About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Monday, 5 November 2012

''పుష్పవర్ణ మాసం''



ఒక ఏడాది నా కథా ప్రయాణాన్ని పుస్తక రూపం లోకి తెచ్చాను .కల్పన బాధను యెట్లా చెప్పాలో అర్థం కాలేదు.తను నవ్వుతూ నవ్వుతూ చాలా అణచివేతను  చెప్పేది .దాన్ని కవిత్వం యెట్లా చేయగలను ?అందుకని కల్పన కథ రాసాను.పాపాయి వాళ్ళ నాన్నకథ  చదివి ఇది ఇప్పుడు చాలా అవసరమైన కథ అన్నాడు.ఎందుకంటె తన ప్రమేయం ఏమీ లేకున్నా నేను కూడా చాలా మంది ఈ కాలపు అమ్మాయిల్లాగే చదువుకుని ఆ చదువుని ఇంటికి పరిమితం చేసుకున్నానని అందుకు చాలా వేదనను అనుభవించానని తనకు దగ్గరగా తెలుసు కనుక .

రాసిన కథలని రెండో సారి చదవడం నాకు చాలా అసహ్యం  .అయినా అట్లా నేను కొన్ని ఎక్కువ సార్లు చదువుకున్న కథ ''పుష్పవర్ణ మాసం''.అది నా బుద్దిని సంతోష పెడుతుంది.మొన్న ఊరికి వెళ్ళినపుడు నా తమ్ముడు మాటల సందర్భంలోMárquez One Hundred Years of Solitude (1967) గురించి చెబుతూ నువ్వా బుక్ చదవలేదని నాకు తెలుసు. చదివి వుంటే నీ నాయకుడిని అక్కడి నుండే తెచ్చావని అనుకుంటారు అందరూ అన్నాడు.నేను నా నాయకుడిని మా ఇంటి పనస చెట్టు పై నుంచి [మామిడి చెట్టు కాదు నిజానికి .మా పనస చెట్టు చాలా గుబురుగా వుండి దయ్యం వుండే ఉండొచ్చని భయం పెడుతుంది.నా నాయకుడు అక్కడి వాడు]తెచ్చాను .

కానీ అంత మంది చదివారు కదా,, ఒక్కరూ ...చివరికి ఆ కథ ఫెయిల్యూర్ అన్న ఖదీర్ బాబు కూడా  ఆ మాట చెప్పలేదే అని ఆశ్చర్యం వేసింది.ఏమైనా మన వాళ్ళు మహా గట్టి వాళ్ళు .చివరికి ఆ పోలికను నా కుటుంబం లో వ్యక్తే చెప్పడం అంటే ...నూరేళ్ళ ఒంటరి తనంలోని ఆ సీతాకోక చిలుకల అబ్బాయి ని,క్రితం జన్మలో నేనూ ,నా తమ్ముడూ పడీ పడీ  చదివి ,ప్రేమించి ,దుక్కపెట్టుకుని వుంటాం.అందుకే ఈ జన్మలోనూ అతను మమ్మల్ని  వదల లేదు కావచ్చును .ఇవాళే  డౌన్ లోడ్ చేసాను.నా తమ్ముడన్నాడూ '..చదవడం ఇప్పుడు పెటు కోకు .అది నాలుగొందల పేజీల పుస్తకం .నీకు కే కే ఆర్  సర్ రాసారు కదా ఒక్క వాక్యం  మిస్సయినా భావం తప్పుతుందని అచ్చు అట్లాటిదే ,నాలుగొందల  పేజీలనీ అక్షరం అక్షరం చదవాల్సిందే ..చదవడానికి మనసోక్కటీ సరిపోదూ ...నీకు ఆరోగ్యం బాలేదు కదా ప్రస్తుతం అని .అయినా చదవాలని తపన పుట్టిపోతుంది .

మొన్న పాపాయి కామిక్స్ కావాలంటే ఏర్పోర్ట్ లో బుక్ షాప్ కి వెళ్ళానా ఒక బుక్ బ్యాక్ కవర్ పై  ఈ నాలుగు మాటలూ కనిపించాయి.''a one line suicide note left by a total stranger ,a small-time writer avinash suvarna ,reveals to young journalist laya thomas ...అంటూ ఉండిందా ఆ వన్ లైన్ సూసైడ్ నోట్ అనే మాట కోసమని బుక్ ని పటుకోచ్చేసా .ఈ వన్ లైన్ సుఇసైడ్ నోట్ కథ గుర్తొస్తుందా  తెలుగులో...నాకు పేరు గుర్తు రావటం లేదు చప్పున .నిన్న ఆ రచయితతో మాట్లాడాను కానీ ఈ విషయాన్ని  చెప్పడం మరిచా.ఈ పుస్తకం పేరు ''a tale of things timeless''[మలయాళం ]రచయిత rizio yohannan raj .చదవాలి .కానీ చదవాలంటే కొంచమేదో భయంగా వుంది .ఇంకేం రాయాలి ...నిజానికి చాలా రాయాలి .అక్టోబర్ డైరీ ...కానీ  ఇప్పుడు కాదు .ఇప్పుడు చిత్ర సుందరిని చదవాలి.

4 comments:

సత్యవతి said...

Tale of things timeless ఇప్పుడే ఆర్డర్ చేశాను.ఈ పుస్తకం గురించి ఇంతకుముందే ఎవరో చెప్పారు. నేనుకూడా చదివాక దాన్ని గురించి మనిద్దరం మాట్లాడదామ్.ఇట్లా పుస్తకాల గురించి మాట్లాడుకోడం బాగుంటుంది. Hundred years of solitude గురించి కూడా.

సామాన్య said...

మీరు మా ఊర్లో వున్నపుడు నేను మీ ఊర్లో వున్నానని మీరు నా బ్లాగ్ చదివేప్పుడు నేను మీ బ్లాగ్ లో వున్నాను.థాంక్ యు మేడం .

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు.. ఆరోగ్యం ఎలా ఉంది? పాపాయి మీతో ఉంది కదా!
అమ్మ వాళ్ళింట్లో ఉండి ఉంటారు. త్వరగా కోలుకుని తమ్ముడు చెప్పిన నవల చదివి బ్లాగ్ లో వ్రాయాలి.

"పుష్ప సువర్ణ మాసం " ఎన్ని సార్లు చదివినా..సరే ఆ వర్ణన అద్భుతం . వేరొక మాట లేదు.

హార్ట్ లీ ఐ విష్ గెట్ వెల్ సూన్..

ప్రేమతో..వనజ

సామాన్య said...

Vanaja gaaru
Thank you very very much.naa AArogyam ippudu parledu.
Meeku book pampadam aalasyamavuthundi kadaa ...pamputhaanu..thank you again.baabunu adiginatlu cheppandi.