నీ కోసమని
పువ్వూ ,పురుగూ
కాగితమూ,ఆకాశమూ
అంతటా అన్వేషిస్తాను
నువ్వున్నావనుకొని
పాటనీ,పక్షినీ
అక్షరాన్నీ,మంచితనాన్నీ
ప్రేమిస్తాను
నువ్వు కావాలని
నిదురనీ,అహంకారాన్నీ
నవ్వుల్నీ ,ఆడంబరాలనీ
పోగొట్టుకున్నాను
నువ్వు లేవో,కలవో తేల్చుకోలేక
తీరాన్నీ,శేషాన్నీ
పూర్ణిమనూ,నమ్మకాన్నీ
నూరు సార్లు తప్పుకొట్టి
మున్నూట సార్లు హత్తుకుంటాను
కనుక ..................
3 comments:
శీర్షిక చూస్తే నిష్టూరం.!
కవిత్వం చూస్తే మనోహరం !!
చిత్రం చూస్తే నయగారం !!!
maamulu padalato chaalaa bavundi kavita
@vanajavanamali gaaru
Mee kavithvam chaalaa baagundi.
@Cheppaalante.
Thank you andee...
Post a Comment