అనిత పాడిన పాట…!
నిత్యం రద్దీగా వుండే మెయిన్ రోడ్ పక్కన నిలుచుని వుందో పాత కాలం బంగ్లో .హుందాగా శాంతంగా అచ్చు మరో పది తరాలకు కూడా దిగులు లేని పెద్దింటి ఆడపడుచులా వుంది.బంగ్లో ఆవరణలో పరుచుకుని వున్నపనస,అనారు,జామి,మామిడి చెట్ల పై వాలి రక రకాల పక్షులు కిల కిలమని ఎడతెగని కబుర్లు. చెప్పుకుంటున్నాయ్ .ఆకాశంలో సూర్యుడు ఆవిళించి,పళ్ళు తోమి ,కాఫీ తాగి సంద్యాద్రి వైపు పావు వంతు ప్రయాణం కూడా చేసేసాడు.
3333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333388888888
3333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333333388888888
మేడం మా ఇంటిల్లపాడికీ మీరిచ్చే రెండేలే గతి మేడం!చానా మాట్లు ''ఒసేయ్ అనిత... పాసిపోయినయ్ తినబాకా... మూలన పడతావ్'' అంటా వుంటావ్ మేడం నువ్వు ! ఆ తిండి కోసం మా నాయనెంత కష్ట పడినాడో మాకు దెల్సు ...పైనున్న ఆ బగమంతుడికి తెల్సు మేడం !ఈ ఎదవ పొట్ట కోసం నేనెంత కష్ట పడతా వుండానో నాకు దెలుసు మేడం!అందుకే తినేయి జూస్తే... పాసినయి,పారేసినయ్ అన్నా ..., వదలబుద్ధి కాదు మేడం! కళ్ళకద్దుకోవాలనిపిస్తది మేడం.....
- saamaanya
[వార్త ,జనవరి 15,2012]
11 comments:
రెండు వ్యవస్థలని..కళ్ళకు కట్టినట్లు చూపించారు. అనిత పాడిన బతుకు పాటకి మాటలు రాక..మీకు అభినందనలు..చెప్పటం కొసం మేలుకున్నాను. ఈ బతుకులు మారేనా?
మార్చుకునేనా!????????
వనమాలి గారు నేనే ఉద్దేశంతో కథరాసేనో దాన్ని మీరు రెండే వాఖ్యాలలోచెప్పేశారు .గ్రేట్.థాంక్ యు .
జరుగుతున్న కథ..మార్చలేని కథ..
జ్యోతిర్మయి గారు
థాంక్ యు.
కానీ... మార్చలేమంటారా?
Baasmathi biyyaM axinthalu,, very good to read
It is very natural that the MADAM wondered how a dog can live 32 rupees a day
mula.ravi@gmail.com
థాంక్ యు రవి గారు
అవును అలా ఆశ్చర్య పడే వ్యక్తులు నాకు పరిచయం .
ముగింపు ఎలా అనిపించింది ?
ఏం చెప్పదలచుకున్నారో అర్థం కాలేదు అన్నారు కొంత మంది
మీ కథ చదివాను చాలా బాగుంది .
సామాన్య గారూ మారాలంటే వారిలాంటి వారు ఇలాంటివి చదవాలిగా..ఇంట్లో ఒక్కటంటే ఒక్క పుస్తకం లేని ఇళ్ళు నూటికి తొంభైశాతం ఇక మానసిక వికాసానికి చోటెక్కడండీ..
జ్యోతిర్మయి గారూ,పునర్వివాహం చేసుకున్న విధవలందరికీ చదువూ,స్వయంగా మానసిక వికాసమూ లేకపోయి ఉండొచ్చు. కానీ,చదువుకున్నవీరేశ లింగం గారూ ,గురజాడ గారూ తెచ్చిన మార్పు ఏమీ లేదంటారా?
వీరేశ లింగం గారూ ,గురజాడ గారూ మార్పు తీసుకుని వచ్చింది విధవలలో, అప్పటికే వారు ఆ జీవిత౦ గడపలేని స్థితిలో ఉన్నారు...మన కథలో మార్పు రావలసినది మేడం ఆవిడ భర్తలలో. వారికి మారాల్సిన అవసరం లేదుగా, అంటే సమస్య వారిది కాదుకా. వారి జీవిత విధానంలో మానసిక వికాశానికి తావు లేదని నా అభిప్రాయము.
సామాన్య గారూ అన్యధా భావించకండి అనవరసరమైన ఆర్భాటాలకు వెళ్లి, మంచి చెడుకు తేడా తెలియని నేటి ధోరణి చూస్తుంటే వచ్చిన ఆవేశం ఇది. మీ అభిప్రాయాలను ఖండించాలని కాదు...ధన్యవాదాలు
మార్పు రావలసిందీ...,చరిత్ర పొడుగూతా మార్పు వచ్చిందీ అనిత లాటి వారిలో అని నా భావన.మేడం లాటి వారిలో మార్పు గురించి నేను ఊహించలేదు,ఎప్పుడూ ఆశా పడలేదు ..
మీరు ఇంత సీరియస్ గా ఈ కథకి స్పందించిన తీరు నాకు ఆనందం కలిగించింది .అన్యదా భావించడానికి ఏమీ లేదు .థాంక్ యు.థాంక్ యు వెరీ మచ్ .
అనిత పాడిన పాట వర్గ అంతరాలను ,పితృస్వామ్యపు మురికిని ,కర్ణ కటోరంగా వినిపించింది .అర్థాంతరంగా ఆగిపోయిన పాట ,అర్థాంతరంగా ముగిసిపోయే పేదల జీవితాన్ని విషాద మోహన రాగం లో పాడింది.
నవలకు సరిపడే జీవితాన్ని చిన్న పారాగ్రాఫ్ లో నిబంధించి సంక్షిప్తతకు ప్రాణం పోసిన మీ ప్రతిభ అమోఘం .
Post a Comment