About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday, 13 January 2012

చిలుకనెప్పుడైనా పెంచుకున్నారా....


అనంత హరితాకాశం నుండి

పట్టి తెచ్చాక

చిలుక

ఎలవర పోతుంది

పడగలెత్తి నిలుచున్న
పంజరం
నిజమో, మాయో
అర్థం కాక
చిలుక
స్తంభించి పోతుంది

పచ్చ పట్టు రెక్కల్ని
పట్టి
కత్తిరించాక కూడా
తుఫాను చెట్టులా
అటై,ఇటై
ఎగరడమనే
తన
పురాతనేచ్చను
పరీక్షించుకుంటుంది

కాలం
బొట్టు బొట్టు
కన్నీళ్లుగా కరిగి
కలలనేత గుండె
తడిసి
వెలిసి పోయాక
చిలుక
కలలోలా
నీకు దగ్గరవుతుంది

పూల కాయల చెట్లు
పురావర్ణ చిత్రాలయ్యాక
హృదయ హరితాన్ని
కోల్పోయి ,
చిలుక
నల్లమందు బానిసలా
నీ గూటి పలుకులు
పలుకుతుంది
[వార్త లో....]

10 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

పర్యావరణ సృహ కల్గిన కవిత ఇధి. నాకెంతగానో నచ్చాయి..ఈ పంక్తులు
పూల కాయల చెట్లు
పురావర్ణ చిత్రాలయ్యాక
హృదయ హరితాన్ని
కోల్పోయి ,
చిలుక
నల్లమందు బానిసలా
నీ గూటి పలుకులు
పలుకుతుంది.

Afsar said...

బాగుంది సామాన్య, స్త్రీని, ప్రకృతిని కలిపిన కవిత. అవును వనమాలీ, స్త్రీ హృదయ పర్యావరణ స్పృహ కల్గిన కవిత ఇదీ.

సామాన్య said...

వన మాలి గారు ,థాంక్ యు.

సామాన్య said...

సర్
మీ కామెంట్ నాకో ఆలోచన .
థాంక్ యు
థాంక్ యు వెరీ మచ్ .

krishh said...

పూల కాయల చెట్లు
పురావర్ణ చిత్రాలయ్యాక
హృదయ హరితాన్ని
కోల్పోయి ,
చిలుక
నల్లమందు బానిసలా
నీ గూటి పలుకులు
పలుకుతుంది ...AMAZING

సామాన్య said...

thank you krishh

SANGEETA REDDY said...

పడగలెత్తి నిలుచున్న
పంజరం
నిజమో, మాయో
అర్థం కాక
చిలుక
స్తంభించి పోతుంది..........................i liked these lines!

krishh said...

ఈ కవిత
వాస్తవిక దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టు ...especially ..నా లాంటి వాళ్ళు respond అవ్వటానికి వీలుగా సరళం గ వుంది .

సామాన్య said...

సంగీత గారు
థాంక్ యు .

సామాన్య said...

థాంక్ యు కృష్ణ మోహన్
ఈ కవిత మిమ్మల్ని ఇంతలా స్పందింపజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
థాంక్ యు .