About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 24 February 2012

నాకు బోలెడు ఇష్టమీ కథ...!

నాకు ఈ కథంటే బోలెడు ఇష్టం .నా బిడ్డకీ ఇష్టమే ,కానీ నాకు ఇంకా బోలెడు... ఇష్టం .ఎందుకంటె ఒక్క కథల పుస్తకం లో నాలుగు కథలు .బోనస్ అన మాట . కథలన్నీ ఎంతో రుచిగా ఉంటాయ్ కూడా!

అనగనగా ఒక చిట్టి ఎలుకమ్మ ,చెట్టు కింద కూర్చుని కథల పుస్తకం చదువుకుంటూ ఉండిందంట .అప్పుడు ఏమయ్యిందీ .. ఒక ముంగిస వెనక మల్లుగా వచ్చి ఎలుకని పట్టేసుకుంది . పట్టేసుకుని సంతోషంగా ఇంటికి తీసికెళ్ళింది.తీసికెళ్ళి ఒక పాత్రలో ఉంచి అన్నదీ ..అబ్బ! నేనిప్పుడు ఎలుక పులుసు వండుకోబోతున్నాను కదా ..అని .అప్పడు పాత్రలో ఎలుక అంది ఓహ్ నేనిపుడు ఎలుక పులుసు కాబోతున్నా కదా అని ..అంతేనా ఇంకా చెప్పిందీ , ముంగిస గారు మీ పులుసు లో కాసిని కథలు వెయ్యాలి, లేకపోతే ఎలుక పులుసు రుచిగా ఉండదూ అని .అది విని ముంగిస బోలెడు ఆశ్చర్య పడి ,మరి నా దగ్గర కథలు లేవే అంది .అప్పుడు ఎలుక మరేం పర్లేదు నేను చెప్తా వినండి అంది ,ముంగిస సరే అని ఒప్పేసుకుని ,త్వరగా చెప్పాలి మరి నాకు బాగా ఆకలిగా ఉంది అన్నది .అప్పుడు ఎలుక కథలు చెప్పడం మొదలెట్టింది

మొదటి కథ ] తేనెటీగలు-బురద.

ఒక ఎలుక అడవిలో వెళ్తూ ఉండింది. హటాత్హుగా దాని నెత్తి పై ఒక తేనే పట్టు పడింది .ఎలుక అందీ.. వెళ్ళండి నా నెత్తి పైన తేనే పట్టు ఉన్టం నాకేం ఇష్టం లేదు అని .అందుకు ఆ తేనెటీగలు అన్నాయి ''we like your ears ,we like your nose ,we like your whiskers ,oh yes ,this is a fine place for our nest .we never fly away ''.ఎలుకకి దుక్కమొచ్చేసింది.తేనెటీగల రొద భరించరాకుండా ఉంది .ఎలా వీటిని వదిలించు కోడం .ఇంతలో దార్లో ఒక బురద గుంట వచ్చింది .ఎలుక తేనె టీగలతో అందీ ,ఓ bees మీకు లాగే నాకూ ఓ గూడు ఉంది .మీరు నాతో ఉండాలనుకుంటే నా ఇంటికి రావాలి అని .bees అన్నాయి ''oh yes ''అని .అప్పుడు ఎలుక మోకాళ్ళ వరకూ బురదలో దిగింది ''here is my front door ''...తేనె టీగలు ఓహ్ ఎస్ అన్నయ్.నడుము వరకూ దిగి అందీ ,ఇది నా లివింగ్ రూం .తేనెటీగలు ఓహ్ ఎస్ అన్నయ్ .ఎలుక గడ్డం వరకూ దిగి అందీ ,ఇది నా బెడ్ రూం తేనెటీగలు అన్నాయి ఓహ్ ఎస్ .అప్పుడు ఎలుక ''అండ్ నౌ ఐ విల్ గో టో స్లీప్'' తల బురదలో ముంచేసింది .అప్పుడు తేనెటీగలు అన్నాయీ ''oh no ! ''we like your front door .we like your living room.we like your bed room .but no,no,no,we dont like your bed !''అని పాడి ఎగిరెలిపొయాయ్.అప్పుడు ఎలుక స్నానం చేసేందుకు ఇంటికెల్లింది.

రెండో కథ] రెండు పెద్ద బండ రాళ్ళు !

