About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday 30 June 2012

మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా !


ఇప్పటి సినీ గీత రచయితల్లో నాకు సిరివెన్నెల గారూ ,చంద్ర బోస్ గారు మాత్రమె తెలుసు .దానికి కారణాల చర్చ పక్కన పెట్టేస్తే ,ఎన్నో సార్లు ''మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ''పాట విని వున్నా ఆ గీత రచయిత ''కందికొండ''అని నాకు  తెలియనే తెలియదు ...నిన్న ఈ ఆర్టికల్ చదివే వరకు. నా కథ 'కొత్త గూడెం పోరాగాడికో లవ్ లెటర్ 'వచ్చినపుడు కందికొండ గారు కాల్ చేసి మంచి కథ రాసానని  చెప్పారు .ఆ తరువాత 'మహిత' వచ్చాక నా పేరు గుర్తుంచుకుని మరీ రెండు భాగాలు చదివి అభినందించారు .నిన్న మళ్ళీ కాల్ చేసి ''నమస్తే తెలంగాణ ''లో వారి గురించి వచ్చిన ఆర్టికల్ గురించి తెలియ పరచారు .

ఒక అపరచిత జీవన చిత్రం వెనుక మనం విషాదాన్నో ,గెలవడానికి చేసిన పోరాటాన్నో అన్ని సార్లూ ఊహించలేం కదా ...ఆ బ్రతుకు చిత్రాన్ని  తరచి చూడగలిగే స్థితిలో వుంటే తప్పించి .కందికొండ గారి జీవిత చిత్రం  చదివాక గెలుపు వెనుక వున్న కష్టం మీద నాకో అవగాహన వచ్చింది . మనిషి సాయుధాన్ని  స్వప్నించే దారి ఎందుకో మనసులో మెరిసింది .''ఆలోచనలన్నీ క్రూరం గా మారుతున్న సమయంలో లైబ్రరీ పరిచయమైంది ''అనడం నాకీ ఆర్టికల్ లో అత్యంతగా నచ్చిన మాట .http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=39154&boxid=248371728 
 



6 comments:

the tree said...

manchi goppa parichayam chesarandi, thank you, keep writing.

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు.. ఈ రోజు చాలా సార్లు "మళ్లీ కూయవే గువ్వా" పాట విన్నాను. చాలా మంచి సాహిత్యం నాకు చాలా బాగా నచ్చుతుంది. .
కందికొండ గారు చెప్పినట్లు.. లిరిక్ రైటర్స్ కి పొజిషన్ లేదు.
నిజమే.. ఓ..ముగ్గురు తప్ప ఇప్పుడు అందరూ.. దర్శకులు,నిర్మాతలు ,ఇంకా చెప్పాలంటే హీరో..ఇమేజ్ కి అనుగుణంగా పాటలు వ్రాస్తుంటే.. మంచి పాట వ్రాసే వాళ్ళు ఎవరు? వారి పొజిషన్ డోలాయమానం యే కదా!. మంచి గీతాలు కొన్ని వ్రాసినా చాలు.కదా!
ఏమైనా కందికొండ గారి జీవన ప్రయాణం ఆసక్తిగా ఉంది. మేలిమి ముత్యాలు లాంటి పాటలు వ్రాసినందుకు వారికి మనసైన అభినందనలు.
పరిచయం చేసి లింక్ ..ఇచ్చిన మీకు ధన్యవాదములు.

Padmarpita said...

Its an interesting and inspiring. thanks for sharing.

సామాన్య said...

@the tree

thank you .thank you very mauch

@వనజవనమాలి
vanaja garu thank you .mee abhinandanalu vaariki neruga thelapa vacchu kadaa !

@Padmarpita

thank you padmarpitha garu

చెప్పాలంటే...... said...

manchi tapaa raasaru kandikonda gaari gurinchi

సామాన్య said...

@చెప్పాలంటే......
thank you