About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday 18 November 2013

సబ్బుతో చేతులు కడుక్కుందాం !

 ఈ రోజు వీ ఎం బంజర్ హై  స్కూల్ లో పిల్లలకి ''సబ్బుతో చేతులు కడుక్కుందాం'' అనే అవగాహనా కార్యక్రమాని నిర్వహించాం . ఈ ప్రోగ్రాం నిజానికి బెంగాల్ లో యునిసెఫ్ వాళ్ళు నిర్వహించారు . ఆంధ్రా వెనుకబడిన ప్రాంతం  కాదని వారు భావించారు . ఖమ్మం జిల్లా చాలా వెనుక బడిన జిల్లా అందుకని మేమీ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం .ఈ హైస్కూల్ లో  800 మంది పిల్లలు వున్నారు  . చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది . పిల్లలు మైనం బొమ్మలు ఎలా మలుచుకుంటే అలా ఒదుగుతారు . అందరూ సుబ్బరంగా  సబ్బు పెట్టి చేతులు కడుక్కున్నారు . పిల్లలనే అడిగి ఈ ప్రోగ్రాం నిర్వహించటానికి వాళ్ళ చేతే ఒక టీచర్ ని ఎంపిక చేయించాం . ఒక్కో క్లాస్ నుండీ ఒక్కో స్టూడెంట్ ని ఎంపిక చేయించి టీం లీడర్లని చేసాం . మళ్ళీ ఆరునెలలకి వస్తామని చెప్పి బై చెప్పాం . పిల్లలందరూ తుళ్ళింతలతో బై  చెప్పారు . . 





పై   ఫోటో చూసారా ,మహిళలదే రాజ్యాధికారం అని చాటుతూ టీం లీడర్స్ లో 7 గురు అమ్మాయిలూ ,[వాళ్ళు ఎంచుకున్న వాష్ లీడర్ మేడం భాను తో కలిపి 8 మంది ] ,6 గురు అబ్బాయిలు .  




Thursday 14 November 2013

రేజర్ల స్వాతి

ఈ రోజు రేజర్ల ఉన్నత పాటశాల కి వెళ్లాం . మద్యపాన రుగ్మత మీద మాట్లాడాలని అనుకున్నాను . ప్రధానోపాద్యాయిని సరోజిని గారి   అనుమతి పొందాం .  175 మంది పిల్లలు . మొదట మేమెందుకొచ్చామో చెప్పాం .తరువాత పిల్లల్ని మాట్లాడమన్నాం . తండ్రుల తాగుడు వ్యసనం పిల్లల మీద ఎంత ప్రభావం చూపుతుందో  ,  వాళ్ళ మనసుల్ని ఎంత వేదనకు గురి చేస్తుందో,వారిలో ఎంత దుక్కం దాగి వుంటుందో ,కదిలిస్తే అది ఎలా కన్నీరై బయటపడుతుందో ప్రత్యక్షంగా చూసాం . స్వాతి ,తొమ్మిదో తరగతి, వెంకట్ కిరణ్ తొమ్మిదో తరగతి , తోట గోపి ఆరో తరగతి లకు మా షీల్డ్ లు ,సర్టిఫికేట్ ఇచ్చామ్. షీల్డ్ ఇవ్వడం కేవలం ఆ సంఘటన జ్ఞాపకార్థం మాత్రమె కాదు, స్వాతి పెద్ద పెరిగి ఈ విషయాన్ని గుర్తుంచుకుని పది మందికి మార్గ దర్శకురాలు కావాలని,గోపి తన వేదనని మరిచి పోకుండా ,భవిష్యత్తులో ఒక నాయకుడిగా ఎదగాలని ,క్లాస్ ఫస్ట్ వచ్చే తెలివైన వెంకట్ కిరణ్ ఈ విషయంలో అందరికీ మార్గ దర్శకత్వం వహించాలనీ చెప్పి ఇచ్చాం . 

స్వాతి తండ్రి తాగుబోతు ఆ పిల్ల ఏడ్చి నన్ను యేడిపించింది ,నేను ఏడ్చి ,సరోజిని  గారిని యేడిపించాను. తోట గోపీ ది దయనీయమైన కథ .పెద్ద పెద్ద కళ్ళ ఆ అబ్బాయి పదే ,పదే జ్ఞాపకమొస్తూ మద్యాన్నపు  నా భోజనాన్ని అరుచింప చేసాడు . గోపీ వాళ్ళ  నాన్న తాగి వచ్చి ,ఆ విషయం మీద గొడవ పెట్టుకున్న వాళ్ళ అమ్మని కిరోసిన్ పోసి  తగల పెట్టేసాడు .  ఆవిడ చనిపోయింది ,గోపి తండ్రికి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది . గోపీ తండ్రి సావాసగాళ్ళు ఇప్పుడు కూడా జైలుకి తీసుకెళ్ళి మందు ఇస్తారని గోపీ ఫిర్యాదు .  తండ్రీ ,తల్లి లేక ప్రస్తుతం ఆ అబ్బాయి పర పంచన బ్రతుకుతున్నాడు.  ఆ అబ్బాయికి నేనేం చేయగలను అని ,ఏదైనా చెయ్యాలని తపన మనసు నిండుగా కల్లోలమై  పరచుకుంది . [కింది ఫోటోలో తలలు వంచుకున్న పిల్లలంతా ఏడుస్తున్నారు] 

 మొన్న కల్లూరికి వెళ్లాం , ఎస్సే రైటింగ్ కి రమ్మని చెప్పడానికి . ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ చాలా దీనంగా మా కాలేజ్ లో జెమ్స్ వున్నారండీ ,కానీ వాళ్ళలో చాలా మందికి  కాళ్ళకి చెప్పులు వుండవు ,మద్యాన్నపు భోజనమూ వుండదు .  మీరు చార్జీలు ఇస్తే పంపుతామండీ  అని చెప్పి ,ఏమండీ మాకు కొంచెం రవ్వ ఇస్తే పిల్లలకి మద్యాన్నమ్ ఏమైనా వండి పెడతామండీ ,అని బ్రతిమిలాడుకున్నారు . ఆయనకి  ఆ అవసరమేముంది నిజానికి  ,. నిన్న పిల్లల్ని తీసుకొచ్చిన ఆ కాలేజ్ లెక్చరర్ మళ్ళీ బ్రతిమిలాడటం మొదలెట్టారు 


ఊహించని ఈ అనుభవాలు దుక్కపరుస్తున్నాయి 


. ఈ దుక్కం నాది  కాక పోవచ్చు కానీ కచ్చితంగా నాది  కూడా . 

Wednesday 13 November 2013

వెంకటేశ్వర్లు

 కొన్ని  రోజుల నుండీ ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నాను . డాక్టర్ ముందే అన్ని ఏర్పాట్లు చూసి పెడుతున్నారు . ప్రతి చోట దాదాపు 60-70 మంది వస్థున్నారు. ఎక్కువ మంది మహిళలే . మేము సామాన్యకిరణ్ ఫౌండేషన్ నుండి వస్తున్నాం ,మేము పలానా కార్యక్రమాలు చేస్తుంటాం ,ఇవి కాక మీ గ్రామానికి అవసరమైనవి ,మేం చేయగలిగినవి వుంటే చెప్పండి అని మాటలు మొదలెడతామ్  ,కొన్ని గ్రామాల వాళ్ళు చెపుతారు కొందరు నోరే  తెరవరు ,అప్పుడిక జోకులు మొదలెట్టేది,అయితే మీ గ్రామానికి సమస్యలే లేవనమాట ,మీది ఉత్తమ గ్రామమనమాట ,ఉత్తమ గ్రామమం అవార్డ్ కోసం మీ గ్రామం పేరు కలక్టర్ కి ప్రతిపాదిస్తాం మరి అని ,అంతే కోలాహలం, అయ్యో మేడం మాకు చాలా సమస్యలున్నాయి అని . ముఖ్యంగా తండా లలో అయితే నోరు విప్పించడం మహా కష్టం .  నిన్న రాత్రి ఒక తండాకి వెళ్లాను ,అదే పరిస్థితి . చాలా సేపు అవీ ఇవీ చెప్పగా చిన్నగా మొదలెడతారు ,సారాయి మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తుందని సారాయిని మా ఇళ్లల నుండి మా ఊళ్ళ నుండి వెల్ల కొడితే చాలూ అని . అప్పుడిక దిగులేస్తుంది . మద్యం భూతాన్ని నేను ఎదుర్కోగలనా   ,దాని ముందు నేనెంతా ?అని ,ఏం  చేయాలో కూడా నాకు అవగాహన లేదు ,ఎవరినైనా సంప్రదించాలి . అంతకు ముందు ఉద్యమం నిర్మించిన వాళ్ళని కలవాలి. 

ఒక్కో చోట ముసలి వాళ్ళు ఆశతో వస్తారు . అమ్మ !మేడం !నాకు పించను రాటం లేదు ,నా వయసేమో అరవై దాటింది వాళ్ళేమో యాభై అంటున్నారు ,ఈ రోగాలతో ఎలా తట్టుకోము తల్లీ ,మాకేమన్నా సహాయం చేయమ్మా అని . ఎంత మందికి సహాయం చేయగలనూ .. అసలు జీసస్ క్రీస్ట్ ఏం చేసే వాడు అని ఈ మధ్య పదే  పదే  అనిపిస్తూ వుంటుంది . అతనెంత శక్తిమంతమైన దయ కలిగినవాడు ,కాకుంటే ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ పరిపాలిన్చేస్తున్నాడే అని ఆశ్చర్యం వేస్తుంది . కరుణ వుంటే చాలా ? .. కన్ఫ్యూషన్ . నాకు,  వలసినంత డబ్బులుంటే ఎంత బాగుండూ అని చింత . ఏ వూరుకేల్లినా ఒక్కటే ,  బాధల సీసాన్ని కరిగించి నా చెవుల్లో పోస్తారు!నేనీ దుక్కాలని  భరించగలనా ?మధ్యలో పారిపోతానా ? ఏమో !ఎవరెవరో గుర్తొచ్చి రాత్రులు నిద్ర రాదు
 . 
వెళ్ళిన ప్రతి  దగ్గరా మా  ఫౌండేషన్ కోసం స్వచ్ఛందంగా ఎవరైనా పని చేస్తారా అని అడుగుతాను ప్రవీణనన్న సలహాని దృష్టిలో ఉంచుకుని . కొంతమంది వస్తారు . వాళ్ళలో ఒక అబ్బాయి ఇవాళ నిద్ర లేవకమునుపే ఫోన్ చేసాడు మా ఊళ్ళో బీ టెక్ ఫైనలియర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు ,మీరు వస్తారా అని . కాసేపు కన్ఫ్యుషణ్ . అక్కడికెళ్ళి నేనేం చేస్తాను ,నా అవసరం ఏముంటుందని,చివరికి వెళ్లాను . ఆ అబ్బాయి ఏం జబ్బుతో చనిపోయాడో కూడా కరక్టుగా వాళ్లకి తెలీదు . పేద వాళ్ళు.  తల్లి నన్నుచుట్టుకుని  భోరుమని ఏడ్చింది ,నేనింక ఎందుకు బ్రతకాలో చెప్పు మేడం అని . నాకు ఏడుపు వచ్చేసింది . ఖమ్మం హాస్పటల్ లో వున్నపుడు డాక్టర్ ని అడిగి వచ్చి ఎక్సామ్ రాసి వెళ్ళాడట ,జబ్బు ఇంకా ముదిరింది.  కాలేజ్ లో చందాలు వేసుకుని నిమ్స్ కి తీసుకెళ్ళారు .తండ్రి వెళితే తండ్రి జేబులో డబ్బు తీసుకుని లెక్కపెట్టి ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అన్నాడట ''అంతే నా చేతుల్లోనే ప్రాణం పోయింది ,కానీ డాక్టర్లు ఆరోగ్య శ్రీ కోసం కోమాలోకి వెళ్ళాడని అబద్దం చెప్పి రెండు రోజులు ఉంచుకున్నారు ''అని చెప్పాడు తండ్రి .

ఎంతమంచి కొడుకు !ఆరోగ్యం బాగాలేనపుడు ఎక్కడో దగ్గర తెచ్చి నన్ను బ్రతికించమని అడగలేదు ,ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అని బాధపడ్డాడు . ఆ అబ్బాయి బ్రతికి వుంటే ఆ నిరుపేద కుటుంబం దారిద్ర్య వలయం లోనుండి బయటకి వచ్చేసి వుండేది . ఇప్పుడిక వారికి దిక్కెవరు . బాగా ఏడుపొచ్చేసింది . నేనేం చేయగలను వాళ్లకి ?నేను చేసే సహాయం ఏపాటి ?దిగులేస్తుంది . వెంకటేశ్వర్లు నువ్వు రోగం వచ్చిన మొదట్లో నాకు తెలిసి వుంటే నేనేమైనా చేయ్యగలిగే దాన్నా ?ఏమో ... ఐయాం సారీ వెంకటేశ్వర్లు !

ఈ దేశంలో ధనవంతులంటే అగ్ర వర్ణాల వారు మాత్రమె కాక పోవచ్చు 
కానీ ఈ దేశం లో పేదలంటే దళితులూ ,ఆదివాసీలే 
 పేదరికం  యొక్క సత్య  స్వరూపం తెలిసిన వాళ్లెవరైనా ఈ సత్యాన్ని తప్పక ఒప్పుకుంటారు .  

Friday 1 November 2013

Saturday 19 October 2013

మల్లె పూలు - గులాబీ పూలు !


  ఫౌండేషన్ పనులకని సత్తు పల్లి లో ఇల్లు తీసుకున్న వెంటనే వంటకి ,సహాయానికి మనుషులు కావాలని చెప్పానా ,ఇంటి ఓనరు రాంబాబు ఫాతిమాని ,ఆవిడ చెల్లెలు కూతురు  జిలానీని తీసుకు వచ్చాడు . 