ఒక పెద్ద కొండ పై పూలు, గడ్డి మెండుగా ఉన్న ఒక చోట రెండు రాళ్లున్నాయ్.అవి ఒక రోజు అనుకున్నాయి ,[ మొదటి రాయి ]ఈ వైపు కొండ బాగుంది.కానీ ఆ వైపు ఏముంటుందో .[రెండో రాయి ] ''we do not know .we never will,''.ఒక రోజు బుజ్జి పిట్ట ఒకటి అక్కడ వాలింది .ఆ రాళ్ళు అడిగాయి ..బుజ్జి పిట్టా! కొండకి అవతలి వైపు ఏముందో కాస్తా చెప్పవా అని .పిట్ట ఎగిరెళ్లి చూసి వచ్చి చెప్పిందీ అటు వైపు నగరాలు,పర్వతాలు ,లోయలూ ఉన్నాయి'' it is a wonderful sight. ''అని .అప్పుడు మొదటి రాయి అందీ, అందమైనయ్యన్నీ అవతలి వైపే ఉన్నాయ్ ..ఎంత విషాదం అని .రెండో రాయి అందీ ''we cannot see them .we never will.అలా ..ఒందేల్లు ఆ రెండు రాళ్ళూ దిగులుపడుతూ గడిపాయి .ఒక రోజు ఒక ఎలుక అటోచ్చింది .పిట్టని అడిగినట్టే ఎలుకనీ అడిగాయి రాళ్ళు .ఎలుక వెళ్లి చూసొచ్చి చెప్పిందీ ,అటువైపు రాళ్ళు ,మట్టి ,గడ్డీ ,పూలు ఉన్నాయ్ .చాలా బాగుంది అని .మొదటి రాయి అందీ ఆ పిట్ట మనకు అబద్దం చెప్పింది, ఇటు వైపూ ,అటు వైపూ ఒక్కలాగే ఉంది అని .రెండో రాయి అందీ ..''we feel happy now .we always will.''అని

మూడో కథ ] కీచు రాళ్ళు !

ఒక రోజు ఎలుక ఒకటి హటాతుగా నిద్దర మేల్కొంది ,కిటికీ దగ్గర ఒకటే రొద.ఏంటా గోల అంది ఎలుక .అక్కడే ఉన్న కీచు రాయి అందీ ''ఏం చెప్తున్నావ్ ?''పాడుతూ వినడం నా వల్ల కాదు ,అంది పాడుతూనే .నేను నిద్ర పోవాలి , మీ ఈ గోల పాట వినలేను అంది ఎలుక .కీచు రాయి అందీ ఏమన్నావ్ ''you want more music ?" సరే ఆగు నా స్నేహితుల్ని పిల్చు కోస్తా అని ..వెళ్లి స్నేహితుల్ని పిలుచుకొచ్చింది .ఎలుక ,బాప్రే! నాకు ఈ సంగీతం వద్దూ అని చెప్పాను అంది .కీచు రాయి ఏంటీ.. ఇంకా కావాలా? ఆగు ఇంకా స్నేహితుల్ని పిలుచుకోస్త అని పిలుచుకొచ్చింది .అట్లా బోల్డు కీచు రాళ్ళు వచ్చేసాయి .ఎలుక అరిచింది, స్టాప్ అని ''your music is too loud !''కీచు రాళ్ళు అన్నాయి ,ఏంటీ ..పెద్దగానా..? సరే అట్లాగే పెద్దగా పాడుతాం అని ,పెద్దగా పాట్టం మొదలు పెట్టాయి .ఎలుక మళ్ళీ అరచింది ''i want to sleep .i wish you would all ''go away?''అని .కీచు రాయి అన్నదీ వెళ్లి పోవాలా.. ఆ విషయం మొదటే ఎందుకు చెప్పలేదు ? సరే మేం వేరే దగ్గరకెళ్ళి పాడుకుంటాం ..అని వెళ్లి పొయాయ్ .ఎలుక నిద్ర పోవడానికి పోయింది .

నాలుగో కథ ] ముళ్ళ పొద !

ఒక ముసలావిడ ఇంటి బయటకొచ్చి ఏడవటం మొదలెట్టింది .ఒక పోలీసాయన పరిగెత్తుకొచ్చాడు ఎమయిందీ అంటూ .ముసలావిడ అతన్ని లొపలకి తీసికెళ్ళి చూపించింది ,ఇదిగి చూడు ఈ సోఫాలో ముళ్ళ పొద ఎలా మొలిచిందో అని .పోలీసు ఆశ్చర్య పడ్డాడు .ఎలా జరిగిందీ అని .ఆవిడ అందీ ఒక రోజు, నేను మామూలుగానే వచ్చి కూర్చున్నాను ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది .చూస్తే ఈ ముళ్ళ పొద .పోలీసాయనకి జాలి వేసింది .బాధ పడొద్దు ఇప్పుడే నేనీ ముళ్ళ పోదని తీసేస్తా ,అప్పుడు నువ్వు హాయిగా కూర్చోవచ్చు.. అంటూ ముళ్ళ పొద మీద చేయి వేయ బోయాడు,అంతే ముసలావిడ పెద్దగా అరిచింది ,noooo..don't do that ! i dont want to sit down .i have been sitting all my life .ఈ ముళ్ళ పొద అంటే నాకు ఇష్టం ,నేను ఏడ్చేది ఇది వాడి పోతుందని ,చూడు కొమ్మలు ఎలా తలలు వాల్చే శాయో అంది .అప్పుడు పోలీసాయన అన్నాడూ .. బహుశా దానికి దాహంగా ఉందేమో, నీళ్ళు పోసి చూడలేక పోయారా అని .ముసలావిడ అరరే !i never thought of that అని పొదకి నీళ్ళు పోసింది .అంతే ఏమయిందీ ముళ్ళ పొద ఒక్క సారి పులకరించి పోయింది .మొక్క లోంచి బోలెడు చిగురులు వచ్చాయి, మొగ్గలు వేసాయి ''the buds opened up .they became large roses.అంతే ముసలావిడ బోల్డు సంతోష పడి పోయింది .పోలీసాయాన్ని అభినందిన్చేసి పెద్ద గుత్తి రోజా పూలు ఇచ్చి పంపింది.

