About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Thursday, 22 March 2012

మన ముక్తి యెక్కడుందంటే...!




కర్ణాటక   సంగీతమూ ,హిందూస్థానీ సంగీతమూ ఇంకా అవీ ఇవీ లాగా కాకుండా బెంగాలీలకే ప్రత్యేకమైనవి  ''రబీంద్ర సంగీత్ '',''రబీంద్ర న్రిత్యో ''...బెంగాలీలు రెండో ఆలోచనేమీ లేకుండా ప్రీతిగా ,పిచ్చిగా, తలవంచి వినమ్రులై నేర్చుకునే సంగీతమూ ,నృత్యమూ ఇవి.రవీంద్రుడు బెంగాలీల ప్రతి సందర్భానికీ ఒక పాట రాసి పెట్టాడు.అందుకే అది టీవీ సీరియల్ అయినా ,సినిమా అయినా ఆ సందర్భానికి వీళ్ళో పాట వెతికేసుకో గలరు. 

ఈ పాటని నేను  అపర్ణా సేన్ కొత్త సినిమా ''ఇతి మ్రిణాలిని''లో మొదటి సారి చూసాను .చూసి మస్తు పరేషాన్ అయ్యి ఇదేం  పాటరా నాయనా ఇంత బాగుంది అనుకున్నాను.ఒక సారి మా ఇంటికో రేడియో గాయని వచ్చింది .ఆవిడ పాటలు వింటూ ఈ సినిమా పాట అడుగుతే అది రబీంద్ర సంగీత్ అని చెప్పింది.

ఇప్పుడు నా కూతురు భరత నాట్యం తో పాటూ నేర్చుకుంటున్న రబీంద్ర న్ర్యత్యం  ''ఆనంద లోకే ...మొంగళాలోకే '' 

అనుకోకుండా ఈ పోస్ట్ మొదలెట్టాను.ఈ సారి ఎప్పుడైనా విపులంగా రవీంద్రుడి నృత్య గానాల గురించి వ్రాస్తాను అంతవరకూ ఈ పాట వినండి .లిరిక్ మీనింగ్ ఇద్దామని వెతుకుతుంటే ఎవరిదో బ్లాగ్ దొరికింది.ఆసక్తి వుంటే చూడొచ్చు లాగుంది .నాకు విహంగ వీక్షణమే కుదిరింది .http://lovetagore.blogspot.in/2011/04/amar-mukti-shrboni-sen.html 

పాట అర్థం ఆంగ్లం లో వస్తుంది పాట వింటూ అక్కడే చూడొచ్చు.

AMAR MUKTI ALOI ALOI
EI AKASHE , AMAR MUKTI ALOI ALOI.
AMAR MUKTI- DHULAI DHULAI GHASHE GHASHE
EI AKASHE AMAR MUKTI ALOI ALOI.(2)

DEHO MONER SUDUR PARE
HARIYE FELI APONARE (2)
GANER SHURE AMAR MUKTI URDHE BHASHE
EI AKASHE AMAR MUKTI ALOI ALOI.(2)

AMAR MUKTI SHORBOJONER MONER MAJHE
DUKHHO BIPOD TUCHHO KORA, KOTHIN KAJE (2)
BISHHO DHATAR JOGGO SHALA
ATTO HOMER BONHI JALA(2)
JIBON JANO DI AHUTI , MUKTI ASHE.

EI AKASHE AMAR MUKTI ALOI ALOI(2)
AMAR MUKTI DHULAI DHULAI GHASHE GHASHE (2)
EI AKASHE AMAR MUKTI ALOI ALOI(2)

  

4 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

రబీంద్ర సంగీత్ మొదటిసారి వినడం. బాగుంది.. మేడం. మా వర్కర్స్ బెంగాలి మాట్లాడుతుంటే..నాకు విసుగు.అర్ధం కాకుండా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ వీడియో వారికి చూపాను. చాలా సంతోషపడ్డారు. బెంగాలి వారికి వారి భాష..పట్ల ,అలాగే దేశం పట్ల గౌరవం. హిందీ కూడా వారికి బాగా రాదు. కొద్దిగానే తెలుసు. చాలా విషయాలు చెపుతారు. ప్రియాంక మజుందార్ గారు అందించిన చిత్రంలో.. శాంతినికేతన్ ఉంది కదా! శ్వేతవర్ణం లో ఉన్న భవనాలు అని చెప్పారు. అక్కడిదాకా రాకుండానే..శాంతి నికేతన్ చూసి సంతోషించాను.ధన్యవాదములు.

పాపాయి కి సంగీతం,నాట్యం,చిత్రలేఖనం ,ఇంకా కథలు చదవడం..చాలా కళల పట్ల మంచి అభిరుచి ఉన్నట్లు తోస్తుంది. చాలా సంతోషం. తాను కోరుకున్న రంగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించి..మంచి పేరు తెచ్చుకోవాలని.. నా దీవెనలు . మన భారతీయ సంస్కృతికి వారదులుగా చిన్నారులని పెంచడమే..తల్లిదండ్రుల భాద్యత. సామాన్య&కిరణ్ గారు...అభినందనలు.

సామాన్య said...

వనజ గారూ

బెంగాలీలు మరీ తప్పని సరైతేనే తమ ఊరిని వదలటానికి ఇష్టపడతారు.బాగా కుటుంబ స్వభావం .సరళులు,సున్నితులూ ...తమ ప్రాంతం పట్ల చాలా ప్రేమ .

బెంగాలీ ఊరికే వచ్చేస్తుంది నేర్చుకోండి .

పాపాయికి మీరిచ్చిన దీవెనలు తప్పక ఫలిస్తాయి .

చాలా కృతజ్ఞతలు.

తృష్ణ said...

బావుంది పాట. రవీంద్ర సంగీటానికి సంబంచించి మా ఇంట్లో కొన్ని కేసెట్లు,సీడిలు ఉన్నాయి. భాష అర్ధం కాకపోయినా టాగూర్ మీదున్న అభిమానం కొద్దీ నాకూ అవి ఇష్టం. నా సంగీతప్రియ బ్లాగ్లో టాగూర్ పాడిన గీతాలు, కవితలు పెట్టాను చూసారా?

సామాన్య said...

choosaanu .chaalaa kaalam krithame anukuntaa.