About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Sunday, 4 March 2012

ఒక దుక్ఖం-ఒక పాట...!

కొందరుంటారు ,వాళ్ళను వెతుక్కుంటూ వస్తాయి ఆనందాలు,వచ్చి,వాళ్ళ వాకిట పూసి, రంగవల్లులు తీర్చి మురిపిస్తాయి.కొందరుంటారు.వాళ్ళను వెదుక్కుంటూ వస్తాయి ఎక్కడేక్కడీ దుక్ఖ మేఘాలు.
వచ్చి తనివితీరా కురిసి తడిపి ,తెరిపినపడి వెళతాయి .

కారణమేమో ...నేను రెండోఆకర్షణని.

నిన్నరాత్రి అపరిచిత మేఘం ఎనిమిదింటికి మొదలెట్టి అర్థరాత్రి పన్నెండున్నర వరకూ కురిసీ కురిసి నా మొబైల్ చార్జ్ అయిపోవడంతో అనివార్యంగా అర్థాంతరపు ముగింపయింది.

రెండ్నెల్ల క్రితం నా విపరీత తలనొప్పుల గురించి యోచించి ప్రముఖ హోమియోవైద్యుడు నువ్వు నేట్రం మూర్ కేటగిరీవి పొమ్మన్నాడు.ఏవిటా ... అనుకుంటే శ్రీశ్రీ బాధ ప్రపంచపు బాధలాగా ప్రపంచపు ఏడ్పు సామాన్య ఏడుపు అవుతుందని సారాంశం .దాన్నలా అనుసరిస్తూ వెళ్లి ఆరున్నొక్కరాగం తీస్తుంటే పాపాయి వాళ్ళ నాన్న ప్రేమ చేత నిదర దుప్పటిని తీసీ ఓపిక తెచ్చుకుని జ్ఞాన భోధ చేసాడు .బ్రామ్హీ ముహూర్తం కావడం చేత బుర్రకి బాగానే ఎక్కింది కానీ ,బుర్ర వేరు మనసు వేరని అనాది కాలానే గీతకారుడు చెప్పేసాడు కనుక , నిన్న రాత్రి గడిచి మరో రాత్రి లోకి రాబోతున్నా ,కొత్త చంద్రుడు ఆకాసంలో తచ్చాడుతున్నా మనసులో దిగులు మేఘం గుబులు పెడ్తూనే ఉంది.

ఏవిటేవిటో తవ్విపోసుకుంటూ వుంటే aretha franklin ''i never loved a man '' పాట జ్ఞాపకం వచ్చింది .ఆవిడ దుక్కపు సారాంశమంతా పాటలో ఉంది .అంతే ఇంకేం ఉందీ ?ఇంకేం లేదు,,,అవును...You're a no good heart breaker
You're a liar and you're a cheat
And I don't know why
I let you do these things to me
My friends keep telling me
That you ain't no good
But oh, they don't know
That I'd leave you if I could

I guess I'm uptight
And I'm stuck like glue
Cause I ain't never
I ain't never, I ain't never, no, no (loved a man)
(The way that I, I love you)

Some time ago I thought
You had run out of fools
But I was so wrong
You got one that you'll never lose
The way you treat me is a shame
How could ya hurt me so bad
Baby, you know that I'm the best thing
That you ever had
Kiss me once again

Don'cha never, never say that we we're through
Cause I ain't never
Never, Never, no, no (loved a man)
(The way that I, I love you)

I can't sleep at night
And I can't even fight
I guess I'll never be free
Since you got, your hooks, in me

Whoa, oh, oh
Yeah! Yeah!
I ain't never loved a man
I ain't never loved a man, baby
Ain't never had a man hurt me so bad

No
Well this is what I'm gonna do about it

2 comments:

వనజవనమాలి said...

ప్రపంచపు ఏడ్పు సామాన్య ఏడుపు అవుతుందని సారాంశం
ఇది ఇలా చెప్పడం బాగుంది. అలాగే పాపాయి నాన్న మీ సహచరుడు, ఇలా అనేకన్నా..మీ అంతరంగాన్ని ఎరిగిన మిత్రుడు.. అని అంటే బాగుంటుంది కదా..అనుకున్నాను.
ఇక ఈ పాట,సాహిత్యం కుండపోతగా..కురిసి ముంచేసి వెళ్ళిన నల్లని మేఘం.ఓ విషాద మేఘం.:-(((

సామాన్య said...

వనజ గారూ సహచరుడు,మిత్రుడు అనడం అలవాటే కానీ ఎప్పుడూ వాదాల పడికట్టు పదాలెందుకు, మనదైన పదం మనం వాడదామని 'పాపాయి వాళ్ళ నాన 'అంటాను.
థాంక్ యు .