ఇప్పుడు అసలు కథ !

ఎలుక అన్నదీ ముంగిసతో చూశారా ...ఇప్పుడు నేను మీకు నాలుగు కథలు చెప్పాను కదా.. ఆ నాలిగింటిని చక్కగా పులుసులో వేసెయ్యండి .అప్పుడు చూడండీ మీ పులుసు ఎంత బాగుంటుందో మరి అని .ముంగిస బోల్డు ఆశ్చర్య పడి ,బానే ఉంది కానీ ఇప్పుడు ఈ నాలుగు కథలని పులుసులో వేయడం యెట్లా అంది .దానికి ఎలుక ఏమన్నదంటే ''that will be easy ,''ఏం చేయాలంటే బయటకెళ్ళి ఒక తేనె పట్టు ,కొంత బురద , రెండు పెద్ద రాళ్ళు ,పది కీచు రాళ్ళు ,ఒక ముళ్ళ పొద తీసుకొచ్చి పులుసులో వేసేయ్యడమే ...అని .ఇకనేముంది ముంగిస బయటకు పరుగులెత్తింది .పాపం దానికి బాగా ఆకలి వేస్తుంది కదా ..! ఆకలేస్తుంటే ఆలోచన మందగిస్తుంది కదా !అంచేత ఇంటి తలుపు వేయడం మరచి పోయిందీ ....తేనె పట్టు కోసం ఇంకా మిగిలిన వాటి కోసం ముంగిస చాలా కష్ట పడింది. చివరికెలా అయితేనేం వాటిని మోసుకుని ఇంటికి వచ్చింది .ఆహా ఇప్పుడు నా ఎలుక పులుసు మస్తు రుచిగా ఉంటుందిలే అనుకుని మురిసి పోయింది .తీరా వచ్చి చూస్తే he found a surprise .the cooking pot was empty .ఎలుక ఎప్పుడో పరిగెత్తుకొని ఇంటికి వెళి పోయింది ...వెళ్లి he lit the fire ,he ate his supper ,and he finished reading his book .అంతే కథ కంచికి మనం ఇంటికీ...........! కథని నేనేం బాగా చెప్పలేదు.పుస్తకం దొరికితే తప్పక చదవండి .మస్తు మజాగా వుంటుంది.

Tuesday 14 February 2012

మంచి ప్రేమ పాట ఒకటి...!



ఒక రాత్రి ఫోన్ చేసి చాలా ఉద్వేగంగా చెప్పింది స్నేహితురాలు ఈ పాట నేర్చుకుంటున్నానని .ఇందులో సాహిత్యం తనకూ నాకూ చాలా నచ్చింది.నిజానికి ప్రియ సిస్టర్స్ కంటే తన పాట నాకు ఎక్కువ నచ్చింది .అట్లా అనేక సార్లు విన్న పాట ఇది.

చాలా సార్లు ఆశ్చర్యం వేస్తుంది ,అన్నమయ్యనో ,త్యాగయ్యనో ...వింటూ వుంటే .రాయాలని వున్నా ఇంకేం రాద్దాం లెద్దూ ప్రేమకవిత్వం అనిపించేస్తుంది వీరి ప్రేమ పాటలు చూస్తే ,దానిని మనం భక్తి అంటున్నాం అనుకోండి .మరీ ఎక్కువ సాగదీస్తే ప్రేమ ,భక్తిగా (లేకపోతే పిచ్చిగా)మారుతుందనుకుంటా.భక్తో ,ప్రేమో ఏదైనా రాయడానికి మనకేం మిగల్చనట్టే వీళ్లు ఆలోచిస్తే.

'మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే'...నట పిల్లలు మన పలుకులే పలికినట్లు.
''వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే''నట .అమ్మ తప్ప చిన్ని చిన్ని పిల్లలికి మరోటి వుండదే ,అట్లా కాబోలు .ఇంత ఘనం ప్రేమించేస్తే దేవుడు కనిపించకేం చేస్తాడు?అవును కదా ...!

