''నవ్య '' వీక్లీలో నా కథ పుష్ప వర్ణ మాసం వచ్చింది .పాటకుల విద్వత్తుపై పై నాకు అపారమైన గౌరవం వుంటుంది.అందుకే ఈ కథ గురించి నాలుగు వాక్యాలు రాయాలనిపించినా రాయడం లేదు. ''మేజిక్ రియలిజం '' ''సింబాలిజం '' ''ఎలోగరి ''...వంటి ప్రయోగాత్మక రచనలంటే నాకు చాలా ఇష్టం .అట్లా ఈ కథ నేను చేసిన ప్రయోగం .చాలా కాలం క్రితం ''చెవులు''అని నే.బు.ట్ర వాళ్ళు వేసిన ఒక నవల చదివాను.అదో అద్బుతం .అట్లాన్టివే మరి కొన్ని.తెలుగులో వీ .చంద్ర శేఖర్ రావు గారూ,మునిపల్లె రాజు గారూ ,పతంజలి గారూ ఈ తరహా ప్రయోగాలు చేసారు .పతంజలి గారినయితే ,,అబ్బ...! చదివితే మరిచిపోగలమా మరుజన్మకైనా ..ఎంత అద్బుతమైన కథలూ అవి!! .అట్లా రాయగలిగితే ,,ఒక్క కథ రాస్తే చాలదా ...రాసేసి, చాల్లే ఇక అని చచ్చి పోవచ్చు.
About
Wednesday, 13 June 2012
పుష్పవర్ణ మాసం !!!

Subscribe to:
Post Comments (Atom)
9 comments:
సామాన్య గారూ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. కథనం చాలా చాలా బావుంది.
జ్యోతిర్మయి గారు చాలా రోజుల తరువాత కనిపించారు.థాంక్ యు వెరీ మచ్ ...
సామాన్య గారు.. కథ లో చాలా అద్భుతమైన వర్ణన.
జొన్నవాడ కామాక్షి తాయి సన్నిధిలో ఎందఱో దెయ్యం పట్టినట్లు ప్రవర్తించే వాళ్ళని చూసాను.
రకరకాల మానసిక వ్యాదులతో బాధ పడేవారిని దెయ్యం పట్టిందని భావించడం హేతువాదులకు నచ్చని విషయం.సున్నిత హృదయులకీ ప్రకృతీ లోని అన్ని బాషలు తెలుస్తాయి అంటారు. వీణాధరి కూడా తన జేవితంలోని అసంతృప్తులతో అయిష్టంగా బ్రతుకుతూ తనకి నచ్చిన ఎవరో..ఒక పూర్ణ పురుషుడు కోసం ఊహిస్తూ అందరికి కనబడని ప్రకృతీ తో,అతనితో మాట్లాడుతున్నట్లు భ్రమపడటం..ఓ..కావ్యం చదివిన అనుభూతి కల్గింది. ఎన్ని సార్లు చదివానో! కథా గమనం చాలా చాలా బాగుంది.
అన్నిటికన్నా,," ఏనుగుని మావటి మచ్చిక చేసుకునే బాష మన చేతలలో,మన ప్రవర్తన లలో నుండి అనురాగ భావనలు గ్రహించుకుంటాయి".
ప్రేమ బాష ఇది అని చెప్పడం నాకు చాలా బాగా నచ్చింది.
పుష్పవర్ణ మాసం.. ఎంత ఆహ్లాదంగా ఉంది.అద్భుతంగా ఉంది. సున్నితంగా ఉంది. ఓ..స్త్రీ మనసులా..
ఒక విషయం చాలా సత్యమే అయినప్పటికీ సత్యాన్ని సత్యమని ఒప్పుకోడానికి కూడా హృదయ వైశాల్యం అవసరమట .అట్లాగే సాహిత్యం కూడా . ఈ కథని అర్థం చేసుకోడానికీ బుద్దీ హృదయమూ రెండూ అవసరం ....వనజ గారు ,నేను ఏం చెప్పాలనుకున్నానో మీరు ఈ పాటికి అర్థం చేసేసుకుని వుంటారు.[ముఖ స్తుతి తగదట కదా :) ] థాంక్ యు వేరి మచ్ .
magic realism,allegories lantivi vyaktigatam ga naaku ruchinchavu...oka sandrasundaramayina ,indriyateetamayina premakatha ga nenu ee kathani teesukuntunnanu..malli malli naa lopaliki..
మైథిలి గారు
''సాంద్ర సుందరమైన ,ఇంద్రియాతీత మైన ప్రేమ కథ ''అన్న మీ వ్యాఖ్య గొప్పగా వుంది .
కానీ నాకు కథని రక రకాలుగా చదువుకోవడం ఇష్టం .''లేక్ హౌస్''మూవీ చూసారా ?ఊరికే అడిగాలెండి.అదంటే నాకు చాలా ఇష్టం. ఆరోజు చెప్ప లేదు కదా మీతో మాట్లాడటం నాకు నచ్చింది.మీరు నా బ్లాగ్ లో ప్రతి పోస్ట్ చదివి వుండటం ఆశ్చర్య పరచింది. సాంత్వన మెయిల్ నాకింకా రాలేదు .అలిగానని చెప్పండి.
avunandi...a story can be read in mamy planes and through so many facets..idi kevalam naa viyaktika bhavana(naadayina anubhuti naadigaana..)meekosam telugu lipi download chesukovaali..ippatiki manninchandi.santwana siggupadipoyindi mail cheyataniki!!:)lake house movie chustanu tappakunda..(i have a son who is well-versed in the world cinema..)
తెలుగు కోసం జి మెయిల్ లో చూడండి ట్రాన్స్ లిటరేటర్ వుంది .పోతే నా కోసం అయితే వద్దు మైథిలి గారూ .నాకు ఇబ్బందేం లేదు .
కథ చాల బాగుంది అండి. Thank you, for the nice story.
Post a Comment