ఫాతిమా యాభై యేళ్ళా విడ  మాట్లాడుతూ ఎంత జీతం కావాలో చెప్పింది . కుదరదు నేను అంత ఇవ్వను ,ఇంతే ఇస్తాను అని చెప్పా. మీ ఇష్టమమ్మా అని , నిన్ను నా కూతురిలా, చెల్లెల్లా చూసుకుంటాను అన్నది ఎందుకో ... ,నేను నవ్వాను నవ్వి అయితే నువ్వు ఇందాక చెప్పిన జీతం ఇస్తాను . నిన్ను అమ్మీ అని పిలుస్తాను అని చెప్పాను . అమ్మీ ... ఈ పదం బాగుంది . ఫాతిమా మంచి అమ్మే కాకపోతే నాకు ఒక్కో సారి చల్లటి అన్నం పెడుతుంది . అలిగి గిన్నె అక్కడే పెట్టేస్తే వచ్చి బ్రతిమలాడి ఆ చల్లటి అన్నమే తినేట్లు చేస్తుంది . ఒక రోజు మొబైల్ తెచ్చింది నా ఫోటో తీసుకు రమ్మన్నది కూతురు అని . 

జిలాని అమ్మీ చెల్లి కూతురు . వాళ్ళ అమ్మకి ఒకటే కూతురు ,నాన్న చనిపోయాడు . అమ్మ కి వేరే పెళ్లి అయింది . జిలానీ పెదమ్మ దగ్గరే వుండి  పోయింది . తెల్లటి సన్నటి పిల్ల . అమ్మీ కూతుర్లు పీజీ లు చదివారు . జిలానీ టెన్త్ ఫెయిలయింది . ఎందుకట్లా అంటే జిలానీకి చిన్నపుడే ఒక కన్ను పోయింది . అందుకని చదవలేక పోయింది అని చెప్పింది అమ్మీ . జిలానీ కి నాకూ సాపత్యం వుంది ఏంటంటే నేను పొద్దునే కాంటాక్ట్ లెన్స్ పెటు కుంటాను . జిలానీ గవ్వ కన్ను తీసి కడిగి పెట్టుకుంటుంది . ఇద్దరం ఆ ప్రాసెస్లో కన్ను ఎంత నొప్పి పుడుతుందో ఒకరికొకరం అడిగి తెలుసుకుని సానుభూతి చూపుకుంటాం . జిలానీ రాత్రులు నాతోనే పడుకుంటుంది . అంటే ఇక నాతోనే వుండి పోయిందన మాట . అప్పుడు జిలానీ తిన్నదా లేదా అని నేను , సరిగా తిన్నానా లేదా అని నా గురించి జిలానీ అడిగి తెలుసుకుని కబుర్లు చెప్పుకుంటాం 

మొన్నో రోజు జిలానీ వాళ్ళ అమ్మ వచ్చిందట నేనేమో కేంప్ కి వెళ్లాను . వచ్చాక సంధ్యవేళ నా కాఫీ ఎలా ఉండాలో చెప్పడానికి వంట ఇంట్లోకి వెళ్ళానా కప్ బోర్డ్లో వున్న బేగ్  లో నుండి పలకరించింది మల్లె పూ మాల . మనసు నిండుగా ఆ పరిమళాన్ని ఆస్వాదించి ఎక్కడివి పూలు అంటే జిలాని చెప్పింది వాళ్ళమ్మ వచ్చిందని . చెప్పి ,పూలు తీసిచ్చి పెటుకోమని బ్రతిమలాడింది ,నేను ''వద్దురా నాన్న ,నువ్వు చిన్న పిల్లవి పూలు పెట్టుకుంటే అందం నేనేమో ముసలమ్మని కదా అందుకని వద్దు'' అన్నాను . అని కాఫీ పటు కుని హాల్ లోకి వచ్చేసాను . జిలానీ ఈ సారి సగం పూమాలని పటుకొచ్చి ఇద్దరం చేరి సగం పెట్టు కుందాం తీసుకోండి మేడం అన్నది అంతేనా  ప్లేటు నిండా గులాబి పూలు పెట్టుకోచ్చింది [తినే గులాబులు ] తినండి అంటూ . ఒక్కటి తీసుకున్నానా .. . గులాబి పువ్వు గాడమైన మల్లె ల వాసన వేస్తుంది . 

ఒక రోజు ఎక్కడిదో ఒక గులాబి పువ్వు ఇచ్చింది జిలానీ . బలవంతానా జిలానీ కోసమని పెటుకున్నానా  ,ఆ  మధ్యాహ్నపు నిదురలో ఎపుడో పక్క మీద పడిపోయిందేమో ,దాన్ని తీసి మళ్ళీ నీళ్ళలో వేసి దానికి ఆయువు పోసి మరుసటి రోజు పొద్దునే బయటకి వెళ్తున్నపుడు పటుకోచ్చింది ,పెట్టుకోమంటూ ,పువ్వుతో పాటు ఒక మాట''  రేపు ఊరికేలుతున్నారు కదా అక్కడ నేనుండను కదా పువ్వు ఇవ్వడానికి ,అందుకని ఇవాళ పెట్టుకోండి '' అని 

ఇంటికి వచ్చాను కదా ,కానీ జిలానీ ని చాలా మిస్ అవుతున్నా .

 అందరూ చిన్నప్ప్పటి నుండి నన్ను అదృష్ట వంతురాలినని అంటారు . నిజమేనేమో నా సత్తుపల్లి అదృష్టమంతా నన్ను ఇంత ప్రేమిస్తున్న జిలానీ లో ,అమ్మీ లో ,తోడ పుట్టకున్నా తోడుగా వుండే కిరణ్ స్నేహితులు మాధురి, నరేష్ లో ,  డ్రైవర్ ప్రభాకర్ రెడ్డి , పీ  ఏ కిషోర్ లో , నాకు ఇంతకు మునుపు  ఎప్పుడూ పరిచయం లేకున్నా నాకోసమని భగవంతుడు పంపిన దేవతల్లా వచ్చి , నాకు మంచి ఇల్లు చూసి పెట్టి అడగకనే అడుగడుగునా సహాయం చేసే మంచి మనుషులు డాక్టర్ ప్రదీప్ , పూర్ణ చంద్ర రావు గారిలో ఉందేమో . 

అవును నేను అదృష్టవంతురాలినే . ప్రేమించే మనుషులున్న వారు అదృష్ట వంతులు కాకేమి ?

Friday 20 September 2013

"డ్రీమ్స్ "

ఈ కథ సెప్టంబర్'' తెలుగు వెలుగు '' లో వచ్చింది . పత్రిక వాళ్లు  పేరు మార్చి ''డబ్బు డబ్బు '' పేరిట ప్రచురించారు

"డ్రీమ్స్ "

పొద్దున్నే లేసి, గంప లేపి కోళ్ళని వదిలి చీపురకట్ట అందుకున్నది నూరున్నిసా. బరబరా పరపరామని చీపురకట్ట చేస్తున్న శబ్దానికి అజీజ్ కూడా లేసేసాడు. వాళ్ళిద్దరి పదేళ్ళ కూతురు తమీమ మాత్రం హా... మని నోరు తెరుచుకుని నిదురపోతోంది. అట్లా నిదురపోతున్న కూతురి బుజ్జి మొహాన్ని చూసి ముసిముసిగా నవ్వుకున్నది నూరున్నిసా. అజీజ్ వీధి వాకిట్లో ఉన్న వేపచెట్టు పుల్ల తుంచి నోట్లో వేసుకుని నవులుతూ తలాకిటే నిలబడ్డాడు.

అజీజ్ బేల్దారి పనులు చేస్తాడు. నూరున్నిసా టైలరింగ్ పని చేస్తుంది . ఆమె తండ్రి, తాత, తల్లి, అమ్మమ్మ అందరూ టైలర్లే. తరతరాలుగా దర్జీ కుటుంబం వాళ్ళది . ఆ పల్లెటూర్లో నూరున్నిసా దర్జీ పనికి మంచి గిరాకీ ఉంది . అజీజ్ కి కూడా ఏ చెడు అలవాట్లు లేవు.సంపాదించింది చక్కగా పొదుపు చేసుకుంటారు. నూరిన్నిసా తమీమా పేరుమీద నెల నెలా ఐదొందల రూపాయలు పోస్టాఫీసులో దాస్తుంది కూడా. ఏ చీకు చింతా లేకుండా అల్లా కరుణించి వాళ్లకి ఒక్క బిడ్డనే ఇచ్చాడని, నూర్ ని చూసి ఆమె స్నేహితురాళ్ళు, బంధువులు మనసులో మనసులో కుళ్ళుకుంటూ ఉంటారు... , పైకి మాత్రం ''ఒక కన్ను కన్నూ కాదు ఒక బిడ్డ బిడ్డా కాదు'' అని దెప్పి పొడుస్తూ వుంటారు .

తమీమా కడుపులో ఉన్నప్పుడు అజీజ్ బేల్దారీ పనులకి డిల్లీకి వెళ్ళాడు. నూర్ కి ఏడో నెల ఉన్నప్పుడు తాజమహల్ చూడాలని ఉందని భర్తకి చిట్టీ రాసింది ,కడుపుతో వున్న వాళ్ళ కోర్కెలు తీర్చాలని అందరూ చెప్తే అజీజ్ వచ్చి ఆమెని డిల్లీకి తీసుకెళ్ళాడు. వెళ్ళిన రెండు మూడు రోజులకే నెలలు నిండకుండా తమీమ పుట్టేసింది నూర్ కి . ముచ్చటగా, బోర్లించిన బంగారు పళ్ళెంలా గుండ్రని మొహంతో ఉన్న కూతుర్ని చూసి భార్యాభర్తలిద్దరూ కూడపలుక్కుని మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఆ విషయం వాళ్ళిద్దరికీ, ఆపరేషన్ చేసిన డాక్టరమ్మకి తప్ప ఇంకెవరికీ తెలియదు . అడిగిన వాళ్ళందరికీ ''ఇదిగో ఆ దర్గాకి వెళ్లాం, ఈ తాయత్తు కట్టుకున్నాం.  కానీ, కడుపు పండడమే లేదు'' అని చెప్పేస్తారు.

ఇదిగో ,ఇవాళ రోజు కంటే చాలా ముందే లేసింది నూర్ . పాసి గిన్నెలు బయటేసి, అడుగుబొడుగులు ఊడ్చి కోళ్ళకు విధిలించి, గిన్నెలన్నీశుభ్రంగా తోమి నాపరాయి మీద బోర్లించింది . ఆనక వేపపుల్ల నోట్లో వేసి పళ్ళు తోమి కూతురి మంచం దగ్గరికి వచ్చింది. ఆకాశంలో సూర్యుడు గబగబా పెద్ద వాడై పోతున్నాడు .సూర్య కిరణాలు పడుకుని ఉన్న తమీమ మొహం మీద సూటిగా పడ్తున్నాయి . అయినా ఆ పిల్ల అట్లాగే నోరు తెరుచుకుని నిర్విచారంగా నిదరపోతుంది. అది చూసి నూరున్నిసా మురిపెంగా కూతురు ముఖం చుట్టూ చేయి తిప్పి కణతకు తాటించి మెటికలు విరుచుకుంది . కూతుర్ని లేపాలంటే ఆమెకు మనసు రాలేదు. కానీ టైమైపోతుంది. ఇవాళ వాళ్ళిద్దరూ టౌన్ కి వెళ్ళాలనుకున్నారు.
తమీమాని ని ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తోంది నూర్. స్కూల్ బస్ వాళ్ళ ఊరికే మొదట వస్తుంది. ఏడున్నరకంతా బస్ లో ఎక్కేసేయ్యాలి.రోజూ అయితే ఇవాల్టికి బస్సులో ఉండాల్సిన మాట .ఈ రోజు స్కూల్ కి సెలవు . అందుకే ఇంత నిదర తమీమాకి . అట్లా వొళ్లెరుగక పడుకున్న బిడ్డని తనివితీరా చూసుకుని ఆఖరికి ఎలాగో లేచి అరచెయ్యి దొన్నెగా చేసి తొట్లోంచి కొన్ని నీళ్ళు తీసుకొచ్చి తెరిచి ఉంచుకున్న తమీమా నోట్లో చుక్కలు చుక్కలుగా పోసింది నవ్వుకుంటూ. తమీమా నిద్దట్లోనే ఆ నీళ్ళని శుభ్రంగా చప్పరించేసింది కానీ లేవలేదు. అది చూసి నూర్ కి నవ్వాగలేదు. నవ్వుకుంటూ తడి చెయ్యితో తమీమా  ముఖాన్ని తుడుస్తూ, "బున్ని! లెయ్ లెయ్  టైమైంది, ఇంకెంత సేపు నిద్రపోతావ్" అని బిడ్డని తీసి ఒళ్లో వేసుకుంది.

తమీమ కళ్ళు తెరిచి తను ఏకంగా అమ్మ ఒళ్లోనే ఉండటం చూసి మరింత గారాలు పోతూ, తల్లి డొక్కకి కరుచుకుని ,తలని తల్లి రొమ్ములకి అదుముతూ , "అమ్మీ ...... అమ్మీ ఈరోజే కదా నాకు గౌను తెచ్చేది. ఈరోజు ఖచ్చితంగా టౌన్ కి పోతాం కదా అమ్మీ ! అల్లా కీ కసమ్ కదా " అన్నది, ఒట్టు కోసం చెయ్యి చాచి. నూర్ నవ్వి " అల్లా కీ కసమ్ సరేనా, ఇంక లెయ్ టైమైంది. నేను కూడా బిర బిరా పనులు చేసుకుంటే కదా పోగలము " అన్నది. ఆ మాట విని తమీమ మంచం మీంచి చెంగున కిందికి దూకింది.

రంజాన్ ఇంకో వారం రోజులే ఉంది. అసలేమయిందంటే... ఈరోజుటికి ఏడెనిమిది నెలల క్రితం తమీమ ఫ్రెండు సుస్మితకి పుట్టిన్రోజు జరిగింది. వాళ్ళ అమ్మానాన్న ఇద్దరూ డాక్టర్లు. బర్త్ డే పార్టీకి తమీమా తో పాటు క్లాసు పిల్లల్నందరినీ పిలిచారు. ఇళ్ళు దూరాబారాలలో ఉన్న పిల్లల్ని వాళ్ళే ఇంటి దగ్గర వదిలే ఏర్పాటు కూడా చేశారు. ఆ పార్టీకి వెళ్ళింది తమీమ . పైపెచ్చు సుస్మిత ఆ పిల్లకి బెస్ట్ ఫ్రెండ్ కూడాను. ఆ రోజు పార్టీ భలే జరిగింది. కేక్ కట్ చేసేప్పుడు సుస్మిత పింక్ కలర్ ఫ్రాక్ వేసుకుంది. దాని మీద ఇంద్ర ధనుస్సు లాటి రంగు రంగుల రాళ్ళు, మెత్తటి గులాబి పూలు, లేసులు వేసి చేసిన వర్క్ ఉంది. అది చూసి తమీమా కి ఆశ్చర్యం వేసింది. అబ్బ ఎంత బాగుంది గౌను . తనకి కూడా అలాటిది ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఆ పిల్లకి, ఆ రోజు రాత్రి ఆ గౌను గురించి అమ్మకి కథలు కథలుగా చెప్పింది. నూర్ అంతా విని విని కూతురి ముచ్చట చూసి "ఎక్కడ కొన్నారో, ఎంత రేటో అడుగు ఈసారి రంజాన్ కి నీకు కొనిస్తా సరేనా" అన్నది. తమీమాకి కి పట్టనలవి కాని సంతోషమేసింది.  ఆ రాత్రి ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు స్కూల్ కి వెళ్లి సుస్మితను అడుగుదామా అని ఆ పిల్ల తహ తహ లాడిపోయింది.

ఆ రాత్రి ఎలాగో తెల్లారింది. సుస్మిత క్లాస్ కి రాగానే తమీమా ఆ పిల్లని పట్టుకుని "సుస్మితా!సుస్మితా! నిన్న నువ్వు వేసుకున్నావే ఆ ఫ్రాక్ ఎక్కడ కొన్నారు? ఎంత ? మా అమ్మ అడిగి రమ్మన్నది, ఈ సారి రంజాన్ కి నాకు కొనిపెడతానంది మా అమ్మ" అని గడగడా మాట్లాడేసింది . తన ఫ్రాక్ తమీమా కి అంతలా నచ్చినందుకు సుస్మిత చాలా సంతోషపడి "అది డ్రీమ్స్ లో కొన్నామబ్బా, సిక్స్ తౌజండ్ రుపీస్" అని చెప్పింది. ఆ సాయంత్రం తమీమ బస్ దిగి వీధిలో నుండే ''అమ్మీ...  అమ్మీ'' అని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మని వాటేసుకుని సుస్మిత చెప్పిన విషయం అమ్మ కి అప్పచెప్పేసింది.

ఆరు వేలు అనగానే నూర్ కి పై ప్రాణం పైనే పోయింది. అమ్మో ఆరు వేలే, మూడు వేలతో అత్తమామలతో సహా ఇంటిల్లిపాదికీ బట్టలు కొంటుంది నూర్ ప్రతి రంజాన్ కి , ఒక్క గౌను ఆరువేలే ... అమ్మో అలా ఎలా కొనగలము అని ఆలోచనలో పడింది. తమీమ అమ్మ మొహం వాడిపోవడం చూసి నీరసపడి "అమ్మీ నాకు గౌను కొనిపెట్టవా అయితే" అని దీనంగా అన్నది. ఆ పిల్ల గొంతులో దీనత్వం విని నూర్ కి చాలా బాధేసింది . ఒక్కగానొక్క బిడ్డ దానికి ఆ మాత్రం కొనలేదా తను,ఎలాగైనా కొనాల్సిందే అని మనసులో మొండిగా అనుకుని ,బిడ్డ తల ప్రేమగా నిమిరి ''తప్పకుండా కొందాంరా బున్నీ'' అని కూతుర్ని ముద్దులాడింది.

అప్పుడు మొదలుపెట్టింది నూర్ డబ్బు దాయడం.మస్తాన్ వలి ఉరుసులో కొన్న పెద్ద చేపబొమ్మ హుండీ నిండుగా పది, యాభై, వొంద ... వట్టి నోట్లే, చిల్లర కాదు,అంతా దాస్తూ వచ్చింది. టైలరింగ్ పని శక్తికి మించీ చెయ్యడం, ఆ పని లేకపోతే బీడీలు చుట్టడం మొదలు పెట్టింది. మొగుడ్ని కూడా ఇంట్లో నిలవనీకుండా పనులకు పంపింది. ఇప్పుడు ఆ డబ్బంతా పెరిగి పెరిగి ఆరు వేలా రెండు వందలా ముప్పై అయ్యింది. ఎందుకైనా మంచిదని చెప్పి ఆ క్రితం రోజు రాత్రి హుండీ పగలగొట్టి తల్లీ కూతుళ్ళు పదిసార్లు డబ్బు లెక్క చూసుకున్నారు. ఆ డబ్బంతా, వాళ్ళ దూరపు పెద్దమ్మ మక్కా నుండి తెచ్చిచ్చిన ఎర్ర చేతి గుడ్డలో మూటకట్టింది నూర్. నూర్ కి, తమీమా కి మనసంతా అలివి కాని సంతోషంతో నిండిపోయింది. ఈరోజే నూర్ టౌన్ కి వెళ్ళాల్సిన రోజు . అందుకే పొద్దన్నే లేసి పనులంతా చేసుకున్నది .

ఇంటికి తాళం పెట్టి పన్నెండు గంటల బస్సులో టౌన్ కి బయల్దేరారు నూరున్నీసా ,తమీమా . బస్సులో కూర్చున్న తరువాత గుర్తొచ్చింది ఆమెకు,తనకు ఆ బట్టల షాప్ పేరు తెలుసు కాని అది ఎక్కడుంటుందో ఆ చిరునామా తెలీదని. బస్టాండులో దిగి ,తమీమా చేయి జాగ్రతగా పట్టుకుని ఆ చివరగా నిలబడి ఉన్న నిమ్మకాయ షోడా బండతని దగ్గరికి వెళ్లి '' అన్నా !ఇక్కడ డ్రీమ్స్ అని చిన్నపిలకాయల... అదే ,ఆడపిల్లల గుడ్డలమ్మే అంగడి ఎక్కడో చెప్తావా" అన్నది. నిమ్మకాయ షోడా అతను చాలా ఆలోచించాడు కానీ, అతనికేం అంతుపట్టలా. అందుకని "అట్ట పొయ్యి ఏదైనా గుడ్డలంగటిలో అడుగు బూబమ్మా చెప్పేస్తారు. మనకేడ తెలస్తది గుడ్డలంగడి కత, నిమ్మకాయలు ఏడ దొరుకుతాయో చెప్పమంటే సరే కానీ....." అన్నాడు నోరు సాగదీసి నవ్వతా.

నూర్,తమీమా జాగ్రత్త గా రోడ్డు దాటి ఒక ఫర్లాంగ్ నడిచి మొదట కనిపించిన బట్టల షాప్ లోకి వెళ్ళారు . నూర్ వాళ్ళని అడ్రసు అడిగింది. వాళ్ళు చాలా వివరంగా అడ్రస్ చెప్పి ఏ నెంబరు బస్సు ఎక్కాలో అది ఎప్పుడొస్తుందో, ఆ బస్సు కోసం ఎక్కడ నిలుచుకోవాలో కూడా చెప్పేశారు.  అరగంట నిలబడి, మరో అరగంట ప్రయాణించి బంగారు రంగు మెటల్ అక్షరాలతో రాసి ఉన్న "డ్రీమ్స్" కి చేరుకున్నారు అమ్మా కూతుర్లిద్దరూ .అది మూడంతుస్థుల్లో ఉన్న బట్టల షాప్ , మామూలు బట్టల దుఖాణం కాదు ,డిజైనర్ స్టోర్. దాన్ని చూడగానే నూర్ కి గొంతెండిపోయినట్టు అనిపించింది. లోపలికి వెళదామా వద్దా అని ఆలోచిస్తూ ,నెమ్మదిగా భుజాన వేళాడుతున్న చేసంచి తీసి ఎర్ర కర్చీఫ్ లో కట్టి ఉన్న డబ్బుని తడుముకుంది. కూతుర్ని దగ్గరగా తీసుకుని బురఖాని మరింత సర్దుకున్నది. ఎందుకు భయ పడాలి తను ఆ గౌను ఆరువేల రూపాయలు, నా దగ్గిర ఇంకా ఎక్కువే ఉంది అనుకుని తనకి తనే నచ్చజెప్పుకున్నది .నూర్ ఆ సందిగ్దావస్తలో ఉండగానే నీలి రంగు డ్రెస్ లో వున్నా గెట్ కీపర్ నిర్లిప్తంగా తలుపు తెరిచాడు . తలుపు తెరవగానే లోపల ఊపిరాడలేదన్నట్లు ఏసీ గాలి బయటకి పరుగులు పెట్టింది .

నూర్ షాప్ లోకి నాలుగు అడుగులు వేయగానే తెల్లగా ,బక్క పల్చగా , ఎర్రటి పూల చీర ,హైనెక్ రవిక వేసుకున్న ఒక అమ్మాయి "ఏం కావాలి" అన్నది , నూర్ గొంతు పెగల్చుకుని,తమీమాని ముందుకు నెట్టి "పాపకి గౌను కొనాలి" అని మెల్లగా వినీ వినపడనట్టు బదులిచ్చింది .అది విని ఆ అమ్మాయి "మూడో అంతస్తులో కుడి పక్క. మెట్లైతే అటు ,లిప్టైతే ఇక్కడ "అని వల్లించింది. ఇంతలో బాగా తెల్లగా,స్టైల్ గా , జుట్టు విరబోసుకున్న ఒకావిడ లోపలికొచ్చింది. కౌంటర్ లో ఉన్న మేనేజర్ లేచి ఆవిడకి నమస్కరించి ఇంగ్లీషులో ఏదో చెప్తుండగా నూర్ మెట్ల వైపుకి వచ్చేసింది.

తమీమాని తీసుకుని అన్ని మెట్లూ ఎక్కి మూడో అంతస్తుకి చేరుకుని నూర్ గౌన్ల కౌంటర్ కి వెళ్ళే సరికి ఆ తెల్లటావిడ లిఫ్ట్ లో వచ్చేసి అప్పటికే అక్కడ కూర్చుని ఉంది. షాప్ లో ఉన్న వాళ్ళు మరేం పనిలేనట్లు ఆవిడకి నమస్కారాలు పెట్టి వెళుతున్నారు. నూర్ ఆవిడ పక్కకెళ్ళి నిలుచుని ,కాసేపు ఆవిడ్ని,ఆవిడ వేసుకున్న రవిక మోడల్ ని పరీక్షగా చూసి ఎవరో పెద్దింటావిడ అనుకున్నది. కౌంటర్ పిల్లవాడు ఆవిడ ముందు రకరకాల గౌన్లు ఒక దాని పై మరొకటి పరుస్తూ వస్తున్నాడు ,అన్నీ మంచి మంచి గౌన్లు .

నూర్ బేగ్ లోంచి ఎర్ర కర్చీఫ్ మూట తీసి చేతిలో పట్టుకుని, కాసేపు ఆ గౌన్ల వంక చూస్తూ నిలబడింది, తరువాత మళ్ళీ బాగ్ లో దాన్ని జాగ్రత్తగా సర్ధి కౌంటర్ లో పిల్లవాడితో "బాబూ ...." అంటూ తనకే రకం గౌను కావాలో వర్ణించి చెప్పబోయింది ఆ కుర్రాడు "కాసేపు ఆగమ్మ...." అని ఒక ముక్కతో ఆపేసి మేడం కి చూపించడం మొదలు పెట్టాడు.మరో పది నిముషాలు గడిచాయి ,ఆ తరువాత మరో పదిహేను నిముషాలు కూడా గడిచాయి. ఇంతలో మేడం కి ,చుట్టు పక్కల వున్న మరో ముగ్గురికీ గాజు గ్లాసుల్లో నీళ్ళు,చల్లటి కూల్ డ్రింకులూ వచ్చాయి. అవి చూడగానే నిలుచుని వున్న తమీమ అమ్మని చిన్నగా గోకి బొటన వేలిని పైకెత్తి పెదవుల దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ళు అని సైగ చేసింది . అది చూసి నూర్ చూపుడు వేలిని పెదాలపై వుంచి ఉష్ అని సైగ చేసింది కూతురికి . నిజానికి ఎండన బడి రావటం చేత నూర్ కి కూడా దాహమేస్తుంది కూతురి కంటే ముందే మంచినీళ్ళు అడుగుదామనుకుంది కూడా కానీ ఏదో బెరుకుతోనో ,అభిమానం చేతనో అడగలేకపోయింది .
నూర్ ని ఎవరూ పలకరించిన పాపాన పోలేదు, అక్కడ చూపిస్తున్న గౌనులు చూస్తూ ఓపికగా నిలుచున్నది, కానీ ఎంతసేపలా, మళ్ళీ ఊరికెళ్ళాలి,ఇంటికెళ్ళి వంట చెయ్యాలి . లాస్ట్ బస్ ఆరుకే . అది దాటితే మరి బస్సు లేదు, . తొందరగా ముగించాలి, ఇంకా భర్తకి, అత్తామామలకి రంజాన్ బట్టలు కొనాలి. నూర్ ఈసారి ధైర్యం చేసి "బాబూ నాకు చూపించవా ఎంతసేపు నిలబడేది" అన్నది. గౌను చూపెడుతున్న అబ్బాయి అందుకేమీ మాట్లాడలేదు కానీ, పక్కన కౌంటర్లో వున్న పిల్లవాడు "ఉండు బూబమ్మ ముందు మేడం పని కానీ ,అలా తొందరపడితే ఎలా,నిలబడలేకపోతే కూర్చో నిన్ను నిలబడమన్నది ఎవరూ '' అన్నాడు."కానీ కూర్చోవాలంటే అక్కడెక్కడా కుర్చీలు ఖాళీ లేవు . నిండా జనం . ఎవరెవరో వస్తున్నారు . అందరూ ఖరీదైన బట్టల్లో అందంగా వున్నారు. వాళ్ళందరి మధ్య నూర్ కి తనకి తనే కుంచించి పోయినట్లు , ఊపిరాడనట్లు అనిపించింది . అయినా తమీమా ముద్దు ముఖాన్ని చూసి అట్లాగే నిలబడింది . ఇంతలో షాప్ కుర్రాడు చిన్న స్టూల్ తెచ్చిచాడు . నూర్ తమీమాని దానిపై కూర్చో పెట్టింది .

