About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday, 11 April 2013

మనమెందుకిలా లేము ?

ఒక పురుషుడు:

 కవిత సర్కార్ ,ఆమె భర్త బంగ్లాదేశ్ నివాసులు .పెల్లై రెండేల్లేమో అయింది . పెళ్ళప్పుడు అనిపించలేదేమో కానీ తరువాత ఆమె నల్లగా వుందని భర్తకి నచ్చకుండా వచ్చింది . వేరే స్త్రీ తో సంబంధం ఏర్పడింది . అతని మనసు మారినట్లు కవిత మనసు మారలేదు ఘర్షనలు జరిగాయి .కొన్నిరొజుల క్రితం హటాత్ గా భర్త చాలా మంచి వాడై  పోయి పద భారత్ లో బంధువులింటికి వేల్లెసోద్దామని చెప్పి అక్రమం గా భారత్ లో కి మేముంటున్న మాల్దా కి తీసుక వచ్చాడు .

పక్కనే ఉంటున్న వేరే ఊరికి తీసికెళ్ళి ఆమెని అమ్మకానికి పెట్టాడు . భర్త పదివేలు అడిగితే పిల్ల నల్లగా వుందని చెప్పి ఎనిమిదే ఇస్తామన్నారట .బేరమ్ కుదరలేదు . విసుగొచ్చింది . ఆ కోపంతో భార్యతో ఘర్షించి  ఆమెని  నిర్జనం గా వున్న మామిడి తోపుకి తీసికెళ్ళి చచ్చేట్టు కొట్టి తన జేబులో వున్న పెన్నుతో ఆమె రెండుకళ్ళూ పీకేసాడు .కవిత షాక్ కి గురై అపస్మారకం లోకి వెళ్ళడం వల్ల విపరీత రక్తస్రావం జరిగింది . ఆమె పరిస్థితి రానున్న 72 గంటలలోపు ఏమీ చెప్పలేమట . ఒక వేళ బ్రతికినా కళ్ళు ఇక పూర్తిగా రావట .

ఒక స్త్రీ :

మీరా సూత్రదార్ మా ఇంట్లో డస్టింగ్ పని చేస్తుంది . దాదాపు నాలుగేళ్ల క్రితం విపరీత తాగుబోతు అయిన ఆమె భర్తకు పిచ్చి వచ్చింది . అంత పిచ్చిలో కూడా అతనికి భార్య మాత్రమె లోకువ .ఇక ఎవరి మీదా కోపం వుండదు . పిచ్చి వచ్చినపుడు భార్యని విచక్షణా రహితంగాకొడతాడు . ఆమె చీరలు చించి వేస్తాడు . ఒక సారి కూరలు తరిగే కత్తి పీట తీసుకుని ఆమె భుజాన్నినరికాడు . విని విని ,,మీరా నువ్వు తిరిగి కొట్టొచ్చు కదా ?ఏం నీకు బలం సరిపోదా ?అంటే మీరా అన్నది .''యెట్లా కోడతాము బాగున్నపుడు ఎంత ప్రేమగా వుండే వాడు , అదంతా మరిచిపోయేదా ?అన్నది . మరి బాగున్నపుడు నిన్నుఎప్పుడూ  కొట్టేవాడు కాదా అంటే ,ఎందుకు కొట్టే వాడు కాదు ... అప్పుడప్పుడూ కొట్టేవాడే అన్నది.

మనమెందుకిలా లేము ?

ఇదనె కాదు చాలా సార్లు నాకనిపిస్తూ వుంటుంది ,మనమెందుకిలా లేము అని !మన సృష్టిలోనే ఏదో తేడా వుంది . ఎంత మంది స్త్రీలు ఎంత మంది పురుషుల్ని ఈ ప్రపంచంలో హత్య చెసారు. మనమేం చేస్తాం కోపమొస్తే ఏడుస్తాం .త లనొప్పులు తేచుకుంటాం .దేవుడికి ముడుపులు కట్టుకుంటాం . భర్త వలన పిల్లలు పుట్టకపోతే ఇంకో భర్తని తెచ్చేసుకోం .నా ఖర్మ ఇంతేనని గొడ్రాళ్ళగా వుండి పోతాం . మనల్ని మనం బాధించుకుని మనల్ని మనం హత్యించుకుంటాం .

ఎందుకని మనం పురుషుల్లా లేము . ఏమో నాకు తెలీదు .వుండాలని నేననడం లేదు .కవిత  భర్తని అంత అమాయకంగా నమ్మి ఎలా ఇంత దూరం వచ్చింది ?మీరా ఆత్మ సంరక్షణకు భర్తను ఒక వేటేస్తేనేం ?

