About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 10 November 2014

కొన్ని అబద్దాలు - అందమైన పాటలు ... శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్


ఒక తెల్లని క్రిస్టియన్ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం బ్రాహ్మడినని అబద్దం చెబుతాడు . ఇంటిగలవారి అమ్మాయి కామోసనుకొని ప్రేమిస్తుంది . అది తెలిసి అబ్బాయి వుద్యోగం వదిలేసి వెళిపోవాలనుకుంటాడు . కథ అలా అలా అందమైన పాటలతో మలుపులు తిరిగి అమ్మాయి తండ్రి కూడా అదే బాపతు అనే ఫినిషింగ్ టచ్ తో సుఖాంతమవుతుంది .

అమ్మాయి తండ్రి బ్రాహ్మడే అయి వుంటే సినిమా అభ్యుదయ కేటగిరీలోకి వెళ్లి వుండేది . అలా కాకుండా సినిమాటిక్ గా వున్నా తప్పనిసరి అబద్దం లోకి నెట్టిన ప్రపంచ నైజాన్ని సున్నితంగా చెప్పి కొత్తదనాన్ని నిలుపుకుంది .

పాటలు ఆణిముత్యాలు . ఎన్ని ఏళ్ళు గడిఛి పోయినా ఈ పాటల సుగంధం ఆవిరి కాదు . నాకు ఈ ''రాకోయి ''పాట చాలా ఇష్టం . ఎన్నో సార్లు వెదికాను షేర్ చేద్దామని . ఇప్పుడు దొరికింది .

సినిమాని పాటలకోసమే కాదు imdb లో ఎవరో రాసారు జయప్రద గురించి absolutely bewitching అని అది అక్షరాలా నిజం . ఆవిడ అందం తో ఈ  సినిమా వెలిగిపోతుంటుంది . ఆ అందం కోసం కళ్లార్పకుండా  మూవీ చూడొచ్చు.  

4 comments:

కమనీయం said...




ఈ అందమైన పాట కృష్ణశాస్త్రిగారు రాసింది.ఆయన టచ్ ఇందులో కనిపిస్తుంది.

లక్ష్మీ'స్ మయూఖ said...

ఎంత చక్కటి పాటండి.ఇలాంటి సాహిత్యం ఈ రోజుల్లో వినాలనుకోవడం ఎడారిలో నీటి చెలమల కోసం వెతుకుతున్నట్లే.

సామాన్య said...

@kamaneeyam
Avunandee ... Yentha maadhryamo paatalonoo Susheela gaari swaramlonoo anduke chirasthaayini pondindee paata.
Thank you



సామాన్య said...

@swarjya Lakshmi gaaru
avunandee intha chikkati saahithyam manakippudu Karuve.thank you.