మరి కాసేపు గడిచింది . మేడం కి చూపిస్తున్న వాట్లలో గులాబీరంగు గౌను కనిపిస్తే దాన్ని తీసుకుని చూడబోయింది నూర్ . కౌంటర్లో వున్నతను దాన్ని నూర్ నుండి లాక్కుని'' కాసేపాగు బూబమ్మ'' అన్నాడు కసిరినట్టు. అది చూసి తమీమా తలెత్తి అమ్మ ముఖం వంక చూసింది . ఏమీ అర్థం కాకున్నా ఎందుకో ఆ చిన్ని అమ్మాయికి మనసులో బాధ కలిగింది . ఇంతలో మేడం మొదలుపెట్టింది "ఇదిగో అబ్బాయ్ అందరూ మాకు 40% డిస్కౌంట్ ఇస్తారు.  మీరు మాత్రం  ఎప్పుడూ 30 పర్సంటే అంటే కుదరదు . ఈసారి 40% ఇవ్వకపోతే ఇకరాను'' అని . సేల్సతను నవ్వుతూ ''మేడం మా దగ్గరున్న వెరైటీలు మీకు ఎవరైనా ఇస్తారా చెప్పండి. వాళ్ళకీ మాకూ అదే తేడా'' అన్నాడు. నూర్ ఆశ్చర్యపోయింది 40% డిస్కౌంట్ అంటే ఆరువేల గౌను ఆవిడకి దాదాపు మూడున్నర వేలకి వస్తుంది. నూర్ ఆవిడ్ని తెరిపార చూసింది , మళ్ళీ ఇటు తిరిగి ఇంకో గౌను చేతిలోకి తీసుకోబోయింది. సేల్స్ అతను నూర్ చేతిలో గౌను మళ్ళీ లాక్కుని "నీక్కదమ్మా చెప్పేది, కాస్తాగలేవూ " అన్నాడు చిరాగ్గా కసిరినట్టు .

నూర్ కి దిగులేసిపోయింది,వచ్చినప్పటి నుండీ చూస్తుంది ,ఎవరూ తననొక మనిషి లాగా గుర్తించటం లేదు .చులకనగా చూస్తున్నారు .విసుక్కున్టున్నారు అనుకుంది . అలా అనుకోగానే ఆమెకి దుఃఖమొచ్చేసింది . నా దగ్గర సరిపడా డబ్బు ఉందికదా అనుకుంది. మేడం చివరికి కొన్న గౌనుని చూసి, ఆవిడకి నాకూ ఏంటి తేడా ఆ డబ్బు నేనీలేనా ,నేనేమైనా వీళ్ళ దగ్గరికి ముష్టెత్తుకోవడానికి వచ్చానా అనుకుంది ,ఎందుకో నూర్ కి ఒక్కసారిగా చెడ్డ అవమానమనిపించింది. అంతే కళ్ళలోంచి, ముక్కులోంచి పట్టనలవి కాని దుఃఖం తన్నుకొచ్చేసింది, మరేం మాట్లాడకుండా, బురఖా సర్దుకుంటూ, భుజాన వున్న చేతి సంచిని  తడుముకుంటూ తమీమాని తీసుకుని నేరుగా దిగి కిందికొచ్చేసింది. ఏమమ్మా ఏంటి వెళిపోతున్నావు అని ఎవరైనా అడుగుతారేమో అని చూసింది కానీ,ఎవరూ అడగనేలేదు, అసలు నూర్ ని ఒక మనిషిలాగే వాళ్ళు మతించలేదు.
నూర్ ,తమీమా ఎర్రటెండలో నడుచుకుంటూ వచ్చి మళ్ళీ బస్సు కోసం నిలబడ్డారు. తమీమా కి అమ్మని మాట్లాడించాలంటే భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుని అమ్మని చిన్నగా తట్టి "అమ్మీ ఏమయింది, మనమెందుకు అక్కడ నుండి వచ్చేశాం?" అన్నది. నూర్ కూతుర్ని దగ్గరికి తీసుకున్నదే కానీ తిరిగి సమాధానమేమీ చెప్పలేదు. తమీమా మళ్ళీ "అమ్మీ మన దగ్గర కూడా డబ్బులున్నాయి కదా , అయినా వాళ్ళు మనకెందుకు చూపించలేదు? " అని అడిగింది. ఈసారి నూర్, నోరు పెకలించి "ఏమోరా బున్నీ మనకెలా తెలుస్తుంది. చాలాసేపు నిలబడ్డాం కదరా, నువ్వే చూసావు కదా" అన్నది క్షమార్పణ వేడుకుంటున్న గొంతుతో . తమీమా తలూపింది. నిజానికి ఇందాకటి నుండి అదే విషయం నూర్ మనసులో కూడా తిరుగుతోంది. ఈ ప్రపంచంలో అన్నింటినీ సరి పడా డబ్బు వున్నా కొనలేమేమో , డబ్బుంటే మాత్రం సరిపోదు.డాబు గా దర్పం గా వుండాలి, ఆ ఫలానా వస్తువుని కొనాలన్నా, అనుభవించాలన్నా బహుశా తరతరాల స్థోమత ఉండాలేమో. గొప్పతనం ఉండాలేమో. అక్కడికి వచ్చినావిడ పుట్టు ధనవంతురాలై ఉంటుంది, ఆవిడ ఒకటికి పది గౌన్లు కొనగలదు, పదిమందికి షాప్ గురించి చెప్పగలదు. తనేం చేయగలదు ?జీవితంలో ఒక్కసారి బోడి ఆరువేల రూపాయలు పెట్టి ఒక్కటంటే ఒక్క గౌను కొనగలదు. అంతే కదా ? అదే నిజం. తను బాధపడటమెందుకు అనవసరంగా అనుకుంది నూర్. అయినా ఎందుకో ఆమెకి మనసంతా బాధగా తోచింది.

కాసేపటికి బస్సొచ్చింది. ఇద్దరూ బస్సెక్కి తామెప్పుడూ బట్టలు కొనే సండే మార్కెట్ వద్దకి వెళ్ళారు. బస్సు దిగగానే రోడ్డు వారగా నిలబడి ఉన్న షోడా బండి దగ్గరకు వెళ్లి తమీమాకో కలర్ షోడా ,తనకో మామూలు షోడా కొట్టిపిచ్చింది నూర్. ఇద్దరూ తాగి తాము వాడుకగా వెళ్ళే దుఖాణానికి వెళ్ళారు. దుఖాణం అబ్బాయి పరిచయంగా నవ్వి "బాగుండా బూబమ్మా" అన్నాడు . నూర్ తలూపి "అబ్బయ్యా అన్నిటికంటే మంచి గౌను చూపిచ్చు. రోజా రంగులో ఉండాల,రాళ్ళుగీళ్లు , లేసులు గీసులు వుండాల " అన్నది. ఆ అబ్బాయి బోలెడు గౌన్లు చూపించాడు . వాటిలో ఒకటి రోజారంగులో ఉంది,దానికి లేసులున్నాయి, పూలున్నాయి, రంగు రంగుల రాళ్ళూ ఉన్నాయి.
నూర్ దానిని తమీమాకి చూపించి "బాగుంది కదరా బున్నీ" అన్నది. తమీమా నవ్వి తలూపింది . నూర్ తమీమాని నిలబెట్టి గౌనును తమీమా ఒంటిపైన పెట్టి కొలత చూస్తూ ''ఎదిగే బిడ్డ మూడు నాలుగేళ్ళు సరిపోవాల కదా ''అన్నది చుట్టుపక్కల వున్న వాళ్ళని ఉద్దేశిస్తూ చనువుగా . అలా పెట్టినపుడు ఆ గౌను రంగు తమీమా ఒంటి రంగులో కలిసి కొత్త కాంతులీనుతోంది. అది చూసి నూర్ ఇందాకటి బాధనంతా మరిచిపోయి తమీమా ముఖం చుట్టూ చేయి తిప్పి మెటికలు విరిచింది. అది చూసి షాప్ అబ్బాయి నవ్వాడు,నవ్వి ,తమీమా పాలుగారే బుగ్గ ని ముద్దుగా సాగదీసాడు .

గౌను కొన్న తరువాత చాల సంతృప్తిగా అమ్మ కూతుళ్ళు అక్కడనుండి ఇంకో అంగడికి వెళ్లి మిగిలిన బట్టలు కొని ,ఇద్దరూ చెరొక మూర కదంబం పూలు ,పది రూపాయలకి పనస తొనలు కొనుక్కుని సందేలకంతా ఇంటికొచ్చేసారు .

తమీమ ఆ గౌనుని వేసుకుని రంజాన్ ని గొప్పగా జరుపుకున్నది. సెలవయ్యాక వచ్చిన మొదటి "కలర్ డ్రెస్" రోజు స్కూల్ కి కూడా వేసుకెళ్ళింది. ఆ రోజు సాయంత్రం స్కూల్ బస్ దిగి "అమ్మీ అమ్మీ ఫ్రాక్ చాలా బాగుందన్నారు మా ఫ్రెండ్స్ . సుస్మిత అయితే నైస్ ఫ్రాక్ అన్నది అమ్మీ " అంటూ అరుచుకుంటూ వచ్చింది తమీమ. అప్పుడే కుట్టిన రవికకు కాజాలేస్తున్న నూర్ తమీమాని వళ్ళోకి తీసుకుని కూతురి పాల బుగ్గలపైన ముద్దు పెట్టుకుని " నువ్వు బాగా చదువుకోవాలి బున్నీ, పెద్ద పెరిగాక గడ గడా ఇంగ్లీష్ మాట్లాడాలి !పెద్ద ఉద్యోగం చెయ్యాలి సరేనా! అప్పుడే అమ్మకి సంతోషం " అన్నది. అమ్మ మాటలకి తమీమ తలూపి ఇంట్లోకెళ్ళింది, తమీమానే చూస్తున్న నూర్ కి ఆవాళ '' డ్రీమ్స్'' గుర్తొచ్చి ఎందుకో గానీ గుబులు గుబులుగా అనిపించింది .
సామాన్య

Monday 19 August 2013

ఆనంద ,మోహన ...

ఆనందా ,నేనీ మధ్యనంతా  పరిశోధకురాలనై యోచించాను సృష్టిలో భవిష్యత్తు లేదనీ ,వర్తమానంలోనే భవిష్యత్తు మిళితమై పోయుందనీ .ప్చ్! నువ్వివాళ  భలే చెప్పావు ,భవిష్యత్తు ఉందనీ, అది మన కోసం దేనినో చేత పట్టి కాపెట్టుకుని ఉంటుందనీ . ఆనందా దుక్కం కమ్ముకొస్తుంది . కొందరి దుక్కం రకం వేరే . వేరే రకపు నా దుక్కం  దిక్కుతోచని తనం తో దిగులు పడుతుంది . నా దుక్కానికి వెలుపలి దారి మూత పడి వుంటుంది . నువ్విక్కడే,నేనూ అక్కడే ... ఆపన్న హస్తమవలేని బధిరత్వం గురించి ఏం చెప్పుకోనూ ? మరణానిదేముందిలే 
పాపం ,తరతమం లేనిది ,అందరినీ పలకరిస్తుంది,కొద్దిమందిని మరీ త్వరపడి ప్రేమతోనూ ,కొంత మందిని వలపక్షంగానూ , కానీ ఒక అనుబంధపు ఖాళీ గురించి ఏం మాట్లాడనూ . ఎన్ని  ఖాళీలో ప్రపంచం నిండా !హేతువు ఖాళీని పూడుస్తుందా ?.  నువ్వు నాకేమి ఇచ్చావో యోచిస్తున్నా ,మృదు నీ చిరు  స్పర్శ పంచినదంతా ఆనందమే,అచ్చు  చురుకులేని  ఉదయ కాలపు  ఎండ లాటి ఆనందపు స్నేహం నీతో ,కానీ చూశావా నువ్వు అంతా దుక్కం కలిపి  ఒక్క సారే  ఇచ్చేసావు . తల వాల్చిన దీనపు నీ రూపు ప్రాణ శక్తి ఇంకా వున్న  నా హృదయం పై గాయపు  నీ చిత్రం గీస్తుంది .ఈ దుక్కపు  చిత్రాన్ని ఏం పెట్టి మానపనూ ? చెంపలేసుకుని నాకు తెలియని ఎవరినోనూ ,మరియూ నిన్నూ ఏక కాలాన ప్రార్దిస్తున్నా ...నన్ను క్షమించు . నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు .కానీ నన్ను నేనెలా క్షమించుకోనూ ?


Saturday 18 May 2013

ఇందుమూలంగా సెలవు ప్రకటించడమైనది !



...ఎందు  మూలంగా అంటారా ,,బోల్డు  చదవాల్సినది వుంది . ఈ బ్లాగ్ ఒక అడ్డంకి కాదనుకోండి ,  చదవాల్సిన పని కాక రాసే పని ఒకటీ , పని చేయాల్సిన ఇంకో ప్రాజెక్టూ వున్నాయి ముందర . నాకేమో బ్లాగ్ వ్యసనం కదా . టైం  లేకున్నా రాద్దామనిపిస్తుంది. అందుకని రెండు  నెలలు ..వూ ... పోనీ నెలన్నర చుట్టీ పెట్టేద్దామని అనుకుంటున్నా .వుత్తుత్తి చుట్టీ నా మనసులో నేనే అనుకున్నాననుకోండి సరేలే  అనుకుని రాసేయ్యగలను . అందుకని స్మోకర్స్ బహిరంగ ప్రకటన చేసినట్లు ఇలా ప్రకటన చేసి బ్లాగ్ ని సుప్తావస్తలో పెట్టేసేయ్యదలచుకున్నా .

అసలు ఇంత చెప్పాల్సిన అవసరం ఏంటంటే ... నాకూ పాటకులున్నారు కదా ,మరి వారికి బాధ్యత పడి  వున్నాను కదా అందుకని . నా పాటకులు నాకు పర్మిషన్ గ్రాన్టేడ్ అనేసారని భావిస్తూ  రేపే బ్లాగ్ మూతపెడుతున్నా .


Friday 17 May 2013

ఎంత ఆనందమో ... హృదయం నిండి పోయింది



ఎంత ప్రేమగా చెప్పనూ ఈ పాట  గురించీ ?వింటూ వుంటే హృదయం నిండి పోతుంది .ఆనందం ఎక్కువైతే హృదయం భరించ కలదా ?ఏడుస్తుంది . పై పైకో...  లోపల లోపలో . టాగోర్ '' రబీంద్ర  సంగీత్ '' నుండి ఇది కూడా .రాసిన వారికి ,పాడిన వారికి పాద ప్రణామాలు .

పాడింది కనికబెనర్జీ https://en.wikipedia.org/wiki/Kanika_Banerjee. మొన్నో రోజు పాపాయి వాళ్ళ నాన ఇంట్లోకి తెచ్చాడు ఈ పాటని . రోజంతా దీనితోనే గడుస్తుంది అయినా తనివి తీరదు . ఒక్కో సారి నా కాశీ చెంబులో పోసుకుని తాగేద్దామని అనిపిస్తుంది .పాట వింటూ వుంటే  చాలా కోపం తెప్పించిన వాళ్ళని కూడా ,వెళ్ళండి ,ఇక తప్పులు చేయకండి ,సామాన్య మిమ్మల్ని క్షమించి  వేసింది అని దయగా దగ్గర కూర్చో  పెటుకుని చెప్పాలనిపించింది . హృదయం సరళమై ,దయార్ద్ర మయింది .

ఈ పాట లో ఆనందం వుంది . ప్రేమ వుంది .

తెలుసా ... రవీంద్రుడు ఎన్ని గీతాలు రాసాడో?మూడు వేల ఐదువందలు . ఆ మాట వింటే ఎంత ఆనందం వేసిందో .ఇకనేం రోజుకో కొత్త పాట విన వచ్చని . సంగీతం జీవితాన్ని సఫలం చేస్తుంది . కానీ ఒక్కోసారి ఎంత బాధ వేస్తుందో నాకెందుకు పాడటం  రాదని . బెంగాలీలు ఈ విషయం లో దయగల వారు . నాకు రబీంద్ర సంగీత్ నేర్పించే మా టీచరు అంటుందీ హృదయం లో ఇంత ఇష్టం వుందే మీకు ,పాడటం రాక పోవటమేమిటి ?నేను తయారు చేస్తా కదా మిమ్మల్నీ అని .

Anandadhara Bohichhe Bhubone 
Anandadhara Bohichhe Bhubone 2
Dino rojoni koto Amrito Roso
Utholi jai Ananto Gogone 
Anandadhara Bohichhe Bhubone 2 
Pano(?) Kore Robi shashi Anjali Bhoriya 
Soda dipto rohe Akhhoyo Jyoti 2 
Nittya purno Dhora Jibone Kirone
Anandadhara Bohichhe Bhubone 2
Bosiya Accho Keno Apon Mone
Shartha Nimogono Ki Karone. 
Chari dike dekho Chahi Hridoyo Prosari 
Khudro Dukkho Sobo tuchho mani 2 
Prem Bhoria Loho Sunno Jibone
Anandadhara Bohichhe Bhubone 2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది పాడింది బహుశా  ఇంద్రాణి సేన్ .
All over the world flows the stream of joy.
Night and Day, in the sky, much nectars deploy.
The stars drink the glow with folded palms.
The eternal light, always stay bright and calm.
The globe is continually full of life and ray.
Why are you sitting detached?
Why are you so self-centered?
Open your heart and look all over.
Ignore the small pains as minor.
Fill the empty life with love and care.
All over the earth flows a flood of joy

Thursday 9 May 2013

పచీసే బైశాక్


పచీసే బైశాక్ అంటే వైశాఖ మాసపు 25 వ తారీకు అని . ఈ రోజు బెంగాలీలకు అతి ఇష్టమైన రోజు . ప్రభుత్వ సెలవు  దినం .ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే రవీంద్ర నాథ్ టాకూర్ పుట్టారు . బెంగాలీల హృదయాధి దేవుడు కావడమే కాక భారత సాహిత్య సీమని సుసంపన్నం చేసారు టాకూర్. పొద్దుటే రాలీ కి వెళ్లి వచ్చి పాపాయి వాళ్ళ నాన ఆశ్చర్య పడ్డాడు ,ఒక వేళ  రవీంద్రుడు పుట్టక పోయి వుంటే బెంగాలీలు ఏమై  పోదురోనని .బెంగాలీలకి రవీంద్రుని పై వుండే పిచ్చి అభిమానం మనకు ఇటువంటి ఆలోచనలను కలిగిస్తే ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు .

ఈ సందర్భం లోనాకు బాగా ఇష్టమైన రబీంద్ర సంగీత్ నుండి ఒకగీత్http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re
  .  ఈ పాటని నేను ఏడేళ్ళ క్రితం మొదటి సారి కూచ్ బిహార్ ''సాగర్ దిఘి ''ఒడ్డున ఓ సాంధ్య వేళ విన్నాను .  ''ఎక్లచలో ''అంటే ఏమిటీ అని అడిగాను . ఒక్కడీవే \ఒక్కతివే వెళ్ళు అని అర్థం తెలుసుకున్నాక ఈ పాట  మొత్తం అర్థం తెలుసుకోవాలనిపించింది . ఈ గీతం అధైర్యం లో ధైర్యాన్ని ఇస్తుంది .కొత్తని ఒప్పుకోని ప్రపంచానికి , దిగులు పడకుండా,కుంగి పోకుండా మార్గ నిర్దేశం చేసే శక్తినీ ఇస్తుంది . ఈ పాట  రాసినందుకు రవీంద్రుడికి మనం తర తరాలుగా రుణ గ్రస్తులమయ్యాం .  

(Jodi tor daak shune keu naa se tobe ekla cholo re
Tobe ekla cholo, ekla cholo, ekla cholo, ekla cholo re)2

Jodi keu kothaa naa koye, ore ore o abhaagaa, keu kothaa na koye
(Jodi shobai thaake mukh phiraaye shobai kore bhoye)2
Tobe poraan khule (o tui mukh phute tor moner kothaa, eklaa bolo re)2

Jodi shobai phire jaaye, ore ore o abhaagaa, shobai phire jaaye
(Jodi gohan pothe jaabaar kaale keu phir naa chaaye)2
Tobe pothera kaantaa (o tui rokto maakhaa choronatole eklaa dolo re)2

Jodi aalo naa dhore, ore ore o abhaagaa, aalo na dhore
(Jodi jhor-baadole aadhaara raate duyaar deye ghore)2
Tobe bajraanole (aapon buker paajor jaaliye niye ekalaa jolo re)

ఈపాటంటే గాంధీజీ కి చాలా ఇష్టమట . మనసు దిగులు పడినపుడు ,నిరాశ కమ్ముకున్నపుడు ఈ పాట వినే వాడట . 

ఒక  వేళ ,నీ పిలుపునందుకుని  ఒక్కరు కూడా  రాకుంటే 
నిన్ను ఏకాకిని చేసేస్తే ,మరేం పర్లేదు !ఎవరూ రాలేదు కదానని ప్రయాణం మాత్రం ఆపకు . నువ్వొక్కడివే వెళ్ళు 


ఒక  వేళ నీతో ఎవరూ మాట్లాడకుంటే ,ఓ అభాగ్యుడా నీతో ఏ ఒక్కరు కూడా  మాట్లాడకుంటే,నీ చుట్టూ  వున్న అందరూ నిన్ను చూసి ముఖం తిప్పెసుకుంటూ వుంటే ,నిను చూసి భయపడి పోతూ వుంటే ,అప్పుడు ,నువ్వొక్కడివే నీ ప్రాణ శక్తినంతా వెచ్చించి నీ మనసులోని మాటను ఎలుగెత్తి  చెప్పేయ్ 


ఒకవేళ అందరూ వెనుదిరిగి పోతూ వుంటే ,పిరికి ముఖం వేస్తూ వుంటే  ఓ అభాగ్యుడా ఒక్కరూ నీ వైపు లేని ఆ నిర్మానుష్యమైన దారిలో నీవు వెళ్ళాల్సి వస్తే ,దారిలోని ముళ్ళు నీ పాదాలని రక్తమయం చేస్తున్నా ఆ రుధిర పాదాలతోనే పరుగు పెట్టు .కానీ ప్రయాణం మాత్రం ఆపకు . 

ఒక వేళ వెలుతురే కనిపించకుంటే ,ఓ అభాగ్యుడా ,కారు మేఘం అలుముకున్న చీకటి రాత్రి ,ఉరుములు మెరుపుల కుంబవ్రిష్టిలో నీ కోసం ఒక్క ఇంటి తలుపూ తెరుచుకోకున్నా ఓ అభాగ్యుడా నీ హృదయం లోని సాహసాన్ని దివిటీ చేసుకుని  జ్వలించు 






Tuesday 7 May 2013

కలక్టర్స్ వైఫ్



సివిల్ సర్వీస్ రిసల్ట్స్ వచ్చాయి కదా ,సివిల్ సర్వీస్ కి చదివే వాళ్ళందరూ కలక్టర్ అనే ఉద్యోగానికి ఆకర్షితమై ఈ వైపుకోస్తారు . నిజానికి ఒక సివిల్ సర్వెంట్ కలక్టర్ గా కేవలం నాలుగైదేళ్ళు మాత్రమె వుంటుంది/ఉంటాడు  .

కిరణ్ ,మాల్దా జిల్లాకు  కలక్టర్ అయ్యాడు . సీనియారిటీని కాదని కిరణ్ కి వాళ్ళ బాచ్ లో అందరికంటే ముందుగా కలక్టర్ పోస్ట్ ఇచ్చారు . ఆ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. కిరణ్ ఎక్కడ పని చేస్తే అక్కడ ప్రజలు ఆయన ''టాకూర్ మతో''[దేవుడి లాంటి వ్యక్తి ]అంటారు . కలక్టర్ ప్రమోషన్ వస్తుందనగానే కిరణ్ పనిచేసి వచ్చిన అన్ని జిల్లాల వాళ్ళు సర్ మీరు మా జిల్లాకి రావాలి అని ఫోన్లు చేసారు. ముఖ్య మంత్రి కి వినతులు కూడా ఇచ్చారు. ఫలితమే కిరణ్ ని సీనియారిటీని అతిక్రమించి ఇక్కడికి పంపించడం . ఈ వూరికి ప్రమోషన్ వచ్చిందని తెలియగానే అప్పుడు కిరణ్ పని చేస్తున్న ఆ వూరి  ప్రజలు మూడు వందల మంది దాకా వచ్చి ఈ సార్ లేక పోతే  మాకు పనులు కావు .[అక్కడ భూసేకరణ  జరుగుతూ ఉండింది .కిరణ్ ప్రజల పక్షాన గట్టిగా నిలబడ్డాడు . ఇతర అధికారులు నచ్చజెప్పాడు .రూల్స్ ని అతిక్రమించి అనేక వుపాయాలతో వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రయత్నించాడు . అందుకని  ప్రజలు రాముడుంటాడు ,రావణుడూ ఉంటాడు.   మనకోసం రాముడొచ్చాడు అని కవిత్వం చెప్పుకున్నారు ]ట్రాన్స్ఫర్ చేస్తే చేసారు కానీ ఈ చార్జ్ కూడా ఆయనకే ఇవ్వండి అని ఆఫీసుని నిర్భంధించి చాల సేపు ధర్నా చేసారు [కిరణ్ వచ్చేసిన రెండు నెలలకి చూసి చూసి ఇప్పుడు మళ్ళీ అక్కడ ప్రజలు దర్నాలకి దిగారట] . అప్పుడు ఆ ఊరి m l a నేను ఎన్నో ఏళ్ళ నుండి ఈ జిల్లాలో ఉంటున్నాను ,నాకు తెలిసీ ఈ జిల్లా చరిత్రలో ఒక అధికారిని ఉంచాలని ధర్నా చేయడం ఇదే ప్రధమం అని ఫోన్ చేసి అన్నారు  .

మాల్దా లో 58 % ముస్లిములు వుంటారు . అల్లర్లూ ,లాండ్ మాఫియా యెక్కువ. అది ఒకటైతే అంతకు ముందు ఇక్కడ వుండిన I A S అధికారి అరాచకాలు చెప్పనలవి కానివట . ఆవిడని ట్రాన్స్ఫర్ చేసినపుడు ప్రజలు ఔట్లు కాల్చి పండగ చేసుకున్నారట . ఒక సర్వెంట్ మెయిడ్ ని బాత్ రూం లో పెట్టి బంధించిందట . ఆవిడ పేరు బ్రౌస్ చేస్తే బోలెడు పితూరీలు ఓపన్ అవుతున్నాయని నా తమ్ముడు చెప్పాడు . ఆవిడని   ట్రాన్స్ఫర్ చేసి   '' బాలో చేలే కె పాటి యే దీచ్చి .బాలొ కాజ్ కొరున్ '' [మంచి అబ్బాయిని పంపుతున్నా   మంచి  గా  పని  చేయండి ]  అని  చెప్పిందట ముఖ్యమంత్రి మినిస్టర్ తో.  అయన ఆవిషయాన్ని మాకు చెప్పారు .

 నేను  కథలు రాస్తే అందరూ ఆయనే రాస్తున్నాడు అని కిరణ్ పేరు చెప్పుకున్నారు   నా వెనకాల .ఎందుకంటే నేను రాసేప్పుడు వాళ్ళు  చూడరు కాబట్టి . తమాషా ఏమిటంటే కిరణ్ పనుల్లో కొన్ని ఆలోచనలు నావి వుంటాయి . మొన్నో  పని జరిగింది బంగ్లాలో . అది నా ఆలోచన . అందరికీ ఆ విషయం తెలుసు . కానీ ,ఆ పుణ్యమంతా సార్  మీకు వస్తుందీ అన్నారు .  కిరణ్ అది విని నొచ్చుకున్నాడు .నాన కంటే ముందు పాపాయి ,అదేంటి అది అమ్మ ఆలోచన కదా అని ఖండించి వేసింది . ఇంట్లో వుండే నా పుస్తకాలు చూసి సార్  బాగా చదువుతారు లాగుంది అంటారు . ఆయన భార్య చదవచ్చు అనే ఊహ వాళ్లకి రాదు . వచ్చినా సార్ కి కీర్తినీయడం వాళ్లకి బాగుంటుంది . అంతకు ముందు ఒక కొండ పైన వుండే వాళ్ళం మేము .వట్టి రాళ్ళు నేల నిండా . చాలా కష్ట పడి ఆ కొండను పది మంది విస్తుపడి చూసేంత ఉద్యానవనం చేశా నేను .వచ్చి చూసే ప్రతి ఒక్కరూ సార్ కి గార్డెనింగ్ అంటే ప్రాణం లాగుంది అనే వారు .ఎందుకంటె ఈ పనులు  వాళ్ళు చూడరు కాబట్టి . ఆడవాళ్ళు తెలివిగానో ,చురుకుగానో వుండటం ఈ సాధారణ ప్రపంచం ఊహించలేదు కాబట్టి .

పెద్ద వ్యక్తుల పక్కనుంటే మన చిన్ని ప్రతిభలు కూడా వాళ్ళలో లయమై మరుగున పడి  పోతాయి . కిరణ్ మర్రి వృక్షం . నేను అతని నీడలో వున్న స్త్రీని .నాకేం  ప్రతిభలు వున్నా వ్యర్థమె ఇక .

అయినా కానీ కిరణ్ ని ఎవరైనా మెచ్చుకున్నారంటే నాకు చాలా ఇష్టం . మొన్న మాల్దా కి వచ్చిన ఎలక్షన్ కమిషనర్ ''ఏంటి ఎక్కడికెళ్ళిన అందరూ మీ పేరే చెబుతున్నారు ఏం చేస్తారెంటి మీరు '' అని అడిగాట్ట . అటువంటివి వింటే నాకు గర్వం కలుగుతుంది . కిరణ్ పై చాలా ప్రేమ పెరుగుతుంది.  భక్తి కూడా . ఎవరెవరో ఆడవాళ్ళు రాస్తుంటే వాళ్ళందర్నీ  వాళ్ళ భర్తలు రాస్తున్నారు అనడం లేదు  కదా ? రాయగలిగే శక్తి ఉన్నవాడని కిరణ్ ని అందరూ భావించడం నాకు గర్వాన్నిస్తుంది  . కిరణ్ బాగా పని చేస్తున్నాడూ అంటే నేనతనికి మంచిగా సహకరిస్తున్నాను అని నాకు నేను చెప్పుకుంటాను . నాకు పొలమూ పుట్ర ,నగ నట్రా కోరికలు లేక పోబట్టి కదా అతనంత మంచిగా, నిజాయితీగా ప్రజల కోసం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను . అతని సమయాన్ని డిమాండ్ చేసి సినిమాలకీ షికార్లకీ రమ్మనకపోబట్టే కదా ఎక్కువ సమయం పనిచేయగలుగుతున్నాడు అనుకుంటాను .

అవును ప్రతి మగాడి విజయం వెనుకా స్త్రీ ఉంటుందనే మాట అక్షర సత్యం . కనుక కిరణ్ విజయాలు ,ఆనందాలు నావి కూడా .  నిజానికి భర్త ఉద్యోగాన్ని ప్రస్తావించడం నాకు అయిష్టమైన విషయం . ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడు అని ప్రశ్నిస్తే  నేను వాళ్ళని అనాగరికులుగా జమకట్టేస్తాను . .కానీ ఇది వేరే .ప్రజల పక్షాన నిలబడే ఒక మంచి వ్యక్తి కి నేను భార్యని అని చెప్పుకోవడం నాకు గొప్పగా వుంటుంది . అందుకనే కలక్టర్ గా కిరణ్ అనుభవాలని అతని సహచరిగా అక్షరబద్ధం చేయాలనుకున్నాను .

''కలక్టర్స్ వైఫ్''  అనే లేబుల్ కింద ఇప్పటి నుండీ అవన్నీ రాస్తాను


Saturday 4 May 2013

మరణానంతరము



ఒక రోజు ఒక ప్రముఖ వ్యక్తి చాలా ఆసక్తిగా ''సామాన్యా  ,నా గురించి బయటి ప్రపంచం ఏమనుకుంటుందీ ''అని అడిగారు. ఆవాళ బుద్ధి పూర్వకం గా నేను సమాధానాన్ని దాటవేసాను .

నేను కథలు రాయటం మొదలు పెట్టాక నాకు సాహితీపరులు కొంతమంది పరిచయమయ్యారు . వారిలో కొంత మంది ఒక రచయిత గురించి అదే పనిగా చాడీలు చెప్పేవారు . అట్లా వింటే ఏమవ్వాలి ?ఏమో నాకయితే ఆ సదరు వ్యక్తి పట్ల హృదయం సరళమై ,జాలి కలిగి స్నేహం పెంచుకున్నాను .ఇదేమ్ స్వభావం ?

నా లాగే నా బిడ్డ బిడియస్తురాలు . మనుషులు నచ్చితే ఎంత వాచాలత్వం రాగలదో ,హృదయానికి దగ్గరగా రాని వారిపట్ల దాని గొంతు రాయవుతుంది . దాని క్లాస్ మేట్స్ తల్లులు కూడా ఈ అమ్మాయికి గర్వం అనుకునే వారట .ఏడేళ్ళ  చిన్న బిడ్డకు గర్వమనే పదార్తాన్ని ఆపాదించిన లోకం లేక్కేమిటికసలూ ?

ఈ సమస్త ఆలొచనలు నాకు ''మరణాంతరము''చదివిన తరువాత కలిగాయి . చెప్పకేం ... నేను బోలెడు చదివాను .చిన్నప్పటి  నుండీ ఇప్పటి వరకూ ,,,కానీ ఈ నవల ఇచ్చా పూర్వకం గా మానవుని బహుముఖాలని స్పృశించి నంతగా మరే నవలా స్పృశించడం  నా చిన్ని ప్రపంచం లో నేను చదివి ఉండలేదు  .

రచయిత శివరామకారంత్ .

ఈ రచయితకు బొంబాయికేలుతున్న  రైలు ప్రయాణం లో ఒక వ్యక్తి పరిచయమవుతాడు ఆరేడేళ్ళ పరిచయం లో కొన్ని మార్లు కలుసుకోవడము ... కొన్ని ఉత్తరాలు .... !

కొందరు మనషులు అతి చిన్ని పరిచయంలోనే చాలా ప్రేమించెంత గా మనకెందుకు నచ్చుతారు?బహుశా  వారిలోని నిష్కల్మషత్వాన్ని మన హృదయం కనిపెట్టడం కావచ్చును  ,లేదా మన హృ దయమూ వారి హృదయమూ ఒకే పదార్ధం తో తయారయిందనే స్పృహ మనకు కలగడమూ కావచ్చును  !

యశ్వంత రావ్ కి అతి చిన్ని పరిచయంలోనే శివరామకారంత్ మీద అలాటి అభిప్రాయం కలుగుతుంది .

అంత్య కాలంలో యశ్వంత రావు గారు చూడాలనుకున్న ఒకే వ్యక్తి కారంత్ గారు .వీరు వెళ్ళే సరికే ఆయన చనిపోతారు . శవ దహనం ఈయనే చేయవలసి వస్తుంది . దానితో పాటు వీరి పేరిట యశ్వంత్ రావు గారు పదిహేను వేల రూపాయల డ్రాఫ్ పంపి తను నెల నెలా పంపవలసిన వారికి పంపాలని ,మిగిలిన డబ్బుని ''నేనే మీరనుకుని ''ఖర్చు చేయమని చెబుతారు .

అసలు ఈ యశ్వంత్ రావు గారు ఎవరూ ... రచయిత అన్వేషణ  మొదలు పెడతారు . అతను వదిలి వెళ్ళిన డైరీ లో ,పెయింటింగ్ లలో ,రహస్యాన్ని  దాచుకున్న మారు పేర్లు లో ... ఆయన డబ్బు పంపమన్న వారి చిరునామాలు పట్టుకుని వారి ఇళ్ళకు వెళ్తాడు . ఆయన విడిచి పెట్టి పారిపోవడానికి కారణమైన భార్యా,కొడుకూ ,అతను ప్రేమించిన స్త్రీ ,ఆవిడకి పుట్టిన పిల్లలు  అక్కడ రక రకాల అనుభవాలు ,రక రకాల పరిచయాలు .

రచయిత మిత్రుడి కోసం బాధ్యతగా సాగించిన అన్వేషణలో ఒకే మనిషి గురించి ఒక్కోరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు .

అవునూ...   అదెలా సాధ్యం ?ఒక వ్యక్తి మంచి వాడయితే మంచి వాడవ్వాలి లేకుంటే చెడ్డ వాడన్నా  అవ్వాలి కదా !ఒకే మనిషి ఒకరికి మంచి ఒకరికి చెడ్డా ఎట్లాగా ?

కానీ నిజమంతే మనిషి బహుముఖీనుడు . అది ఒకటి  . రెండోది  ఏమిటంటే మీ వలన సహాయం పొందిన వారికి మీరు మంచి వారు .అవును ,మీరు చెడ్డ వారయినప్పటికీ , మీరు మంచి వారు కాగలరు.  అలాగే ఏ కారణానో మీరు నచ్చని వారికి మీరు మంచి వారయ్యీ చెడ్డ వారు కాగలరు . అట్లాగే ఒక మనిషి స్వభావపు అంచనాలలో మన స్వభావ స్తోమత కూడా కలిసి వుంటుంది . మన వ్యక్తిత్వ ఔన్నత్యమొ ,అల్పత్వమో ఎదుటి వారిపై అభిప్రాయాలను ఏర్పరచుకునేలా చేస్తుంది . ఒకరు ఒకానొక కాలం లో మనకు బాగా నచ్చి, తరువాత వెగటు కలగడానికి కారణం మన మనస్తత్వం లోని చాపల్యత కావచ్చును . ఈ విషయాలన్నింటినీ ఒక్కో పాత్రని ఆలంబనం చేసుకుని చెపుతారు కారంత్ .

ఇంతకీ ఈ నవల ఏం చెబుతుందీ ?యేమని ముగింపుని ఇచ్చింది ?ఏమీ లేదు ! ఒక జీవితాన్ని చిత్రించింది ,అంతే !అంతే అయితే మరి పాటకునికి లాభమేమిటి ?దీనికి సమాధానం ఇది -ప్రతి సృజనా వాచ్యంగా పాటకుడినో ,మానవుడినో ఇది చేయమని శాసించదు. అన్ని సార్లు ముగింపుని కృతకంగా చెప్పి దిశానిర్దేశం చేయడం వీలు కూడా కాదు . కానీ మంచి రచన చదివిన తరువాత మనం  మానసికంగా సంపన్నులమవుతాం . ఇలా చేయడం తప్పు,లేదా ఇది సరైనదే అనే అవగాహన ఏర్పరచుకుంటాం.వాచ్య సూచనలు లేకుండానే మంచి వైపుకి మొగ్గుతాం . ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప  రచన మనుషులను నాగరీకులని చేస్తుంది .

చిక్కటి భాష ,లోతైన తాత్వికత కలిసిన ఈ నవల మనల్ని అంతర్ముఖీనులను చేస్తుంది . మానవ స్వభావాన్ని అర్థం చేసుకునే మానసిక ఎదుగుదలని  ఇస్తుంది .

పేజీల కొద్దీ వాక్యాలు నా హృదయానికి హత్తుకుని పోయాయి .ఈ రచయిత నా హృదయానికి దగ్గరి వాడుగా తోచాడు . ఆలొచనల సామీప్యత వలన ఆత్మీయుడయ్యాడు . నేర్చుకోవలసినది చెప్పి గురువయ్యాడు .

'' మన పూర్వ ఋషులు కొందరు జగత్తు,సృష్టి విషయంలో -ఇది ఇలా ,ఇదే సత్యం ;ఇదే చివరి మాట -అనే రీతిగా చెప్పారు కదా మీరు వేదాలనండీ ,వుపనిషత్తులనండీ ,మరేమన్నా అనండి ,తపస్సుతో తెలుసుకున్నదనండి ,భగవంతుడే ఒక చెవిలో ఊదినాడనండి ,నాకొక సంశయం . ఈ విశ్వం ,సృష్టి వీని విషయంలో కొద్దిగా నేనూ  చదివి తెలుసుకున్నాను . జీవ కోటి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభమయింది .యెక్కడికొ సాగుతున్నది ;ప్రయాణం ప్రారంభమయిన ఎంతో కాలం తరువాత ,దారిలోని రైల్వే స్టేషనులో బండి ఎక్కే ప్రయాణికుని లాగా ,మనుష్యుడనే ప్రాణి లోపల ప్రవేశించాడు ;ప్రవేశించిన వాడు ప్రవేశించినట్టు దిగిపోనూ పొయాడు . జీవిత ప్రయాణమేమో ఇంకా ముందుకు సాగింది .దాని లక్ష్యం ఇంతవరకూ తెలియ లేదు 'ముందు దారి లెక్క పెట్టలేనంత దూరం ,అలాటి సమయం లో ఎవరైనా సరే ''నేను దీని రహస్యం తెలుసుకున్నాను .'' ''ఇదే సత్యం ''అని ఘంటాపథం గా చాటితే నగుబాటు కాదా?''

