About

చూడలేదు కదానని , రాత్రి కురిసి వెళ్ళిన సౌందర్యపు ఝడిని , అల్పమైనదని అనేసెయ్ గలమా ...

Friday 2 March 2012

నేను సుధీరని...


కొన్ని రోజుల క్రితం కొత్త పాళీ గారు నాకో జాబు రాసారు .ఏమనీ అంటే ... ఇప్పుడే సత్యవతి గారి బ్లాగులో మీ పాప బ్లాగు పరిచయం {జీఎస్ కే మీనాక్షి} షోవ దాస్}, అక్కడనుంచి మీ బ్లాగునీ చూసాను మీ కథ కల్పన బాగుంది ...అంటూ సామాన్య అనే నన్ను కొత్తగా పరిచయం చేసుకున్నారు.

కొత్తగా పరిచయం అని ఎందుకన్నానంటే ,,,నిజానికి కొత్త పాళీ గారికి నేను కొత్త పరిచయమే కానీ వారు నాకు 2010 నుండీ పరిచయం.సాహిత్యం లో మేజిక్ రియలిజం లాగా {ఇవాళే మేజిక్ రియలిజం చదవడం స్టాట్ చేశా .ఒక్క పేజీనే అయింది ,కనుక సంపూర్ణం గా చెప్పలేను కానీ ఆ పదం ఎందుకో ఇక్కడ వాడాలని అనిపించింది.}...నాకో బ్లాగ్ వుండేది పాపాయి అని ,సుధీర గోదారి అనే నా ఇంకో పేరుతో .{సుధీర అనే పేరంటే నాకు చాలా ఇష్టం.}ఆ బ్లాగ్ కి నా మొదటి అతిధులు కొత్త పాళీ గారు,త్రిష్ణ గారు.అంతే కాదు కొత్త పాళీ గారు ఈ వారం బ్లాగు పేరిట నా బ్లాగును వారి బ్లాగులో సిఫారసు కి కూడా పెట్టారు.మళ్ళీ సామాన్యని కూడా కథ బాగుందంటూ పలకరించారు.

ఇక త్రిష్ణ గారు ఒకానొక రోజు త్రిష్ణ గారి నుండి నా మెయిల్ కి ఓ రిక్వెస్ట్ వచ్చింది ...మీ కల్పన కథని నా బ్లాగ్ లో పెట్టేదా అని .ఆ మెయిల్ చూసి నేను నిజంగా ఆశర్యపడ్డా ,ఎందుకంటె నా బ్లాగ్ కి వారు వారి బ్లాగ్ కి నేను రెగ్గులర్ పాటకులం.సామాన్య గా నూ సుధీరగానూ నా రాతలు వారికి నచ్చాయి.సరే అని చెప్పా కానీ సామాన్యగా నన్ను నేను పరిచయం చేసుకోవడం అనేకానేక మొహమాటాల వల్ల ఇబ్బందిగా అనిపించింది .పరిచయం కాలేదు.

పాపాయి బ్లాగ్ అంటే నాకు చాలా ఇష్టం వుండేది .ఎంత ఇష్టం అంటే ఆల్మోస్ట్ అడిక్షన్ లెవల్ లో ఇష్టం .ఏదో ఒకటి రాయాలి ప్రతి రోజూ ,అది కాక ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేయడం...టైపింగ్ చేత కాక పోవడం చేతననుకుంటా రోజులో ఘన సమయం బ్లాగ్ తోనే గడిచి పోయేది .చదువూ సంధ్య {అప్పుడు పీ హెచ్ డీ చేస్తున్నా]అటక ఎక్కేసాయ్.చూసి చూసి నా ప్రియ మైన శ్రేయోభిలాషి మందలించటం మొదలెట్టాడు .వొన్ ఫైన్ డే నా పై నాకు కూడా బోలెడు కోపమొచ్చేసింది ,అంతే బ్లాగ్ని డిలీట్ చేసేసా జూలై మాసం లో .కానీ చెప్పా కదా బోల్డు ఇష్టం ఆ బ్లాగ్ అంటే ...అని,, అందుకని అట్టి పెట్టా...

కొత్త పాళీ గారి పలకరింపుతో ఇవన్నీ గుర్తొచ్చాయి .అందుకని బ్లాగ్ ని పునరుద్దరించా.

