ఇవాళ పొద్దున్న ఈ పాట విన్నాను . స్నేహితురాలు చిన్మయి గురించిన ప్రస్తావనతెస్తే . పాట బాగా నచ్చింది . ఈ మూవీ తమిల్ వర్షన్ లో పెయిర్ ఇష్టం నాకు . తెలుగు ''ఏ మాయ చేసావో'' హైదరాబాద్లో చూస్తూ వుండగా నా తల బద్దలై అగ్ని పర్వతమవుతుండగా మొత్తం కనుక చూసానంటే మరిక మిగలనేమో అనిపించి క్రిందికొచ్చి వాష్ రూం లో వాంతులు చేస్తూ వుండగా పక్కనే అలాటి సౌండ్ వచ్చి చూస్తే ,నా లాగే ఇంకో పిల్ల ...ఆ పిల్ల తల్లి మా ఇద్దరినీ జాలిగా చూస్తూ .నాకెందుకో అది నా సొంత తల నెప్పిగా కాక సినిమా ఎఫెక్ట్ గా గుర్తుండి పోయింది .కానీ తమిల్ మూవీ బాగుంటుంది .
దేవస్మిత కథ గురించి కామెంట్స్ చదువుతున్నపుడు కూడా ఈ మూవీ గుర్తొచ్చింది .ప్రస్తావించాలని కూడా అనిపించిన్ది. ఈ కథా నాయిక అంటే దేవస్మిత మీద ఉన్నంత చిరాకు నాకు .
ఇంతకు ముందు ఈ పాట ఏ మూడ్ లో విన్నానో కానీ ఇంత సుందరంగా తోచలెదు. బహుశా ఇవాళ చిన్మయీ అందమైన ఫోటో చూట్టం వల్ల కావచ్చు పాట కూడా బహు శ్రావ్యంగా అనిపించింది .

2 comments:
"ఈ కథా నాయిక అంటే దేవస్మిత మీద ఉన్నంత చిరాకు నాకు ."
భలే నచ్చేశారు మీరసలు.. :)))
చిన్మయికి నేను కూడా పెద్ద పంఖాని, తమిళ్ "ఆవారం పూ" సాంగ్ విన్నప్పట్నించీ.. తన డబ్బింగ్ కూడా చాలా ఇష్టం నాకు!
థాంక్ యు థాంక్ యు నచ్చెసినందుకు .ఆ పాట నాకు రాలేదే ఎట్లాగా???
Post a Comment