About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 22 February 2013

శ్రీ వెంకట సుబ్బు స్మారక అవార్డ్


ప్రముఖ అనువాదకురాలు శ్రీ అల్లాడి ఉమ గారు తమ అమ్మమ్మ శ్రీ ''వెంకట సుబ్బు ''గారి పేరిట గత ఐదారేళ్ళగా ప్రతి ఏడాది ఇద్దరు రచయితలకి  అవార్డ్ ఇస్తూ వున్నారు  .,శ్రీ అబ్బూరి ఛాయా దేవి గారు ,శ్రీ వోల్గా గారు, హెచ్ సి యు ప్రొఫెసర్ సునీతా రాణి గారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారు . అవార్డ్ పేరిట ఒక్కోరికీ పదిహేను వేల  రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుంది . ఈ ఏడాది కార్యక్రమం ఈ నెల 17 న హైదరాబాద్ లోని వారి ఇంట్లో జరిగింది  .''కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ ''కథల పుస్తకానికి గాను నాకు ,జాజుల గౌరీ గారి కథల పుస్తకానికీ  ఇవ్వడం జరిగింది .ఇంతకు ముందు ఈ అవార్డ్ ను కె రామ లక్ష్మి  ,వినోదిని ,షెహనాజ్ ఫాతిమా వంటి వారు వివిధ ప్రక్రియలకు గాను అందుకున్నారు.వెంకట సుబ్బు గారు తమంతట తామే చదువు నేర్చుకున్నారనీ .పుస్థకాలు విపరీతంగా చదివే వారనీ .తమందరికీ వారే స్ఫూర్తి అనీ ,అందుకే వారి పేరిట ఈ అవార్డ్ ఇవ్వా లనుకున్నామని ఉమ గారు ఈ సందర్భం లో అన్నారు.

అయితే ..అక్కడికొచ్చిన ఎవరి పాపో తెలీదు కానీ , ఆ ఇంట్లో ఒక అమ్మాయి  ఉండింది ... వైష్ణవి .ఐదో క్లాసు . గచ్చక్కాయ రంగు కళ్ళు ,చిన్ని మూతి .యెర్రని పెదాలు . పావడా జాకెట్టు వేసుకుని . అన్నం తింటుంటే నా దగ్గరకొచ్చి నాక్కూడా మీలాగా కావాలని వుందాంటీ అన్నది . [నిజానికి నాకు నవ్వొచ్చిందనుకొండీ . ఎందుకంటె నాక్కూడా కొన్ని కోరికలుంటాయి అచ్చు ఆ పిల్లలానే ... ఇప్పటికీ ఇంత వృద్దాప్యం వచ్చేసాక కూడా . ]తన ఆరంగేట్రం ఫొటో స్ చూపించింది .తన మెయిల్ అడ్రస్ ఇచ్చింది .ఇంగ్లీశ్ లో రాసిన తన పోయెమ్స్ పంపుతానని చెప్పింది .ఫోన్ నంబర్ లు ఇచ్చి పుచ్చుకున్నాం .అందరూ భోజనాలు చేస్తున్నపుడు ఏకాంతంగా అట్లా మేమిద్దరం చాలా సేపు మాట్లాడుకున్నాం ..కానీ నేను చేసిన తప్పేంటంటే ఆ పిల్లని ఒక్క ఫోటో అయినా తీసుకోక పోవడం . ఆలోచిస్తుంటే ఆశ్చర్యమేసింది పెద్దయితే ఆ పాప ఎంత సౌందర్య వంతురాలు అవుతుందో కదా నని .కాకపొతే నిండు గోదారి అవుతుంది.  తోణుకూ బెణుకూ లేని చల్లని తల్లి లా . వైష్ణవీ నిజంగా నీతో టచ్ లో ఉండాలనిపిస్తుంది .ఇంట్రస్టింగ్ గా వుంది .నువ్వెలా పెరుగుతావో చూడాలని వుంది . 

4 comments:

వనజవనమాలి said...

సామాన్య గారు.. అందుకోండి అభినందన మందార మాల.

వైష్ణవి ని నాకు చూడాలని ఉంది మరి :) మెయిల్ ID ఉంది కదా.. ! త్వరగా తెప్పించేయండి మరి. :)

Venakata Subbu gaaru Spoorthikaram.

సామాన్య said...

thank you vanaja garu .

తృష్ణ said...

congratulations for the award !

సామాన్య said...

thank you trushna garu