About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday, 7 March 2012

''శ్రీ కృష్ణుడు ........కూడా స్నేహం కడతాడా అండీ...''?-మధుర వాణి .



1.
స్త్రీ పురుషులు ఒకరికొకరు అలవాటు పడకూడదు
2.
ఒకరికొకరు తిండికి కానీ , డబ్బుకు గానీ ,సౌఖ్యానికి గానీ ,మోక్షానికి గానీ ,చివరికి ఆనందానికి గానీ ,ఆధారంగా [ఇన్స్ట్రు మెంట్స్ గా ]చూసుకోకూడదు ..తమ జీవితంలో గొప్ప ఐడియల్[ఆదర్శం]రెండో వారిని ప్రేమించడం గానే చూసుకోవాలి.-చలం స్త్రీ
దేశం లో మార్పులు చోటు చేసుకోవాలంటే కేవలం మొగ వారిపై ఆధార పడితే ప్రయోజనం లేదనే సత్యాన్ని
మహిళలు గ్రహించాలి.తమ కోసం పురుషులేమీ చేయరనీ తమకు తామే ఉద్యమాల్లో ముందుండాలనీ వారు అర్థం చేసుకోవాలి మహిళలు మొదట తమ తమ తల్లి దండ్రుల నుండీ ,భర్తల నుండీ ఆస్తి హక్కు
సంపాదించుకునేందుకు
ఉద్యమించాలి.-పెరియార్ ,స్త్రీ ఎందుకు బానిసయింది

మధుర వాణి:వేశ్యలను పాటకు పిలవక పోతే ,వాళ్లు బతకడం ఎలాగండీ?
సౌజన్యా రావు పంతులు :పెళ్లి చేసుకుంటే సరి.
మధు:గిరీశం లాటి వారిననా తమ అభిప్రాయం?
సౌజ:ఏమి మాటన్నారు!రేపో ,నేడో ఆయన ఒక పవిత్రమైన వితంతువుకు పెళ్లి కానై వున్నారు కదా ,వేశ్యనా పెళ్లాడుతారు?
మధు:అయితే పెళ్లి చేసుకోగోరిన వేశ్యలకు కోరతగిన వరులు దొరకడం ఎలాగండీ ?లేక యెట్టి వారైనా సరే అని తమరి , అభిప్రాయమా అండీ?
సౌజ: సంగతి ఇంకా నేను బాగా ఆలోచించలేదు .వేశ్యలు విద్యలు నేర్చి ఇతర వృత్తుల వల్ల సత్కాలక్షేపం చెయ్యరాదా?
మధు :అట్లా చేస్తే తమ వంటి వారు వివాహమౌదురా?
సౌజ:ఏం ప్రశ్న?నేను ఎన్నడూ వేశ్యను పెళ్లాడను.నా ఎత్తు ధనం పోస్తేనూ వేశ్యను ముట్టను.
మధు:వేశ్య జాతి చెడ్డ కావచ్చును .కానీ తాము సెలవిచ్చినట్లు ,చెడ్డలో మంచి ఉండకూడదా?మంచి ఎక్కడున్నా గ్రాహ్యం కాదా అండి?
గురజాడ,కన్యా శుల్కం
ఇష్టమైన వాళ్ళే ఉద్యోగాలు చేయండి .లేని వాళ్లు గృహ నిర్వహణే చేసుకోండి .ఇంటి పని కూడా బయటి వుద్యోగాలకన్నా తక్కువది కాదు అని మీరు మొగ వాళ్లకి చెబుతారా?-రంగనాయకమ్మ 'విమల'స్వీట్ హోమ్
మగాడికీ ఆడదానికీ పెంపకం లో ఉన్న తేడా వల్లనే కదుటే ఆడదాని బ్రతుకు 'బోన్సాయ్ 'మాదిరి అయింది.-అబ్బూరి చాయా దేవి [తన మార్గం ]

మీకు తెలుసా నేను 'చందమామ' కోసం రాసిన కథలో పక్షుల లోకం నుంచి వచ్చిన రెక్కల పాపాయికి యోని ఉందా లేదా అన్న సంగతే రాయలేదు. పాప అయోనిజా ,అయోనా ?అన్న ప్రశ్నే రాలేదు -ఓల్గా .రాజకీయ కథలు


''
పాటం ఒప్ప చెప్పక పోతే పెళ్లి చేసేస్తాన''ని
పంతులు గారన్నప్పుడే భయమేసింది .
''
ఆఫీసులో నా మొగుడున్నాడు!అవసరమొచ్చినా సెలవివ్వడ''ని
అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది
''
వాడికేం?మగ మహారాజు''అని
ఆడా,మగా వాగినప్పుడే అర్థమై పోయింది-
''
పెళ్ళంటే'' ''పెద్ద శిక్ష ''అని
''
మొగుడంటే'' ''స్వేచ్చా బక్షకుడ''ని
మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
మమ్మల్ని విభజించి పాలిస్తుందని!-సావిత్రి,బంది పోట్లు
కొద్ది,కొద్దిగా జీవితాంతం పీక్కు తింటున్న
రాకాసిగద్ద వంటిల్లు
వంటింటి సంస్కృతి;వంటింటి ముచ్చట్లు
వంటలక్కలమైన మనం,మనం ఏమైనా మన అంతిమ కర్తవ్యం
'గరిట
తిప్పటం'గా చేసిన వంటిళ్ళను
ధ్వంసం చేద్దాం రండి!-విమల ,వంటిల్లు
ఎవరైతేనేం ?ధైర్యంగా నవ మాసాలు మోయాలనుకున్నప్పుడు
గుండె చప్పుడు కడుపులో వినిపించే
అద్భతాన్ని సొంతం చేసుకోవాలి
మన రక్త మాంసాల ఫలాల మీద
ఎవరి ఆధిక్యమూ వద్దు
వాళ్ళకే తెలియని అస్పష్ట బహిష్కరణల మధ్య
నేను యుగం ముందు నిలబడి
మాతృత్వాన్ని ఆవిష్కరిస్తున్నాను -మహె జబీన్ ,నవ స్మృతి
మహళ్ల పరదాల వెనుక
నేనింక నిలబడలేను
ఉక్కు సంకెళ్ళ లోంచి
బయట పడుతున్న దాన్ని !ఎంత క్రూరమైనా సరే
మతమూ ,తండ్రీ,మొగుడూ !-షాజహానా,దూత్కార్
ఏం చేత కాక -ఎలా ఆపాలో తెలియక
నిస్తేజంగా-ఉక్రోషంతో
'
వార' 'నీలి' ముద్రలతో
వ్యక్తిత్వపు హత్యకీ -దూషనకీ
చేతులు కలిపినా-గొంతులు కలిసినా
అదిరిపోతామనుకున్నారా?ఆడది శారీరక అవినీతి నుంచే ఎదిగిందనే మగ సంస్కారం
మాకు రామాయణమంత పాత -కుప్పిలి పద్మ ,నీలి మేఘాలు

నీకు పంచేందుకు రక్తం లేకే కదా
నిన్ను పెంచేందుకు తీరిక లేకే క్యడ
అనుమతి లేకుండా అస్తిత్వం పొందిన నీ నేరానికి
నా టెంపరరీ ఉద్యోగమూ,ఆరోగ్యమూ,నీకు మరణ శిక్షను ఖాయం చేస్తే
కడుపు చించుకుంటే మనసు గాయం అయ్యి ,కడివెడు కన్నీళ్ళ దుక్కంగానూ వుందిరా.
పాలింకి పోవడానికున్నట్లు
మనసింకి పోవడానికీ-మాత్రలుంటే ఎంత బావుండు!-పాటిబండ్ల రజని,అబార్షన్ స్టేట్మెంట్
ఇప్పుడు నేను
సమూహంలో ఏకాకిని
సూన్యపు రెక్కల కింద
పిల్లకాకినై ఒదిగి పోతుంటాను
ఒక్క అమ్మ మాత్రమె నన్ను మనిషిని చేసి
జీవిత రహదారిని చూపుతుంది-పుట్ల హేమలత ,జ్ఞాపకాల తెరలు.

మనం
పెళ్లి చేసుకున్నాం కాబట్టి మూడో వ్యక్తి మీద ఒక ఆకర్షణో లేదా ఇంకేవో మానసిక భౌతిక ఉద్వేగాలు ,అనుభూతులు కలగకుండా ఏదో రెడ్ లైట్ పడ్డట్లు ఆగిపోవు...అసలు ఫీలింగ్స్ కలగవు కలగ బోవు అని చెప్పడం ఎవరికి వారిని ,ఎదుటి వారిని మోసం చేయటమే అవుతుంది.-కల్పనారెంటాల ,తన్హాయి.


### మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ###

11 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

రచయిత్రుల మనోభావాలని వెల్లడిస్తూ..నవ్యత్వం తో..మీరు "మన కోసం " తెలిపిన శుభాకాంక్షలు ...కి
ధన్యవాదములు.
బాగున్నాయని అనలేను,తర తరాల బానిసత్వంలో..నుండి..సొంత గొంతుకతో.. ఆవేదనతో.. ఘోషించిన ... ఈ స్టేట్మెంట్లు స్టేట్ మేంట్ల్ గా ..మిగలకుండా ..పోరాటం సాగిద్దాం.

"అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. "

సామాన్య said...

థాంక్ యు వనజ గారు.'' తర తరాల బానిసత్వంలో..నుండి..సొంత గొంతుకతో.. ఆవేదనతో.. ఘోషించిన ... ఈ స్టేట్మెంట్లు స్టేట్ మేంట్ల్ గా ..మిగలకుండా ..పోరాటం సాగిద్దాం''. ...ఈ మాటలు సంతోషాన్నిచ్చాయి.

Anonymous said...

Why that Title for this post?

Dr.Pen said...

బావుంది.
కానీ నాణానికి మరో వైపు ఉంటుంది.
ఎంతకీ మాకెప్పుడు ఇస్తారు ఇంటర్వ్యూ???

విష్వక్సేనుడు said...

Really Greate post.
All the best andi

చిలమకూరు విజయమోహన్ said...

టపాకు,హెడ్డింగుకు ఏమైనా సంబంధముందా? ఆ హెడ్డింగు ఎందుకు పెట్టారో తెలియజేయగలరా?

సామాన్య said...

@అజ్ఞాత
@ చిలమకూరు విజయ మోహన్
అది కన్యా శుల్కంలో మధుర వాణి మాట .మధురవాణి అని పక్కనే రాశా కానీ శీర్షిక పెద్దదవుతుందని తీసేసాను.
టపాకి ఆ మాటకి చాలా సంబంధముంది .నాకు తటస్థ పడ్డమొదటి స్త్రీవాది గురజాడ మధురవాణి. తనకు తటస్థ పడ్డ ప్రతి స్త్రీతోనూ స్త్రీ అస్తిత్వ చైతన్యం లోంచి మాట్లాడుతుంది ఆమె ,ఆ స్త్రీ తనని అవమానించిన పూటకూళ్ళమ్మ అయినా సరే.అట్లాగే సంఘ సంస్కర్తలమనుకునే వారి డొల్ల తనాన్ని ,సౌజన్యా రావు పంతులుతో చేసిన సంభాషణలో చెప్తుంది [నేను కోట్ చేసిన సంభాషణ చూడండి]పంతులు వద్ద నుండి వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న భగవద్గీతని చేతిలోకి తీసుకుని 'ఇదేం పుస్తకం' అంటుంది.గిరీశం కి పనికి రాకపోతిని ,పంతులు గారు నిలువెత్తు ధనం పోసిన వేశ్యను పెండ్లాడనంటిరే మరి కృష్ణుడు మాత్రం ?ఆయన ఏంటీ నాచ్ కాదా ?వేశ్యలతో కూడా స్నేహం కడతాడా ?అంటుంది.ఆ మాట వెనుక చాలా వేదన ఉంది.వీలైతే బెంగుళూరు నాగ రత్నమ్మ పుస్తకం చదవండి.
కృతజ్ఞతలు .

సామాన్య said...

వినోద్ గారు ...కృతజ్ఞతలండీ !

సామాన్య said...

ఇస్మాయిల్ గారూ
నాణానికి మరో వైపు అనేది చాలా పాత మాట .ముస్లిముల పట్ల జరుగుతున్న వివక్ష పక్కన నించుని నాణానికి మరో వైపు చూడండి అనో,తెలంగాణా పోరాటం ముందు నించుని నాణానికి ఆవల వైపు చూడండనో అనడం వృధానేమో .ఆవలి వైపులూ ,మరో ప్రక్కలూ దాటి వచ్చిన ఉద్యమాలు కదా ఇవన్నీ...

Anonymous said...

అరబ్బు దేశాలలొ షరియా కింద బతుకుతున్న స్త్రీల హీన పరిస్తితి ప్రస్తావించండి, కొంత మందిలొనైనా మార్పు వస్తుందేమొ!.

తృష్ణ said...

ఇందరి అభిప్రాయాల సేకరణ బాగుంది..