About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Sunday, 28 December 2014

రామచక్కని సీత

 రామచక్కని సీత 


దిగులు కాదు
నిర్లిప్తతా కాదు
చీకటి  ఆకాశంలో 
ఒంటరి చుక్క 

చూరు నుండి 
జారిపడే చినుకుల్లా 
మబ్బుల తెరచాటు 
కాంతి లీలలా 
రోజులు 

Tuesday, 23 December 2014

@కమ్యూనికేషన్ ప్రాబ్లం...


@కమ్యూనికేషన్ ప్రాబ్లం...

సరిగా చెప్పటం 
చేతకాక 
పోగొట్టుకొంటాను 
పుట్ట తేనెని,

కొండ గోగులని 

నిన్ను


పాపం 
విపులం తెలియదు 
నీకున్ను 
అరణ్యాల ఆవలది
సాగరపు లోతులది 

నిధి దొరకాలంటే 
అంజనం రాయాలి 

Sunday, 7 December 2014

విన్నపం .. ..



 ఇది తప్పక చదవాల్సిన కథ . నిర్భయ న్యూస్ ఐటెం గానే మనకు తెలుసు . కానీ నిర్భయ లేదా అభయ మన ఇంటి అమ్మాయిలయితే ఆ బాధ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథని  చదివి తీరాలి. అత్యాచారానికి గురైన అమ్మాయిల అంతరంగ ఘర్షణ ని చిత్రిక పట్టిన కథ ఇది . రచయిత్రి కుప్పిలి పద్మ గారికి కృతజ్ఞతలు .


http://patrika.kinige.com/?p=4307