About
Sunday, 28 December 2014
Tuesday, 23 December 2014
@కమ్యూనికేషన్ ప్రాబ్లం...
Monday, 8 December 2014
ప్రాతినిధ్య ఆవిష్కరణ ఫోటోస్
Sunday, 7 December 2014
విన్నపం .. ..
ఇది తప్పక చదవాల్సిన కథ . నిర్భయ న్యూస్ ఐటెం గానే మనకు తెలుసు . కానీ నిర్భయ లేదా అభయ మన ఇంటి అమ్మాయిలయితే ఆ బాధ ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ కథని చదివి తీరాలి. అత్యాచారానికి గురైన అమ్మాయిల అంతరంగ ఘర్షణ ని చిత్రిక పట్టిన కథ ఇది . రచయిత్రి కుప్పిలి పద్మ గారికి కృతజ్ఞతలు .
http://patrika.kinige.com/?p=4307
Monday, 24 November 2014
ప్రాతినిధ్య కు సత్యవతి గారు రాసిన ముందు మాట .
Thursday, 20 November 2014
కథా ఉత్సవానికి హృదయపూర్వక ఆహ్వానం
Thursday, 13 November 2014
''మదనా సుందారి ... మదనా సుందారి !
ఇవాల్టి నా బూడిదరంగు రోజుకి ఉత్సాహపు కాంతులనద్దినవి గద్దర్ పాటలు , గోరటి పాటలు . అందునుండి నాకు నచ్చినది ... ఈ పాట . బహు ముద్దువచ్చినది ఈ వాఖ్యాలు ''మదనా సుందారి ... మదనా సుందారి, కామందు నీ మీద కన్నేసినాడో... మదనా సుందారి ,, ఆ .. కామందు కళ్ళల్లో జిల్లెళ్ళు పాలు ... మదనా సుందారి !!!!
మదనా సుందారి మదనా సుందారి... సందేడు కురులాది జమ్మిడి పాపలది మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... కొమ్మల్లా మెరిసేటి నీ బొట్టు చూసో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి... నీళ్ళల్ల కదిలేటి నీ నీడ చూసో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి... వెన్నెలా రాత్రుల్లో వన్నెలు చూసో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి...దారిన బోవంగ దొరగాడు కాసే మదన సుందారి
మదనా సుందారి మదనా సుందారి...సందుల్ల గాసిండు సైగ చేసిండు మదన సుందారి
మదనా సుందారి మదనా సుందారి...కనపడ్డ కన్నేలకు కన్ను గీటిన్డో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి...కన్నులల కడివేడు జిల్లేడు పాలో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి... నడుమూన కొడవలి కొసలు మేరవంగో మదనా సుందారి
మదనా సుందారి మదనా సుందారి... బ్రహ్మ జమ్ముడు నరుక బాట బట్టిందో మదనా సుందారి మదనా సుందారి మదనా సుందారి... వీరాయి పువ్వూలు పూసేటి వేల బిందెలతో నీళ్ళు తెచ్చేటి వేల
మదనా సుందారి...మదనా సుందారి మదనా సుందారి...కాకార పువ్వూలు పూసేటి వేల కడవలతో నీళ్ళు తెచ్చేటి వేల
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...గుమ్మాడి పువ్వూలు పూసేటి వేల గుండిగలతో నీళ్ళు తెచ్చేటి వేల
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...సిగ్గూడు పువ్వూలు పూసేటి వేల సిత్తలతో గంధాము తీసేటి వేల
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి...ఆవూలు దూడలు వచ్చేటి వేల ఆంబోతు రంకేలు ఏసేటి వేల
మదనా సుందారి....మదనా సుందారి మదనా సుందారి ఆహాహ ఆహ ఆహ.....
లిరిక్స్ http://nishanthdongari.blogspot.in/ నుండి
థాంక్స్ టు Dr Nishanth Dongari
Wednesday, 12 November 2014
మన భాష కాదు కానీ ... మనసు దోచే పాట !
''ఎ లెటర్ టు మోమో'' 2011 జపాన్ యానిమేషన్ సినిమా .దర్శకుడు Hiroyuki Okiura . 11 ఏళ్ళ అమ్మాయి కథ . మీకు పిల్లలుంటే తప్పక చూపించాల్సిన మూవీ . మీలో చిన్న పిల్లలుంటే తప్పక చూడాల్సిన మూవీ . నాకు ఎంత నచ్చిందంటే'' మై నైబర్ తొతోరో''తర్వాత ఇప్పుడిదే నా ఫేవరేట్ మూవీ . ఈ పాట ఎంత నచ్చిందంటే ఇప్పటికి బోల్డు సార్లు వినేసాను . ఈ పాట గురించి సమాచారం ఏంటంటే Yuko Hara, who is the keyboardist for the Japanese band Southern All Stars, reportedly spent 5 years working on this piece of music.'' She said that "I loved animation from a very young age, so being able to contribute the theme song for this film makes me happy and honored.".ఇక పాట వినండి . లిరిక్స్ కింద ఇచ్ఛా చూడండి .