నమో నారాయణ నావిన్నపమిదివో

సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే


మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే

తనువు నీపుట్టించినధన మిది

మును నీవంపున నిన్ని మోచుకున్నవాడనింతే

వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే


భోగములెల్లా నీవి బుధ్ధులు నీవిచ్చినవి

యీగతి నాబతుకు నీవిరవైనది

చేగదీర నీవునన్ను జేసినమానిసి నింతే

సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే


వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే

కలకాలమును నీకరుణే నాకు

యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే

నెలవు దప్పించక నీవే రక్షించవే

Monday 13 February 2012

పూరి జగన్నాథ్ 'బూతు పోకిరి '


2006 లో పోకిరి మూవీ చూశాను.విపరీతంగా జుగుప్స కలిగింది.కోపమొచ్చింది .ఇంటికొచ్చి కాయితమోటి తీసుకుని ఇది రాసేసి ప్రజా సాహితికి పంపేశాను.కొన్ని రోజులాగి రవి గారికి ఫోన్ చేసి అందిందా అని అడిగాను.ఆయన వెంటనే అయితే మీరీ మధ్య ప్రజా సాహితీ చదవటం లేదన మాట అన్నారు.నేను చాలా నిజాయితీగా లేదండీ నాకు పాప పుట్టిందీ అన్నాను.రవి గారు నాకు మారిన అడ్రెస్స్ ఇచ్చారు.అప్పటికి నా దగ్గర రఫ్ కాపీయే ఉండింది.అదే పంపించేసాను.అదే ఇది .మళ్ళీ ఇన్ని రోజులకి నాకు బిజినెస్ మేన్ మీద రాయాలనిపించింది.అది రాస్తూ ఇది జ్ఞాపకమొచ్చి బ్లాగ్ లో పెట్టాను.

ఈ దేశపు పేద, మధ్యతరగతి ప్రజలకు కాస్త సేద తీరేందుకు ,ఆనందించేందుకు ఉన్న ఏకైక మార్గం సినిమానే.అందుకే ఆ సినిమా ప్రభావం వారి జీవన శైలి ఫై ముఖ్యంగా యువతరం పై మరీ తీవ్రంగా ఉంటుంది .

పూరి జగన్నాథ్ సంపూర్ణ నేతృత్వం లో ఈ మధ్య పోకిరి అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో హీరో... కృష్ణ కొడుకు, మహేష్ బాబు .సినిమా అంతా దర్శకుడు చాల సామాజిక అంశాలను నెత్తికెత్తుకుని బాధ పడుతూ ఉంటాడు.ప్రేక్షకులు ఇవన్ని జరిగినవే కదా అని ఫీల్ అయిపోతుంటారు కాకపోతే అన్నీ దర్శకుడి సినిమాకు రంజుదనాన్ని తెస్తుంటాయి.దర్శకుడు పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఆ పాత్ర ,శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుంది.మసాజ్ పార్లర్ కు వెళ్దాం పద అనో ,అమలాపురం లో ఆడవాళ్ళు బాగుంటారట ” కదా అనో, వంకరగాఅంటూ ఒక దెబ్బ కు రెండు ఫీలింగ్ లను తెప్పిస్తాడు .

దర్శకుడు పోలీసు వ్యవస్థ గురించే కాదు ,గూండా ల గురించి,సెల్ ఫోన్ లో సెక్స్ దృశ్యాల గురించి,టీవీ ల గురించి ఏమిటేమిటో చెప్తాడు.మధ్య మధ్య లో హిందీ సినిమాలను ,ఎం టీవీ ని మరిపించే దృశ్యాలు,పాటలతో కిర్రెక్కిస్తుంటాడు.ఏం చేసినా సినిమా లో కామరసం పోర్లేట్టు చూసుకుంటాడు.

సినిమాలో ఎస్.పి పాత్ర ,”గాంధీ సినిమా ను ఎవరు చూడరు అదే కడప కింగ్ అంటే రెండు వందల రోజులు నడుస్తుందని” అంటుంది.ఈ డైలాగు పూరి జగన్నాథ్ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిందే .పూరి సినిమాలు ఇంతకు ముందు మరీ ఇంత కంపుగా వుండేవి కావు.కొన్నిభారీ ఫ్లాపుల తర్వాత కంపు పెరిగింది .అతనెందుకు గ్రహించలేదో కానీ కడప కింగ్ లే కాదు, తేజ హీరోయిన్ జాకెట్ లో నుంచి ఈనాడు, వార్త , పత్రికల బాల్స్ ని చెరో వైపు నుండి తీయించినా సినిమా ఫ్లాప్ అయింది.అశ్లీలతే సినిమా కి ఆయువు పట్టు అనుకోవడం తెలివి తక్కువ తనమే.

గురివింద గింజ సామెత ఒకటి ఉంది.అది పూరి కి సరిగా సరిపోతుంది.తానొక బాధ్యత గల పౌరుడిలా టీవీ 9 కి t tv అని పేరు పెట్టి అశ్లీల దృశ్యాలేమన్నా దొరికితే ముందు మాకే ఇవ్వండి రోజంతా వేస్తాం అని విలేఖరికి డైలాగు పెట్టిన దర్శకుడు ,నువ్వు ఆడదానివి కాదా మీ అక్కాచెళ్ళల్లని ఇలా చేస్తే వూరుకుంటారా అని డైలాగు చెప్పే హీరో దారిలో వెళ్తున్న హీరోయిన్ని ఆపి ఆమె టీషర్టు పై (కేమెరా ని నిలబెట్టేసి )దృష్టి కేంద్రీకరించేసి అంతా కాకపోవచ్చు కానీ some parts of me are awesome అని వర్ణిస్తుంటారు. ఎస్.పీ కూతురిని మంత్రి కొడుకు చేడుపుతున్నట్టున్న దృశ్యాలు సినిమాలో బూతుకు చేరుపే కానీ మరోటి కాదని ప్రేక్షకుడు గ్రహించగలడు.

