About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Tuesday, 14 October 2014

సామల సదాశివ స్మృతి సంచిక & some musings


ఐదు రోజుల క్రితం శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారు ఫోన్ చేసి ''అమ్మ ,నీ అడ్రెస్స్ చెప్పరా , సామల సదాశివ గారి స్మృతి  సంచిక ఒకటి వేసారు ,చక్కటి వ్యాసాలున్నాయిరా అందులో  "అన్నారు . అడ్రెస్స్ పంపిన ఆవాళ 1230 పేజీల బృహద్గ్రంధమోటి ఇంటికి రాబోతుందని నాకు ఊహయినా లేదు . బుక్ తిరేగేయగానే నాకు,  లడ్డూ  కావాలా నాయనా అనే అడ్విమెంట్ గురుతోచ్చింది . సాహితీ ప్రియులు లడ్డూలా  కొని దాచుకోదగ్గది, శ్రద్దగా చదువదగ్గది ఈ ''పరిశోధన'' .

విశ్వేశ్వర రావు గారు... పట్టుకుని ఏక భిగిన చదవడానికి  కష్టంగా ఉంటుందనే  కానీ ఎంత అపురూపంగా వుందో ఈ పుస్తకం . దీన్ని చూడగానే మా అమ్మాయి వాళ్ళ పాపాయికి వారసత్వపు  బహుమతి గా ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నా . నా మనవరాలు తన లేత కళ్ళతో ఈ పుస్తకాన్ని చదవడాన్ని ఇప్పుడే డ్రీం చేసా . జిజ్ఞాస నిండిన  కళ్ళు , నల్లటి చర్మపు రంగు , బారుపాటి జడ, అచ్చు బుజ్జి మా అమ్మాయ  పెదాలు ... అపురూపమైన మేధస్సు ,ఖంగుమనే ఖంటమూ ,అన్యాయానికి తిరగబడే మానసిక స్తైర్యమూ , చచ్చే దాకా పోరాడగల మొండి తనమూ ,శారీరక ద్రుడత్వమూ తో సాదా సీదా గా ,అందరికీ స్నేహంగా  అనిపిస్తూ  , ఆత్మీయతను పంచే  సాహసి  నా మనవరాలికి ఈ పుస్తకాన్నివిల్లు  రాసి బ్లాగ్ ముఖం గా ఇచ్చేస్తున్నాను .

ఇదేనా ఆవాళ ప్రాతినిధ్య రోజు అమ్మ...  ప్రమీలమ్మ గారు నాకు ఇచ్చిన నెమలి పించం  రంగు మంగళ  గిరి ఝరీ చీర కూడా . నల్ల పిల్ల కదా దానికి అది బాగుంటుంది . దాని లేత చెంప ఆ చీరని ఆత్మీయంగా స్పృశించి మీరు నాకు ఇచ్చిన ప్రేమని ఫీల్ కావాలి .

థాంక్స్ ఫర్ ది బుక్ అండ్ థాంక్స్ ఫర్ ఎవిరీ థింగ్ .

థాంక్స్ అనేది పిచ్చి చిన్ని మాట , ఇప్పటికిప్పుడు నాకు కలిగిన ఈ అలవి కాని  సంతోషాన్ని వ్యక్త పరచడానికి నా దగ్గర మాటలు లేవు . కాలక్రమంలో వీలు వెంబడి నెమ్మదిగా ఈ సంతోషాన్ని మీకు తిరిగి ఇస్తాను .

పి ఎస్ :నా కలలెప్పుడూ నిజమవుతాయి :))




2 comments:

Radha Manduva said...

వడ్రాణాన్ని ముందుగానే చేయించారనమాట. సరే మిగతా నగలు కూడా ఏర్పరచండి మరి మనవరాలికి.... కలలెప్పుడూ నిజమవుతాయి... అందుకేగా అంటారు "కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి" అని.. (బావున్నారా సామాన్యగారూ?)

సామాన్య said...

రాధ గారు నేను బాగున్నాను . మీరెలా వున్నారు ? మనలో మనమాట ... ఇదంతా నా కూతురిని మాయ చేసే ఎత్తుగడ . నేను కలలు కనే ఒక మంచి అమ్మాయిలా అది తయారు కావాలని :)). సారీ ఫర్ ది లేట్ రిప్లై .