పీఎస్ :ఈ నవలను నాకు పంపినందుకు ,మంజుల గారు మీకు నేను చాలా రుణపడ్డాను . మీ సహృదయతకు ప్రేమ పూర్వక కృతజ్ఞతలు .




Thursday 2 May 2013

అపర్ణాసేన్‌ కొత్త సినిమా ”గొయినార్‌ బాక్షో”



అపర్ణాసేన్‌ ”గొయినార్‌ బాక్షో”

- సామాన్య
ఈ ఏప్రిల్ పన్నెండున అపర్ణ సేన్‌ కొత్త (బెంగాలీ) సినిమా ”గొయినార్‌ బాక్షో” విడుదలయింది. గొయినార్‌ బాక్షో అంటే నగల పెట్టె  అని అర్థం. ఈ సినిమాకి మూలం అదే పేరుతో వున్న శీర్షేందు ముఖోపాద్యాయ్‌ నవలిక . మూడు తరాలకి చెందిన ముగ్గురు ఆడవాళ్లు, ఒక నగల పెట్టె  వాళ్ళ జీవితాలతో పెనవేసుకున్న తీరు, వారి వివాహాలు, మోహాలు, దుఃఖ్ఖాలు, విజయాలు అన్నింటినీ స్పృశిస్తూ స్త్రీల దృష్టికోణం నుండి ,స్త్రీవాద అవగాహనతో తీసిన సినిమా గోయినార్‌ బాక్షొ.
మొదటి తరం స్త్రీ రాస్‌ మణి,చిన్న వయసులోనే విధవగా మారిన జమీందారు కూతురు. ఈమె కాలంలో దేశ విభజన జరుగుతుంది. వున్న స్తిరాస్తులను వదలుకుని వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌కి వలస వస్తుంది. కుటుంబ పరిస్థితి ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతగా మారుతుంది. అయినా యెన్ని విపత్తులు వచ్చి పడినా గయ్యాళి నోటి రాస్‌ మణి తన నగలపై ఈగని కూడా వాలనీయదు. 

ఆ ఇంటికి కొత్త కోడలిగా అడుగు పెడుతుంది సోమలత. ఆమె వచ్చిన కొన్ని రోజులకే ఆమె భర్త పిషి మా (మేనత్త) రాస్‌ మణి మరణిస్తుంది. అనుకోకుండా రాస్‌ మణి గదిలోకి వెళ్ళిన సోమలతకు రాస్‌ మణి దెయ్యం కనిపించి పెట్టె తాళం చెవులిచ్చి నగల పెట్టెని తీసికెళ్ళి దాచమంటుంది. అది మొదలు రాస్‌ మణి దెయ్యం సోమలత కదలికలను నియంత్రిస్తూ నగలని జాగ్రత్తగా కాపాడుకుంటూ వుంటుంది. అయినా భర్త ఆత్మ హత్యకి ప్రయత్నిస్తున్న సందర్భంలో సోమలత రాస్‌ మణి నగలు కొన్నింటిని కుదువ పెట్టి బట్టల దుకాణం తెరుస్తుంది. అది తెలిసి రాస్‌ మణి సోమలతతో ఘర్షణ పడ్డా, శారీ స్టోర్‌కి ”రాస్‌ మణి శారీ స్టోర్‌” అని పేరు పెట్టారని తెలిసి ,విధవ …. విధవ అని జీవితమంతా పిలిపించుకున్న తన పేరుకి వచ్చిన గౌరవాన్ని చూసి ఉప్పొంగిపోతుంది.
మూడవ తరం స్త్రీ చైతాలి. స్కూటర్‌ నడపగల, ప్రజా ఉద్యమాలలో పాలు పంచుకోగల స్వేచ్ఛా మానసం వున్న ఆధునిక యువతి. చైతాలికి చిన్నప్పటి నుండీ రాస్‌ మణి దయ్యం కనిపిస్తూ వుంటుంది. నగల మీద ఏ మాత్రం ఆసక్తి లేని చైతాలీని, తన నగలని అప్పుడు నడుస్తున్న బంగ్లాదేశ్‌ స్వాతంత్ర పోరాటం” ముక్తి వాహిని ”కోసం వినియోగించమని రాస్‌ మణి ప్రోత్సహి స్తుంది. చైతాలి రాస్‌ మణి నగల ఆధునిక ప్రయోజనం గుర్తించడంతో సినిమా ముగుస్తుంది.
ఆపర్ణ సినిమా కోసమని నవలికలో కొన్ని మార్పులు చేసారట. దాన్ని గురించి ప్రశ్నించినపుడు రచయిత శీర్షేందు ”ఆ నవలని నేను 90లలో రాసాను. అప్పట్లో ఏం రాసానో నాకు జ్ఞాపకం కూడా లేదు. అపర్ణ ఏం మార్పులు చేసి వున్నా నాకు సంతోషమే” అన్నారు. బెంగాలీ మేధావులు, కళాకారులు ఒకరినొకరు బాగా గౌరవించు కుంటారు. ఆ కారణం చేత కూడానేమో వాళ్ళెప్పుడూ అవార్డుల వరుసలో ముందుం టారు. ఒకరి కాళ్లు ఒకరు పట్టి క్రిందికి లాక్కునే తెలుగు వారి సంస్కృతికి ఇది చాలా భిన్నం. ఈ నవల నేను ఇంకా చదవలేదు కనుక ఆ మార్పులేమిటో చెప్పలేను కానీ, ఆ మార్పులు తప్పకుండా స్త్రీల సమస్యలను ప్రశ్నించేవిగా ఉంటాయని నాకు తెలుసు. ఆ ప్రశ్నలని ఆకాంక్షలని ఇక్కడ డికోడ్‌ చేస్తాను.
మాట్లాడలేని లోహాభరణాలకి మాట్లాడే రాస్‌ మణి ప్రతినిధి. మూడు తరాలలో బంగారం ఏయే రూపాన్ని పొందిందో రాస్‌ మణి పాత్ర చెప్తుంది. దెయ్యమైన రాస్‌ మణి శరీరధర్మ రీత్యా మరణించిన వయసులోనే ఆగిపోయినా, మానసికంగా ఒక తరం తరువాత మరో తరానికి మారుతూ వస్తూ వుంటుంది. తన నగలని ఆస్తిగా గుర్తించినా వాటిని ఆచలంగానే వుంచేసిన మొదటి తరం రాస్‌ మణి, సోమలత వాటికి ద్రవ్య రూపాన్నిచ్చి తన పేరుకో గుర్తింపుని తెచ్చి పెట్టినపుడు ఆ మార్పుని స్వీకరించి ఆధునికం అవుతుంది. చైతాలి సమయం వచ్చేసరికి మనవరాలికంటే ముందుకెళ్ళి ఆలోచించి తన నగలని ముక్తి వాహిని కి వినియోగించమంటుంది. అట్లా ఈ పాత్ర కాలంతోపాటు మారుతూ వచ్చి మారిన ఆధునిక భారత స్త్రీకి ప్రతినిధిగా నిలుస్తుంది. 

అపర్ణ తన ప్రతి సినిమాలోనూ స్త్రీ పురుష సంబంధాల ప్రశ్నలు వేస్తూనే వుంటుంది. ఈ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు. సోమలత భర్త సంప్రదాయ భర్తలకి ప్రతినిధి. మామూలు భర్తలకి వుండే సుగుణాలు దుర్గుణాలు వున్నావాడు. అతనో సారి వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతాలకి వెళ్తాడు. ఒంటరిగా శారీ స్టోర్‌ కి వెళ్లి వస్తున్న సోమలతను పరాయి మగవాడురోజూ వెంబడిస్తూ ఉంటాడు. అది గమనించి రాస్‌ మణి అతనితో సంబంధం పెట్టుకోమని సోమలతని ప్రోత్సహిస్తుంది. ఆ సన్నివేశం చూసి మనం ఆశ్చర్యపడతాం. మన ఆశ్చర్యం పై దెబ్బ కొడుతూ స్క్రీన్‌ ప్లే రాసిన అపర్ణ ”ఏం మగవాళ్ళకేనా అన్ని ఆనందాలు?” అని ప్రశ్నిస్తుంది. అన్నట్టుగానే సోమలత ఒకసారి ప్రియుడి సముఖానికి వస్తుంది. అప్పుడే భర్త తిరిగి వస్తాడు. ఆ ఏడాది సోమలతకి చైతాలిపుడుతుంది. పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో తల్లి మాత్రమే చెప్పగలదనె మాట గుర్తొచ్చి మనం ఆశ్చర్యపడతాం.
రచయితగా చలం కానీ దర్శకురా లుగా అపర్ణ కానీ వివాహ విచ్ఛిన్నతని, విశృంఖలతని ప్రతిపాదించరు. ఆలోచించ డానికి  స్వంతంగా మెదడూ, శరీరానికి కోరికలూ వున్న స్త్రీకి సమాజం, వ్యక్తీకరణని నిషేధించి ఎలా బంధించి వేసిందో చెప్తారు. విముక్తిని కలగంటారు. పురుషులు వివాహే తర సంబంధాలలోనో ,ప్రేమ సంబంధాల లోనో వున్నపుడు ఆ సంబంధాలలో స్త్రీలు కూడా వుంటారు. కానీ మన కపట ప్రపంచం ప్రేమనో ,వ్యామోహాన్నో పురుషుడు ప్రకటించినట్లుగా స్త్రీని ప్రకటించనీయదు. అటువంటి సంబంధాలలో వున్న స్త్రీ కూడా సమాజానికి భయపడి పైకి పాతివ్రత్యాన్ని వుపన్యసిస్తుంది. ”ఏం ఆనందాలన్నీ మగవాళ్ళకేనా” అన్న ప్రశ్న అట్లాంటి ఈ కపట ప్రపంచాన్ని షాక్‌కి గురి చేయడానికి వుద్దేసించినదే తప్ప విశృంకలతని వుద్దేసించినది కాదు . అపర్ణ తన ప్రతి సినిమా లోనూ నిలవనీటి మురికి గుంటలాంటి ఈ సమాజాన్ని ప్రశ్నల రాళ్ళు వేసి చెదరగొట్టి చలనం తీసుకురావడానికి ప్రయత్నిస్తూ వుంటుంది.
అణచివేతలకి సంబంధించిన ఇంకో ప్రశ్న రాస్‌ మణి ప్రణయ ప్రయత్నం. నిండు యవ్వనంలో వున్న విధవ రాస్‌ మణి తన ఇంట్లో బొగ్గులు కొట్టే పని వాడితో ప్రణయానికి ప్రయత్నిస్తుంది. చీకటి పడ్డాక గదికి రమ్మని పిలుస్తుంది. పిలుపునందుకుని వచ్చిన ఆ కుర్ర వాడు దురదృష్టవశాత్తు పట్టుపడి తన్నులు తింటాడు. అట్లా రాస్‌ మణి కోరికని భుగ్గిపాలు చేస్తాడు. ఈ సన్నివేశం నాకు ప్రఖ్యాత ఆంగ్ల చిత్రం ”టు కిల్‌ ఏ మాకింగ్‌ బర్డ్‌” ని జ్ఞాపకం తెచ్చింది. రెండు చిత్రాలలోనూ స్త్రీలు అగ్రవర్ణులు. ఇద్దరూ కూడా అణచివేతలో తమకన్నా ఒక మెట్టు క్రింద వున్న పురుషులను ప్రలోభ పెట్టాలని చూస్తారు. ఈ ప్రయత్నంలో మాకింగ్‌ బర్డ్‌లో శ్వేత స్త్రీ ”మయెల్ల” అమాయుకుడైన నల్లజాతి యువకుడి మరణానికి కారణమవుతుంది. కొడవటిగంటి కుటుంబ రావు ఒక కథలో తన స్వార్థ ప్రయోజనం కోసం నాయిక (బహుశా) పార్వతి ఒక దళితుడిని పెళ్ళాడి అతని జీవితాన్ని కల్లోలం చేసి దుఃఖితుడ్ని చేస్తుంది. స్త్రీలయినప్పటికీ అగ్రవర్ణ స్త్రీలు అణచి వెయబడ్డ కులాల పురుషల్ని ఏ దృష్టి కోణంతో చూస్తారో, అణచివేతలో వారు కూడా ఎలా పాలు పంచుకుంటారో చెప్పిన అపర్ణ, చైతాలి పరంగా ఇప్పుడు రావాల్సిన మార్పును కూడా చెప్తుంది.
ముక్తి వాహిని ఉద్యమంలో చురుకుగా ఉంటున్న చైతాలి స్నేహితుడ్ని చూసిన రాస్‌ మణి ఆ యువకుడిని పెళ్లి చేసుకోమని చైతాలితో అంటుంది. సినిమాలో ఆ యువకుడి పాత్రను ,అప్పుడు రాస్‌ మణి మోహించిన యువకుడి పాత్రను వేసిన నల్లటి యువ నటుడు ఒక్కరే కావడం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. అణచివేయబడ్డ కులాల వారు చదువుకుంటున్నారు, ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు అని చెప్పడంతో సరి పెట్టుకోదు అపర్ణ, ఇప్పుడు, అత్యాధునికంగా మారిన రాస్‌ మణి చేత అతడిని పెళ్ళెందుకు చేసుకోకూడదు అన్న ప్రశ్న కూడా వేయిస్తుంది.
నాకు వ్యక్తిగతంగా నా కులం, నా భాష, నా భారతదేశం అనే భావాలు వుండవు. అందుకని అపర్ణా సేస్‌ భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు[నిజానికి ఆమె ఒక దేశం గా భారత దేశం గర్వించ దగ్గ దర్శకురాలు ] అని స్టేట్‌ మెంట్‌ ఇవ్వను. కానీ, ఒకటి మాత్రం చెప్పగలను మనిషిగా, అందునా స్త్రీ ప్రకృతిగా నేను అపర్ణని చూసుకుని గర్వ పడతాను. ఆనంద పడతాను. ప్రేమిస్తాను.


