అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నఆదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
అనగనగనగా.... చాలా కాలం క్రితం చాలా దూరంలో ఒక సముద్రముండేది .ఆ సముద్రంలో చాలా రాజ్యాలుండేవి. చేపల రాజ్యం,తాబేళ్ల రాజ్యం,పీతల రాజ్యం ఇట్లా .ఇది పీతల రాజ్యంలో జరిగిన కథ .ఆ రోజు పైన ఆకాశం చాలా ముసురు పట్టి ఉంది.రాత్రిరావాల్సిన పౌర్ణమి చంద్రుడు ముఖం చాటేసుకుని ఎటో వెళ్లి పోయాడు .వద్దన్నా కాల్చే కర్కోటకుడు సూర్యుడు మంచాన పడ్డట్టున్నాడు. సమస్త భాద్యతలు తనే తీసుకుని వానల దేవుడు కుండపోతగా కురుస్తున్నాడు .సముద్రంఅలలు అలలుగా ఉంది .అస్థిమితంగా ఉంది .పరమ చిరాగ్గా ఆటూ పోటు ఔతుంది. అటువంటి రోజు,అటువంటి వానలో పీతల రాజ్యంలో రాజ భవనం ముందు పేదపీతల గుంపు ఒకటి రాజుకు వ్యతిరేఖంగా నినాదాలు చేస్తుంది .నినాదాలు రాజ భవనం గోడ గోడని తగిలి తిరిగి తిరిగి ప్రతి ధ్వనిస్తున్నాయి .
పీత పలికినఆమాటలు విని జాలరి స్త్రీ అది సరే,మొదట నీకొచ్చిన అంత పెద్దకష్టమేమిటో చెప్పు అన్నది .ఇంతకీ ఆ పీత మేధావీ బహు భాషా కోవిదురాలు అయిన రాకుమారి పీత కదా,ఆమెలో ఉన్నది రాచ రక్తం కదా అంచేత ఒక నీచ జాలరి స్త్రీకితన దీన గాద వినిపించడానికి ఇష్ట పడక కాసేపు ఊరుకొని నా కథ తరువాత ముందు నువ్వెందుకేడుస్తున్నావోఅది చెప్పు అంది .అంత బాధలోను తన గురించితెలుసుకోవాలనుకుంటున్న ఆ పీత ఆసక్తి గమనించి జాలరి స్త్రీ అది ఆడ పీత అని కని పెట్టేసింది .
మళ్లీఒక సారి ముక్కు చీది రాముడనే రాజు సముద్రంపై వారధి కట్టి ,లంక రాజు ని చంపి,వాడు దొంగిలించి తీసుకెళ్ళిన తన భార్యని జయించి తీసుకొచ్చాడు. అదంతా పెద్ద కథలే .అంత చేసిన ఆ రాముడు ఎవడో ఒక వెధవ ఏదో అన్నాడని ఆ సీతమ్మ తల్లిని అనుమానించాడమ్మా,తన భార్య సత్యం తనకు తెలీదా లోకం కోసమా భార్య .ఇది భరించలేక ఆ తల్లి ఇవాళ భూమిలో కలిసి పోయింది అని చెప్పింది మళ్లీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ .
పీత మద్య ఆ స్త్రీ మద్య ఒక నీరవ నిశ్శబ్దం అలుముకున్నది .జాలరి స్త్రీయే ఆ నిశ్శబ్దాన్ని మొదట బగ్నం చేస్తూ,ఇంతకూ నీకొచ్చిన కష్టమేంది పీతమ్మాఅని అడిగింది
అప్పుడు పీతరాకుమారి నిట్టూర్చి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా "అని తన కథ చెప్పడం మొదలు పెట్టింది .జాలరి స్త్రీ జాలి జాలిగా పీత చెప్పిన అతి పాత కధే ,అందరికీతెలిసిందే,మళ్లీ ఓపిగ్గావిని కొత్తగా తెలుసుకున్న ఆ పీతను చూసి జాలి పడి చేతిలోకి తీసుకుని పీతమ్మాఅందుకే ఆడ పుటక పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలన్నది. ఈ కష్టం నీ ఒక్క దానిదే కాదు ఆడ జాతి మొత్తానిది .నువ్వు కొత్తగా పడుతున్నావు నేను పడి కొట్టుకుని లేచాను,నీ కడుపున కూడా రెండో మూడో కాయలు కాస్తే వాళ్ళను చూసుకుంటూ అంతా మరచి పోతావు అయినా కట్టుకున్న భార్యల్నివదిలి వీళ్ళు ఎక్కడికి పోతారు,తిరిగి తిరిగి ఆఖరాకి మన దగ్గరికేవస్తారు అన్నది .
అది విని 'వృద్ద పురుషః పత్నీ వ్రతః'కాబోలనుకుంది విద్యావతి ఐన రాకుమారి పీత .ఐనా కాలూచేయి ఆడని మగ వాడు కొంగు పట్టుకు తిరిగితేఏంటి కాలు పట్టుకు తిరిగితే ఏంటిఅని ఆ తుచ్చ జాలరి స్త్రీతో చర్చించడానికి దానికి మనసొప్పలేదు .మళ్లీఆ జాలరి స్త్రీయే మౌనాన్ని చేదిస్తూ పీతనిప్రేమగా నిమిరి వెళ్లమ్మావెళ్ళు చచ్చి మాత్రంసాధించేదేముంది, ,గుండె దిటవు చేసుకుని కాపురం చెయ్యమ్మా,మనకింకో గతి లేదు అంది .అని పీతనినెమ్మదిగా సముద్రం లోకి వదిలేసింది .
************************
జాలరామే మొగుడు తిరిగొచ్చి మెదలకుండా కూర్చున్న పెళ్ళాన్ని అడిగాడు ఏందే అట్టా తుమ్మల్లో పొద్దు గూకినట్టు మొకం పెట్టుక్కూచున్నావ్,ఇప్పుడేం కొంప మునిగింది అని .అప్పుడా జాలరి స్త్రీ భర్తతో "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవా "అనిపీత కథ చెప్పింది .
సాయంత్రం చేపలాయనవ్యాపారికి చేపలమ్ముతున్నాడు .సొమ్ము ముట్టిన సంతోషం లేని జాలరి ముఖాన్ని చూసి వ్యాపారిఒక వరహాఅటో ఇటో అవుద్ది దానికే మొహమట్టా పెడితే ఎట్టాఅన్నాడు .అప్పుడా జాలరి "సీత కష్టాలు సీతకుంటే పీత కష్టాలు పీతకుండవాఅని సముద్రం మీద తన కష్టాలను వ్యాపారికి ఏకరువు పెట్టడం మొదలు పెట్టాడు .అదే మాట వ్యాపారి చేపలు కొన్న ఇంటామెతో అన్నాడు .ఇంటామె భర్తతో అన్నది. భర్త ఇంకోరితో అన్నాడు.అట్లా సామెత ప్రపంచంలో స్తిర పడింది.
నేను సిస్టం ముందు కూర్చుని మంజుల ఫోటో వెతుక్కుంటూ వుంటే కందగడ్డ లాంటి దాన్ని పటుకొచ్చి ఇది తింటారా మీరు అని అడిగింది మంజుల .బెంగాలీలు గుమ్మడి కాయని ,గుమ్మడి ఆకునీ రెంటినీ సమ దృష్టితో చూస్తారు .అందుకని ఆ తెచ్చిన పదార్థమేమిటో అర్థం కాకున్నా బెంగాల్ లో బెంగాలీ లాగే వుండాలి అనే సత్యాన్ని అనుసరించి తల గట్టిగా ఊచి అన్నీ తింటాం ఏదైనా తింటాం అన్నాను.నా మాటవిని మంజు పగలబడి నవ్వుతూ వంట ఇంట్లోకి వెళ్ళింది .అందులో నవ్వోచ్చేందుకు ఏముందీ అనుకుంటున్నారా ...మా మంజూకి ప్రతి దానికీ నవ్వొస్తుంది.కొంచెం దీర్ఘం తీసి ఆ..అన్నా ,చాలా పొట్టిగా ఊ ... అన్నా పుసుక్కుమని నవ్వొస్తుంది.ముద్దొచ్చే ముఖాన్ని సాగ దీసి ,నోట్లో పాన్ ని బుగ్గలోపలికి నెట్టి పగలబడి నవ్వుతుంది.
మేమీ ఊరికి రాగానే నా కుక్కల్ని ,మా వంట సామాన్లనీ చూసి ,అదివరకే ఉన్న వంట మగాడు కాలికి బుద్ది చెప్పేసాడు.అసలు విషయం ఏంటంటే మంత్రగాడిని అంత దూరంలోనే కనిపెట్టేసి దయ్యాలు దడుచుకున్నట్టు నన్ను చూడగానే మగ మానవులు బతికుంటే బలుసాకు తిందాం అని భావిస్తారు.నిలిచి ఉన్న వారు పురుషులందు పుణ్య పురుషులు.
సరే అప్పుడిక వంటమనిషిని వెతకడం మొదలెట్టారు.ఎవరూ నచ్చందే ..,!అప్పుడు మా మంజూ వచ్చింది.ఎంచక్కా ఐడడుగులా నాలుగంగుళాల ఎత్తు ,నోటి నిండా నవ్వు .చూడగానే బెంగాలీల ''మా దుర్గా ''ని చూసినట్టు తోచి అంత వరకూ ప్రొఫెషనల్ కుక్ కావాలని అంటున్న దాన్ని ,సరే ఈ నవ్వులని కొంచెం అరువు పుచ్చుకుందాం అనుకుని మరో మాటేమీ లేకుండా పనిలోకి వచ్చెయ్ మన్నాను .
నిజానికి మా మంజు వంటేం బాగా చెయ్యదు .ఎప్పుడైనా ఒక రోజు బాగా చెయ్యలేదు అనో ,వంట ఇల్లేమిటి ఇలా ఉందనో అన్నామనుకోండి ,అలిగి ఆ రోజు పనికి ఎగనామం కూడా పెట్టేస్తుంది.మళ్ళీ మనం సవర దీసి బుజ్జగించడానికి ఎవర్నో ఒకర్ని ఎదురుకోలు పంపించాలి.అయినా వంటదేముందిలెండి నాలిక దాటితే నరకం .నవ్వులు ముఖ్యం... కదా ?
అంత నవ్వుతుందా మొన్న ఒక రోజు మా మంజు ఏడ్చింది .అనిత లాగా కాదులెండి ,నవ్వులమారిది కదా ...కళ్లలో నుండి దూక బోయిన కన్నీటిని కంటిరెప్పలోనే ఉప్పుపాతరేసేసింది.
ఆ కుసింత ఏడుపైనా ఎందుకంటారా ?ఎందుకంటె మంజుకి ముగ్గురు కూతుర్లు .కొడుకు పుడతాడని ఆశ పడి కంటూ పోమ్మన్నాట్ట వాళ్ళాయన .అట్లా పంప ,జంప ,టుంప పుట్టారుట .పంప అంటే సరే నది పేరు ..మిగిలిన పేర్లకి అర్థమేమిటి మంజూ అంటే ''ఏమ్ని''అని నవ్వింది.అంటే ఊరికే అట్లా పేర్లు అంతే అని అర్థం .
పెన్సిలు మూడు రూపాయలు రబట్ [ఎరేసరు] మూడురూపాయలు ఇంకా నోడ్సులు సంచులూ టిఫిన్లూ ...అమ్మా అది కావాలి ,అమ్మ ఇది కావాలి అని పిల్లలు దెయ్యాల్ల మీద పడుతారట .పడుకునే మంచం దగ్గరి నుండీ తినే కంచం వరకూ పొద్దున్న లేచిన దగ్గర నుండీ కీచులాడుతూ వుంటారట .ఇంటి కెళ్తే క్షణం మనశ్శాంతి ఉండదట.పిల్లలు రాక్షసులేనట .ఉండాలే గానీ రోజుకి రెండొందల రూపాయలు రెక్కలు కట్టుకుని యెగిరి పోతాయట.మగడు ఒక రోజు పని చేసి ఒంద రోజులు రెస్టు తీసుకున్టాట్ట. ఒక్కోసారి ఇంట్లోనుండి పారిపోవాలనిపిస్తుందట .ఎందుకీ పిల్లలు అనిపించేస్తుందట ....
''పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ ''... కదా ?ఆ మాట చాలా మంది మగ పుంగ(క)వులు పాటలుగా నాటకాలుగా ..గట్రా గట్రాలుగా...రాసారు కదా .మరి అమ్మై ఉండి మంజూ ఏంటి ఇట్లా అంటుంది ?మాతృత్వం తీయనైందని మంజు ఇంట్లో మగవాళ్ళు చెప్పలేదా .చెప్పినా మంజు ప్రాక్టికల్ గా ఆ మాట తప్పని తెలుసుకున్నట్టుంది. .బహుశా ఈ తీపి మాతృత్వం కడుపునిండిన వాళ్లకి ,మగ వాళ్ళ కి మాత్రమే తీపిగా తగిలేట్టుంది.
అవునంటారా...కాదంటారా ?
కానీ శత దీర్ఘంగా చింతించి నేనోటి కనిపెట్టా.. ఏంటంటే మాతృత్వం ,అమ్మతనం రెండూ వేర్వేరు. మాతృత్వం స్త్రీకి శాపం అమ్మతనం మనిషికి దేవుడిచ్చిన వరం.నా కొటేషన్ లో చెప్పాలంటే ''మాతృత్వం తీపిది కాదు.కానీ అమ్మ దేవత .ఎందుకంటె అమ్మ స్త్రీ కదా''
''మగవాడితో నిమిత్తం లేకుండా ఆడది ఈ ప్రపంచంలో ఏ పనైనా చేయగలదు;పిల్లలను కనడం తప్ప ,మరే పనైనా చేయగలదు.ఇక పిల్లల విషయానికొస్తే -బుద్దుందే ఆడదెవతీ సంతానం కోరుకోదు ''-మార్గరెట్ మిచ్చెల్...గాన్ విత్ ది విండ్ నుండి .
{మార్గరెట్ ఈ మాటలు చదివి నిజానికి నేను షాక్ తిన్నాను .ఏంటంటే ఆడవాళ్ళందరూ ఇట్లా అనేసుకున్నారనుకోండి అప్పుడు నా లాగా బంగారు తల్లుల్లాటి ఆడపిల్లలికి కూడా అమ్మల్లేకుండా పోతారు కదా అని.}
ఈ మూవీ అంటేనాకు బాగా ఇష్టం .టీన్ రొమాంటిక్ కామెడి మూవీ కనుక పెద్ద తరహాలో ఇష్టపడకుండా వుండాల్సింది నిజానికి .కానీ, బాగా ఇష్టం వేసేసింది .ఎందుకబ్బా అట్లా అనుకుంటే ఇది Shakespeare ''The Taming of the Shrew''కి ఆధునిక రూపం అని తెలియ వచ్చింది .అప్పుడిక ,అది కదా సంగతి అని సంతోష పడి పోయి నిరభ్యంతరంగా నాలుగైదు సార్లు చూసి తరించడం జరిగింది.
ఇందులోని"Can't Take My Eyes Off You" అనే పాటకు కు ''అయాం వెరీ సారీ అంటున్నా ఒందో సారి''అని తెలుగు రూపాన్ని ఇచ్చాడు మన త్రివిక్రమ్ .డిట్టో... డిట్టోగా .
అట్లాగే Cheap Trick రాక్ బ్యాండ్ వారి బిగ్గెస్ట్ హిట్ '' "I Want You to Want Me"కూడా ఈ మూవీలో వినొచ్చు .
ఈ మూవీ హీరో హీత్ లేడ్జర్ .మంచి నటుడు.నవ్వు చాలా బాగుంటుంది .మొదటి సారి హీత్ ను ''The Patriot''మూవీ లో చూసాను .దురదృష్టం ఆ పిల్లాడు 29 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు.
ఈ పోయెం పేరే సినిమాది కూడా .నాకెంత ద్వేషమో నువ్వంటే అంటూ ఎంత ఇష్టమో పదం పదం లోనూ చెప్తుంది నాయిక . చూడండి.