About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Showing posts with label కొన్ని దిగుళ్లు.. Show all posts
Showing posts with label కొన్ని దిగుళ్లు.. Show all posts

Monday, 19 August 2013

ఆనంద ,మోహన ...

ఆనందా ,నేనీ మధ్యనంతా  పరిశోధకురాలనై యోచించాను సృష్టిలో భవిష్యత్తు లేదనీ ,వర్తమానంలోనే భవిష్యత్తు మిళితమై పోయుందనీ .ప్చ్! నువ్వివాళ  భలే చెప్పావు ,భవిష్యత్తు ఉందనీ, అది మన కోసం దేనినో చేత పట్టి కాపెట్టుకుని ఉంటుందనీ . ఆనందా దుక్కం కమ్ముకొస్తుంది . కొందరి దుక్కం రకం వేరే . వేరే రకపు నా దుక్కం  దిక్కుతోచని తనం తో దిగులు పడుతుంది . నా దుక్కానికి వెలుపలి దారి మూత పడి వుంటుంది . నువ్విక్కడే,నేనూ అక్కడే ... ఆపన్న హస్తమవలేని బధిరత్వం గురించి ఏం చెప్పుకోనూ ? మరణానిదేముందిలే 
పాపం ,తరతమం లేనిది ,అందరినీ పలకరిస్తుంది,కొద్దిమందిని మరీ త్వరపడి ప్రేమతోనూ ,కొంత మందిని వలపక్షంగానూ , కానీ ఒక అనుబంధపు ఖాళీ గురించి ఏం మాట్లాడనూ . ఎన్ని  ఖాళీలో ప్రపంచం నిండా !హేతువు ఖాళీని పూడుస్తుందా ?.  నువ్వు నాకేమి ఇచ్చావో యోచిస్తున్నా ,మృదు నీ చిరు  స్పర్శ పంచినదంతా ఆనందమే,అచ్చు  చురుకులేని  ఉదయ కాలపు  ఎండ లాటి ఆనందపు స్నేహం నీతో ,కానీ చూశావా నువ్వు అంతా దుక్కం కలిపి  ఒక్క సారే  ఇచ్చేసావు . తల వాల్చిన దీనపు నీ రూపు ప్రాణ శక్తి ఇంకా వున్న  నా హృదయం పై గాయపు  నీ చిత్రం గీస్తుంది .ఈ దుక్కపు  చిత్రాన్ని ఏం పెట్టి మానపనూ ? చెంపలేసుకుని నాకు తెలియని ఎవరినోనూ ,మరియూ నిన్నూ ఏక కాలాన ప్రార్దిస్తున్నా ...నన్ను క్షమించు . నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు .కానీ నన్ను నేనెలా క్షమించుకోనూ ?


Thursday, 11 April 2013

మనమెందుకిలా లేము ?





ఒక పురుషుడు:

 కవిత సర్కార్ ,ఆమె భర్త బంగ్లాదేశ్ నివాసులు .పెల్లై రెండేల్లేమో అయింది . పెళ్ళప్పుడు అనిపించలేదేమో కానీ తరువాత ఆమె నల్లగా వుందని భర్తకి నచ్చకుండా వచ్చింది . వేరే స్త్రీ తో సంబంధం ఏర్పడింది . అతని మనసు మారినట్లు కవిత మనసు మారలేదు ఘర్షనలు జరిగాయి .కొన్నిరొజుల క్రితం హటాత్ గా భర్త చాలా మంచి వాడై  పోయి పద భారత్ లో బంధువులింటికి వేల్లెసోద్దామని చెప్పి అక్రమం గా భారత్ లో కి మేముంటున్న మాల్దా కి తీసుక వచ్చాడు .

పక్కనే ఉంటున్న వేరే ఊరికి తీసికెళ్ళి ఆమెని అమ్మకానికి పెట్టాడు . భర్త పదివేలు అడిగితే పిల్ల నల్లగా వుందని చెప్పి ఎనిమిదే ఇస్తామన్నారట .బేరమ్ కుదరలేదు . విసుగొచ్చింది . ఆ కోపంతో భార్యతో ఘర్షించి  ఆమెని  నిర్జనం గా వున్న మామిడి తోపుకి తీసికెళ్ళి చచ్చేట్టు కొట్టి తన జేబులో వున్న పెన్నుతో ఆమె రెండుకళ్ళూ పీకేసాడు .కవిత షాక్ కి గురై అపస్మారకం లోకి వెళ్ళడం వల్ల విపరీత రక్తస్రావం జరిగింది . ఆమె పరిస్థితి రానున్న 72 గంటలలోపు ఏమీ చెప్పలేమట . ఒక వేళ బ్రతికినా కళ్ళు ఇక పూర్తిగా రావట .

