About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 17 May 2013

ఎంత ఆనందమో ... హృదయం నిండి పోయింది



ఎంత ప్రేమగా చెప్పనూ ఈ పాట  గురించీ ?వింటూ వుంటే హృదయం నిండి పోతుంది .ఆనందం ఎక్కువైతే హృదయం భరించ కలదా ?ఏడుస్తుంది . పై పైకో...  లోపల లోపలో . టాగోర్ '' రబీంద్ర  సంగీత్ '' నుండి ఇది కూడా .రాసిన వారికి ,పాడిన వారికి పాద ప్రణామాలు .

పాడింది కనికబెనర్జీ https://en.wikipedia.org/wiki/Kanika_Banerjee. మొన్నో రోజు పాపాయి వాళ్ళ నాన ఇంట్లోకి తెచ్చాడు ఈ పాటని . రోజంతా దీనితోనే గడుస్తుంది అయినా తనివి తీరదు . ఒక్కో సారి నా కాశీ చెంబులో పోసుకుని తాగేద్దామని అనిపిస్తుంది .పాట వింటూ వుంటే  చాలా కోపం తెప్పించిన వాళ్ళని కూడా ,వెళ్ళండి ,ఇక తప్పులు చేయకండి ,సామాన్య మిమ్మల్ని క్షమించి  వేసింది అని దయగా దగ్గర కూర్చో  పెటుకుని చెప్పాలనిపించింది . హృదయం సరళమై ,దయార్ద్ర మయింది .

ఈ పాట లో ఆనందం వుంది . ప్రేమ వుంది .

తెలుసా ... రవీంద్రుడు ఎన్ని గీతాలు రాసాడో?మూడు వేల ఐదువందలు . ఆ మాట వింటే ఎంత ఆనందం వేసిందో .ఇకనేం రోజుకో కొత్త పాట విన వచ్చని . సంగీతం జీవితాన్ని సఫలం చేస్తుంది . కానీ ఒక్కోసారి ఎంత బాధ వేస్తుందో నాకెందుకు పాడటం  రాదని . బెంగాలీలు ఈ విషయం లో దయగల వారు . నాకు రబీంద్ర సంగీత్ నేర్పించే మా టీచరు అంటుందీ హృదయం లో ఇంత ఇష్టం వుందే మీకు ,పాడటం రాక పోవటమేమిటి ?నేను తయారు చేస్తా కదా మిమ్మల్నీ అని .

Anandadhara Bohichhe Bhubone 
Anandadhara Bohichhe Bhubone 2
Dino rojoni koto Amrito Roso
Utholi jai Ananto Gogone 
Anandadhara Bohichhe Bhubone 2 
Pano(?) Kore Robi shashi Anjali Bhoriya 
Soda dipto rohe Akhhoyo Jyoti 2 
Nittya purno Dhora Jibone Kirone
Anandadhara Bohichhe Bhubone 2
Bosiya Accho Keno Apon Mone
Shartha Nimogono Ki Karone. 
Chari dike dekho Chahi Hridoyo Prosari 
Khudro Dukkho Sobo tuchho mani 2 
Prem Bhoria Loho Sunno Jibone
Anandadhara Bohichhe Bhubone 2

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇది పాడింది బహుశా  ఇంద్రాణి సేన్ .
All over the world flows the stream of joy.
Night and Day, in the sky, much nectars deploy.
The stars drink the glow with folded palms.
The eternal light, always stay bright and calm.
The globe is continually full of life and ray.
Why are you sitting detached?
Why are you so self-centered?
Open your heart and look all over.
Ignore the small pains as minor.
Fill the empty life with love and care.
All over the earth flows a flood of joy

4 comments:

Kottapali said...

హిందోళం మాయ :)

వనజ తాతినేని/VanajaTatineni said...

సంగీతం జీవితాన్ని సఫలం చేస్తుంది...
ఎంత బాగా చెప్పారు సామాన్య. మీరు ఇప్పుదు సంతోషంగా ఉన్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు. త్వరలొ చక్కగా పాడటం నేర్చుకుని "రబీంద్ర సంగీత్" ఆలపించి ఇలా.. అప్లోడ్ చేసేయండీ. ఆల్ ది బెస్ట్.
రబీంద్రుడు ౩౫౦౦ పాటలు అబ్బురంగా ఉంది.
ఇన్ని విషయాలు తెలిపినందుకు ధన్యవాదములు.

సామాన్య said...

నారాయణ స్వామి గారు

ఈ పాట మాల్కొష్ రాగ్ ,త్రితాళ్ లో వుంది ,మాల్కొష్=హిందోళం కర్నాటిక్ లో
నిజమే మాయ !

థాంక్యు

సామాన్య said...

వనజ గారు
సంగీతం అప్పుడప్పుడూ నేర్చుకుంటూనే వుంటాను :)) సంగీతమనేమిటి ..సర్వ కళ ల లో తల దూరుస్తూ వుంటాను .సకల కళా కోవిదురాలినవ్వాలని దురాశ అనమాట . చాలా సీక్రెట్ ఏమిటంటే నా పాట వింటే ఇట్లా కామెంట్ పెట్టడానికి కూడా మీరు నా బ్లాగ్ కి రారు ఇక :))

థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ .