చాలా కాలం క్రితం ఒక కథ చదివాను .స్వీడిష్ రచయిత్రి పేరు selma ottilia lovisa lagerlof .రచయిత్రి నోబెల్ ప్రైజ్ విన్నర్. కథ పేరు 'ది మ్యుజీషియన్'.అతనో వయలిన్ వాద్య కారుడు .రచయిత్రి అతని గురించి చెప్తూ ఇప్పుడైతే అతను వినయవంతుడు కానీ ఒకప్పుడు కాదు .అతను ఒకే ఒక్క రాత్రి లో అలా వినయం గా మారిపోయాడు అంటూ ,ఎలా మారిపోయాడో కథ మొదలెడుతుంది.
ఒక సారి ఓ పార్టీ లో అందరూ అచ్చేరువొందేట్టు అతను వయలిన్ ప్లే చేస్తాడు.ఇంటికొస్తూ, దార్లో తన ప్రతిభ గురించీ,తనని ప్రోత్సహించక పోగా బాధ పెట్టిన తల్లి దండ్రుల గురించి తల పోస్తాడు .చిన్నగా ఒక అడివిలోకి ప్రవేసిస్తాడు.నడిచే దారి వెంబడి ఒక నది ప్రవహిస్తూ వుంటుంది .ఈ నది సంగీతం బానే వుంది అనుకుంటాడు.బానే పాడుతున్నావ్ అని సంభాషిస్తాడు.ఇంకొంత దూరం వెళ్లి ,పర్లేదు నువ్విప్పుడు కొంత ఇంప్రూవ్ అయినట్టు తోస్తుంది అని , అవున్లే ఈ ఊర్లోనే బెస్ట్ వయలినిస్ట్ నిన్ను వింటున్నాడని స్పృహ కలిగినట్టు వుంది నీకు అంటాడు .అట్లా నదితో సొంత డబ్బా కొట్టుకుంటూ వస్తాడు .
ఒక దగ్గరకి వచ్చేసరికి పాడుబడ్డ మిల్లోటి కనిపిస్తుంది .చూస్తుండగానే అందులోనుండి ఓ పిల్ల వస్తుంది. వచ్చీ రాటం తోనే నువ్వు వాయించు నేను డాన్స్ చేస్తా అంటుంది .అతను వాయించడం మొదలు పెడతాడు.వినీ వినగానే ఆ పిల్ల ఇదేం సంగీతం ,ఏం బాలేదు అని తీసి పడేస్తుంది .అతను మళ్ళీ మళ్ళీ వాయిస్తాడు .ఆ పిల్లకి నచ్చదు.చివరికి అతనంటాడు నువ్వు ఇంకెవరన్నా మంచి వాళ్ళని చూడాల్సిందే నా వల్ల కాదు అని .
అంతలోకి హటాత్ గా అతని చేయి తనంతట తానే ప్లే చేయటం మొదలెడుతుంది.ఆ అమ్మాయి అప్పుడు ఇదీ సంగీతమంటే అంటుంది ,అని అలిసే వరకూ డాన్స్ చేసి వెళి పోతుంది .కానీ ఎంత ప్రయత్నించినా అతని చేయి ఆగదు.చివరికి అతనికి అర్థమయిపోతుంది ఇక మరణమే అని .
మరణించిన తండ్రీ ,అతని ముసలి తల్లి జ్ఞాపకం వస్తారు.మొదటి సారి తల్లి గురించీ ,వృద్దాప్యంలో ఆమెని ఒంటరిని చేసిన తన కటినత్వం గురించీ యోచిస్తాడు.బ్రతికితే తల్లితో వుండాలి అనుకుంటాడు.తెల్లారుతుంది .చుట్టూ మనుషులే కనిపించరు.దుక్కమొస్తుంటుంది.
ఇంతలో దూరంగా తల్లి కనిపిస్తుంది .ముడతలు పడి, దీనం గా ...అమ్మేనా ,అంత ముసలిగా అయిపోయిందేమిటీ అనుకుంటాడు.
అమ్మా.. అని ఏడుస్తూ పిలుస్తాడు. అమ్మ అయిష్టంగా ఆగి అంటుందీ... .నేను విన్నాను ఇవాళ మన ఊర్లో నువ్వే గొప్ప వాద్యకారుడివట కదా , ఇక నా లాటి ముసలి వాళ్ళని నువెందుకు కేర్ చేస్తావులే అని .అతను ఏడుస్తూ అమ్మ నన్ను వదిలి వెళ్ళకు .నేను గొప్ప ముజీశియన్ని కానే కాదు .నా గర్వం వల్ల ఇప్పుడు నేను చని పో బోతున్నాను .నన్ను క్షమిస్తావా అమ్మా అంటాడు .
అమ్మ కొడుకు స్థితి చూస్తుంది .పెల్లుబికే ప్రేమతో అంటుంది ,ఎందుకు క్షమించనూ ?తప్పక క్షమిస్తాను అని .మళ్ళీ అతను నమ్మేట్టుగా గట్టిగా 'దేవుడి సత్యంగా నిన్ను క్షమిస్తున్నాను ''అంటుంది .
అమ్మ అలా అనగానే వయలిన్ కింద పడిపోతుంది.
కథని నేను బాగా పరిచయం చెయ్యలేదు .చదవి తీరాలి .సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా వుంది హృదయానికి అతుక్కు పోతాయి.చదువుతుంటే సినిమా చూసినట్టు వుంటుంది.గుర్తొచ్చిన ప్రతి సారీ దృశ్య రూపంలోనే గుర్తొస్తుంది.ఎన్నేళ్ళయినా మార్పే రాదు.
కథ గుర్తొచ్చినప్పుడల్లా ...ఈ కథ ఎందుకట్లా జ్ఞాపకముండిపోయింది...ఈ కథలో ఏదో వుంది మేజిక్ అనుకుంటాను .మళ్ళీ అంత ఘనం ఏముందా ఈ కథలో అని యోచిస్తాను.ఏదో వుందని అన్వేషిస్తాను.
అబ్బ అసలకి ఎంత అద్భుతం ఈ కథ .
4 comments:
ఈ కధలో ఏదో ఉంది....
అర్ధం అయినట్టే ఉంది అర్ధం కావట్లేదండి !!!! ఏమయ్యుంటుంది??? కధానాయకుడు గర్వం వదిలి నొర్మల్ గా అవ్వడం అనేది ప్రతీ కధలో ఉండేదే కాని ఈ కధలో ఇంకా ఏదో ఉంది...తల్లి ప్రేమ అనుకుందామా అంతే....ఉహు ఇది కామన్ పాయింటే....ఆగండి ముందు కధ చదివి వస్తాను...
katha chadivaaraa ? yelaa anpinchindi?
కధ మీరుమళ్ళీ చదివి అర్ధమయ్యేలా చెప్పరూ
శర్మ గారు చదవ గలను ఎన్ని సార్లయినా ...కానీ రాయలేనండీ నాకు టైపింగ్ కష్టం.
Post a Comment