ఇది అకాడెమీ పురస్కారాన్ని పొందిన కన్నడ కథల సంకలనం [మొదట ముద్రణ 2010]. ఇవాళ పొద్దున్న మొదలు పెట్టాను అడపాదడపా విరామాలతో ఇప్పుడే పూర్తి చెశాను. నా రోజుని ఇందులో పోగొట్టుకున్నందుకు మనసు చాలా సంతృప్తి పొందింది . శైలిలో ఎంత భిన్నత్వమూ ,ఆకర్షణా వుందంటే ,,ఇలా రాస్తే,రాయగలిగితే ఎంత బాగుండూ అని చెడ్డ కోరిక ఒకటి నాకు బలంగా కలిగింది . చెడ్డ అని ఎందుకన్నానంటే ఈ ఆకర్షణ అనేక రోజులు నాకు మరుపుకు రాదు కాబట్టి .ప్రతి కథా ఎంత చదివిన్చిందో . ఇంటికొచ్చిన మనుషులు,ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి పుస్తకానికి విరామం ఇవ్వాల్సి వచ్చినపుడు ఎదుట కూర్చున్నవాళ్ళపై చాలా కోపం తెచ్చుకున్నాను మనసులో ఇవాళ .
ఈ రచయిత పేరు చెప్పలేదు కదా శ్రీ .పి.లంకెశ్ గారు . శ్రీ .అని నాకు మనస్పూర్తిగా ఆయన మేధస్సు నచ్చడం చేత అంటున్నాను.
టాల్స్టాయ్ గురించి ఈ రచయిత అన్న మాటలు బహుశా జీవితమంతా గుర్తుంచు కుంటానేమో, అదేమిటంటే ''రాయటం ఎంత కష్టమో లేదా రాయటం తప్పనిసరైనపుడు అదెంత సులభమో అంతే సుఖదాయకం కూడా ''...లంకేష్ గారు కూడా ఈ కోవలోని రచయితే అని అతని కథలు మనకు చెబుతాయి .
No comments:
Post a Comment