ఒక స్త్రీ :

మీరా సూత్రదార్ మా ఇంట్లో డస్టింగ్ పని చేస్తుంది . దాదాపు నాలుగేళ్ల క్రితం విపరీత తాగుబోతు అయిన ఆమె భర్తకు పిచ్చి వచ్చింది . అంత పిచ్చిలో కూడా అతనికి భార్య మాత్రమె లోకువ .ఇక ఎవరి మీదా కోపం వుండదు . పిచ్చి వచ్చినపుడు భార్యని విచక్షణా రహితంగాకొడతాడు . ఆమె చీరలు చించి వేస్తాడు . ఒక సారి కూరలు తరిగే కత్తి పీట తీసుకుని ఆమె భుజాన్నినరికాడు . విని విని ,,మీరా నువ్వు తిరిగి కొట్టొచ్చు కదా ?ఏం నీకు బలం సరిపోదా ?అంటే మీరా అన్నది .''యెట్లా కోడతాము బాగున్నపుడు ఎంత ప్రేమగా వుండే వాడు , అదంతా మరిచిపోయేదా ?అన్నది . మరి బాగున్నపుడు నిన్నుఎప్పుడూ  కొట్టేవాడు కాదా అంటే ,ఎందుకు కొట్టే వాడు కాదు ... అప్పుడప్పుడూ కొట్టేవాడే అన్నది.

మనమెందుకిలా లేము ?

ఇదనె కాదు చాలా సార్లు నాకనిపిస్తూ వుంటుంది ,మనమెందుకిలా లేము అని !మన సృష్టిలోనే ఏదో తేడా వుంది . ఎంత మంది స్త్రీలు ఎంత మంది పురుషుల్ని ఈ ప్రపంచంలో హత్య చెసారు. మనమేం చేస్తాం కోపమొస్తే ఏడుస్తాం .త లనొప్పులు తేచుకుంటాం .దేవుడికి ముడుపులు కట్టుకుంటాం . భర్త వలన పిల్లలు పుట్టకపోతే ఇంకో భర్తని తెచ్చేసుకోం .నా ఖర్మ ఇంతేనని గొడ్రాళ్ళగా వుండి పోతాం . మనల్ని మనం బాధించుకుని మనల్ని మనం హత్యించుకుంటాం .

ఎందుకని మనం పురుషుల్లా లేము . ఏమో నాకు తెలీదు .వుండాలని నేననడం లేదు .కవిత  భర్తని అంత అమాయకంగా నమ్మి ఎలా ఇంత దూరం వచ్చింది ?మీరా ఆత్మ సంరక్షణకు భర్తను ఒక వేటేస్తేనేం ?

ఏంటో ఈరోజంతా ఒక చెడ్డ దిగులు తగులుకుంది . మాటి మాటికీ ఏడుపొస్తుంది . పాపాయి కూడా చాలా భయ పడింది .వుమెన్ షుడ్  కిల్ మెన్ ఘోస్ట్ అన్నది .ఆడవాల్లు ఈ మగ పిశాచుల్ని చమ్పెయ్యాలట . మగ వాళ్ళు పిశాచులట .

ముగింపు :

కవిత మొగుడు చివరికి కొన్ని గంటల్లోనే పట్టు పడి పోయాడు . మన పోలీసు వ్యవస్థ ప్రపంచం లోనే అత్యంత సమర్ధవంతమైనదట . తప్పు చేసిన వాళ్ళు పట్టు  పడక మానరు . మహా మహా పోలీసు అధికారి కొడుకు బిట్టూ మొహంతీ ఎన్ని వేషాలు మార్చినా పట్టు పడ్డాడు . బుద్ధి వున్న వాళ్ళెవరూ తప్పులు చేయరు. సంస్కార హీనులే ఇలా ప్రవర్తిస్తారు .

కొంత మంది సిస్టం ఒకటి ముందు పెట్టుకుని ఎన్నెన్నో ఆకృత్యాలు చేస్తుంటారు .వాటిల్ని అతి సులభంగా కని పెట్టగల సాఫ్ట్ వేర్లు పోలీసు ల దగ్గర ఇవాళ వున్నాయి . ఆ టెక్నాలజీ ప్రత్యక్షంగా చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . పిల్లుల్లా కళ్ళు మూసుకుని పాలు తాగుతూ మనల్ని ఎవరూ చూట్టం లేదని కవిత మొగుడిలా అనుకోవడం పొరపాటు .

