About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday, 15 March 2012

అనంతర దృశ్యం...!


అవాంచితపు ఏకాంతమొకటి
ఎడతెగని కావిలింతై కామిస్తుంది
దుక్ఖం ఎందుకనో ఊరకనే అపహసిస్తుంది
జీవితం
ఆవిలింతై
ముణగదీసుకుని
కదలనంటుంది.
కొన్నేసి భూకంపాల తరవాత
కొత్త దృశ్యాలు మొలకెత్తుతాయి
ఇహ ఇప్పుడు శిఖరాలు కాదు
కబళించి వేసే బడబాగ్ని కావాలి
నగ్నమో అర్థనగ్నమో కాదు
నైరూప్యమొకటి
పాదాక్రాంతం కావాలి
అద్వితీయమూ అమలినమూ కాదు
కోల్పోవటం కావాలి
తాళమూ గానమూ కాదు
కొత్త ఊహ కావాలి
విశ్వాంతరాళాన్ని ఒక్క తన్ను తన్ని
లయమవాలి
స్వప్న వర్ణాలను అద్ది
సాకారాన్ని చిత్రించాలి.


9 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

కవిత అసాంతం బాగుంది.

ఇంకా ఇంకా చెప్పాలంటే

"అద్వితీయమూ అమలినమూ కాదు
కోల్పోవటం కావాలి"

చాలా బాగుంది.

Afsar said...

అవాంచితపు ఏకాంతమొకటి
ఎడతెగని కావిలింతై కామిస్తుంది
దుక్ఖం ఎందుకనో ఊరకనే అపహసిస్తుంది
జీవితం
ఆవిలింతై ముణగదీసుకుని
కదలనంటుంది.
---సామాన్య, ఇందులో ఏ వొక్క లైనో తీసి, అది ప్రత్యేకంగా, అసామాన్యంగా వుందని చెప్పడం కష్టం. ప్రతి లైనూ మనసులో ముద్రించేట్టు...వొక నిటారుగా నిలబడిన చెట్టు!

జలతారు వెన్నెల said...

WOW! చాలా బాగుంది.

సామాన్య said...

ప్రతి లైనూ మనసులో ముద్రించేట్టు...వొక నిటారుగా నిలబడిన చెట్టు!...సర్ మీ ఈ వాక్యాలు నాకెంత నచ్చాయో ఇప్పటికి బోల్డు సార్లు కిరణ్ కి చెప్పి మురిసి పోయాను...ఏమంటే మీరు బాగుందంటే నేను పరీక్ష పాసయినట్టు.థాంక్ యు సర్ .

సామాన్య said...

థాంక్ యు వనజ గారూ ...నాకూ ఆ వాక్యాలు నచ్చాయి.బిజినెస్ మేన్ మీద మీరు రాసిన పోస్ట్ చాలా బాగుంది .పొద్దునే మేమిద్దరం చదివాం.

సామాన్య said...

@జలతారు వెన్నెల
థాంక్ యు అండీ

Dr.Pen said...

బావుంది.అఫ్సర్ గారి మాటే నా మాట!

సామాన్య said...

Thank you.

Anonymous said...

good poetry.