ఒక రాత్రి ఫోన్ చేసి చాలా ఉద్వేగంగా చెప్పింది స్నేహితురాలు ఈ పాట నేర్చుకుంటున్నానని .ఇందులో సాహిత్యం తనకూ నాకూ చాలా నచ్చింది.నిజానికి ప్రియ సిస్టర్స్ కంటే తన పాట నాకు ఎక్కువ నచ్చింది .అట్లా అనేక సార్లు విన్న పాట ఇది.
చాలా సార్లు ఆశ్చర్యం వేస్తుంది ,అన్నమయ్యనో ,త్యాగయ్యనో ...వింటూ వుంటే .రాయాలని వున్నా ఇంకేం రాద్దాం లెద్దూ ప్రేమకవిత్వం అనిపించేస్తుంది వీరి ప్రేమ పాటలు చూస్తే ,దానిని మనం భక్తి అంటున్నాం అనుకోండి .మరీ ఎక్కువ సాగదీస్తే ప్రేమ ,భక్తిగా (లేకపోతే పిచ్చిగా)మారుతుందనుకుంటా.భక్తో ,ప్రేమో ఏదైనా రాయడానికి మనకేం మిగల్చనట్టే వీళ్లు ఆలోచిస్తే.
'మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే'...నట పిల్లలు మన పలుకులే పలికినట్లు.''వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే''నట .అమ్మ తప్ప చిన్ని చిన్ని పిల్లలికి మరోటి వుండదే ,అట్లా కాబోలు .ఇంత ఘనం ప్రేమించేస్తే దేవుడు కనిపించకేం చేస్తాడు?అవును కదా ...!
నమో నారాయణ నావిన్నపమిదివో
సమానుడగాను నీకు సర్వేశ రక్షించవే
మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే
తనువు నీపుట్టించినధన మిది
మును నీవంపున నిన్ని మోచుకున్నవాడనింతే
వెనక నన్ను నేరాలు వేయక రక్షించవే
భోగములెల్లా నీవి బుధ్ధులు నీవిచ్చినవి
యీగతి నాబతుకు నీవిరవైనది
చేగదీర నీవునన్ను జేసినమానిసి నింతే
సోగల నాయజ్ఞానము చూడక రక్షించవే
వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే
కలకాలమును నీకరుణే నాకు
యిల శ్రీవేంకటేశ నీవేలుకొన్నబంట నింతే
నెలవు దప్పించక నీవే రక్షించవే
2 comments:
మంచి సాంగ్ పరిచయం చేశారు ధన్యవాదములు...
థాంక్యు అండీ
నా బిడ్డ బ్లాగ్లో మీ కామెంట్ చూసి మీ బ్లాగ్ చూసాను.చాలా పాటలు విన్నాను.థాంక్యు ఒన్స్ అగైన్ అండీ
Post a Comment