About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Wednesday 6 June 2012

''మహిత -ఉమా మహేశ్వర్ రావు గారు''


మహిత కథ పుస్తకంగా వచ్చింది .
ఈ కథని ఇట్లా పుస్తకం గా తీసుకురావాలని నేనసలు ఆలోచించలేదు .[''దొంగల సంత''కథని పుస్తకం గా తేవాలని ప్రయత్నాలు  జరుగుతూ వున్నాయ్.] మహిత మొదటి భాగం వచ్చినపుడు నాకో ఆర్త్రమైన మెసేజ్ వచ్చింది .పేరు లేదు .ఆ మెసేజ్ చూసాక కాల్ బాక్ చెయ్యాలనిపించింది .అట్లా నేను మొదటి సారి ఆర్ ఎం ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడాను.

పాటకులుగా మనకి మనవే అయిన అభిరుచులుంటాయి,ఆసక్తులుంటాయి.మన ఆసక్తికి అతి దగ్గరగా వచ్చిన ,మనం అమితంగా ఇష్టపడిన రచయిత ఒకానొక  రోజు మనతో మాట్లాడితే యెట్లా వుంటుంది ?మాట్లాడటమే  కాక  మనని మెచ్చుకుంటే యెట్లా వుంటుంది?ఆ రోజు ఎంత సుందరమైనదవుతుందీ ?దానినే  dreams comes true కలలే ఫలించడం అంటారు కదా !ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడటం నాకు అట్లాంటిదే .

మొదటి సారి ఆరెం ఉమా మహేశ్వర్ రావు గారి కథ చదివినపుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో .ఎక్కడ కూర్చుని చదివాను ,చదివినది ఏ వేళలో? అంతా నాకు హృదయంలో ఇమేజ్ లా బద్రపరచబడి వుంది . చాలా నచ్చినవీ  ముక్యమనుకున్నవే కదా మన హృదయంపై అలా ముద్ర వేసి నిలిచిపోతాయి .అంత ఇష్టం నాకు వారి కథలంటే .

వారు నాతో మాట్లాడటం అంటే మొదలు అదే చాలా పెద్ద విషయం  నాకు .అది కాకుండా నా కథని ఇష్టపడటం రెండో పెద్ద విషయం.ఇష్టపడ్డారు పో... స్వంతంగా వారి ఖర్చుతో మహితని పుస్తకంగా తీసుకురావడం నా జీవితంలో అతి పెద్ద విషయం .

డబ్బే ప్రామాణికం అనుకుంటే ...మహితని కావాలనుకుంటే స్వంతంగా  నేను  కూడా వేసుకోగలను నా డబ్బే పెట్టి .పబ్లిషర్స్ నీ పర్స్యు చేయగలను .కానీ నాకివాళ కలిగిన ఈ సంతోషపు ఫీలింగ్ ఎన్ని డబ్బులు కర్చు పెట్టినా నేను సంపాదించి ఉండలేను. ..కదా !!

''అంటరాని వసంతం -విమర్శనాత్మక పరిశీలన ''టెక్నికల్ గా నా మొదటి పుస్తకం .కానీ మొదటిగా పాటకులు లోకి వెళ్ళిన  పుస్తకం ''మహిత''.నాకు తిరుపతి అంటే చాలా,చాలా......ఇష్టం .ఆ తిరుపతిలో ''వల్లంపాటి సాహితీ మిత్రులు ప్రచురణ''గా నా పుస్తకం మొదటిగా మనుషులలోకి వెళ్ళింది .ప్రజల్లోకి తన బుజ్జి బంగారు చేతులతో పంపింది ''రాగలీన'' ...ఉమా మహేశ్వర్ రావు గారి అమ్మాయి .

రాగాలీనకూ ,ఒక గొప్ప మంచితనాన్ని ఏ ఆడంబరమూ లేకుండా అతి సరళంగా నాకు పరిచయం చేసిన ఉమా మహేశ్వర్ రావు గారికి  నేను మాటలలో పొందు పరచలేనంత  ఋణం  పడ్డాను .ఉమా మహేశ్వర్ రావు గారికి నా శతాధిక కృతజ్ఞతలు.


పీ ఎస్ : అజ్ఞానం చేత నేను మరచి పోయిన కృతజ్ఞతని  అన్వర్ గారు గుర్తు చేసారు . ఉమా మహేశ్వర్ రావు గారు పుస్తకం అనుకున్నంత మాత్రానే అందమైన బొమ్మలతో సహా వెయ్యడం వెనుక ఆర్టిస్ట్ కిరణ్ కుమారి గారి సహాయం సహృదయత ఎంతైనా వుంది.వారి బొమ్మల వల్ల  ఈ పుస్తకానికి అసలైన  ఆ కర్షణ వచ్చింది .అడిగినంతనే బొమ్మలు ఇచ్చినందుకు వారు నాకు తెలియకున్నా వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచు కుంటున్నాను .థాంక్  యు కిరణ్ గారూ ,థాంక్ యు వెరీ మచ్ 



9 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా సంతోషం ..సామాన్య గారు.
మహిత కథ వ్యధా భరిత జీవిత గాధ
పుస్తకంగా రావడం చాలా సంతోషం కల్గించినది.
ఉమా మహేశ్వరరావు గార్కి నా తరపున ధన్యవాదములు.
ఇక్కడ మీరొక మాట చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది.
"మహితని కావాలనుకుంటే స్వంతంగా నేను కూడా వేసుకోగలను నా డబ్బే పెట్టి .పబ్లిషర్స్ నీ పర్స్యు చేయగలను .కానీ నాకివాళ కలిగిన ఈ సంతోషపు ఫీలింగ్ ఎన్ని డబ్బులు కర్చు పెట్టినా నేను సంపాదించి ఉండలేను. కదా !!"
ఇది నిజం.
ఇలా ప్రచురించుకుని బోలెడన్ని సమీక్షలు వ్రాయించుకునే వారికి..ఈ సంతోషం అర్ధం కాదు.
అభినందనలు.

సామాన్య said...

వనజ గారూ థాంక్ యు .

Anwartheartist said...

Cover page is great!

సామాన్య said...

నమస్తే అండీ
అవును కిరణ్ గారు వేసారు .నా తప్పిదం చూసారా కిరణ్ గారిని స్మరించలేదు.పోస్ట్ ను సవరించుకుంటున్నాను అన్వర్ గారూ .థాంక్ యు

జాన్‌హైడ్ కనుమూరి said...

నేను కథలు తక్కువ చదువుతుంటాను, యాదాలాపంగా రెండు లైన్లు చది వదలకుండా చదివి, రెండవ భాగం కోసం ఎదురు చూసాను. అంతగా నన్ను వెంటాడింది.
పుస్తకంగా వచ్చినందుకు సంతోషం
అభినందనలు

మోహనరాగం said...

అంటరాని వసంతం-విమర్శనాత్మక పరిశీలన హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరాండి

సామాన్య said...

anni pusthakaala shaapullonoo dorukuthundandee .ante vishalandhra ,navodaya,palapitta...

Kottapali said...

చాలా సంతోషం. ఆరెం ఉమామహేశ్వర్రావుగారు అరుదైన మంచి సాహితీవేత్త, ఇంకా అరుదైన మంచి మనిషి.

సామాన్య said...

నారాయణ స్వామి గారు చాలా బాగా నిర్వచించారు .మీరు చెప్పింది అక్షర సత్యం.థాంక్ యు .