About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday, 10 May 2012

మన్నం [సింధు] మాధురి - కాళావు


http://www.scribd.com/nnunna/d/85713150-Kallavu-Mannam-Sindhu-Madhuri-Story-The-Sunday-Indian


ఇవాళ పొద్దునే నాలుగు కథలు చదివాను.''కాళావు,బల్లకట్టు కవలమ్మ, డూగమ్మ ,తయ్య ''...ఈ కథలన్నీ రాసింది మాధురి .మాధురి  నాకెట్లా పరిచయమంటే నా 'మహిత'  కథ  వచ్చాక జూకంటి జగన్నాథం గారు నా కథ బాగుందని చెబుతూ మాధురి''కాళావు''కథ గురించి చెప్పారు.సండే ఇండియన్ లో వచ్చిన   ఈ కథ ఎలా  ఓపెన్ చెయ్యాలో  తెలీక నేను  చదవ లేక పోయాను .తరువాత మాధురీ''చంద్రకళ''కథ''పాలపిట్ట''లో ప్రచురితమయింది.కత్తి మహేష్ కుమార్ గారు ఫేస్ బుక్ లో పెడితే  చదివాను.మంచి కథ .మహేష్ గారు చెప్పినట్టే చలం ,కాసీ భట్ల వేణుగోపాల్ గార్ల కథలు గుర్తొచ్చాయి.

నేను కథలు రాయటం మొదలెట్టా క  నాకో మంచి సంస్కారం పరిచయమైంది.అది నేను అసలు ఊహించనిది.నా కథ ''కల్పన''రాగానే ,సాహితీ ప్రముఖులలో ముప్పాతిక మంది నాకు ఫోన్  చేసి బాగా రాశావమ్మా...అన్నారు.ఒకరికొకరు చెప్పుకుని నా కథలని చదివారు .కొత్త నీటిని తమలో ప్రేమగా కలుపుకున్నారు.వారి ఉదారత,ప్రోత్సాహమూ నన్ను చాలా సంతోష  పెట్టింది ..నన్ను వెయ్యి జన్మలకి  గాను ఋణ  పరచుకున్నారు .  నచ్చితే అట్లా హాయిగా ,ఉదారంగా,ఆప్యాయంగా  ,నిష్కల్మషంగా పలకరించాలని నాకు నేర్పారు .

మాధురి  కథ చదవగానే నేను అనుభవించిన ఈ కొత్త సంస్కారం నాకు జ్ఞాపకం  వచ్చింది .అందుకే తనకి కాల్ ,మెయిల్ చేశా .కథ ఎంత నచ్చిందో ,ఎందుకు నచ్చిందో చెప్పా .తను చాలా ఆప్యాయంగా సామాన్య  నీ నిష్కల్మషమైన, భేషజాలు లేని ఉత్తరంలోని నాలుగు వాక్యాలూ నిన్ను అత్యంత ఆప్తురాలిని చేసేశాయి అని నాకో మంచి ఉత్తరం రాసారు.అట్లా తన గురించి కొంత తెలిసికో గలిగాను.

చంద్ర కళ చదవగానే ఈ కథ రాసిన వ్యక్తికి విస్తృతమైన ప్రపంచానుభవం వుందని నాకు అనిపించింది.నా అంచనా నిజమే అని ఆమె పరిచయం తెలిపింది.

వాటిలోని వస్తు భిన్నత్వం వలన మాధురి  కథలు చాలా విశిష్టంగా వున్నాయ్ అని నేను  ఒక స్టేట్మెంట్ ఇవ్వగలను.ఎందుకంటె మాధురి  జీవితం  చాలా విశిష్టమైన అనుభవాల సుసంపన్న జీవితం .ఇవి మామూలు తరహా అనుభవాలు కాదు .కమ్యూనిస్ట్ లు , డాక్టర్లూ ,కర్ణాటకలో స్థిర పడ్డ తెలుగు వారూ అయిన తలిదండ్రుల ఉదార పెంపకం ప్రభావం మాధురి పై చాలా ఉంది.తన  బాల్యం అందరి లాటిది కాదు .శ్రుంక లాలు  లేని బాల్యం .కనీసం చదువు గొలుసుల్లో  కూడా ఆమె చిక్కుకోక పోవడం చేత డిగ్రీ వరకూ ఇంట్లోనే చదివారట .ఆమె కథల్లో నాయకులై కనిపించే  గోర్రేలోల్లు  ,జోగినులూ,లంబాడీలు, బల్లకట్టు కవలవ్వలూ ఆమెకు అతి దగ్గరి వారు,ఆత్మీయులు .మాధురికి వీరితో వున్న దగ్గరితనం ,వీరిపై వున్న ప్రేమ  తెలుగు సాహిత్యానికి కొత్త కళను ఇస్తుందని తెలుగు  సాహిత్య విద్యార్తినిగా నా అంచనా .అందుకనే ఇష్టంగా... నా లాగే దూర తీరాల్లోనూ,పని భారాల్లోనూ ఉండి ,ఇన్ని రోజులూ ఆమె రచనలతో పరిచయం లేని వాళ్ళు చదువుతారని  ఆమె కథ 'కాళావు ' ఇక్కడ ఇస్తున్నాను .
సమీప భవిష్యత్ లో ఆవిడ కథల పుస్తకం వేస్తే శైలీ శిల్పాలను కూడా పరిశీలిస్తూ 
మంచి వ్యాసం రాయాలని కోరిక  .

ప్రచురితమైన ఆమె మిగిలిన కథలను మాదురి  గారినుండి పొందవచ్చు 

2 comments:

వనజవనమాలి said...

సామాన్య గారు.. చాలా చక్కని పరిచయం చేసారు. చక్కని కథని అందించారు.
ఒక ఉత్తమ సంస్కారం గురించి ..నేను చెపుతాను. అది మీకు ఎప్పుడో ఉంది. నా పరిశీలనలో ణే ఉ చూసినది ఏమంటే.. ఒక కథ కాని ఒక కవిత కాని చదివిన వెంటనే paaThakudu తన స్పందనని.. రచయిత కి తెలపాలని చూస్తారు ఇప్పుడు ఉన్న సౌలభ్యాల దృష్ట్యా..అది చాలా సులభం కూడా. అందుకు ఆ రచయిత ఒక కనీస సంస్కారంతో వారికి ధన్యవాదములు చెపుతారు.
అది మీ సంస్కారంలో ఎప్పుడూ ఉంది.paaThakula స్పందనకి ధన్యవాదము చెప్పడం అనేది. మీ బ్లాగ్ మొదలెట్టినప్పటి నుండి చూస్తున్నాను. ఇప్పుడు మీ విలువైన మాటలు ని చూస్తున్నాను. థాంక్ యు..మేడం.
ఇది ముఖ స్తుతికి చెపుతున్నది కాదు. హార్ట్ ఫుల్ గా చెపుతున్నాను. రచనలలోనే కాదు ,మనిషిలోను ఉత్తమ సంస్కారం చూస్తున్నాను.
మీలాంటి అందరిki అభినందన మందారమాల.

సామాన్య said...

వనజ గారూ థాంక్ యు వెరీ మచ్ .మాదురి మిగిలిన కథలు నా దగ్గరున్నాయి .కానీ ఎలా పెట్టాలో తెలీక పెట్టలేదు.ముఖ్యంగా డూగమ్మ నాకు చాలా నచ్చింది.