నేను ఆరో క్లాసో,ఏడోక్లాసులోనో వుండగా మా అమ్మ ఓపెన్ యునివర్సిటీ బీయే చదువుతూ వుండేది.హిస్టరీ,తెలుగు,పోలిటిక్స్తో .మిగిలిన వాటి సంగతి గుర్తు లేదు కానీ మా అమ్మ తెలుగు పుస్తకాలలోని కథలన్నీ
నేను ఒక్కోటి బోలెడు సార్లు చదివాను .కరుణ కుమార టార్చి లైటు,ఇలాంటి తవ్వాయి వస్తే ,పెళ్ళానికి ప్రేమ లేఖ వంటివీ...చాగంటి సోమయాజులు గారి ''''ఎందుకు పారేస్తాను నాన్న ?'' కథ ,అట్లా చదివినవే .
అన్ని కథల సంగతి ఏమో కానీ ,అప్పుడు నాది కూడా ''ఎందుకు పారేస్తాను నాన్న ?''కథలోని కృష్ణుడికి దాదాపు అటూ ఇటూ వయసు కావడంతో ఆ కథ బాగా మనసుకి హత్తేసుకుని గుర్తుండి పోయింది.
మా అమ్మ అప్పటి పుస్తకాలను ఆ కథలోకోసమే జాగ్రత్తగా దాచుకున్నాను .పెద్ద పెరిగి,తెలుగు ఏం ఏ కి వచ్చిన తరువాత వాటిని వాడుకున్నాను కూడా
మంచి అపురూపమైన పుస్తకాలు అవి .
''ఎందుకుపారేస్తానునాన్న?''1945 లో భారతిలో అచ్చయిన కథ.దాంట్లోని వస్తువు రీత్యా స్థల కాలాదులకు అతీతంగా
నిలిచిన కథ .
...బాగా చదివే అబ్బాయి కృష్ణుడు ఫోర్త్ ఫాం కి వస్తాడు.నానకేమో వాడ్ని
చదివించేందుకు డబ్బులుండవ్. బడి మానిపించేస్తాడు.ఒక సారేమో నాన చుట్ట తెమ్మనికృష్ణుడికి డబ్బులిచ్చిపంపుతాడు.బడి ముందు నుండి వెళ్ళాలంటే వాడికి బోల్డు అవమానం వేస్తుంది.
అనుకున్నట్టే క్లాస్ మేట్స్ కనిపిస్తారు.ఏం రా కృష్ణుడూ ''నువ్వు బల్లోకి రావటం లేదు'' అంటాడు నరసింహం.వాడితో తో ''సోమవారం నుండి వస్తా'' అని చెబుతాడు.అంతలో శకుంతల వస్తుంది
ఈ సారి ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్ అది కొట్టేస్తుంది, కృష్ణుడికి కాకుండా .ఇంతలో బెల్ కొడతారు .వాళ్ళిద్దరూ బడిలోకి వెళిపోతారు .
కృష్ణుడికి దుక్కం వస్తుంది ఒక సారి మాస్టారుబడి మానేసిన ఒకబ్బాయి పేరు కొట్టేస్తూ ''డిస్కంటిన్యూడ్''అని రాసేసి ఆ పదానికి అర్థం చెపుతాడు.అది గుర్తొస్తుంది వాడికి ''నేను ఇంటికే వెళ్ళను '' అనుకుని బడి ఎదుటే కూర్చుండి పోతాడు.
వాడిని వెదుక్కుంటూ నాన వస్తాడు.నానపిలిచినా వాడు ఇంటికి రానంటే రానంటాడు .చివరకు కు నాన వాడిని బడిలో వెయ్యడాని తల తాకట్టయినా పెట్టాలనుకుంటాడు .అయితే క్రుష్ణుడు,పుస్తకాలు అప్పటికప్పుడే కొనమంటాడు.ఒక్కటయినా కొనమంటాడు.నాన ఆలోచించి''ఇందాకా చుట్టలకిచ్చిన డబ్బులున్నాయా,పారేసావా?''అని అడుగుతాడు కృష్ణుడు ఆ ఏడుపులో''ప..ప్ప...ప్పారీలేదు.జేబులో వున్నాయి...ఎందుకు పారేస్తాను నాన్నా ?'' అంటాడు
కథ అంతే .కథగా చెప్పడానికి ఏమీ వుండదు. ఒక సన్నివేసం అంతే !కానీ ఆ కథ నన్ను ఎంత ఏడిపించిందో ..
ఎవరైనా బడి మానేసినా,అటువంటి సంఘటనలు తటస్థ పడినా ఆ కథే గుర్తొస్తుంది ఇప్పటికీ.ఏదైనా చెయ్యాలని గుబులేసి పోతుంది.నాగార్జున సాగర్ ఏపీ ఆర్ జే సి లో చదివే వాడు
నా తమ్ముడు
నా తమ్ముడు
అక్కడ పిల్లల లో కొంత మంది ఎంత బాగా చదివే వాళ్ళో.కానీమధ్యలోనే ఆపేసే వాళ్ళు .అప్పుడు కూడా అట్లాగే ఈకథ జ్ఞాపకానికి వచ్చేది.
పాపాయి వాళ్ళ నానఈ మధ్య యుద్ద ప్రాతిపదికన కథలు చదువుతున్నాడు.అందులో భాగంగా''విశాలాంధ్ర తెలుగు కథ''చదువుతున్నాడు.ఇవ్వాళ పొద్దున్న ఆ పుస్తకాన్ని ఊరికే అట్లా తిప్పుతుంటే ఈ కథ దొరికింది.అసంకల్పితంగా చదవటం మొదలెట్టాను ఇంత పెద్దయ్ పోయానా ఈ రోజు కూడా చివరి వాఖ్యం చదవగానే కళ్ళ నిండా నీళ్ళు పేరుకున్నాయి .అచ్చు కథలో కృష్ణుడికి లాగే ''దుక్కం పొర్లుకుంటూ వొచ్చింది''
...అదీ చాసో అంటే.
4 comments:
చదువుకోవడం అంటే ప్రాణం అయినవారికి ఆర్ధిక లేమి యెంత కృంగ తీస్తుందో .మనసులో కోరిక యెంత బలవత్తరంగా ఉంటుందో..ఈ కథ చెబుతుంది." చాసో " కథలు చాలా తక్కువ చదివాను. ఈ కథ పరిచయం,మీ అనుభవం రెండు బాగున్నాయి. సామాన్య గారు.
"అమ్మ" మీరు ఆరేడు తరగతులు చదువుతున్న అప్పుడు చడుకోవడం స్పూర్తిగా ఉంది. ఆమెకి నా తరపున అభినందనలు చెప్పండి
thank you vanaja garu.
type cheyadamlo problem vallanemo sariga artham kaledandi.
nachina kathani parichayam cheyadam bagundi.
@the tree అవునండీ, టైపు చెయ్యడం రావడం లేదు .ఏవిటో వంకరగా వస్తుంది.థాంక్ యు .
Post a Comment