.టైపింగ్ లోపానికి క్షంతవ్యురాలను.చాలా కాలం క్రితం నేనో హిందీ మూవీ చూశా పహేలి అని .అప్పుడు షారుక్ సినిమాలు చూసే అలవాటు వుండేది.అందులో భాగమే పహేలీ కూడా .రాణీ ముఖర్జీ అంటే కూడా బాగా ఇష్టం.ఎప్పటికీ సఫలం కాలేని నా కలల్లో ఒకటి చలం ''మైదానం ''ని షారూక్ ,రాణి లతో మూవీ చెయ్యడం.డబ్బు అనేది ఎంత ఘన పదార్తమో ..అప్పుడప్పుడూ అలా అర్థమవుతూ వుంటుంది.కానీ మైదానం తిరిగి తిరిగీ చదివే క్రమంలో నేను ఇచ్చుకునే రూపం ఈ ఇద్దరిదే .
పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే ...మతిపోయింది.ఎటువంటి కథ ఇది. ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని .ముఖ్యంగా దెయ్యం ,పక్షిలా వచ్చే సన్నివేశం, దాని అరుపు[సంగీతం: కీరవాణి} ,అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి.
అప్పుడు ఆ కథ ఎవరిదీ ,ఏవిటీ నాకేమి తెలీదు.తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత Vijaydan Detha కథ అని .ఆ తరవాత కొన్నాళ్ళకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ''విజ్జి'' అనువాదకథలసంకలనం ''సందిగ్ద''చదవడంజరిగింది .ప్రతి కథ ఒక షాక్ .అంతకు మించీ స్త్రీవాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది
కథ మూడుముక్కల్లోఏంటంటే..ఒకమగాడు,,,వాడికి అందమైనఅమ్మాయితోపెళ్ళవుతుంది
.పెళ్లిచేసుకుని వచ్చే దారిలో ఓదెయ్యం ఆపిల్లని చూసి మొహిస్తాడు.వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు
,కొత్తపెళ్లికూతుర్నివదిలిఏదోవ్యాపారానికిసుదూరానికివెళ్లిపోతాడు. అప్పుడీదెయ్యం,
మగడివేషంలోవచ్చిఆపిల్లతోకాపురంమొదలెడతాడు.కానీనిజంచెబుతాడు.నిజంచెప్పినాఆపిల్లవాడినికోరుకుంటుంది.
గర్భవతికూడాఅవుతుంది
.మగడువస్తాడువిషయంతెలుస్తుంది.నేనునిజమైనమగడినంటేనేనునిజమైన. మగడిననిపోట్లాడుకుంటారు.తీర్పుకురాజుదగ్గరికివెళ్తూవుంటే ,మార్గమధ్యంలోఓగొర్రెలకాపరిదయ్యాన్నిబంధించిసమస్యనిపరిష్కరించేస్తాడు.
ఇప్పుడునాకుమూవీగుర్తులేదుకానీకథలోమంత్రగాడుఅంటాడూ''ఏడుసార్లుచిటికేవేసేలోగా
ఎవరైతేఈనీటిబుర్రలోదూరుతారోవాడేపడకగదికినిజమైనయజమాని''అని .అంతేఆపిల్లని అమితంగా ప్రేమించేదెయ్యంఆనీటిబుర్రలోకిదూరేస్తాడు.
అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నఆదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
సందిగ్ధ
లిఖిత ప్రెస్
అనువాదం :కే .సురేష్