About
Friday, 24 February 2012
నాకు బోలెడు ఇష్టమీ కథ...!
Tuesday, 14 February 2012
మంచి ప్రేమ పాట ఒకటి...!
ఒక రాత్రి ఫోన్ చేసి చాలా ఉద్వేగంగా చెప్పింది స్నేహితురాలు ఈ పాట నేర్చుకుంటున్నానని .ఇందులో సాహిత్యం తనకూ నాకూ చాలా నచ్చింది.నిజానికి ప్రియ సిస్టర్స్ కంటే తన పాట నాకు ఎక్కువ నచ్చింది .అట్లా అనేక సార్లు విన్న పాట ఇది.
చాలా సార్లు ఆశ్చర్యం వేస్తుంది ,అన్నమయ్యనో ,త్యాగయ్యనో ...వింటూ వుంటే .రాయాలని వున్నా ఇంకేం రాద్దాం లెద్దూ ప్రేమకవిత్వం అనిపించేస్తుంది వీరి ప్రేమ పాటలు చూస్తే ,దానిని మనం భక్తి అంటున్నాం అనుకోండి .మరీ ఎక్కువ సాగదీస్తే ప్రేమ ,భక్తిగా (లేకపోతే పిచ్చిగా)మారుతుందనుకుంటా.భక్తో ,ప్రేమో ఏదైనా రాయడానికి మనకేం మిగల్చనట్టే వీళ్లు ఆలోచిస్తే.
'మనసు నీయాధీనము మాటలు నీవాడేటివే'...నట పిల్లలు మన పలుకులే పలికినట్లు.''వెలినీవె లోనీవే వేడుకలెల్లా నీవే''నట .అమ్మ తప్ప చిన్ని చిన్ని పిల్లలికి మరోటి వుండదే ,అట్లా కాబోలు .ఇంత ఘనం ప్రేమించేస్తే దేవుడు కనిపించకేం చేస్తాడు?అవును కదా ...!
Monday, 13 February 2012
పూరి జగన్నాథ్ 'బూతు పోకిరి '
2006 లో పోకిరి మూవీ చూశాను.విపరీతంగా జుగుప్స కలిగింది.కోపమొచ్చింది .ఇంటికొచ్చి కాయితమోటి తీసుకుని ఇది రాసేసి ప్రజా సాహితికి పంపేశాను.కొన్ని రోజులాగి రవి గారికి ఫోన్ చేసి అందిందా అని అడిగాను.ఆయన వెంటనే అయితే మీరీ మధ్య ప్రజా సాహితీ చదవటం లేదన మాట అన్నారు.నేను చాలా నిజాయితీగా లేదండీ నాకు పాప పుట్టిందీ అన్నాను.రవి గారు నాకు మారిన అడ్రెస్స్ ఇచ్చారు.అప్పటికి నా దగ్గర రఫ్ కాపీయే ఉండింది.అదే పంపించేసాను.అదే ఇది .మళ్ళీ ఇన్ని రోజులకి నాకు బిజినెస్ మేన్ మీద రాయాలనిపించింది.అది రాస్తూ ఇది జ్ఞాపకమొచ్చి బ్లాగ్ లో పెట్టాను.
ఈ దేశపు పేద, మధ్యతరగతి ప్రజలకు కాస్త సేద తీరేందుకు ,ఆనందించేందుకు ఉన్న ఏకైక మార్గం సినిమానే.అందుకే ఆ సినిమా ప్రభావం వారి జీవన శైలి ఫై ముఖ్యంగా యువతరం పై మరీ తీవ్రంగా ఉంటుంది .
పూరి జగన్నాథ్ సంపూర్ణ నేతృత్వం లో ఈ మధ్య “పోకిరి” అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో హీరో... కృష్ణ కొడుకు, మహేష్ బాబు .సినిమా అంతా దర్శకుడు చాల సామాజిక అంశాలను నెత్తికెత్తుకుని బాధ పడుతూ ఉంటాడు.ప్రేక్షకులు ఇవన్ని జరిగినవే కదా అని ఫీల్ అయిపోతుంటారు కాకపోతే అన్నీ దర్శకుడి సినిమాకు రంజుదనాన్ని తెస్తుంటాయి.దర్శకుడు పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తుంటే ఆ పాత్ర ,శరీరం స్త్రీ సాంగత్యం కోరుతుంది.”మసాజ్ పార్లర్ కు వెళ్దాం పద” అనో ,”అమలాపురం లో ఆడవాళ్ళు బాగుంటారట ” కదా అనో, వంకరగాఅంటూ ఒక దెబ్బ కు రెండు ఫీలింగ్ లను తెప్పిస్తాడు .
దర్శకుడు పోలీసు వ్యవస్థ గురించే కాదు ,గూండా ల గురించి,సెల్ ఫోన్ లో సెక్స్ దృశ్యాల గురించి,టీవీ ల గురించి ఏమిటేమిటో చెప్తాడు.మధ్య మధ్య లో హిందీ సినిమాలను ,ఎం టీవీ ని మరిపించే దృశ్యాలు,పాటలతో కిర్రెక్కిస్తుంటాడు.ఏం చేసినా సినిమా లో కామరసం పోర్లేట్టు చూసుకుంటాడు.
సినిమాలో ఎస్.పి పాత్ర ,”గాంధీ సినిమా ను ఎవరు చూడరు అదే కడప కింగ్ అంటే రెండు వందల రోజులు నడుస్తుందని” అంటుంది.ఈ డైలాగు పూరి జగన్నాథ్ ఫ్రస్ట్రేషన్ నుండి వచ్చిందే .పూరి సినిమాలు ఇంతకు ముందు మరీ ఇంత కంపుగా వుండేవి కావు.కొన్నిభారీ ఫ్లాపుల తర్వాత కంపు పెరిగింది .అతనెందుకు గ్రహించలేదో కానీ కడప కింగ్ లే కాదు, తేజ హీరోయిన్ జాకెట్ లో నుంచి ఈనాడు, వార్త , పత్రికల బాల్స్ ని చెరో వైపు నుండి తీయించినా సినిమా ఫ్లాప్ అయింది.అశ్లీలతే సినిమా కి ఆయువు పట్టు అనుకోవడం తెలివి తక్కువ తనమే.
గురివింద గింజ సామెత ఒకటి ఉంది.అది పూరి కి సరిగా సరిపోతుంది.తానొక బాధ్యత గల పౌరుడిలా టీవీ 9 కి t tv అని పేరు పెట్టి అశ్లీల దృశ్యాలేమన్నా దొరికితే ముందు మాకే ఇవ్వండి రోజంతా వేస్తాం అని విలేఖరికి డైలాగు పెట్టిన దర్శకుడు ,నువ్వు ఆడదానివి కాదా మీ అక్కాచెళ్ళల్లని ఇలా చేస్తే వూరుకుంటారా అని డైలాగు చెప్పే హీరో దారిలో వెళ్తున్న హీరోయిన్ని ఆపి ఆమె టీషర్టు పై (కేమెరా ని నిలబెట్టేసి )దృష్టి కేంద్రీకరించేసి అంతా కాకపోవచ్చు కానీ some parts of me are awesome అని వర్ణిస్తుంటారు. ఎస్.పీ కూతురిని మంత్రి కొడుకు చేడుపుతున్నట్టున్న దృశ్యాలు సినిమాలో బూతుకు చేరుపే కానీ మరోటి కాదని ప్రేక్షకుడు గ్రహించగలడు.
పూరి తన సినిమా లో పాటలని స్త్ర్రీ శరీర ప్రదర్సనకే కేటాయిస్తాడు.ఎం టీవీ ని తలపించేలా పాటలు ఇది వరకే సూపర్ సినిమాలో ప్రేక్షకులకు పరిచయమే.ఇందులో “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే” అనే పాట ఆ తరహాకి హైలైట్ .అందులో పిల్ల తన శేరీరాన్నంతా తెర మీద పరిచేసి గంతులేస్తూ జుగుప్స కలిగిస్తుంది .ఈ పాట చాల హిట్.రాఘవేంద్ర రావు వృద్దుడై, శీలవంతుడు అయిన తర్వాత విఖ్యాతమైన అతని బొడ్డుకి మరి నాలుగు చేర్చి, పూరి సినిమాలను కంపు కొట్టిస్తున్నాడు.ఈ తరహా ఏంటని? ఏదో టీవీ ఇంటర్వ్యూ లో ప్రశ్నిస్తే చాలా నిర్లజ్జగా, “అంతా డబ్బు కోసమే "greed for money " అని సమాధానం ఇచ్చాడు.
సినిమాలో ఇంకో దృశ్యం ఉంటుంది .విలన్ ఒకడు ఒక పిల్ల చేత మంచానికి కట్టించుకుంటాడు.ఆ పిల్ల, వాడి మీదకెక్కి లిప్ స్టిక్ పూసి కొరడా తీసుకుని కొట్టేదా కొట్టేదా అంటుంటుంది .ఇది ప్రఖ్యాత పర్వర్టేడ్ ఆంగ్ల చిత్రం బేసిక్ ఇన్స్టింక్ట్ కు అనుకరణ.మాతృక ని ఎంత మంది పిల్లలు, స్త్రీలు చూసారో కానీ ఆ దౌర్భాగ్యాన్ని అఖిలాంధ్ర ప్రేక్షకులకు కలిగించాడు దర్శకుడు.సినిమా కు ఆ సన్నివేశం అవసరం అని దర్శకుడు కూడా చెప్పలేనంత అనవసరం గా ఉంది.కనుక ఆ సీన్ పూరి జగన్నాథ్ లోని పర్వర్షన్ కి ఒక నిదర్సనం గా చెప్పవచ్చు.
సమాజ సేవకి అంకితం అయిపోయాడు కదా దర్శకుడు, అందులో భాగంగానే పది సార్లు నిరోద్ అనిపిస్తేనన్న ప్రజలు కుటుంబ నియంత్రణ పాటిస్తారు అన్నట్లు అలీ చేత ప్రభుత్వ నిరోద్ ప్రకటన బోర్డు ని చూపిస్తూ ''అర్థ రూపాయి కి ఇది కూడా రాదు'' అని ఒక సారీ, మహేష్ బాబు చేత ఎస్సై ని మీ నాన్న నిరోద్ వాడి వుండాల్సింది నువ్వు పుట్టకుందువు అని ఒక సారీ అనిపిస్తాడు .యాభై ఏళ్ళ మనిషిని పట్టుకుని అప్పుడు మీ నాన నిరోద్ వాడున్డాల్సింది అనడం ఎంత అసహ్యం?
ఈ మధ్య నెల్లూరు జిల్లా కావలి లో ఒక ప్రముఖ కాలేజీ లో వార్షికోత్సవం తర్వాత, మధ్య రాత్రి హాస్టల్ కు వెళ్తున్న ఆడపిల్లలపై అదే కాలేజీ అబ్బాయిలు ముసుగులేసుకుని దాడి చేసి చెప్పుకోలేని చోట్ల కొరికి గాయపరిచారు.
ఈ ఐడియా వాళ్ళకి “సై” అనే సినిమా నుండి వచ్చిందట .మహిళా సంఘాల వాళ్ళు, ప్రజాతంత్ర వాదులు ధర్నాలు చేసి, కరపత్రాలు వేసి ఆందోళన చేసారు.కానీ ఆ అమ్మాయిల తోలి యవ్వన జీవితం పై జరిగిన పైశాచిక దాడి జీవిత పర్యంతం వారిని భయ పెడుతూనే ఉంటుంది.దీనికి బాధ్యులు ఆ అబ్బాయిలే అనడం కన్నా సై సినిమా టీం అనడమే న్యాయం.
చాల సార్లు ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు కనుక అలాంటి సినిమాలు తీస్తున్నామని దర్శకులు అంటారు.అది తప్పు.ఇదే మహేష్ బాబు “ఒక్కడు” సినిమాని ఎటువంటి స్త్రీ శరీర ప్రదర్శన లేకపోయినా వంద రోజులు చూసారు.ప్రేక్షకులు అశ్లీలం కోసమే సినిమా చూడరు.చూసే వాటికి అలవాటు పడతారు.ఈ పోకిరి సినిమా మొదటి సారి చూసినప్పుడు నేను చాల జుగుప్స కి లోనయ్యాను.ఈ వ్యాసం రాయాలనే ఆలోచన కలిగాక రెండో సారి చూసాను.ఈసారి నాకు అంత జుగుప్స కలగలేదు.కారణం అలవాటు పడడమే. అలవాటు పడడం చాలా ప్రమాదకరం .ఎందుకంటే ఎప్పటికప్పుడు డోస్ పెంచాలి కదా .బహుశా సెన్సార్ వాళ్ళు కూడా నాలాగే అలవాటు పడ్డారేమో .అంటే రాబోయే సినిమాల అశ్లీలానికి మనం అనివార్యంగా అలవాటు పడాలేమో.
స్త్రీ శరీరాన్ని ప్రదర్శించటానికి, రెచ్చగోట్టేట్టు ప్రదర్శించడానికి తేడా ఉంది.పూరిది రెండవ పద్దతి .సెక్స్ సినిమాల ముద్ర తో వచ్చే షకీలా సినిమాలు సమాజం లోని అన్ని వర్గాల వారు చూడరు .ఆ థియేటర్ల ముందు కూడా నిలబడరు .కాని పూరి జగన్నాథ్ ,సెన్సార్ బోర్డు ,కలిసి అలాంటి భయాలేమి అవసరం లేకుండా ఆబాలగోపాలానికి, షకీలని మించి పోయేంత అంగాంగ ప్రదర్శనలతో సినిమాలు చూపించి మైమరిపిస్తున్నారు.ఏ అడ్డం ,సిగ్గు లేకుండా ప్రజలు ఈ సెక్స్ సినిమా లు చూసేస్తున్నారు.
హెచ్.బి .టీ వాళ్ళు ,”వ్యసనం” అని ఒక అనువాద పుస్తకం ప్రచురించారు .అందులో డ్రగ్స్ కన్నా ఆల్కహాల్ ఎక్కువ ప్రమాదకరం అంటాడు రచయిత.ఎందుకంటే ఆల్కహాల్ లభ్యత ఎక్కువ.ప్రభుత్వమే స్వయంగా దుకాణాలను పెట్టి వ్యసనాన్ని నేర్పుతుంది.పూరి జగన్నాథ్ సినిమాలు ఆల్కహాల్ అయితే మన సెన్సార్ ప్రభుత్వ సారాయి దుకాణం లాంటిది.
ప్రజాసాహితి ,ఆగష్టు 2006.
Friday, 10 February 2012
పాపాయి...!
Thursday, 9 February 2012
ఒక కథ - ఒక సినిమా.
.టైపింగ్ లోపానికి క్షంతవ్యురాలను.
పహేలి చూసినప్పుడు ఆ మూవీ నన్ను ఎంత ఆకర్షించిందంటే ...మతిపోయింది.ఎటువంటి కథ ఇది. ఊహలో కూడా ఎప్పుడూ తోచదే అని .ముఖ్యంగా దెయ్యం ,పక్షిలా వచ్చే సన్నివేశం, దాని అరుపు[సంగీతం: కీరవాణి} ,అప్పుడు రాణి హావభావాలు నాకు మతి పోగొట్టేశాయి.
అప్పుడు ఆ కథ ఎవరిదీ ,ఏవిటీ నాకేమి తెలీదు.తర్వాత ఎలాగో తెలిసింది విజయ దాన్ దేత Vijaydan Detha కథ అని .ఆ తరవాత కొన్నాళ్ళకి లిఖిత ప్రెస్ వాళ్లు వేసిన ''విజ్జి'' అనువాదకథలసంకలనం ''సందిగ్ద''చదవడంజరిగింది .ప్రతి కథ ఒక షాక్ .అంతకు మించీ స్త్రీవాదం ఎవరైనా ఏం ఊహించగలరూ అనిపించింది
కథ మూడుముక్కల్లోఏంటంటే..ఒకమగాడు,,,వాడికి అందమైనఅమ్మాయితోపెళ్ళవుతుంది
.పెళ్లిచేసుకుని వచ్చే దారిలో ఓదెయ్యం ఆపిల్లని చూసి మొహిస్తాడు.వ్యాపారం తప్ప హృదయ వేదనలు పట్టని మగడు
,కొత్తపెళ్లికూతుర్నివదిలిఏదోవ్యాపారానికిసుదూరానికివెళ్లిపోతాడు. అప్పుడీదెయ్యం,
మగడివేషంలోవచ్చిఆపిల్లతోకాపురంమొదలెడతాడు.కానీనిజంచెబుతాడు.నిజంచెప్పినాఆపిల్లవాడినికోరుకుంటుంది.
గర్భవతికూడాఅవుతుంది
.మగడువస్తాడువిషయంతెలుస్తుంది.నేనునిజమైనమగడినంటేనేనునిజమైన. మగడిననిపోట్లాడుకుంటారు.తీర్పుకురాజుదగ్గరికివెళ్తూవుంటే ,మార్గమధ్యంలోఓగొర్రెలకాపరిదయ్యాన్నిబంధించిసమస్యనిపరిష్కరించేస్తాడు.
ఇప్పుడునాకుమూవీగుర్తులేదుకానీకథలోమంత్రగాడుఅంటాడూ''ఏడుసార్లుచిటికేవేసేలోగా
ఎవరైతేఈనీటిబుర్రలోదూరుతారోవాడేపడకగదికినిజమైనయజమాని''అని .అంతేఆపిల్లని అమితంగా ప్రేమించేదెయ్యంఆనీటిబుర్రలోకిదూరేస్తాడు.
అంతాబానేఉంది,పడకగదిలోకిఅసలుమగడువచ్చేసాడు. కానీఅప్రమేయంగాఇద్దరుమగవాళ్ళమధ్యనలిగిన ఆమె జీవితంసంగతిఏంటి?పడక గదికి యజమాని సంగతి సరే ఆమె మనసుకి యజమాని సంగతేంటి?ఆపిల్లమనసులోపీటంవేసుకుకూచున్నఆదెయ్యంమీదిప్రేమసంగతిఏంటి ???.ఏడుచిటికెలువేసిదానినికూడాఏదైనానీటిబుర్రల్లోకిపంపగలిగేగొర్రెలకాపరులువుంటేఎంత బాగుండు కదా అనిపిస్తుంది., దిగులేస్తుంది. చదివినఅనేకసంవత్సరాలతరువాతకూడా,వెంటాడేకథఈ ''ఉల్ఝన్''[సంశయం} .
లిఖిత ప్రెస్
అనువాదం :కే .సురేష్
Sunday, 5 February 2012
సీత కష్టాలు ...
|