మీబ్లాగ్ చదువుతున్నప్పుడు మీ వ్యక్తిత్వం నచ్చింది.మీరు సామాన్యకిరణ్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న పనులు నచ్చాయి.నాలా అది చెయ్యాలి,ఇది చెయ్యాలి అని కలలు కంటూ సమయం వృథా చేయకుండా సామాన్య గారు తను అనుకున్నది చేస్తున్నారు అని చాలా సంతోషం వేసింది.కిరణ్ గారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు కూడా నమ్మబుద్ది కాలేదు.ఎందుకంటే మీరు కిరణ్ గారి గురించి రాసినవి చదివాను కనుక,మీ నిజాయితీ మీద నమ్మకం వుంది కనుక.
ఎన్నికలు వచ్చేసాయి మీరు ఒక పార్టీ తరపున ఎం.పి గా పోటిచేస్తున్నారని చదివా. మనసు చివుక్కుమంది మీరు ఎంచుకున్న పార్టీని చూసి(నేను ఏ పార్టీ అభిమానిని కాదండి.).కానీ మీరు ఎన్నుకున్న పార్టీ గెలవడానికి ఎంత డబ్బు ఖర్చుపెడుతోందో చూస్తూనే ఉన్నా.ఇవన్ని పేపర్లలో చదివి తెలుసుకున్నవి కాదండి.నాకు బాగా తెలిసిన వ్యక్తులు మీ పార్టీ తరపునే ఎన్నికల్లో నిలబడ్డారు.వాళ్ళ ద్వారానే తెలిసింది ఒక్కొక్క అభ్యర్థి ఎంత డబ్బు ఖర్చుపెట్టాలో.మీరు కూడా ఇలా డబ్బులిచ్చి ప్రలోభ పరుస్తారన్న ఊహే అసహ్యంగా వుంది.ఎన్ని రాసారండి బ్లాగుల్లో నిజాయితీ గురించి.ఈరోజు యు ట్యూబ్‌లో ఎదో వీడియోలో మీరు మాట్లాడుతుంటే చూసాను.మీరు ఏమి చేస్తారు అంటే అన్నీ మా మనిఫెస్టోలో చెప్పేశాం.రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు,జగన్ రెడ్డి ధైర్యం,నిర్భయత్వం చూసి ఓటెయ్యాలంటున్నారు.
ఏవి అండి సంక్షేమ పథకాలు అన్ని ఫ్రీ గా ఇవ్వడమా?మీకు ఇవి నచ్చే మీరు ఆ పార్టీలో చేరారా?
గెలవడానికి విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెడుతోంది కదండి మీ పార్టీ?ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందండి?మీరు,మీ నాయకులు కష్టపడి సంపాదిస్తే వచ్చిందా?గెలవడానికి వేసే మొదటి అడుగే బురదలో వేస్తుంటే బురద కడుక్కునేదెప్పుడు?జనాలకు ఏమి చెయ్యక్కరేదండి ముందు మీరు బ్లాగుల్లో రాసిన నిజాయితీ మీలోనూ,మీపార్టీలోనూ ఉందేమో చూసుకోండి.
అయినా కేవలం మీ బ్లాగు రాతలు చదివి మీరు నిజాయితీకి నిలువెత్తు దర్పణం అని వెఱ్ఱిగా నమ్మిన నాది తప్పు,ఇందులో మీ తప్పేమీ లేదండి.
బ్లాగులు ఎందుకు చదవకూడదో అనుభవపూర్వకంగా తెలిసేలా చేసారు. ధన్యవాదాలండి.
2 comments:
సామాన్య గారు,

బ్లాగులు ఎందుకు చదవకూడదో అనుభవపూర్వకంగా తెలిసేలా చేసారు.
ధన్యవాదాలండి.
స్నేహ
very beautiful..thanks for sharing!
Post a Comment