ఇంత రాయటానికీ కారణమేమంటే పేరుతోనో ,మరి ఇతరేతరాలతోను సంబంధం లేకుండా కర్మ ని {ఇంకో పేరు ఏదైనా వుంటే అది...}అనుసరించి మనుషులం ఒకరికొకరం పరిచయమవుతామా?కర్మ ,పూర్వ జన్మ లిఖితం ఇలాటివన్నీ రాయటానికి కూడా టూమచ్ గా అనిపిస్తుంది కానీ ,ఎందుకో అలా అనిపించింది.

ఇదిగో ఈ వ్యక్తికి ఫోన్ చేయాలిక అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి నుండి ఫోన్ రావటం ,ఈ వ్యక్తితో పరిచయమైతే బాగుండు అనుకుంటూ ఉండగానే ఆ వ్యక్తి ఎదురు వచ్చి పరిచయం చేసుకోవడం ...చాలా సార్లు నాకీ 'మేజిక్' అనుభవం.ఫేస్ బుక్ లో సత్య వతి గారి ఫోటో చూసి అచ్చం నా కూతురిలా వున్నారు ,నా కూతురు కూడా ఇలా గొప్ప రచయిత్రి అయితే ఎంత బాగుండు అనుకున్నానా ,కొన్ని రోజులకే ఒక అద్బుతమైన బ్లాగ్ కనిపెట్టా చూడండి అని సత్యవతి గారు నా కూతురి బ్లాగ్ ని వారి బ్లాగ్ లో పరిచయం చేసారు.

అనిపిస్తుంది నిజ్జంగా, ఈ జీవితం వుందే...ఇదో మేజిక్ .జరిగినవీ,జరగబోయేవీ అన్నీ మన పేరిట ఓ కథల పుస్తకంలో రాసిపెట్టి ఉంటాయ్ ...ది ఎండ్ అన్న ఆఖరి పీజీ అప్పటికి మనం చేయవలసి ఉన్న పనులు బుద్ధితో చేసేస్తే సరే ,లేక పోతే ఇమ్పోసిషన్ రాయాల్సి వస్తుందేమో అని .ఇట్లా ఏవేవో ఆలోచనలు ...

11 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

అమ్మయ్య ..సుదీర ,మీరు ఒకరే అన్నమాట. పాపాయి ఫోటో చూసి అనుమానం కల్గింది. అక్కడ కామెంట్ పెట్టాను . ఓకే.. సామాన్య గారు. చాలా సంతోషం. ఇప్పుడే మీ. .రంగవల్లి పురస్కారం వీడియో.. షేర్ చేసుకున్నాను.

సామాన్య said...

వనజవనమాలి గారు
మీరు గూగుల్ ప్లస్ చెప్పారు కానీ నేను చూడలేక పోయాను.మీ బ్లాగ్ లో ,జిలేబి గారి బ్లాగులో చర్చ చూసాను .బాగుంది.మాటకు మాట ల పోరాటం ...
కల్పన, మీ కల్పన అయిపొయింది కదా ,ఎంత వెనకేసుకోస్తున్నారో చక్కగా అమ్మలా ...
థాంక్ యు ,జిలేబి గారికి కూడా.

Anonymous said...

నమస్తే సామన్య గారు,
కల్పన కథ నేను విహంగ లో చదివి, + లో మిత్రులతో నా అభిప్రాయం పంచుకోవటం జరిగిపోయింది.
పెట్టె పట్టుకు బయటికి నడిచే కథలు చదవటం పూర్తయిన ప్రతిసారి ఏదో బాధ. ఇంతకు మించి వేరే మార్గం లేదా అని . మీ కథలో కల్పన తన భర్తను తిరిగి కలవటానికి చేసిన ప్రయత్నం, దానికి ఇచ్చిన వివరణ చాలా సమంజసంగా అనిపించాయి .
మరో విషయం, మీ గురించి ఇంతకు ముందెక్కడో విన్నాను.......మీరు పైన రాసినట్టూ అనిపిస్తుంది నాక్కూడా. (కె. వరలక్ష్మి గారి ద్వారానేమో , సరిగా గుర్తు లేదు. మీరు వారు తెలుసా!)

సామాన్య said...

వరలక్ష్మి గారు తెలుసండి .కల్పన కథ ద్వారే పరిచయం అయ్యారు.చాలా ఆత్మీయమైన వ్యక్తిత్వం వారిది.విహంగలో వారి ఆత్మ కథ వస్తుంది చూస్తున్నారు కదా ....కథ పై మీ అభిప్రాయాలు చదివాను.థాంక్ యు.

వనజ తాతినేని/VanajaTatineni said...

సామాన్య గారు... మీ వ్యాఖ్య కి ధన్యవాదములు.
"కల్పన" నా కల్పన కాదు. ముమ్మాటికి మీ కల్పన నే !
ఈ సారి సుదీర పాత్ర తో.. వస్తారని నా ..గొప్ప నమ్మకం. :)))))

Kottapali said...

అమ్మా, చాలా సంతోషం. పాపాయి బ్లాగుని చాలా అభిమానించాను. అకస్మాత్తుగా కనబడక పోయేటప్పటికి, బ్లాగులోకంలో జరిగే అల్లకల్లోలాలు స్వయంగా ఎరిగినవాడిన కనుక మీకూ అటువంటి చేదు అనుభవం ఏదైనా ఎదురై బ్లాగు మూసేశారేమోనని చాలా బాధపడ్డాను. బ్లాగింగనేది ఒక వ్యసనం అవటం మంచిదేనని మీవంటి బ్లాగరులని చూసినప్పుడల్లా అనిపిస్తుంది. రాయకుండా ఉండలేక, మళ్ళీ బ్లాగు తెరిచారు. అదే సంతోషం. కథలింకా చదవలేదు పనుల వత్తిడి వల్ల. త్వరలో చదువుతాను.

సామాన్య said...

సర్
బ్లాగ్ విషయం లో నాకు ఎటువంటి చెడు అనుభవమూ ఎదురు కాలేదు.అతి ముఖ్యమైన చదువు పోతూ వుంటే ...అలా చేయాల్సి వచ్చింది.ఇప్పుడు కూడా నిజానికి టైం వేస్టే కానీ ,చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా రాసుకున్న డైరీ లాగా అనిపిస్తుంది బ్లాగ్ ...రంగులతో అందంగా ,,,,ఇష్టమైన విషయాలని పేర్చుకుంటూ పోవాలనిపిస్తుంది....

తృష్ణ said...

ఎంతో యాదృచ్ఛికంగా ఇవాళ మీ టపా చూశాను...మీరేనా సామాన్య??!! ఈ టపా చదువుతున్నంత సేపు..ఎంత ఆశ్చర్యానికి లోనయ్యానో చెప్పలేను..!! "పాపాయి" బాగ్ నాకెంత ఇష్టమో... మీ కబుర్లు, కవితలు... I really missed your writings..Happy to see you here !! Keep blogging !

సామాన్య said...

తృష్ణ గారూ అది చదివి మీరెంత ఆశ్చర్య పడి ఉంటారో నేను ఊహించగలను ,ఎందుకంటె ఒకానొక రోజు మీ మెయిల్ చూసి నేనూ ..అట్లాగే ఆశ్చర్య పడ్డాను కనుక!!

జైభారత్ said...

ఈ జీవితం వుందే...ఇదో మేజిక్ .జరిగినవీ,జరగబోయేవీ అన్నీ మన పేరిట ఓ కథల పుస్తకంలో రాసిపెట్టి ఉంటాయ్ ...ది ఎండ్ అన్న ఆఖరి పీజీ అప్పటికి మనం చేయవలసి ఉన్న పనులు బుద్ధితో చేసేస్తే సరే ,లేక పోతే ఇమ్పోసిషన్ రాయాల్సి వస్తుందేమో అని -..వామ్మో..ఎం చెప్పారండి అసలు..నిజ్జంగా నాకు ఇలానే అని పిస్తుందండి...చాల చాల చక్కగా.. ఒద్దికగా.. సుతి మెత్తగా..ఓ తెలుగమ్మాయి..పండగకి ముస్తాబయ్యి .. తన పాదాలకింద ఏమైనా పడి చనిపోతఎమో..లేక భూమాతకి నొప్పెమైన కలుగుతదేమో అని సుతారం గా నడిచి వెళ్తున్నట్టే ఉందండి...మీ రచన..అద్భుతం.

సామాన్య said...

@లోకనాథ్
thank you andee