మహిత కథ పుస్తకంగా వచ్చింది .
ఈ కథని ఇట్లా పుస్తకం గా తీసుకురావాలని నేనసలు ఆలోచించలేదు .[''దొంగల సంత''కథని పుస్తకం గా తేవాలని ప్రయత్నాలు జరుగుతూ వున్నాయ్.] మహిత మొదటి భాగం వచ్చినపుడు నాకో ఆర్త్రమైన మెసేజ్ వచ్చింది .పేరు లేదు .ఆ మెసేజ్ చూసాక కాల్ బాక్ చెయ్యాలనిపించింది .అట్లా నేను మొదటి సారి ఆర్ ఎం ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడాను.
పాటకులుగా మనకి మనవే అయిన అభిరుచులుంటాయి,ఆసక్తులుంటాయి.మన ఆసక్తికి అతి దగ్గరగా వచ్చిన ,మనం అమితంగా ఇష్టపడిన రచయిత ఒకానొక రోజు మనతో మాట్లాడితే యెట్లా వుంటుంది ?మాట్లాడటమే కాక మనని మెచ్చుకుంటే యెట్లా వుంటుంది?ఆ రోజు ఎంత సుందరమైనదవుతుందీ ?దానినే dreams comes true కలలే ఫలించడం అంటారు కదా !ఉమా మహేశ్వర్ రావు గారితో మాట్లాడటం నాకు అట్లాంటిదే .
మొదటి సారి ఆరెం ఉమా మహేశ్వర్ రావు గారి కథ చదివినపుడు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో .ఎక్కడ కూర్చుని చదివాను ,చదివినది ఏ వేళలో? అంతా నాకు హృదయంలో ఇమేజ్ లా బద్రపరచబడి వుంది . చాలా నచ్చినవీ ముక్యమనుకున్నవే కదా మన హృదయంపై అలా ముద్ర వేసి నిలిచిపోతాయి .అంత ఇష్టం నాకు వారి కథలంటే .
వారు నాతో మాట్లాడటం అంటే మొదలు అదే చాలా పెద్ద విషయం నాకు .అది కాకుండా నా కథని ఇష్టపడటం రెండో పెద్ద విషయం.ఇష్టపడ్డారు పో... స్వంతంగా వారి ఖర్చుతో మహితని పుస్తకంగా తీసుకురావడం నా జీవితంలో అతి పెద్ద విషయం .
డబ్బే ప్రామాణికం అనుకుంటే ...మహితని కావాలనుకుంటే స్వంతంగా నేను కూడా వేసుకోగలను నా డబ్బే పెట్టి .పబ్లిషర్స్ నీ పర్స్యు చేయగలను .కానీ నాకివాళ కలిగిన ఈ సంతోషపు ఫీలింగ్ ఎన్ని డబ్బులు కర్చు పెట్టినా నేను సంపాదించి ఉండలేను. ..కదా !!
''అంటరాని వసంతం -విమర్శనాత్మక పరిశీలన ''టెక్నికల్ గా నా మొదటి పుస్తకం .కానీ మొదటిగా పాటకులు లోకి వెళ్ళిన పుస్తకం ''మహిత''.నాకు తిరుపతి అంటే చాలా,చాలా......ఇష్టం .ఆ తిరుపతిలో ''వల్లంపాటి సాహితీ మిత్రులు ప్రచురణ''గా నా పుస్తకం మొదటిగా మనుషులలోకి వెళ్ళింది .ప్రజల్లోకి తన బుజ్జి బంగారు చేతులతో పంపింది ''రాగలీన'' ...ఉమా మహేశ్వర్ రావు గారి అమ్మాయి .
రాగాలీనకూ ,ఒక గొప్ప మంచితనాన్ని ఏ ఆడంబరమూ లేకుండా అతి సరళంగా నాకు పరిచయం చేసిన ఉమా మహేశ్వర్ రావు గారికి నేను మాటలలో పొందు పరచలేనంత ఋణం పడ్డాను .ఉమా మహేశ్వర్ రావు గారికి నా శతాధిక కృతజ్ఞతలు.
పీ ఎస్ : అజ్ఞానం చేత నేను మరచి పోయిన కృతజ్ఞతని అన్వర్ గారు గుర్తు చేసారు . ఉమా మహేశ్వర్ రావు గారు పుస్తకం అనుకున్నంత మాత్రానే అందమైన బొమ్మలతో సహా వెయ్యడం వెనుక ఆర్టిస్ట్ కిరణ్ కుమారి గారి సహాయం సహృదయత ఎంతైనా వుంది.వారి బొమ్మల వల్ల ఈ పుస్తకానికి అసలైన ఆ కర్షణ వచ్చింది .అడిగినంతనే బొమ్మలు ఇచ్చినందుకు వారు నాకు తెలియకున్నా వారికి హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచు కుంటున్నాను .థాంక్ యు కిరణ్ గారూ ,థాంక్ యు వెరీ మచ్