ఈ పాటని మొదటి సారి ఆరో తరగతిలో అనుకుంటా విన్నాను . పాట మాధుర్యం కంటే ఇందులో వున్న సాహిత్యం నాకు ఎక్కువ ఇష్టం .ముఖ్యంగా ''ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే ...''లైన్స్ ఇష్టం. ఆత్మ శాంతి అనేది చాలా పెద్ద మాట అందు బదులుగా ఆనందం అని చిన్న మాట వాడేసి వుంటే ఈ సరలళతకి ఇంకా అందం వచ్చేదేమో .
ఒక సారి హాస్టల్ లో వున్నపుడు ఒకమ్మాయి రూమ్లో ఒక పోస్టర్ చూసాను . యదాతదంగా జ్ఞాపకం లేదు కానీ ఒకతని వెంట భగవంతుడు ఎప్పుడూ నడుస్తూ ఉంటాడు .దేవుని పాద ముద్రలు అతనికి కనిపిస్తూ వుంటాయి .ఒక సారి అతనికి గొప్ప కష్టం వస్తుంది . అప్పుడు దేవుని పద ముద్రలు కనిపించవు అతను కినుకు పడి నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు లేవు అని అలుగుతాడు . అప్పుడు దేవుడు అంటాడు నువ్వు చూసింది నా అడుగుల గుర్తులు ఎందుకంటె నువ్వపుడు నా చేతుల్లో వున్నావు అని . నిజం కదా దైవమంటే యుక్తాయుక్త విచక్షణ కలిగి ,కష్టాలలో కూడా మంచిని విడిచి పెట్టని వ్యక్తే నని నా అభిప్రాయం . అలాటి మనుషులే కాలక్రమాన దైవాలవుతారు .
ఏ విధి మారినా వారు మారరు .
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...
ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
చీకటి ముసిరినా వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన
పరమాత్ముని తలచుకో
జానకి సహనము రాముని సుగుణము
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...
ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు
ఏ సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే
మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
చీకటి ముసిరినా వేకువ ఆగునా
ఏ విధి మారినా దైవం మారునా
కలిమిలోన లేమిలోన
పరమాత్ముని తలచుకో
జానకి సహనము రాముని సుగుణము
ఏ యుగమైనను ఇలకే ఆదర్శము
వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము
నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలొ వేదన మరచిపో
నీ మది చల్లగా ...
2 comments:
చాలా చక్కని పాట . మీకు ఇష్టమేనన్న మాట. షేర్ చేసినందుకు ధన్యవాదములు
naaku chaalaa ishtamandee ...thank you .
Post a Comment