రాష్మోని దెయ్యంగా మౌసమి చటర్జీ 
Story: Shirshendu Mukhopadhyay
Starring : Moushumi Chatterjee, Konkona Sen Sharma, Srabanti, Saswata Chatterjee & Others.
Producer : Shree Venkatesh Films Pvt. Ltd.
Presenter: Mahendra Soni & Shrikant Mohta.
Director: Aparna Sen.
Screenplay & Dialogue: Aparna Sen
Music: Debojyoti Mishro
Cinematographer: Soumik Halder
Editor: Rabiranjan Moitra
Art Director: Tanmoy Chakraborty

Friday 26 April 2013

నా పై కురిసే నల్లటి మేఘం




తల పై చేయి పెట్టుకుని పడుకుని వుంటాను 

నా లోంచి ,లోలోంచి ఒక నల్లని మేఘం 
పుడుతుంది 
నా పైనంతా పరుచుకుని నవ్వుతుంది 
నేను లేచి కూర్చుంటాను 
అతనోస్తాడు 
యేవో లెక్కలు కడతాడు 
ఒక గొడుగిస్తాడు 
అప్పుడిక నేను నవ్వుతాను 
చీకటి చెట్టు వెనుక నిండు చంద్రుడ్ని చూసి 
మరేమీ అనుకోను 
అప్పడం లాగున్నావు చంద్రుడూ అంటాను 
వట్టి మసాలా అప్పడం! 
కానీ ఒకరోజు ఏదో అవుతుంది 
మెదడులోనూ ,మనసులోనూ 
చెప్పిన  మాట విననిదేదో పుడుతుంది 
నా కళ్ళ ఎదుటే నీళ్ళు తగిలి ఉబ్బిపోయే 
అదేదో పదార్థం లా 
ఇంతది ,అంతవుతుంది . 
ఇప్పుడు కూడా చూస్తూనే వుంటాను 
ఆ నల్ల మేఘం మళ్ళీ పుడుతుంది 
నా పైనంతా పరుచుకుంటుంది . 
అతను పరిగెట్టుకొస్తాడు 
లెక్కలేస్తాడు 
చిన్నపోతాడు . 
నేను నవ్వుతాను 
తడవడం నాకు వ్యసనమేమో
నువ్వేం చేయగలవని  నేనతనితో అనను 
దయతో  జాలిపడతాను . 
అతనీసారి మరీ మందమైన గట్టి గొడుగునిస్తాడు 
శుభాన్ని కాంక్షించి సెలవు పుచ్చుకుంటాడు 
అతనటు వెళ్ళగానే నేను నవ్వుకుంటాను .విరగబడీ ,పగలబడీ . 
నవ్వి నవ్వి ఏడుపొస్తుంది . 
అప్పటికే నా నల్ల మేఘం నన్ను కావిలించుకుని వుంటుంది 
నువ్వంటే నాకిష్టం లేదు అంటాను . 
ముడుచుకుంటాను ,
నన్ను వదిలి పెట్టూ అంటాను 
నల్ల మేఘం ,నా నల్ల మేఘం 
నాలో జీవసారాన్ని నమిలి మింగిన నల్ల మేఘం 
నన్ను తడుపుతూ వుంటుంది 
కాంక్షగా .... 
కసిగా !!!



Tuesday 23 April 2013

చిన్మయి

ఇవాళ పొద్దున్న ఈ పాట విన్నాను . స్నేహితురాలు చిన్మయి గురించిన ప్రస్తావనతెస్తే . పాట బాగా నచ్చింది . ఈ మూవీ తమిల్ వర్షన్ లో పెయిర్ ఇష్టం నాకు . తెలుగు ''ఏ మాయ చేసావో'' హైదరాబాద్లో చూస్తూ వుండగా నా తల బద్దలై అగ్ని పర్వతమవుతుండగా మొత్తం కనుక చూసానంటే మరిక మిగలనేమో అనిపించి క్రిందికొచ్చి వాష్ రూం లో వాంతులు చేస్తూ వుండగా పక్కనే అలాటి సౌండ్ వచ్చి చూస్తే ,నా లాగే ఇంకో పిల్ల ...ఆ పిల్ల తల్లి మా ఇద్దరినీ జాలిగా చూస్తూ .నాకెందుకో అది నా సొంత తల నెప్పిగా కాక సినిమా ఎఫెక్ట్ గా గుర్తుండి  పోయింది .కానీ తమిల్ మూవీ బాగుంటుంది .

దేవస్మిత కథ గురించి కామెంట్స్ చదువుతున్నపుడు కూడా ఈ మూవీ గుర్తొచ్చింది .ప్రస్తావించాలని కూడా అనిపించిన్ది.  ఈ కథా నాయిక అంటే దేవస్మిత మీద ఉన్నంత చిరాకు నాకు .

ఇంతకు ముందు ఈ పాట ఏ మూడ్ లో విన్నానో  కానీ ఇంత సుందరంగా తోచలెదు. బహుశా ఇవాళ చిన్మయీ అందమైన ఫోటో చూట్టం వల్ల కావచ్చు పాట కూడా బహు శ్రావ్యంగా అనిపించింది .











Friday 12 April 2013

ఒక కథ !

గ్రాడ్యుయేషన్ వరకూ నేను చాల శ్రద్దగా పేపర్లు,ఇండియా టుడే రాజకీయాలూ చదివెదాన్ని. సంపాదకీయాలూ , సాహిత్య పేజీలు  చాలా ఇష్టంగా దాచుకునే దాన్ని . సెంట్రల్ యునివర్సిటీ కి వచ్చాక నా అధ్యయనానికి బ్రేక్ పడిన్ది. మా యునివర్సిటీ పేపర్ రూమ్లో మగ వాళ్ళు , నల్లులు ఎక్కువగా వుండే వారు[వి] . అదే కాక అన్ని పుస్తకాలు ఒక్క సారిగా చూసే సరిక నా మోజు సాహిత్యం వైపుకి వెళ్లింది . ఇన్నాళ్ళకి ఇప్పుడు మళ్ళీ అధ్యయనం మొదలెట్టాను మార్క్సిజమ్,అంబేడ్కరిజం లో ఎక్సెల్ అవ్వాలని కోరిక పటుకుంది .కేవలమ్ నా సంతృప్తి కొసమె కాదు సామాన్యకిరణ్ ఫౌండేషన్  నుంచి భవిష్యత్ లో మంచి పుస్తకాలు రావాలి అందుకు .

ఈ అధ్యయనం లో భాగంగా ఇవాళ ఇది చదివాను . చాలా బాధ కలిగింది . నవయాన్ పబ్లిషర్ యెస్.ఆనంద్ చెప్పిన నమ్మక తప్పని అనుభవం జ్ఞాపకం వచ్చింది http://india.ashoka.org/fellow/s-anand Anand’s own life serves as an example. Born into a traditional Brahmin family in Tamil Nadu, at the top of the hierarchy, he confesses to being a student of only average effort and capability. Yet his teachers—many of them Brahmins—always
His marriage to a fellow student outside his caste further brought home to him the tyranny of the system. Now largely alienated from his family, Anand narrates an interesting story from his university days. His girlfriend, a non-Brahmin, once told him that he scored higher marks more easily only because he was Brahmin. Proof of this came through an unintended experiment. Anand had once written a term paper for his MA English course on behalf of his girlfriend (whom he later married). He also wrote another paper, a poorer one, in his own name. However, when the assessments came in, he had scored higher than her. This reinforced the social truth that Anand’s caste mattered more than the merit of his non-Brahmin girlfriend’s efforts.


ULTURE & SOCIETYLife

PERSONAL HISTORIES
‘EVEN IF I NEVER BECOME A DOCTOR, I WILL NOT GIVE UP THIS FIGHT’

AJAY KUMAR SINGH
Born in 1982. Grew up in Etah in Uttar Pradesh. Gained admission in 2002 at the All India Institute of Medical Sciences. Is in his MBBS final year

I was in Class viii when I first heard about AIIMS, the All India Institute of Medical Sciences. My mother was a nurse, and the doctor she worked with in Etah, my hometown, had a nephew at AIIMS. He visited Etah once, and my mother was very keen that I meet him. “You need to read a lot if you want to go to AIIMS,” he said. That’s when I told myself I’d study there somehow, someday.
Uzma Mohsin
The harassment peaked during the anti-reservation protests of 2006. They were always trying to start fights so they could bash us up. Derogatory remarks were common: ‘Yeh chamar log kya karenge?’
My father, who drives an autorickshaw, wouldn’t have been able to send me to Delhi for coaching had it not been for my Physics teacher who helped me get a concession on the fees. I got into AIIMS with 66.16 percent, the same as the “General” cut-off that year. Nirpat Singh, the autodriver, and Munni Devi , the nurse, were very proud of their son. It was a big moment for all of us when we entered the campus of India’s premier medical sciences college.
As soon as my parents left, I was summoned by my neighbour, a senior, who asked me to introduce myself. Among other things, I told him I had stood first on the Scheduled Caste list. The next moment I found myself outside the room, on the ground; he had pushed me out. That was just the first day. The next time he tried to insult me, I told him I’d complain. While he never spoke to me as long as he was on campus, he told his friends about the incident and they boycotted me too.
Ever since, I have been reminded of my “low” status every moment I have been here. I was the only “Category” student in my wing. One day, I found this on my door: “Nobody likes you here. F**k off.” On another day: “Everybody can use the carom board, but not Room No 45.” People would bang and kick at my door at all hours, disappearing by the time I opened it. They tried their best to make me leave, but I told myself I wouldn’t, no matter what. I gradually isolated myself from them, and started interacting only with others from the “Category”.
I had been to school at the Navodaya Vidyalaya for seven years, and I knew about casteism from my experience there, but it was nothing compared to AIIMS. In school, I used to think I wouldn’t have to go through the same humiliations if I were at a big institution. I came to the biggest of them all, but in vain. At least we would eat together at Navodaya.
It is true that not all General Category students are casteist, but caste cuts through everything at AIIMS. They won’t talk to us. We have no representation in the students’ union this year. They won’t let us play cricket; in a basket ball match, they won’t pass us the ball once. The hatred was out in the open in 2003, during Pulse (AIIMS’ annual medical college festival). They beat up a Dalit student so badly that it was a miracle he survived. We went to complain, but the administration was ready only to dismiss both parties: those who attacked and those who were attacked. Having been beaten up, he didn’t want to go through that, so he withdrew.
The harassment reached a high during the anti-reservation protests of 2006. There were more than a thousand outsiders staying on campus during those days. They slept in our hostels and ate in our messes. Derogatory remarks were common: “Yeh chamar log kya karenge?” They were always trying to start fights so they could bash us up. They even made plans to beat up a few resident doctors. There was no point complaining. Nobody was willing to listen. The media chose to portray last year’s events as if everyone at AIIMS — scs, sts and obcs included — was against reservation. “Category” juniors were dragged out during ragging and forced to participate in the protests; in many of these, they came under baton charges from the police. I could see them going through trauma; I took the initiative and told the director that ragging was being prolonged even after the stipulated time. Nothing happened. They also beat up our gym secretary, a “Category” student. That got all of us very upset. Pushed to the wall, we decided to submit a memorandum. The director, Dr P. Venugopal, promised to act within 24 hours — and he did. All the people we named were informed, and all of them came to each one of us and threatened us with dire consequences if we did not withdraw the complaint. We didn’t; instead we wrote another, this time to the President of AIIMS. There was no response. Then we went to the media.
We were accused of obstructing Pulse 2006. They did that to malign us and turn student sentiment against us. We put up posters clarifying our stand — we had nothing against Pulse, we just wanted the harassment stopped. During Pulse, a cd was circulated with a film showing the burning of books written by Babasaheb Ambedkar. I called a press conference against the film; I didn’t get much support. An enquiry committee was appointed, and they asked me why I was out to tarnish AIIMS’ reputation. I told them I had no choice when no help was forthcoming.
Never before had a “Category” student raised his voice this way.
They decided to teach me a lesson, and send out a message to all the “Category” students of the campus. They failed me in my final professional exam, which was in December. If I fail three times, I will be disqualified. My re-examination was video-recorded — though it is unheard-of, I wouldn’t have had any problem had they informed me beforehand. I wrote another complaint to the director about this illegal recording. A day before the results were due, my result was leaked. Posters were pasted all over campus declaring that the student who had complained and called the press conference had failed. I filed a police complaint. We held a series of protests, as a result of which the Centre formed a committee headed by the University Grants Commission chairman Sukhdeo Thorat, to look into the matter. The AIIMS director did not even allocate it a room, and the hearings happened off-campus. I gathered everyone and we went to depose in groups.
I knew I would fail when the only question I was asked on my viva was: “What is your involvement with the Thorat report?” Six or seven students had scored lower in the internal marks than I — all passed, I did not. I was failed in medicine in my re-professional exam by one-and-a-half marks. We later got to know that the faculty association had passed a resolution two days before the vivas that no one would take my re-examination viva. And the director still hasn’t accepted the governing body’s order to grant me re-examination with a new set of examiners.
All this is being done to scare my juniors. My case will be an example, since I am in my final year.
I had an opportunity recently for an internship at the University of Penn-sylvania. AIIMS couldn’t do anything about it, so they got in touch with their seniors there, who, as I have heard, assured them they would “set me right”.
If I am not destined to be a doctor, I won’t be. But I will not give up this fight. Even if I never become a doctor, I have a great satisfaction already. No voices were heard in the past. Now people are willing to come to protest. There are 45 “Category” boys at AIIMS, and whenever there is a protest, at least 40 of them turn up.
Though my father is an auto driver, people respect him in my hometown. My parents have taught me to safeguard my dignity at all costs, and that’s what I am doing now. Though it was not easy, I don’t feel it has been all that tough either.
As told to Praveen Donthi
Jun 02 , 2007