అమ్మలందరూ ఒకటే అయినా
కొందరమ్మలు కొంచెం వేరు
మా అమ్మ లాగా :
మా అమ్మ శత రూప
మేము కన్నీళ్ళ మైతే
శోషించే సూర్యుడు
మా అమ్మ
మేం పిరికి ఎలుకలమైతే
దాచి పెట్టేసే కలుగు
మా అమ్మ
పెద్దై మేం ప్రేమలో పడితే
మా అమ్మ
సినిమా అమ్మ
గుంపులు గుంపులుగా అందరూ
అమెరికా దిక్కు ఎగురుతుంటే
కలో గెంజో కలిసే తాగుదామని
వడిసెల దెబ్బలని ఊహించి వారించిన
దార్శనిక మా అమ్మ
అనుభవమే ఆనందమని
అందమైన అనుభూతుల ఆస్తినిచ్చిన
వారసత్వం మా అమ్మ
చిన్నప్పట్లానే ఇప్పటికీ
ఎవరైనా దిగులు పడ్తుంటే
మా ఇంటికెల్దాం రా...
మా అమ్ముందని
చెప్పాలనిపిస్తుంది
మా అమ్మ ధైర్యాన్ని
కొంత
వారిలోకి ప్రవహింప చేయాలనిపిస్తుంది
కొందరమ్మలు కొంచెం వేరు
మా అమ్మ లాగా :
మా అమ్మ శత రూప
మేము కన్నీళ్ళ మైతే
శోషించే సూర్యుడు
మా అమ్మ
మేం పిరికి ఎలుకలమైతే
దాచి పెట్టేసే కలుగు
మా అమ్మ
పెద్దై మేం ప్రేమలో పడితే
మా అమ్మ
సినిమా అమ్మ
గుంపులు గుంపులుగా అందరూ
అమెరికా దిక్కు ఎగురుతుంటే
కలో గెంజో కలిసే తాగుదామని
వడిసెల దెబ్బలని ఊహించి వారించిన
దార్శనిక మా అమ్మ
అనుభవమే ఆనందమని
అందమైన అనుభూతుల ఆస్తినిచ్చిన
వారసత్వం మా అమ్మ
చిన్నప్పట్లానే ఇప్పటికీ
ఎవరైనా దిగులు పడ్తుంటే
మా ఇంటికెల్దాం రా...
మా అమ్ముందని
చెప్పాలనిపిస్తుంది
మా అమ్మ ధైర్యాన్ని
కొంత
వారిలోకి ప్రవహింప చేయాలనిపిస్తుంది
[మార్చ్ 7 2010 ఆదివారం ఆంద్ర జ్యోతి ]
5 comments:
గొప్ప అమ్మని పరిచయం చేసారు. నిజమే..చాలా మందికి దైర్యాన్ని ప్రవహిన్పజేసే అమ్మల అవసరం ఉంది. చాలా బాగా నచ్చింది. నిన్న మా ఎక్సరే అవార్డుల ప్రధాన సభలోనూ ఇలాటి కవిత్వమే విన్నాము. ధన్యవాదములు .
thank you vanaja vanamali gaaru .
Very good poem.
Very good poem.Please mail me your address. I shall send you a book of poems on amma.
vadina chaaaaaala bagundi...
Post a Comment