About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 11 June 2012

సత్యవతి గారు,ఓల్గా గారు ...!

ఇవాళ ''వివిధ''లో సత్యవతి గారితో  ఇంటర్వ్యు ...''అతి పీడితులు స్త్రీలే గనుక '', Andhra Jyothy Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra Jyoti, Andhra Jyothi, Telugu Culture and Tradition, IT News, Telugu Matrimonials, Classifieds, etc

 ''సూర్యా ''లో ఓల్గా గారి మృణ్మయ నాదం పై నేను రాసిన ఈ  వ్యాసమూ వచ్చాయి Surya Telugu Daily Telugu News Paper Online edition published from Andhra Pradesh, India, Andhra news, Andhra Pradesh Politics, India news, Telugu Literature, Telugu Cinema news, Analysis, Hyderabad news, Andhra , Telugu Culture and Tradition, etc   .రెంటినీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఈ రచయిత్రులు ఇరువురూ స్త్రీల వేదనలను అక్షరీకరించారు గనుక .నాకు ఓల్గా గారితో పరిచయం లేదు.సత్యవతి గారి ఆత్మీయత తో ఈ మధ్యనే ఫోన్ పరిచయం .వారి సమగ్ర సాహిత్యం పైన పేపర్ ఒకటి రాయాలని ప్రయత్నం .

భూమికలో నా కథ వచ్చింది కదా   దానికేవరో  కామెంట్ పెట్టారు .ఆ కామెంట్ చాలా దురుసుగా వుంది.అట్లాగే  విహంగాలో కామెంట్ కూడా ...చూసి చాలా దిగులేసింది.నేనిక రాయనంటే రాయనని పాపాయి వాళ్ళ నాన్న కి ప్రకటించా కూడా .తను కాదు... ఇదంతా   స్త్రీల ని రాయనీకుండా చేయడానికి   వేశే   ఎత్తుగడ నువ్వు రాయాలి ,మానకూడదు ,భయపడ కూడదు అని చెప్పాడు .అయినా నాకు ఏమనిపించిందంటే అసలు ఎందుకు  రాయాలి అని .నాకేమీ కీర్తి కాంక్షో గొప్పతనాల యావలో లేవు కదా .నా సామాజిక బాద్యతని మరో    మార్గంలో నేరవేర్చవచ్చులే అనిపించింది  . ఎందుకని ఎవరైనా దురుసుగా అంటే  ఊరుకోవాలి  .మామూలుగా అయతే ఎవరేమైనా పేలితే మొహం పగలగోట్టేస్తాం కదా ఇప్పుడేమో ఇది కథా చర్చ కదాని  ఊరుకోవాలి . కల్పనా గారి తన్హాయి ని  వనజ గారు సమీక్షించి నపుడు  వచ్చిన కామెంట్స్ చూసి కూడా అట్లాగే అనిపించింది .ఆ చర్చకి అసహ్యించుకుని ఆ లింక్ షేర్ చేసిన అవినేని భాస్కర్ గారు ఆ  గూగుల్ ప్లస్ నే డిలీట్ చేసేసుకున్నారు .ఈ నెల  పాలపిట్టలో డాక్టరేట్ చేసిన ఒకావిడ మాధురి  కథ ''చంద్ర కళ ''గురించి రాస్తూ ''చలం ఈ   విధం గా  అక్రమ సంబంధాలను ఆకర్షణీయంగా   చిత్రించిన మాట నిజం ...2012 లో ఇలా అక్రమ సంబంధాలను మహత్తర విషయంగా చిత్రించడానికి రచయిత్రికి గల కారనేమిమితో తెలియలేదు ''అని రాసింది .ఒక స్త్రీవాద రచయిత్రి ఆ మాట  చదివి   స్త్రీలు కూడా ఈ పదజాలాన్ని వాడుతున్నారే అని బాధపడ్డారు.నా క్కూడా  ఆ  స్పందన అసత్య విమర్శ  అనిపించింది.ఏం  మనుషులో కొత్త రచయితలు వచ్చినప్పుడు  తప్పొప్పులు సున్నితంగా చెప్పి ప్రోత్సహించాలి కానీ చంపేస్తారా అని దిగులేసింది ...మనం మంచి వాల్లమైతే చెడును సంస్కరించాలి .చీకొట్టి దూరంగా జరిగితే లోపల మనలో చెడు వుందని ఒక అర్థం ... వీళ్ళు  స్త్రీలు ఎందుకవుతారు .స్త్రీల ముసుగులోని  రాజకీయ నాయకులు . వారి కుందేటికి మూడే కాళ్ళు  అనిపించింది  ...ఇట్లా ఇంత మదన పడ్డానా నా  ఇంత మదనకూ .తమని తాము స్థిరీకరించుకుంటున్న స్త్రీల పట్ల పురుషాధిక్య భావాలు ఇంకా పెంచి పోషించుకుంటున్న కుటుంబ సభ్యుల్లో ఒక అసహనం, ఇగో బయలుదేరాయి. వాళ్లను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచే ప్రయత్నాలు మొదలౌతాయి. పని ప్రదేశాల్లో కూడా ఇది ప్రతిఫలిస్తుంది. స్త్రీల తెలివి, సామర్ధ్యం గుర్తించకుండా మరుగున పడేసే ప్రయత్నాలుంటాయి. ఇవన్నీ కాకపోతే తురుపుముక్క ఉండనే ఉంది. ఆమె శీలం మంచిది కాదని ఒక్కమాటంటే సరిపోతుంది. వీటన్నింటిని తట్టుకుని నిలబడాలంటే చాలా శక్తి కావాలి. ఆ శక్తి శ్రామిక మహిళల్లో కనిపించినంతగా మధ్యతరగతి మహిళల్లో కనిపించదు. శ్రామిక మహిళల శ్రమ శక్తి, శారీరక బలం పట్ల వాళ్లకు ఉన్న నమ్మకం గౌరవం, మధ్యతరగతి స్త్రీలకు ఇంకా రాలేదు.  అన్న సత్యవతి గారి  ఈ మాటలు విషయాలు  తెలిసినవే అయినా తేటతెల్లం చేసి  ..ఊరటనీ ధైర్యాన్ని ఇచ్చాయి ..అవును రాయాలి ఎందుకు రాయకూడదు అని ధైర్యం వచ్చిది .

ఇవాల్టి వారి ఇంటర్వ్యు లో నాకు వారిచ్చిన ఈ సమాధానం కూడా భలే నచ్చింది . మిమ్మల్ని మీరు స్త్రీవాద రచయిత్రిగానా - ప్రధాన స్రవంతి రచయితగానా - ఎట్లా గుర్తిస్తారు?

- ఒక మంచి స్త్రీవాద కథ లేదా దళిత వాద కథ, లేదా ముస్లింవాద కథ మంచి కథే అవుతుంది గానీ మంచి స్త్రీవాద కథ, మంచి దళిత వాద కథ, మంచి ముస్లింవాద కథ అవుతుందా? మంచి కథలన్నీ ప్రధాన స్రవంతిలోకి రావలసినవే అని నా అభిప్రాయం. ప్రధాన స్రవంతిని ఎట్లా నిర్వచిస్తాం.. ఏ విధంగా రాస్తే ప్రధాన స్రవంతి అవుతుంది? స్త్రీలను గురించి, దళితులను గురించి, ముస్లింలను గురించి రాసిన రచయితలు ప్రధాన స్రవంతి కాక మార్జిన్‌లో ఉండేవారు అని నిర్వచిస్తే నన్ను నేను స్త్రీ వాద రచయితగానే గుర్తించుకోదలిచాను. నిజమే కదా మరి ప్రధాన స్రవంతి  రచయితలంటే ఎవరు ?మొన్న మాట్లాడినప్పుడు సత్యవతి గారు నవ్వుతూ ''ప్రభువులు మెచ్చిన వారు ప్రధాన స్రవంతి వారు ''అన్నారు .  అది నూటికి   మున్నూరు శాతం నిజం .

సత్యవతి గారు మరిన్ని స్పూర్తిదాయకమైన కథలు రాయాలి .ఎందుకు రాయాలని నేను పడ్డ దిగులుకి ఇది నేనే ఇచ్చుకున్న సమాధానం .ఎందుకు రాయాలంటే పదిమందికి స్పూర్తినివ్వడానికి రాయాలి .మిగిలిన వారికంటే  రచయితలకి సమాజం మరింత స్పష్టం గా అర్థమవుతుంది కనుక రాయాలి .

వోల్గా గారి రచనలు నాకు మొదట పరిచయమైన స్త్రీవాద రచనలు . ''స్త్రీ వాద రాజకీయ చెైతన్యాన్ని సాహిత్యం రూపంలో అందించడానికి కథారచనను ఒక మార్గంగా ఎంచుకున్నాను''అని ప్రకటించినందుకూ , ఆ దిశగా వీలయినంత  మేరా ప్రయాణమూ జరిపినందుకు వోల్గా గారంటే నాకు చాలా ఇష్టం .
 
ఇక్కడ  ,టీవీ 9 బుక్ పాయింట్ లో వారిరువురూ ఇచ్చిన ఇంటర్వ్యు ల లింక్ లు ఇచ్చాను తప్పక  చూడండి,,,చదవండి.



 
.




పీఎస్ :అయితే నాకు కామెంట్ పెట్టిన భూషనాన్ని ఆ స్త్రీవాద రచయిత్రి ఏమన్నారంటే ''వారు భూషణం కారు బీరువా:) ''[పిరికి ] ...అని ఆపకుండా ఐదు నిమిషాలు నవ్వారు.

2 comments:

శ్యామలీయం said...

నేను కవిని గాని, రచయితను గాని కాను కాబట్టి నా అభిప్రాయాలకు యెంత విలువా సాధికారతా ఆపాదించబడతాయో నాకు తెలియదు. కాని చెప్పాలనిపించిన విషయాలు చెబుతున్నాను.

సాహిత్యకారులు తమని తాము వర్గాలుగా విభజించుకోవటమో లేదా యెవరన్నా వర్గీకరణలు చేస్తుంటే ఆమోదించటమో సరయినది కాదు. ఒక వేళ అటువంటి వర్గీకరణల వలన యేమయినా ప్రయోజనాలు కనిపించినా సరే! దీర్ఘకాలంలో యెటువంటి వర్గీకరణం అయినా సాహిత్యకారులకీ సమాజానికీ కూడా బాగా చెరుపు చేస్తుంది కాబట్టి. సాహిత్యం ఇలా ఉండాలని నిర్వచింఛటం అశాస్త్రీయం. అలాగే సాహిత్యకారులు యేవోవో నిబద్ధతాశృంఖలాలలో తమనితాము బంధించుకోవటమో, విమర్శకులయ్యేది వేరే వాళ్ళయ్యేది తమని అలా బంధించనీయటమో వాంఛనీయం కాదు. సాహిత్యకారులు యదార్ధవాదులు అంటే సత్యవాదులు. సమాజానికి అభిలషణీయమైన విషయాలను ప్రబోధించేవారు. అందుచేత వాదాల లేదా ఇజాలలో ఇరుక్కోకుండా వాళ్ళు తమపని తాము నిర్భయంగా చేసుకుపోవలసినదే. సాహిత్యంలో ప్రధానం అప్రధానం అంటూ యేమీ ఉండదు. సాహిత్యం అంతా ప్రధానమే.

అన్నింటకన్నా ప్రమాదమైనది సాహిత్యకారులకు యేకారణంగా ఆత్మన్యూనత కలగటం. అప్పుడు వాళ్ళు సమాజానికి తప్పుడు సంకేతాలిచ్చే రచనలు చేసే ప్రమాదమూ, వారికి కల ప్రతిష్ట వలన అదికూడా ఆమోదించబడి గందరగోళానికి దారితీయటమూ జరగుతుంది కనుక.

ఆత్మవిశ్వాసంతో మీరు హితకారి అనుకున్న విషయం సమాజానికి చెప్పండి. సహ + హితమ్ = సాహిర్యం.

స్వస్తి.

సామాన్య said...

మీ వ్యాఖ్యానం చాలా సాదికారికం గా ఉంది.ఏ మాటా తోసి,తీసి వేయదగ్గది కాదు.

ఈ హెచ్చు తగ్గుల సమాజం మనుషుల్ని బలవంతంగా ఏదో వైపుకు నెట్టి వేస్తుంది.వర్గం మాత్రమే సత్యమనుకున్న శివ సాగర్ ని కులం వైపుకు నేట్టినట్లూ ,ఓల్గా ని స్త్రీల వైపుకు నేట్టినట్లూ .మనమేదీ కాదనుకున్నా అవసరంలో మన వైపు నిలబడేది ఆ మన వాళ్ళు మాత్రమే అవుతున్నారు.ఒకానొక సందిగ్ద కాలం లో వున్నాం బహుశా మనమిప్పుడు .ఏమైనా థాంక్ యు అండీ .