About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday 9 May 2013

పచీసే బైశాక్


పచీసే బైశాక్ అంటే వైశాఖ మాసపు 25 వ తారీకు అని . ఈ రోజు బెంగాలీలకు అతి ఇష్టమైన రోజు . ప్రభుత్వ సెలవు  దినం .ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే రవీంద్ర నాథ్ టాకూర్ పుట్టారు . బెంగాలీల హృదయాధి దేవుడు కావడమే కాక భారత సాహిత్య సీమని సుసంపన్నం చేసారు టాకూర్. పొద్దుటే రాలీ కి వెళ్లి వచ్చి పాపాయి వాళ్ళ నాన ఆశ్చర్య పడ్డాడు ,ఒక వేళ  రవీంద్రుడు పుట్టక పోయి వుంటే బెంగాలీలు ఏమై  పోదురోనని .బెంగాలీలకి రవీంద్రుని పై వుండే పిచ్చి అభిమానం మనకు ఇటువంటి ఆలోచనలను కలిగిస్తే ఆశ్చర్య పడవలసింది ఏమీ లేదు .

ఈ సందర్భం లోనాకు బాగా ఇష్టమైన రబీంద్ర సంగీత్ నుండి ఒకగీత్http://en.wikipedia.org/wiki/Ekla_Chalo_Re
  .  ఈ పాటని నేను ఏడేళ్ళ క్రితం మొదటి సారి కూచ్ బిహార్ ''సాగర్ దిఘి ''ఒడ్డున ఓ సాంధ్య వేళ విన్నాను .  ''ఎక్లచలో ''అంటే ఏమిటీ అని అడిగాను . ఒక్కడీవే \ఒక్కతివే వెళ్ళు అని అర్థం తెలుసుకున్నాక ఈ పాట  మొత్తం అర్థం తెలుసుకోవాలనిపించింది . ఈ గీతం అధైర్యం లో ధైర్యాన్ని ఇస్తుంది .కొత్తని ఒప్పుకోని ప్రపంచానికి , దిగులు పడకుండా,కుంగి పోకుండా మార్గ నిర్దేశం చేసే శక్తినీ ఇస్తుంది . ఈ పాట  రాసినందుకు రవీంద్రుడికి మనం తర తరాలుగా రుణ గ్రస్తులమయ్యాం .  

(Jodi tor daak shune keu naa se tobe ekla cholo re
Tobe ekla cholo, ekla cholo, ekla cholo, ekla cholo re)2

Jodi keu kothaa naa koye, ore ore o abhaagaa, keu kothaa na koye
(Jodi shobai thaake mukh phiraaye shobai kore bhoye)2
Tobe poraan khule (o tui mukh phute tor moner kothaa, eklaa bolo re)2

Jodi shobai phire jaaye, ore ore o abhaagaa, shobai phire jaaye
(Jodi gohan pothe jaabaar kaale keu phir naa chaaye)2
Tobe pothera kaantaa (o tui rokto maakhaa choronatole eklaa dolo re)2

Jodi aalo naa dhore, ore ore o abhaagaa, aalo na dhore
(Jodi jhor-baadole aadhaara raate duyaar deye ghore)2
Tobe bajraanole (aapon buker paajor jaaliye niye ekalaa jolo re)

ఈపాటంటే గాంధీజీ కి చాలా ఇష్టమట . మనసు దిగులు పడినపుడు ,నిరాశ కమ్ముకున్నపుడు ఈ పాట వినే వాడట . 

ఒక  వేళ ,నీ పిలుపునందుకుని  ఒక్కరు కూడా  రాకుంటే 
నిన్ను ఏకాకిని చేసేస్తే ,మరేం పర్లేదు !ఎవరూ రాలేదు కదానని ప్రయాణం మాత్రం ఆపకు . నువ్వొక్కడివే వెళ్ళు 


ఒక  వేళ నీతో ఎవరూ మాట్లాడకుంటే ,ఓ అభాగ్యుడా నీతో ఏ ఒక్కరు కూడా  మాట్లాడకుంటే,నీ చుట్టూ  వున్న అందరూ నిన్ను చూసి ముఖం తిప్పెసుకుంటూ వుంటే ,నిను చూసి భయపడి పోతూ వుంటే ,అప్పుడు ,నువ్వొక్కడివే నీ ప్రాణ శక్తినంతా వెచ్చించి నీ మనసులోని మాటను ఎలుగెత్తి  చెప్పేయ్ 


ఒకవేళ అందరూ వెనుదిరిగి పోతూ వుంటే ,పిరికి ముఖం వేస్తూ వుంటే  ఓ అభాగ్యుడా ఒక్కరూ నీ వైపు లేని ఆ నిర్మానుష్యమైన దారిలో నీవు వెళ్ళాల్సి వస్తే ,దారిలోని ముళ్ళు నీ పాదాలని రక్తమయం చేస్తున్నా ఆ రుధిర పాదాలతోనే పరుగు పెట్టు .కానీ ప్రయాణం మాత్రం ఆపకు . 

ఒక వేళ వెలుతురే కనిపించకుంటే ,ఓ అభాగ్యుడా ,కారు మేఘం అలుముకున్న చీకటి రాత్రి ,ఉరుములు మెరుపుల కుంబవ్రిష్టిలో నీ కోసం ఒక్క ఇంటి తలుపూ తెరుచుకోకున్నా ఓ అభాగ్యుడా నీ హృదయం లోని సాహసాన్ని దివిటీ చేసుకుని  జ్వలించు 






4 comments:

Anonymous said...

రవీంద్ర గీతం సంగీతం అమరికగా కుదిరాయి!కవిత్వానికి నోబెల్ పురస్కారం ఉత్తినే రాదుకదా!కవనంలో ఆజన్మాంత ఆశావాదం ఒకసారి గమనించండి!

సామాన్య said...

అవునండీ సూర్య ప్రకాష్ గారు . తెలుగు అనువాదాల ద్వారా కన్నా బెంగాల్ లో ఉంటూ రవీంద్రుని వర్సటాలిటీని మరింత తెలుసుకున్నా నేను !థాంక్ యు .

తృష్ణ said...

నాక్కూడా చాలా ఇష్టమండి. ఈ పాటకు తెలుగు అనువాదం ప్రముఖ వాగ్గేయకారులు రజనీకాంతరావు గారు చేసారండి. ఇక్కడ రాసాను. వీలైనప్పుడు చూడండి:
http://samgeetapriyaa.blogspot.in/2012/05/blog-post_10.html

సామాన్య said...

తెలుగులో ఈ పాట వినే అదృష్టం కలిగించినందుకు మీకు హృదయ పూర్వక ధన్యవాదాలు తృష్ణ గారు .