పూరి తన సినిమా లో పాటలని స్త్ర్రీ శరీర ప్రదర్సనకే కేటాయిస్తాడు.ఎం టీవీ ని తలపించేలా పాటలు ఇది వరకే సూపర్ సినిమాలో ప్రేక్షకులకు పరిచయమే.ఇందులో “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాట ఆ తరహాకి హైలైట్ .అందులో పిల్ల తన శేరీరాన్నంతా తెర మీద పరిచేసి గంతులేస్తూ జుగుప్స కలిగిస్తుంది .ఈ పాట చాల హిట్.రాఘవేంద్ర రావు వృద్దుడై, శీలవంతుడు అయిన తర్వాత విఖ్యాతమైన అతని బొడ్డుకి మరి నాలుగు చేర్చి, పూరి సినిమాలను కంపు కొట్టిస్తున్నాడు.ఈ తరహా ఏంటని? ఏదో టీవీ ఇంటర్వ్యూ లో ప్రశ్నిస్తే చాలా నిర్లజ్జగా, అంతా డబ్బు కోసమే "greed for money " అని సమాధానం ఇచ్చాడు.

సినిమాలో ఇంకో దృశ్యం ఉంటుంది .విలన్ ఒకడు ఒక పిల్ల చేత మంచానికి కట్టించుకుంటాడు.ఆ పిల్ల, వాడి మీదకెక్కి లిప్ స్టిక్ పూసి కొరడా తీసుకుని కొట్టేదా కొట్టేదా అంటుంటుంది .ఇది ప్రఖ్యాత పర్వర్టేడ్ ఆంగ్ల చిత్రం బేసిక్ ఇన్స్టింక్ట్ కు అనుకరణ.మాతృక ని ఎంత మంది పిల్లలు, స్త్రీలు చూసారో కానీ ఆ దౌర్భాగ్యాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు.సినిమా కు ఆ సన్నివేశం అవసరం అని దర్శకుడు కూడా చెప్పలేనంత అనవసరం గా ఉంది.కనుక ఆ సీన్ పూరి జగన్నాథ్ లోని పర్వర్షన్ కి ఒక నిదర్సనం గా చెప్పవచ్చు.

సమాజ సేవకి అంకితం అయిపోయాడు కదా దర్శకుడు, అందులో భాగంగానే పది సార్లు నిరోద్ అనిపిస్తేనన్న ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తారు అన్నట్లు అలీ చేత ప్రభుత్వ నిరోద్ ప్రకటన బోర్డు ని చూపిస్తూ ''అర్థ రూపాయి కి ఇది కూడా రాదు'' అని ఒక సారీ, మహేష్ బాబు చేత ఎస్సై ని మీ నాన్న నిరోద్ వాడి వుండాల్సింది నువ్వు పుట్టకుందువు అని ఒక సారీ అనిపిస్తాడు .యాభై ఏళ్ళ మనిషిని పట్టుకుని అప్పుడు మీ నాన నిరోద్ వాడున్డాల్సింది అనడం ఎంత అసహ్యం?

ఈ మధ్య నెల్లూరు జిల్లా కావలి లో ఒక ప్రముఖ కాలేజీ లో వార్షికోత్సవం తర్వాత, మధ్య రాత్రి హాస్టల్ కు వెళ్తున్న ఆడపిల్లలపై అదే కాలేజీ అబ్బాయిలు ముసుగులేసుకుని దాడి చేసి చెప్పుకోలేని చోట్ల కొరికి గాయపరిచారు.

ఈ ఐడియా వాళ్ళకి “సై” అనే సినిమా నుండి వచ్చిందట .మహిళా సంఘాల వాళ్ళు, ప్రజాతంత్ర వాదులు ధర్నాలు చేసి, కరపత్రాలు వేసి ఆందోళన చేసారు.కానీ ఆ అమ్మాయిల తోలి యవ్వన జీవితం పై జరిగిన పైశాచిక దాడి జీవిత పర్యంతం వారిని భయ పెడుతూనే ఉంటుంది.దీనికి బాధ్యులు ఆ అబ్బాయిలే అనడం కన్నా సై సినిమా టీం అనడమే న్యాయం.

చాల సార్లు ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు కనుక అలాంటి సినిమాలు తీస్తున్నామని దర్శకులు అంటారు.అది తప్పు.ఇదే మహేష్ బాబు “ఒక్కడు” సినిమాని ఎటువంటి స్త్రీ శరీర ప్రదర్శన లేకపోయినా వంద రోజులు చూసారు.ప్రేక్షకులు అశ్లీలం కోసమే సినిమా చూడరు.చూసే వాటికి అలవాటు పడతారు.ఈ పోకిరి సినిమా మొదటి సారి చూసినప్పుడు నేను చాల జుగుప్స కి లోనయ్యాను.ఈ వ్యాసం రాయాలనే ఆలోచన కలిగాక రెండో సారి చూసాను.ఈసారి నాకు అంత జుగుప్స కలగలేదు.కారణం అలవాటు పడడమే. అలవాటు పడడం చాలా ప్రమాదకరం .ఎందుకంటే ఎప్పటికప్పుడు డోస్ పెంచాలి కదా .బహుశా సెన్సార్ వాళ్ళు కూడా నాలాగే అలవాటు పడ్డారేమో .అంటే రాబోయే సినిమాల అశ్లీలానికి మనం అనివార్యంగా అలవాటు పడాలేమో.

అట్లాగే,పైరసీ విషయంలో రెచ్చిపోయి ,రియల్ హీరో లాగా షాపులు పగలగొట్టి ,ఇండస్ట్రీ బాగోగుల్ని తన భుజాలపై వేసుకున్న మహేష్ బాబు కి సమాజం బాగోగుల పట్ల మాత్రం అలంటి బాధ్యత లేదు కాబోలు .వ్యష్టి కన్నా సమిష్టి పట్ల ఇంకా జాగర్త గ ఉండాలనే కనీస జ్ఞానం లేని ఇతను యువతరపు idol he అట.

స్త్రీ శరీరాన్ని ప్రదర్శించటానికి, రెచ్చగోట్టేట్టు ప్రదర్శించడానికి తేడా ఉంది.పూరిది రెండవ పద్దతి .సెక్స్ సినిమాల ముద్ర తో వచ్చే షకీలా సినిమాలు సమాజం లోని అన్ని వర్గాల వారు చూడరు .ఆ థియేటర్ల ముందు కూడా నిలబడరు .కాని పూరి జగన్నాథ్ ,సెన్సార్ బోర్డు ,కలిసి అలాంటి భయాలేమి అవసరం లేకుండా ఆబాలగోపాలానికి, షకీలని మించి పోయేంత అంగాంగ ప్రదర్శనలతో సినిమాలు చూపించి మైమరిపిస్తున్నారు.ఏ అడ్డం ,సిగ్గు లేకుండా ప్రజలు ఈ సెక్స్ సినిమా లు చూసేస్తున్నారు.

హెచ్.బి .టీ వాళ్ళు ,”వ్యసనం” అని ఒక అనువాద పుస్తకం ప్రచురించారు .అందులో డ్రగ్స్ కన్నా ఆల్కహాల్ ఎక్కువ ప్రమాదకరం అంటాడు రచయిత.ఎందుకంటే ఆల్కహాల్ లభ్యత ఎక్కువ.ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను పెట్టి వ్యసనాన్ని నేర్పుతుంది.పూరి జగన్నాథ్ సినిమాలు ఆల్కహాల్ అయితే మన సెన్సార్ ప్రభుత్వ సారాయి దుకాణం లాంటిది.

ప్రజాసాహితి ,ఆగష్టు 2006.

Friday 10 February 2012

పాపాయి...!

నిదుర ఖైదు నుండి బైట పడి ,
పాపాయి
కొత్త సూర్యుడితో
కరచాలనం చేస్తుంది .

గూటిని విదిల్చి
కిలకిలల రామచిలుకై
పువ్వుల సీతా కోకై
పిల్లులు పట్టే దొమ్మరి రాణై
అమ్మ గుండె బండిని అదుపు తప్పిస్తూ
కుక్కని గుర్రం చేసి
రోజు తాడు పై
ఒంటి కాలితో నడిచేస్తుంది

పాపాయి
కొత్త కొత్త చిగుళ్లతో
ఇళ్లంతా అల్లేసి
వన్నె చిన్నె మాటల్ని
విరగ పూస్తుంది
పూసిన మాటలు
కోసే వాళ్లో వైపు
రాలిన నవ్వులు ఏరే వాళ్లో వైపు

ఆడే ఆట హటాత్తు గా ఏమౌతుందో
నానని మంత్రించి
జీ హుజూర్ అనిపించి
కళ్ళ దివిటీలని వెలిగించి
మాయల లోకానికి విహారమౌతుంది

తాత మెడ ఊడని పట్టి
ఊగి ఊగి
అవ్వ కథలోని ఊళ్లన్నీ
చుట్టి చుట్టి
గూళ్ల పిట్టలు గూళ్ల కి
సూర్యుడింటికి సూర్యుడు
వెళ్ళాక ,
పాపాయి
వెక్కిరిస్తున్న కొక్కిరాయి చంద్రునిపై
అలిగి
కీ పోయిన బొమ్మలా
దిగులు నిద్రవుతుంది

అప్పుడు
ఇళ్ళంతా
సూర్యుడు లేని
పగటి ఆకాశమౌతుంది .

Thursday 9 February 2012

ఒక కథ - ఒక సినిమా.



.టైపింగ్ లోపానికి క్షంతవ్యురాలను.

చాలా కాలం క్రితం నేనో హిందీ మూవీ చూశా పహేలి అని .అప్పుడు షారుక్ సినిమాలు చూసే అలవాటు వుండేది.అందులో భాగమే పహేలీ కూడా .రాణీ ముఖర్జీ అంటే కూడా బాగా ఇష్టం.ఎప్పటికీ సఫలం కాలేని నా కలల్లో ఒకటి చలం ''మైదానం ''ని షారూక్ ,రాణి లతో మూవీ చెయ్యడం.డబ్బు అనేది ఎంత ఘన పదార్తమో ..అప్పుడప్పుడూ అలా అర్థమవుతూ వుంటుంది.కానీ మైదానం తిరిగి తిరిగీ చదివే క్రమంలో నేను ఇచ్చుకునే రూపం ఇద్దరిదే .

పహేలి చూసినప్పుడు మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే ...మతిపోయింది.ఎటువంటి కథ ఇది. ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని .ముఖ్యంగా దెయ్యం ,పక్షిలా వచ్చే సన్నివేశం, దాని అరుపు[సంగీతం: కీరవాణి} ,అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి.

అప్పుడు కథ ఎవరిదీ ,ఏవిటీ నాకేమి తెలీదు.తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత Vijaydan Detha కథ అని . తరవాత కొన్నాళ్ళకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ''విజ్జి'' అనువాదకథలసంకలనం ''సందిగ్ద''చదవడంజరిగింది .ప్రతి కథ ఒక షాక్ .అంతకు మించీ స్త్రీవాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది

కథ మూడుముక్కల్లోఏంటంటే..ఒకమగాడు,,,వాడికి అందమైనఅమ్మాయితోపెళ్ళవుతుంది
.పెళ్లిచేసుకుని వచ్చే దారిలో ఓదెయ్యం ఆపిల్లని చూసి మొహిస్తాడు.వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు
,కొత్తపెళ్లికూతుర్నివదిలిఏదోవ్యాపారానికిసుదూరానికివెళ్లిపోతాడు. అప్పుడీదెయ్యం,
మగడివేషంలోవచ్చిఆపిల్లతోకాపురంమొదలెడతాడు.కానీనిజంచెబుతాడు.నిజంచెప్పినాఆపిల్లవాడినికోరుకుంటుంది.
గర్భవతికూడాఅవుతుంది

.మగడువస్తాడువిషయంతెలుస్తుంది.నేనునిజమైనమగడినంటేనేనునిజమైన. మగడిననిపోట్లాడుకుంటారు.తీర్పుకురాజుదగ్గరికివెళ్తూవుంటే ,మార్గమధ్యంలోఓగొర్రెలకాపరిదయ్యాన్నిబంధించిసమస్యనిపరిష్కరించేస్తాడు.
ఇప్పుడునాకుమూవీగుర్తులేదుకానీకథలోమంత్రగాడుఅంటాడూ''ఏడుసార్లుచిటికేవేసేలోగా
ఎవరైతేఈనీటిబుర్రలోదూరుతారోవాడేపడకగదికినిజమైనయజమాని''అని .అంతేఆపిల్లని అమితంగా ప్రేమించేదెయ్యంనీటిబుర్రలోకిదూరేస్తాడు.

అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
సందిగ్ధ
లిఖిత ప్రెస్
అనువాదం :కే .సురేష్

Sunday 5 February 2012

సీత కష్టాలు ...



అనగనగనగా.... చాలా కాలం క్రితం చాలా దూరంలో ఒక సముద్రముండేది .ఆ సముద్రంలో చాలా రాజ్యాలుండేవి. చేపల రాజ్యం, తాబేళ్ల రాజ్యం ,పీతల రాజ్యం ఇట్లా .ఇది పీతల రాజ్యంలో జరిగిన కథ .ఆ రోజు పైన ఆకాశం చాలా ముసురు పట్టి ఉంది.రాత్రి రావాల్సిన పౌర్ణమి చంద్రుడు ముఖం చాటేసుకుని ఎటో వెళ్లి పోయాడు .వద్దన్నా కాల్చే కర్కోటకుడు సూర్యుడు మంచాన పడ్డట్టున్నాడు. సమస్త భాద్యతలు తనే తీసుకుని వానల దేవుడు కుండపోతగా కురుస్తున్నాడు . సముద్రం అలలు అలలుగా ఉంది .అస్థిమితంగా ఉంది .పరమ చిరాగ్గా ఆటూ పోటు ఔతుంది. అటువంటి రోజు ,అటువంటి వానలో పీతల రాజ్యంలో రాజ భవనం ముందు పేద పీతల గుంపు ఒకటి రాజుకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తుంది .నినాదాలు రాజ భవనం గోడ గోడని తగిలి తిరిగి తిరిగి ప్రతి ధ్వనిస్తున్నాయి .

పీత పలికిన మాటలు విని జాలరి స్త్రీ అది సరే ,మొదట నీకొచ్చిన అంత పెద్ద కష్టమేమిటో చెప్పు అన్నది .ఇంతకీ ఆ పీత మేధావీ బహు భాషా కోవిదురాలు అయిన రాకుమారి పీత కదా ,ఆమెలో ఉన్నది రాచ రక్తం కదా అంచేత ఒక నీచ జాలరి స్త్రీకి తన దీన గాద వినిపించడానికి ఇష్ట పడక కాసేపు ఊరుకొని నా కథ తరువాత ముందు నువ్వెందుకేడుస్తున్నావో అది చెప్పు అంది .అంత బాధ లోను తన గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఆ పీత ఆసక్తి గమనించి జాలరి స్త్రీ అది ఆడ పీత అని కని పెట్టేసింది .
మళ్లీ ఒక సారి ముక్కు చీది రాముడనే రాజు సముద్రంపై వారధి కట్టి , లంక రాజు ని చంపి, వాడు దొంగిలించి తీసుకెళ్ళిన తన భార్యని జయించి తీసుకొచ్చాడు. అదంతా పెద్ద కథలే .అంత చేసిన ఆ రాముడు ఎవడో ఒక వెధవ ఏదో అన్నాడని ఆ సీతమ్మ తల్లిని అనుమానించాడమ్మా , తన భార్య సత్యం తనకు తెలీదా లోకం కోసమా భార్య .ఇది భరించలేక ఆ తల్లి ఇవాళ భూమిలో కలిసి పోయింది అని చెప్పింది మళ్లీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ .
పీత మద్య ఆ స్త్రీ మద్య ఒక నీరవ నిశ్శబ్దం అలుముకున్నది .జాలరి స్త్రీయే ఆ నిశ్శబ్దాన్ని మొదట బగ్నం చేస్తూ, ఇంతకూ నీకొచ్చిన కష్టమేంది పీతమ్మా అని అడిగింది
అప్పుడు పీతరాకుమారి నిట్టూర్చి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా " అని తన కథ చెప్పడం మొదలు పెట్టింది .జాలరి స్త్రీ జాలి జాలిగా పీత చెప్పిన అతి పాత కధే ,అందరికీ తెలిసిందే , మళ్లీ ఓపిగ్గా విని కొత్తగా తెలుసుకున్న ఆ పీతను చూసి జాలి పడి చేతిలోకి తీసుకుని పీతమ్మా అందుకే ఆడ పుటక పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలన్నది. ఈ కష్టం నీ ఒక్క దానిదే కాదు ఆడ జాతి మొత్తానిది .నువ్వు కొత్తగా పడుతున్నావు నేను పడి కొట్టుకుని లేచాను ,నీ కడుపున కూడా రెండో మూడో కాయలు కాస్తే వాళ్ళను చూసుకుంటూ అంతా మరచి పోతావు అయినా కట్టుకున్న భార్యల్ని వదిలి వీళ్ళు ఎక్కడికి పోతారు , తిరిగి తిరిగి ఆఖరాకి మన దగ్గరికే వస్తారు అన్నది .
అది విని ' వృద్ద పురుషః పత్నీ వ్రతః'కాబోలనుకుంది విద్యావతి ఐన రాకుమారి పీత .ఐనా కాలూ చేయి ఆడని మగ వాడు కొంగు పట్టుకు తిరిగితే ఏంటి కాలు పట్టుకు తిరిగితే ఏంటి అని ఆ తుచ్చ జాలరి స్త్రీతో చర్చించడానికి దానికి మనసొప్పలేదు .మళ్లీ ఆ జాలరి స్త్రీయే మౌనాన్ని చేదిస్తూ పీతని ప్రేమగా నిమిరి వెళ్లమ్మా వెళ్ళు చచ్చి మాత్రం సాధించేదేముంది , , గుండె దిటవు చేసుకుని కాపురం చెయ్యమ్మా ,మనకింకో గతి లేదు అంది .అని పీతని నెమ్మదిగా సముద్రం లోకి వదిలేసింది .


************************

జాలరామే మొగుడు తిరిగొచ్చి మెదలకుండా కూర్చున్న పెళ్ళాన్ని అడిగాడు ఏందే అట్టా తుమ్మల్లో పొద్దు గూకినట్టు మొకం పెట్టుక్కూచున్నావ్, ఇప్పుడేం కొంప మునిగింది అని .అప్పుడా జాలరి స్త్రీ భర్తతో " సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా "అని పీత కథ చెప్పింది .
సాయంత్రం చేపలాయన వ్యాపారికి చేపలమ్ముతున్నాడు .సొమ్ము ముట్టిన సంతోషం లేని జాలరి ముఖాన్ని చూసి వ్యాపారి ఒక వరహా అటో ఇటో అవుద్ది దానికే మొహమట్టా పెడితే ఎట్టా అన్నాడు . అప్పుడా జాలరి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా అని సముద్రం మీద తన కష్టాలను వ్యాపారికి ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు .అదే మాట వ్యాపారి చేపలు కొన్న ఇంటామెతో అన్నాడు .ఇంటామె భర్తతో అన్నది. భర్త ఇంకోరితో అన్నాడు .అట్లా సామెత ప్రపంచంలో స్తిర పడింది.


[పతంజలి గారికి మరీ మరీ ప్రేమగా ]

సెప్టంబర్ 2011,పాలపిట్ట .