కొన్ని రోజుల నుండీ ప్రతి రోజూ రాత్రి 7 గంటలకు ఏదో ఒక గ్రామానికి వెళ్తున్నాను . డాక్టర్ ముందే అన్ని ఏర్పాట్లు చూసి పెడుతున్నారు . ప్రతి చోట దాదాపు 60-70 మంది వస్థున్నారు. ఎక్కువ మంది మహిళలే . మేము సామాన్యకిరణ్ ఫౌండేషన్ నుండి వస్తున్నాం ,మేము పలానా కార్యక్రమాలు చేస్తుంటాం ,ఇవి కాక మీ గ్రామానికి అవసరమైనవి ,మేం చేయగలిగినవి వుంటే చెప్పండి అని మాటలు మొదలెడతామ్ ,కొన్ని గ్రామాల వాళ్ళు చెపుతారు కొందరు నోరే తెరవరు ,అప్పుడిక జోకులు మొదలెట్టేది,అయితే మీ గ్రామానికి సమస్యలే లేవనమాట ,మీది ఉత్తమ గ్రామమనమాట ,ఉత్తమ గ్రామమం అవార్డ్ కోసం మీ గ్రామం పేరు కలక్టర్ కి ప్రతిపాదిస్తాం మరి అని ,అంతే కోలాహలం, అయ్యో మేడం మాకు చాలా సమస్యలున్నాయి అని . ముఖ్యంగా తండా లలో అయితే నోరు విప్పించడం మహా కష్టం . నిన్న రాత్రి ఒక తండాకి వెళ్లాను ,అదే పరిస్థితి . చాలా సేపు అవీ ఇవీ చెప్పగా చిన్నగా మొదలెడతారు ,సారాయి మమ్మల్ని పీల్చి పిప్పి చేస్తుందని సారాయిని మా ఇళ్లల నుండి మా ఊళ్ళ నుండి వెల్ల కొడితే చాలూ అని . అప్పుడిక దిగులేస్తుంది . మద్యం భూతాన్ని నేను ఎదుర్కోగలనా ,దాని ముందు నేనెంతా ?అని ,ఏం చేయాలో కూడా నాకు అవగాహన లేదు ,ఎవరినైనా సంప్రదించాలి . అంతకు ముందు ఉద్యమం నిర్మించిన వాళ్ళని కలవాలి.
ఒక్కో చోట ముసలి వాళ్ళు ఆశతో వస్తారు . అమ్మ !మేడం !నాకు పించను రాటం లేదు ,నా వయసేమో అరవై దాటింది వాళ్ళేమో యాభై అంటున్నారు ,ఈ రోగాలతో ఎలా తట్టుకోము తల్లీ ,మాకేమన్నా సహాయం చేయమ్మా అని . ఎంత మందికి సహాయం చేయగలనూ .. అసలు జీసస్ క్రీస్ట్ ఏం చేసే వాడు అని ఈ మధ్య పదే పదే అనిపిస్తూ వుంటుంది . అతనెంత శక్తిమంతమైన దయ కలిగినవాడు ,కాకుంటే ఈ ప్రపంచాన్ని ఇప్పటికీ పరిపాలిన్చేస్తున్నాడే అని ఆశ్చర్యం వేస్తుంది . కరుణ వుంటే చాలా ? .. కన్ఫ్యూషన్ . నాకు, వలసినంత డబ్బులుంటే ఎంత బాగుండూ అని చింత . ఏ వూరుకేల్లినా ఒక్కటే , బాధల సీసాన్ని కరిగించి నా చెవుల్లో పోస్తారు!నేనీ దుక్కాలని భరించగలనా ?మధ్యలో పారిపోతానా ? ఏమో !ఎవరెవరో గుర్తొచ్చి రాత్రులు నిద్ర రాదు
.
వెళ్ళిన ప్రతి దగ్గరా మా ఫౌండేషన్ కోసం స్వచ్ఛందంగా ఎవరైనా పని చేస్తారా అని అడుగుతాను ప్రవీణనన్న సలహాని దృష్టిలో ఉంచుకుని . కొంతమంది వస్తారు . వాళ్ళలో ఒక అబ్బాయి ఇవాళ నిద్ర లేవకమునుపే ఫోన్ చేసాడు మా ఊళ్ళో బీ టెక్ ఫైనలియర్ చదువుతున్న అబ్బాయి చనిపోయాడు ,మీరు వస్తారా అని . కాసేపు కన్ఫ్యుషణ్ . అక్కడికెళ్ళి నేనేం చేస్తాను ,నా అవసరం ఏముంటుందని,చివరికి వెళ్లాను . ఆ అబ్బాయి ఏం జబ్బుతో చనిపోయాడో కూడా కరక్టుగా వాళ్లకి తెలీదు . పేద వాళ్ళు. తల్లి నన్నుచుట్టుకుని భోరుమని ఏడ్చింది ,నేనింక ఎందుకు బ్రతకాలో చెప్పు మేడం అని . నాకు ఏడుపు వచ్చేసింది . ఖమ్మం హాస్పటల్ లో వున్నపుడు డాక్టర్ ని అడిగి వచ్చి ఎక్సామ్ రాసి వెళ్ళాడట ,జబ్బు ఇంకా ముదిరింది. కాలేజ్ లో చందాలు వేసుకుని నిమ్స్ కి తీసుకెళ్ళారు .తండ్రి వెళితే తండ్రి జేబులో డబ్బు తీసుకుని లెక్కపెట్టి ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అన్నాడట ''అంతే నా చేతుల్లోనే ప్రాణం పోయింది ,కానీ డాక్టర్లు ఆరోగ్య శ్రీ కోసం కోమాలోకి వెళ్ళాడని అబద్దం చెప్పి రెండు రోజులు ఉంచుకున్నారు ''అని చెప్పాడు తండ్రి .
ఎంతమంచి కొడుకు !ఆరోగ్యం బాగాలేనపుడు ఎక్కడో దగ్గర తెచ్చి నన్ను బ్రతికించమని అడగలేదు ,ఎక్కడనుండి తెచ్చావు నాన్నా అని బాధపడ్డాడు . ఆ అబ్బాయి బ్రతికి వుంటే ఆ నిరుపేద కుటుంబం దారిద్ర్య వలయం లోనుండి బయటకి వచ్చేసి వుండేది . ఇప్పుడిక వారికి దిక్కెవరు . బాగా ఏడుపొచ్చేసింది . నేనేం చేయగలను వాళ్లకి ?నేను చేసే సహాయం ఏపాటి ?దిగులేస్తుంది . వెంకటేశ్వర్లు నువ్వు రోగం వచ్చిన మొదట్లో నాకు తెలిసి వుంటే నేనేమైనా చేయ్యగలిగే దాన్నా ?ఏమో ... ఐయాం సారీ వెంకటేశ్వర్లు !
ఈ దేశంలో ధనవంతులంటే అగ్ర వర్ణాల వారు మాత్రమె కాక పోవచ్చు
కానీ ఈ దేశం లో పేదలంటే దళితులూ ,ఆదివాసీలే
పేదరికం యొక్క సత్య స్వరూపం తెలిసిన వాళ్లెవరైనా ఈ సత్యాన్ని తప్పక ఒప్పుకుంటారు .
ఈ దేశంలో ధనవంతులంటే అగ్ర వర్ణాల వారు మాత్రమె కాక పోవచ్చు
కానీ ఈ దేశం లో పేదలంటే దళితులూ ,ఆదివాసీలే
పేదరికం యొక్క సత్య స్వరూపం తెలిసిన వాళ్లెవరైనా ఈ సత్యాన్ని తప్పక ఒప్పుకుంటారు .
1 comment:
సామాన్య గారు ఈ మధ్య మీ బ్లాగ్ చూడటంలేదు అనే కంటే ..నేను ఇక్కడ సంచరించడం లేదు . ఇన్ని రోజులుగా మిస్ అయిన పోస్ట్ లు చూస్తూనే చాలా బాధ కల్గింది . మీరు అంకిత భావంతో చేస్తున్న ఈ కార్యక్రమాలు ఆసక్తిగా ఉన్నాయి. అభినందనలు . ఒక ఆరు నెలల సమయం తర్వాత స్వచ్చందంగా మీ టీం తో పాటు కలసి పని చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి . సోషియల్ సర్వీస్ చేయాలనే ఆసక్తి కల్గిన మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలసి అప్పుడప్పుడు మీ టీం చేస్తున్న కార్యక్రమాల్లో స్వచ్చందంగా పాల్గొంటాము.ఇలా చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మీ బాట స్పూర్తికరం .
Post a Comment