అసూయ చెడ్డ లక్షణం . మారు పేర్లతో ఇతరుల మీద బురద చల్లుదాం అనుకుని పాటు పడటం  ,తను అనుకున్నట్లే ప్రపంచం ఉండాలనుకోవడం మానసిక రోగాలు.అటువంటివి  తలెత్తితే వెంటనే డాక్టర్ కి చూపించుకోవడం మంచిది .ఎందుకంటె తప్పులు ఎన్నో రోజులు దాగవు. ఎవరూ కూడా సరేనని ఊరుకోరు.  ప్రతి దానికీ ఒక ముగింపు వుంటుంది .





Saturday, 30 March 2013

కథలూ ,కాకరకాయలూ


ప్రాతినిధ్య ఆవిష్కరణ  జరిగిపోయింది  .నిజానికి నవ్వొస్తుంది .సామాన్యా  ఏం కావాలనుకున్నావు చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యావు బిడ్డా అని.గండవరపు కమలమ్మ ...నువ్వెక్కడున్నావే ... ''బుద్ది భూములేలమంటే రాత గాడిదలు కాయమంటుందని '' చెప్పేదానివి కదా ఎప్పుడూ....  చూశావా నా జీవితం ఎలా నా చేతుల్లో లేకుండా పోతుందో .ది గ్రేట్ సామాన్య చివరికి కథలూ ,కాకరకాయలూ అని అల్ప అంశాల వెంబడి తిరుగుతుంది .  మళ్ళీ వీట్లలో రాజకీయాలూ ,చాడీలు అబ్బబ్బ ...దేనికీ పనికి రాని పనులు .

దురదృష్టమంటే 
కావలనుకున్నవి 
అందకపోవడం 
వద్దనుకున్నవి వాటేసుకుని 
కరచాలనం చేయడం 


                                                             

Tuesday, 5 February 2013

నా పుస్తకం ఆవిష్కరణ !



మా ఊర్లో ,మా ఇంట్లో సరదాగా మేం చేసుకున్న నా ''కొత్తగూడెం పోరాగాడికో లవ్ లెటర్ ''పుస్తకావిష్కరణ .

Monday, 26 November 2012

బహుశా ...

సౌందర్యం ,స్వభావంలో వుంటుంది
రూపంలో కాదు 

మృదుత్వం ,ప్రవర్తనలో  లో వుంటుంది 
మాటలో కాదు 

ఇంకా...

Saturday, 12 May 2012

రెండు అభిప్రాయాలు -ఆనందము


నాకు, డాక్టర్ కేశవ రెడ్డి గారు ఒక మెసేజ్ పంపించారు.చిన్నప్పుడు మా ఇంట్లో, కేశవ రెడ్డి గారి ''స్మశానం దున్నేరు ''
పుస్తకం వుండేది.మా నాన్న కూడా ఆయన లాగే చిత్తూరు వాడు ..అట్లా రాయల సీమ భాషలోని 
ఆ పుస్తకాన్నినేను చాలా సార్లు చదివాను.తరువాతవారి 
ప్రతి పుస్తకాన్ని వచ్చింది వచ్చినట్లు చదివాను.నాకు చాలా  ఇష్టమైన రచయితల్లో వారు ఒకరు.వారి నుండి 
నిన్న మద్యాహ్నం మెసేజ్ వచ్చింది. ఇవాళ వారితో మాట్లాడాను.రాస్తూ పొమ్మన్నారు.వారి మెసేజ్ ఇది .
dear saamaanya ,the story 
mahitha is good.language
is clean ,narration is 
smooth,plot is plausable .
...dr.keshav reddy.
ఎంత బాగుంది కదా వారి మెసేజ్.నేను జీవితాలను బాగా అర్థం చేసుకుని కథను బాగా రాస్తేనే కదా వారు నాకట్లా చెప్పి వుంటారు.అంటే అర్థం నాకు జీవితం తెలుసనే కదా? 
మేధావులు ఊరికే చెప్తారా ఏమిటి మాటలు .మేధావులు చెప్తే అది  తిరుగులేని నిజం.  కదా ?
 
 నా స్నేహితురాలు కాల్ చేసింది ఈ రోజు .తన బాధ ఏంటో చెప్తుంది .నేను వింటున్నా.మద్యలో తనో కంప్లైంట్ చేసింది . నేను నా సమస్యని చెప్తుంటే నువ్వు అవతలి వాళ్ళ పక్క వకాల్తా పుచ్చుకుని వస్తావ్ 
సామాన్య ఎప్పుడూ అని.అసలు నీకు జీవితమే తెలియదు.ఇంకెప్పటికీ తెలీదు నీ చుట్టూ మీ అమ్మ, 
నాయన,తమ్ముడ్లూ,పెదమ్మలు,కిరణ్,చివరికి నీ కూతురు కూడా నిన్నే ముద్దు చేస్తుంటే నీకు 
జీవితం,ప్రపంచం ఎక్కడ తెలుస్తుందీ.మళ్ళీ ఏమో రాసేస్తావ్ కథలు,కవితలూ అని ఘోరంగా తిట్టేసింది..

మన స్నేహితులు మన గురించి అబద్దాలు ఎందుకు చెప్తారు? చెప్పరు.  అన్నీ నిజాలే చెప్తారు!

Sunday, 4 March 2012

ఒక దుక్ఖం-ఒక పాట...!

కొందరుంటారు ,వాళ్ళను వెతుక్కుంటూ వస్తాయి ఆనందాలు,వచ్చి,వాళ్ళ వాకిట పూసి, రంగవల్లులు తీర్చి మురిపిస్తాయి.కొందరుంటారు.వాళ్ళను వెదుక్కుంటూ వస్తాయి ఎక్కడేక్కడీ దుక్ఖ మేఘాలు.
వచ్చి తనివితీరా కురిసి తడిపి ,తెరిపినపడి వెళతాయి .

కారణమేమో ...నేను రెండోఆకర్షణని.

నిన్నరాత్రి అపరిచిత మేఘం ఎనిమిదింటికి మొదలెట్టి అర్థరాత్రి పన్నెండున్నర వరకూ కురిసీ కురిసి నా మొబైల్ చార్జ్ అయిపోవడంతో అనివార్యంగా అర్థాంతరపు ముగింపయింది.

రెండ్నెల్ల క్రితం నా విపరీత తలనొప్పుల గురించి యోచించి ప్రముఖ హోమియోవైద్యుడు నువ్వు నేట్రం మూర్ కేటగిరీవి పొమ్మన్నాడు.ఏవిటా ... అనుకుంటే శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధలాగా ప్రపంచపు ఏడ్పు సామాన్య ఏడుపు అవుతుందని సారాంశం .దాన్నలా అనుసరిస్తూ వెళ్లి ఆరున్నొక్కరాగం తీస్తుంటే పాపాయి వాళ్ళ నాన్న ప్రేమ చేత నిదర దుప్పటిని తీసీ ఓపిక తెచ్చుకుని జ్ఞాన భోధ చేసాడు .బ్రామ్హీ ముహూర్తం కావడం చేత బుర్రకి బాగానే ఎక్కింది కానీ ,బుర్ర వేరు మనసు వేరని అనాది కాలానే గీతకారుడు చెప్పేసాడు కనుక , నిన్న రాత్రి గడిచి మరో రాత్రి లోకి రాబోతున్నా ,కొత్త చంద్రుడు ఆకాసంలో తచ్చాడుతున్నా మనసులో దిగులు మేఘం గుబులు పెడ్తూనే ఉంది.

ఏవిటేవిటో తవ్విపోసుకుంటూ వుంటే aretha franklin ''i never loved a man '' పాట జ్ఞాపకం వచ్చింది .ఆవిడ దుక్కపు సారాంశమంతా పాటలో ఉంది .అంతే ఇంకేం ఉందీ ?ఇంకేం లేదు,,,అవును...



You're a no good heart breaker
You're a liar and you're a cheat
And I don't know why
I let you do these things to me
My friends keep telling me
That you ain't no good
But oh, they don't know
That I'd leave you if I could

I guess I'm uptight
And I'm stuck like glue
Cause I ain't never
I ain't never, I ain't never, no, no (loved a man)
(The way that I, I love you)

Some time ago I thought
You had run out of fools
But I was so wrong
You got one that you'll never lose
The way you treat me is a shame
How could ya hurt me so bad
Baby, you know that I'm the best thing
That you ever had
Kiss me once again

Don'cha never, never say that we we're through
Cause I ain't never
Never, Never, no, no (loved a man)
(The way that I, I love you)

I can't sleep at night
And I can't even fight
I guess I'll never be free
Since you got, your hooks, in me

Whoa, oh, oh
Yeah! Yeah!
I ain't never loved a man
I ain't never loved a man, baby
Ain't never had a man hurt me so bad

No
Well this is what I'm gonna do about it

Tuesday, 27 December 2011

మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుందంటే ...!

ప్రపంచం తల కిందులైనట్టు అనిపిస్తుంది.
ఇంకాసేపట్లో చనిపోబోతున్నాం అనిపిస్తుంది .
విముక్తి లేదా అనిపిస్తుంది .
తగ్గాక...చచ్చి బతికినట్టు అనిపిస్తుంది.
ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది.