ఆగకుండా మ్రోగిన
అర్థ రాత్రి ఫోన్
నువ్వెళ్ళి పోయావని చెప్పింది .
నువ్వంటే జీవ నదివి కదా
వెళిపోయావంటే
ఎలా నమ్మనూ
మిగిలిన సగపు మంచురాత్రి
నన్ను డొక్కలో పొదవుకొని
వెచ్చటి కన్నీటి మేఘాన్ని
నాపై కురిపించి
నీ జ్ఞాపకాల సుధ
తీపిగానే ఎందుకుంటుందని
అడిగింది
చెప్పూ ,ఏమని చెప్పనూ
నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫీ గ్లాసేనా
మా సగపు బ్రతుకు ఎడారిని
దాటించిన ఎడారి ఓడవి కదా
ఎ దారీ లేని దాహార్తిలో
మేం నీకెన్ని సార్లు
మ్రుత్యువునివ్వలేదు
కొత్తగా ఇవాళ నువ్వెళ్ళి పోయావన్నారే
నువ్వు ఈదులాడింది
అంతు లేని సాగరం కదా
ఇవ్వాళ జ్ఞాపకాల బొత్తి విప్పి
వెతుకుతున్నా
శాంతం పేరుకున్న
నీ చల్లటి ముఖంలో
విరిగిన ఒక్క విసుగు పెదవి కోసం
నువ్వంటే మా ఆశా పూర్ణానివి కదా
ఇక్కడ నిరాశని చ్చావేం
మేం ఎన్నెన్ని సార్లు
తుఫాను మేఘాలమై
నిను కల్లోలించాం
కన్నీళ్ళమై ,వెర్రి నవ్వులమై
అవమానాలమై,దరిద్రపు ఆకళ్ళమై
గర్వాలమై ,సంత్రుప్తులమై
నీకెన్ని రంగులనిచ్చాం
కానీ నువ్వు జీవన పర్యంతం
ఎలా నిర్వర్ణమై నిలిచావు
ఇంటి పావురాయి
పొయిలో పిల్లి
చూరు కింది కుక్క
నీ ఉపనదులు
అన్నింటిపై నీ చేతివేళ్ళ
ప్రేమ స్పర్శలు
జీడి గింజతో వేసినట్టు
అతికి పోయి కనిపిస్తున్నాయ్
చెప్పూ నువ్వెళ్ళి పోయావంటే
ఎలా నమ్మనూ
ఐనా మనిషున్నంత కాలం
మనిషికి మరణమేలా సాధ్యం
నువ్వెక్కడికైనా
ఎలా వెళ్లి పోగలవ్
అర్థ రాత్రి ఫోన్
నువ్వెళ్ళి పోయావని చెప్పింది .
నువ్వంటే జీవ నదివి కదా
వెళిపోయావంటే
ఎలా నమ్మనూ
మిగిలిన సగపు మంచురాత్రి
నన్ను డొక్కలో పొదవుకొని
వెచ్చటి కన్నీటి మేఘాన్ని
నాపై కురిపించి
నీ జ్ఞాపకాల సుధ
తీపిగానే ఎందుకుంటుందని
అడిగింది
చెప్పూ ,ఏమని చెప్పనూ
నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫీ గ్లాసేనా
మా సగపు బ్రతుకు ఎడారిని
దాటించిన ఎడారి ఓడవి కదా
ఎ దారీ లేని దాహార్తిలో
మేం నీకెన్ని సార్లు
మ్రుత్యువునివ్వలేదు
కొత్తగా ఇవాళ నువ్వెళ్ళి పోయావన్నారే
నువ్వు ఈదులాడింది
అంతు లేని సాగరం కదా
ఇవ్వాళ జ్ఞాపకాల బొత్తి విప్పి
వెతుకుతున్నా
శాంతం పేరుకున్న
నీ చల్లటి ముఖంలో
విరిగిన ఒక్క విసుగు పెదవి కోసం
నువ్వంటే మా ఆశా పూర్ణానివి కదా
ఇక్కడ నిరాశని చ్చావేం
మేం ఎన్నెన్ని సార్లు
తుఫాను మేఘాలమై
నిను కల్లోలించాం
కన్నీళ్ళమై ,వెర్రి నవ్వులమై
అవమానాలమై,దరిద్రపు ఆకళ్ళమై
గర్వాలమై ,సంత్రుప్తులమై
నీకెన్ని రంగులనిచ్చాం
కానీ నువ్వు జీవన పర్యంతం
ఎలా నిర్వర్ణమై నిలిచావు
ఇంటి పావురాయి
పొయిలో పిల్లి
చూరు కింది కుక్క
నీ ఉపనదులు
అన్నింటిపై నీ చేతివేళ్ళ
ప్రేమ స్పర్శలు
జీడి గింజతో వేసినట్టు
అతికి పోయి కనిపిస్తున్నాయ్
చెప్పూ నువ్వెళ్ళి పోయావంటే
ఎలా నమ్మనూ
ఐనా మనిషున్నంత కాలం
మనిషికి మరణమేలా సాధ్యం
నువ్వెక్కడికైనా
ఎలా వెళ్లి పోగలవ్
పాలపిట్ట ,మార్చ్ 2012.
8 comments:
అవును, ఆమె ఎప్పటికీ జీవనదే.
కాని ఆమె భౌతికంగా మరణించి, తనవారిలో అంతర్వాహినిలా ప్రవహిస్తోంది.
మా అమ్మగా... మా అమ్మమ్మ గురించి రాసింది.
పరకాయ ప్రవేశం చేసినా అమ్మ భావనని యెంత బలవత్తరంగా చెప్పారు. ఎంత బాగుందో! స్త్రీ మనసు,అమ్మతనం అంతేనెమో నువ్వు వెళ్ళిపోయావంటే ఎలా నమ్మను. మనిషి ని మరణింపజేయడం ఎలా సాధ్యం.? అలాగే బ్రతకనివ్వండి. స్యైర్యం బ్రతికే ఉంటుంది .
నువ్వంటే కళ్ళాపి వాకిళ్ళూ
నిదుర పెదవులపై వాలిన
కాఫీ గ్లాసేనా
మా సగపు బ్రతుకు ఎడారిని
దాటించిన ఎడారి ఓడవి కదా
ఎ దారీ లేని దాహార్తిలో
మేం నీకెన్ని సార్లు
మ్రుత్యువునివ్వలేదు
కొత్తగా ఇవాళ నువ్వెళ్ళి పోయావన్నారే
చాలా బాగా చెప్పారు..
ఐనా ఎక్కడికెళ్ళిపోతారు.. ఎక్కడికీ వెళ్ళరు bonagiri గారు అన్నట్టు..
Thank you andee
చాలా కృతజ్ఞతలు వనజ గారూ ...విహంగలో మీ కవిత చూసాను చాలా బాగుంది .వారి ఎడిటోరియల్ బోర్డ్ లో వున్నా కదా అందుకని అక్కడ కామెంట్ పెట్టలేకపోయాను.చాలా మంచి కవిత అది.
అవును సుభ గారూ,వారు చెప్పినట్టు అంతర్వాహినులవుతారు అంతే.థాంక్ యు .
సామాన్య గారు.. "దేహ క్రీడలో తెగిన సగం "నచ్చినందుకు .. మరీ మరీ ధన్యవాదములు.
మీలాగా నాకు కూడా దేవుడు ఇంత మంచిగా వ్రాసే వరం ఇచ్చుంటే బాగుండు ......... అమ్మమ్మ గురించి చాలా బాగా వ్రాసారు......... ,అయిదు ఉద్వేగ నదులు అనేది నాకు చాలా చాలా నచ్చింది
Post a Comment