మీనాక్షి నా మొదటి కుమార్తె .సామాన్యకిరణ్ ఫౌన్డేషణ్ నా రెండవ కుమార్తె . ప్రాతినిధ్య నా మూడో అమ్మాయి .
అస్తిత్వ ప్రశ్నలకూ ,ఆవేదనలకూ వేదిక కాదలచి ఒకానొక రాజకీయ ఆవశ్యకతతో ఆవిర్భవించింది ''ప్రాతినిధ్య ''. ఆవిష్కరణకు నేను ఎంచుకున్న రోజు సావిత్రీ బాయి వర్ధంతి అయిన మార్చ్ 10. అనివార్య కారణాలతో ఆ రోజు నుండి వాయిదా పడుతూ మార్చ్ 28 న ఆవిష్కరించాల్సి వచ్చింది .
ప్రాతినిధ్య ఆవిష్కరణ ఘనంగా జరిగింది . కళ్యాణ రావు గారు ,పాణి గారు, జిలుకర శ్రీనివాస్ ,వక్తలుగా వచ్చారు మరో వక్త ఖాదర్ మొహియుద్దీన్ గారు అనారోగ్య కారణాల వల్ల రాలేక పోయారు .
ఇంత పెద్ద పని కదా చేయగలనా లేదా అని చాలా భయం వేసింది .చేసేసాం .తొలి ప్రతిని సెంటిమెంటల్ గా వాసిరెడ్డి నవీన్ గారికి అంద జేసాం .కథ లాగే ''ప్రాతినిధ్య ''కూడా నా జీవిత పర్యంతం సాగాలని. నడపగలనని నా పై నాకు నమ్మకముంది .
సభకు పెద్దలు ,ప్రముఖులు ,పిల్లలూ వొంద మంది దాకా వచ్చారు . వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు .
కళ్యాణ రావు గారు కథల గురించి చెప్పారు.
పాణి గారి మధ్య, జిలుకర శ్రీనివాస్ ఉపన్యాసాల మధ్య సైద్దాంతిక ఘర్షణ మరోసారి బట్టబయలయింది .
మిస్ g s k.మీనాక్షి సావిత్రీ బాయి ఫూలే గురించీ ,సామాన్యకిరణ్ ఫౌండేషన్ గురించీ మాట్లాడింది
తొలి ప్రాతినిధ్య
సంపాదకులు సామాన్య,కుప్పిలి పద్మ
చిరునవ్వుల మధ్య ''ప్రాతినిధ్య ''సాయంత్రం
''ప్రాతినిధ్య ''ఆవిష్కరణ
తొలి ప్రాతినిధ్యను అందుకున్న వాసిరెడ్డి నవీన్ గారు
శ్రోతలలో కత్తి మహేష్,జుగాష్ విలి,స్నేహ తదితరులు
అస్తిత్వాల పై పాణి గారు
ఈ ఆధునిక కాలం లో ''కినిగే'' అవసరం గురించి అనిల్ అట్లూరి గారు
అంబేద్కర్ చెప్పిన ప్రాతినిధ్యం గురించి జిలుకర శ్రీనివాస్ గారు
తన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథ వెనుక కథ గురించి రచయిత పసునూరి రవీందర్
పర్స్పెక్టివ్ r k గారి నుండి ''ప్రాతినిధ్య ''కాపీ అందుకుంటూ పెద్దింటి అశోక్ కుమార్ గారు .
''గోళ్లు ''కథ వెనుక కథ గురించి చెబుతూ వేంపల్లి షరీఫ్ గారు
నా వోట్ అఫ్ థాంక్స్
గండవరపు మధుసూదనమ్మ.
No comments:
Post a Comment