About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday, 14 October 2014

సామల సదాశివ స్మృతి సంచిక & some musings


ఐదు రోజుల క్రితం శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారు ఫోన్ చేసి ''అమ్మ ,నీ అడ్రెస్స్ చెప్పరా , సామల సదాశివ గారి స్మృతి  సంచిక ఒకటి వేసారు ,చక్కటి వ్యాసాలున్నాయిరా అందులో  "అన్నారు . అడ్రెస్స్ పంపిన ఆవాళ 1230 పేజీల బృహద్గ్రంధమోటి ఇంటికి రాబోతుందని నాకు ఊహయినా లేదు . బుక్ తిరేగేయగానే నాకు,  లడ్డూ  కావాలా నాయనా అనే అడ్విమెంట్ గురుతోచ్చింది . సాహితీ ప్రియులు లడ్డూలా  కొని దాచుకోదగ్గది, శ్రద్దగా చదువదగ్గది ఈ ''పరిశోధన'' .

విశ్వేశ్వర రావు గారు... పట్టుకుని ఏక భిగిన చదవడానికి  కష్టంగా ఉంటుందనే  కానీ ఎంత అపురూపంగా వుందో ఈ పుస్తకం . దీన్ని చూడగానే మా అమ్మాయి వాళ్ళ పాపాయికి వారసత్వపు  బహుమతి గా ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నా . నా మనవరాలు తన లేత కళ్ళతో ఈ పుస్తకాన్ని చదవడాన్ని ఇప్పుడే డ్రీం చేసా . జిజ్ఞాస నిండిన  కళ్ళు , నల్లటి చర్మపు రంగు , బారుపాటి జడ, అచ్చు బుజ్జి మా అమ్మాయ  పెదాలు ... అపురూపమైన మేధస్సు ,ఖంగుమనే ఖంటమూ ,అన్యాయానికి తిరగబడే మానసిక స్తైర్యమూ , చచ్చే దాకా పోరాడగల మొండి తనమూ ,శారీరక ద్రుడత్వమూ తో సాదా సీదా గా ,అందరికీ స్నేహంగా  అనిపిస్తూ  , ఆత్మీయతను పంచే  సాహసి  నా మనవరాలికి ఈ పుస్తకాన్నివిల్లు  రాసి బ్లాగ్ ముఖం గా ఇచ్చేస్తున్నాను .

ఇదేనా ఆవాళ ప్రాతినిధ్య రోజు అమ్మ...  ప్రమీలమ్మ గారు నాకు ఇచ్చిన నెమలి పించం  రంగు మంగళ  గిరి ఝరీ చీర కూడా . నల్ల పిల్ల కదా దానికి అది బాగుంటుంది . దాని లేత చెంప ఆ చీరని ఆత్మీయంగా స్పృశించి మీరు నాకు ఇచ్చిన ప్రేమని ఫీల్ కావాలి .

థాంక్స్ ఫర్ ది బుక్ అండ్ థాంక్స్ ఫర్ ఎవిరీ థింగ్ .

థాంక్స్ అనేది పిచ్చి చిన్ని మాట , ఇప్పటికిప్పుడు నాకు కలిగిన ఈ అలవి కాని  సంతోషాన్ని వ్యక్త పరచడానికి నా దగ్గర మాటలు లేవు . కాలక్రమంలో వీలు వెంబడి నెమ్మదిగా ఈ సంతోషాన్ని మీకు తిరిగి ఇస్తాను .

పి ఎస్ :నా కలలెప్పుడూ నిజమవుతాయి :))




Friday, 12 September 2014

షట్కోణం

                                                                         షట్కోణం

నిర్వచనం ఇచ్చుకోవాలి .
అర్థం కాని వాటినీ  ,అర్థం చేసుకోలేని వాటినీ 
వెదకాలి లోపల్లోపల 
 ప్రశ్నార్థకాలని .
ఒకరెవరో వస్తారు 
యేవో నిర్వచిస్తారు 
కొన్ని తెల్లటి మెత్తటి పావురాయిల గురించి 
మరొకరెవరో వాడి ముళ్ల గురించి 
బల్ల మీది పేపర్ వెయిట్ గర గర  తిరుగుతుంటుంది  
హటాత్ గా షట్కోణం మదిలో ఉదయిస్తుంది 
నిట్టూర్పు సుడులు తిరిగి తిరిగీ అణిగిపోతుంది 
అన్నింటినీ చిలక్కొయ్యకి ఏక మొత్తం గా తగిలించేసాక 
కొన్ని ఎర్రటి వుదయాల వేళ 
ఎవరో ఆర్త గీతం పాడుకుంటూ లోతుల్లో కి నడిచి వెళతారు 
అంతలోనే ఇక ఏదీ అదుపులో  వుండదు 
మొదలైన చోటికే చేరి పూర్ణ మవుతుంది 
అస్తవ్యస్తంగా నిలబడ్డ అనుభవాలు 
వరుస కట్టి దృశ్యమానమవుతాయి 

నిర్వచనం 
ఎప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే 
అదొక్కటేనా 
నీడను వెదుకులాడటం కూడా 

Wednesday, 27 August 2014

చేపలు పట్టే జాలరి !

చేపలు పట్టే జాలరి !


 కలిసి  పెంచిన దూరంలో 
బహుశా 
ఈ దుఃఖం నీకొక రహస్యమే 

పూల పూల జీవన శైలిలో 
ఈ పరిమళం 
నీకు 
అనాఘ్రాతమే 

పర్లేదు 
అసంపూర్ణం అసంతృప్తి కాదు 
సంపూర్ణం సంతృప్తిని చేరదు

కానీ  
ఎందుకలా ...
వలలోను నీటిలోనూ 
ఏక కాలాన ఉంచి ఇలా ...



Sunday, 8 June 2014

Sunday, 18 May 2014

Saturday, 5 April 2014

Jao Pakhi Bolo Tare

Wednesday, 12 March 2014

నీ కొరకై ... ప్రభూ !





నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1.
నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును -
నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో
కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా -
రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు
నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ
//నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును
ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము
విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము
మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు -
పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన
నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
6.
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో
- పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //