About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday, 9 May 2012

స్త్రీ గా బ్రతకడం ఎంత వేదనో ...నిజానికి ఇవాళ జల్దాపారా పున్నమి అరణ్యాన్ని బ్లాగ్ లోచిత్రిం చాల్సిన పని.కానీ నిభ నా ఆనందాన్నంతా
తన దుఖం లో లయం చేసుకుంది .

అడవి నుండి వచ్చి,అలిసి పడుకుని లేచానా,పాపాయి ఓ వార్త మోసుకొచ్చింది''అమ్మ!నిభ కూతురు బావిలో దూకేసిం దంట ''అని .నీరసం ముంచుకొచ్చింది .ఇప్పుడెంత దుక్ఖాన్ని నా స్టోర్ రూం లో చేర్చాలో అని .

నిభ  వచ్చింది.ఏడవటం మొదలెట్టింది .మొన్న మీ దగ్గరకొచ్చిందే నా కూతురు ,ఆ పిల్ల బావిలో దూకిందీ  అని.అందులో చల్లటి వార్త పిల్ల బ్రతకడం.స్త్రీల దుక్కాలన్నీ  షరా మామూలువే .పిల్లాడు తాగుబోతు ..వాడు పెడితే తినాల్సిన పిల్ల కదా ,ఆర్ధిక ఆధారం అలా తాగుడు పాలైతే ఎలా ?అందుకే పిల్ల వాడిని బెదిరించింది .ఇక మీదట తాగావంటే చస్తాను అని .వాడు చావు అన్నాడు .పిల్ల బావి ఎక్కింది  , దూకేస్తాను అన్నది  ...అన్నా పిల్లాడి ధైర్యం చెదిరి పోలేదు .దూకెయ్ చూద్దామన్నాడు .దూకేసింది .తల్లి వురుకులై ,పరుగులై, ఫైరింజనై ,పిల్లని బయటకి తెచ్చుకుంది .

మొన్న నా 'మహిత' కథ వచ్చినప్పుడు గూగుల్ ప్లస్సుల్లో ఎవరో చర్చలు చేసారు.బాల గోపాల్ ఒక వ్యాసం రాసారు .సాఫ్ట్ వేర్ రంగం గురించి ,పేరు గుర్తు రావటం లేదు ...ఆ వ్యాసం  గుర్తొచ్చింది .ఎందుకంటె ఆ చర్చల్లో ఇప్పు డేక్కడా ఇలా లేదు ఎప్పటిదో పాతికేళ్ళ క్రితం కథ ఇదీ  అని నుడివారు సాఫ్ట్వేర్ వారు  .తెలిసిందే అయినా ప్రపంచం వాల్లకి  అంత పచ్చగా కనిపించడం  మళ్ళీ ఆశ్చర్యం కలిగించింది [జెనరలైజ్  చేయడం లేదు ]

.ఆ చర్చలు చదువుతున్నప్పుడే నిభ కూతురు వచ్చింది ఇంటికి .పద్దెనిమిదేళ్ళ  పసిపిల్ల .ఏడాదిన్నర బాబు .ముద్దుగా ఎంత అందంగా వుందో,అందుకే ఒక ఫోటో తీసి పెట్టుకున్నా.ఇవాళ ఆ ఫోటో చూస్తుంటే.
నిశ్చయంగా చావాలనే కదా అట్లా చేసేసిందీ పిల్ల ,కొంత తేడా వచ్చినా చచ్చిపోవడమే కదా అని దిగులేసి పోయింది.

నిభ మంచి గాయని .భవయ్య,బౌల్ జానపదాలని అద్భుతంగా పాడుతుంది .ఎప్పుడు పాడమన్నా గొప్ప దుక్కాన్ని పాడుతుంది.నిభ జీవితం రాస్తే ,శరత్ చంద్రుడు రాసినంత దుక్కపు కథ రాయాల్సి వస్తుంది. ఈ సారి  ఎప్పుడైనా రాస్తాను 

.ఇవాళ ఇంటికి వెళ్తుంటే ,పాడమంటే నాలుగు పాటలు పాడింది  .పాడుతూ పాడుతూ భోరున ఏడ్చింది.నిభా తోపాటూ అనిత,షీలా ఏడ్చారు .వెరసి మొత్తం నాలుగు యేడుపులయ్యాయి.

ఆ పాట ఏం చెప్తుందో నిజానికి నాకు అర్థం కాలేదు .అందులో దుక్కం మాత్రం అర్థమయింది . పాట  యు ట్యూబ్ లో దొరికింది .ఇస్తున్నా .దుక్కమున్న వాళ్ళ దుక్కాన్ని ఎక్కువ చేసే లక్షణం ఆ పాటకి ఉందేమో మరి.

నాలుగు పాటల్లోనూ ,నాకు  ''నారీ హోవార్ కీజే బేతా ,ఏ ప్రిత్వి భూజేనా తాహా ''  స్త్రీగా బ్రతకడం లో ఎంత వేదన వుందో ఈ ప్రపంచం  అర్థం చేసుకోవడం లేదు  ''లైన్ ఒక్కటీ అర్థమయింది .  

అవును కదా స్త్రీ గా బ్రతకడం లో చాలా వేదనే వుంది .ఆ స్త్రీ ,ఏ స్త్రీ అయినా సరే ! ఆ దుక్కం శరీరానిదైనా సరే ,మనసుదైనా సరే !!
 

4 comments:

వనజవనమాలి said...

స్త్రీగా బ్రతకడం లో ఎంత వేదన వుందో ఈ ప్రపంచం అర్థం చేసుకోవడం లేదు ''లైన్ ఒక్కటీ అర్థమయింది .

అవును కదా స్త్రీ గా బ్రతకడం లో చాలా వేదనే వుంది .ఆ స్త్రీ ,ఏ స్త్రీ అయినా సరే ! ఆ దుక్కం శరీరానిదైనా సరే ,మనసుదైనా సరే !!
saamaanya gaaru :((

సామాన్య said...

vanaja garu sorry.

anrd said...

బాగా చెప్పారండి.

సామాన్య said...

@anrd
Thank you