ఏంటో ఈరోజంతా ఒక చెడ్డ దిగులు తగులుకుంది . మాటి మాటికీ ఏడుపొస్తుంది . పాపాయి కూడా చాలా భయ పడింది .వుమెన్ షుడ్  కిల్ మెన్ ఘోస్ట్ అన్నది .ఆడవాల్లు ఈ మగ పిశాచుల్ని చమ్పెయ్యాలట . మగ వాళ్ళు పిశాచులట .

ముగింపు :

కవిత మొగుడు చివరికి కొన్ని గంటల్లోనే పట్టు పడి పోయాడు . మన పోలీసు వ్యవస్థ ప్రపంచం లోనే అత్యంత సమర్ధవంతమైనదట . తప్పు చేసిన వాళ్ళు పట్టు  పడక మానరు . మహా మహా పోలీసు అధికారి కొడుకు బిట్టూ మొహంతీ ఎన్ని వేషాలు మార్చినా పట్టు పడ్డాడు . బుద్ధి వున్న వాళ్ళెవరూ తప్పులు చేయరు. సంస్కార హీనులే ఇలా ప్రవర్తిస్తారు .

కొంత మంది సిస్టం ఒకటి ముందు పెట్టుకుని ఎన్నెన్నో ఆకృత్యాలు చేస్తుంటారు .వాటిల్ని అతి సులభంగా కని పెట్టగల సాఫ్ట్ వేర్లు పోలీసు ల దగ్గర ఇవాళ వున్నాయి . ఆ టెక్నాలజీ ప్రత్యక్షంగా చూసి నేను చాలా ఆశ్చర్య పడ్డాను . పిల్లుల్లా కళ్ళు మూసుకుని పాలు తాగుతూ మనల్ని ఎవరూ చూట్టం లేదని కవిత మొగుడిలా అనుకోవడం పొరపాటు .

అసూయ చెడ్డ లక్షణం . మారు పేర్లతో ఇతరుల మీద బురద చల్లుదాం అనుకుని పాటు పడటం  ,తను అనుకున్నట్లే ప్రపంచం ఉండాలనుకోవడం మానసిక రోగాలు.అటువంటివి  తలెత్తితే వెంటనే డాక్టర్ కి చూపించుకోవడం మంచిది .ఎందుకంటె తప్పులు ఎన్నో రోజులు దాగవు. ఎవరూ కూడా సరేనని ఊరుకోరు.  ప్రతి దానికీ ఒక ముగింపు వుంటుంది .

2 comments:

వనజవనమాలి said...

కవిత, మీరా సూత్రదార్ జీవిత కథలు కదిలించాయి .

పాపాయి ఇలాంటివి అన్నీ చూడటం తెలుసుకోవడం అవసరమే! కానీ మనసు చెదిరిపోతుంది కదా !

ఇలాంటి విషయాల మధ్య మనసు ఎలా సంతోషంగా ఉండగల్గుతుంది ?

ఈ రోజు పండుగ వాతావరణమే కాదు . :(

"అసూయ చెడ్డ లక్షణం . మారు పేర్లతో ఇతరుల మీద బురద చల్లుదాం అనుకుని పాటు పడటం ,తను అనుకున్నట్లే ప్రపంచం ఉండాలనుకోవడం మానసిక రోగాలు.అటువంటివి తలెత్తితే వెంటనే డాక్టర్ కి చూపించుకోవడం మంచిది .ఎందుకంటె తప్పులు ఎన్నో రోజులు దాగవు. ఎవరూ కూడా సరేనని ఊరుకోరు. ప్రతి దానికీ ఒక ముగింపు వుంటుంది "

ఈ పేరా లో బాగా స్పందించారు . తప్పులు ఎన్నో రోజులు దాగవు నిజమ్. .

సామాన్య said...

వనజ గారూ నిజమే ..కానీ పాపాయికి చెవులు పలచన విననట్టే అన్నీ వింటూ వుంటుంది.ఇవాళ నాకూ మీలాగే భయం కలిగింది.కానీ ఆడపిల్ల కదా అమ్మ వెనుకే వుంటారు అన్నీవింటూ..
లాస్ట్ పేరా...కానీ తప్పులు చేయడమనేది వ్యసనమనుకుంటా. కుక్కతోక వంకర లాగా మంచి మాట పెడచెవిన పెడతారు."ఇచ్చేది ఇస్తే గానీ లేవనన్న " కోడలి బుద్ది వీళ్ళది.చేసుకున్న వాళ్లకి చేసుకున్నంత మహదేవ అన్నారు కదా పెద్దలు .