About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Saturday, 30 March 2013

కథలూ ,కాకరకాయలూ


ప్రాతినిధ్య ఆవిష్కరణ  జరిగిపోయింది  .నిజానికి నవ్వొస్తుంది .సామాన్యా  ఏం కావాలనుకున్నావు చివరికి ఎక్కడ ల్యాండ్ అయ్యావు బిడ్డా అని.గండవరపు కమలమ్మ ...నువ్వెక్కడున్నావే ... ''బుద్ది భూములేలమంటే రాత గాడిదలు కాయమంటుందని '' చెప్పేదానివి కదా ఎప్పుడూ....  చూశావా నా జీవితం ఎలా నా చేతుల్లో లేకుండా పోతుందో .ది గ్రేట్ సామాన్య చివరికి కథలూ ,కాకరకాయలూ అని అల్ప అంశాల వెంబడి తిరుగుతుంది .  మళ్ళీ వీట్లలో రాజకీయాలూ ,చాడీలు అబ్బబ్బ ...దేనికీ పనికి రాని పనులు .

దురదృష్టమంటే 
కావలనుకున్నవి 
అందకపోవడం 
వద్దనుకున్నవి వాటేసుకుని 
కరచాలనం చేయడం 


                                                             

2 comments:

వనజవనమాలి said...

దొరికిన వాటిలోనే కావాలనుకున్నవి చూసుకోవడం విజ్ఞుల లక్షణం.

ఏ మురికి అంటకుండా నిర్మలమైన మనస్సుతో ముందుకు నడవాలి

ముగ్గురు కుమార్తెలు ఉండగా ఏమి లోటు !?

అల్పమో అనల్పమో కాలం చెపుతుంది

నడవండి .. ముందుకు నడవండి .

సామాన్య said...

ఎల్ల వేళలా ఇలా నా వెంట ఉంటున్నందుకు మీకు హ్రుదయపూర్వక కృతజ్ఞతలు వనజ గారు.