sound of the wind moved my heart years later
my memory projects you in the farway sky
when i find myself wandering along the path to the sea
unchanging summer sunlight still shines upon me
never-ending blue sky expandad above
when i expressed my feelings to the person forever in my heart
let the passing clouds carry the song that connects our soul
the wind caressed my cheeks as seasons pass by
wherever you are , my dear love,please watch over me
the town shimmers under the heat surrounded by the sound of waves
where is the fragment of my dream hiding
beautiful utopia ,grant me this wish
i put my hands together , grant me this wish
i put my hands together and pray for everybody's happiness
life binds eternal love
Monday, 10 November 2014
కొన్ని అబద్దాలు - అందమైన పాటలు ... శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్
ఒక తెల్లని క్రిస్టియన్ అబ్బాయి బ్రతుకు తెరువు కోసం బ్రాహ్మడినని అబద్దం చెబుతాడు . ఇంటిగలవారి అమ్మాయి కామోసనుకొని ప్రేమిస్తుంది . అది తెలిసి అబ్బాయి వుద్యోగం వదిలేసి వెళిపోవాలనుకుంటాడు . కథ అలా అలా అందమైన పాటలతో మలుపులు తిరిగి అమ్మాయి తండ్రి కూడా అదే బాపతు అనే ఫినిషింగ్ టచ్ తో సుఖాంతమవుతుంది .
అమ్మాయి తండ్రి బ్రాహ్మడే అయి వుంటే సినిమా అభ్యుదయ కేటగిరీలోకి వెళ్లి వుండేది . అలా కాకుండా సినిమాటిక్ గా వున్నా తప్పనిసరి అబద్దం లోకి నెట్టిన ప్రపంచ నైజాన్ని సున్నితంగా చెప్పి కొత్తదనాన్ని నిలుపుకుంది .
పాటలు ఆణిముత్యాలు . ఎన్ని ఏళ్ళు గడిఛి పోయినా ఈ పాటల సుగంధం ఆవిరి కాదు . నాకు ఈ ''రాకోయి ''పాట చాలా ఇష్టం . ఎన్నో సార్లు వెదికాను షేర్ చేద్దామని . ఇప్పుడు దొరికింది .
సినిమాని పాటలకోసమే కాదు imdb లో ఎవరో రాసారు జయప్రద గురించి absolutely bewitching అని అది అక్షరాలా నిజం . ఆవిడ అందం తో ఈ సినిమా వెలిగిపోతుంటుంది . ఆ అందం కోసం కళ్లార్పకుండా మూవీ చూడొచ్చు.
Monday, 20 October 2014
కథాసాహిత్యంలో విలక్షణ కంఠస్వరం
కథ రాయడం ఒక కళ. ముడిసరుకు వుంటే సరిపోదు, దానిని కళాత్మకంగా వ్యక్తం చేయగల నైపుణ్యం అవసరం. ఏం రాయాలన్నదే కాదు, ఎలా రాయాలన్నది ప్రధానం. ఈ అంశాన్ని దశాబ్దాలుగా సాహిత్యరంగంలో నొక్కి వక్కాణిస్తున్నప్పటికీ చాలామంది వస్తువుకు ఇచ్చే ప్రాముఖ్యం కథనానికీ, కథనంలో శిల్పానికీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో కళాత్మక విలువలతో రాసిన కథలు చూస్తే అబ్బురం కలుగుతుంది.
ఇలా కూడా రాయొచ్చా అని కొంచెం విస్మయానికి లోను చేయగలిగితే సాఫల్యం సాధించినట్టే. 'కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్' శీర్షికన సామాన్య రాసిన కథలు చదివితే కచ్చితంగా కొత్త కంఠస్వరం విన్న అనుభూతికి లోనవుతారు పాఠకులు. సామాన్య రాసిన పది కథల సంపుటి 'కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్'. ఈ పుస్తకం వచ్చాక కూడా మరికొన్ని కథలు రాశారు. ఈ పుస్తకంలో ఉన్నవి పది కథలే అయినా, మరల మరల చదివించే గుణమున్న కథలు. వివిధ పత్రికల్లో వచ్చినప్పుడు చదివిన పాఠకులు భిన్నరీతుల్లో స్పందించారు. వీటన్నిటినీ ఒకసారి చదివినప్పుడు చెందే అనుభూతి సాంద్రమైంది.
సృజనశీలురయిన వారి జీవన వైశాల్యం, అనుభవ పరిధిలోని విస్తృతి పదునైన సాహిత్యసృష్టికి దోహద పడుతుంది. సామాన్య కథలు ఇందుకు తార్కాణం. ఒక తెలుగు రచయిత్రి కథల్లోకి బెంగాలీ వాతావరణం, బెంగాలీ జానపదుల పాటలు, బెంగాలీ సంగీతపు ఛాయలు, బెంగాల్‌లోని ప్రజల సమస్యలు, జీవన సంఘర్షణలు ఎలా వచ్చాయన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ పది కథల్లో 'పీ...యు..., దొంగల సంత, అనితపాడిన పాట, ఆలం కాందొకార్' మొదలైన కథల ఇతివృత్తాలు బెంగాల్‌తో ముడిపడివున్నాయి. రచయిత్రి బెంగాల్‌లో జీవించకుండా, అక్కడి మనుషులతో, జీవితంతో గాఢమైన అభినివేశం లేకుండా ఈ కథలు రావు.
అయితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతంలోకి వెళ్ళినంత మాత్రానే కథలు రాయలేరు. తెలుగు నేల జ్ఞాపకాలకే పరిమితం కాలేదు. తను నివసిస్తున్న నేల మీది మనుషుల పట్ల, వారి జీవితాల పట్ల కుతూహలం వల్ల ఆమె తెలిసీ తెలియకనే అక్కడివారితో మమేకమయ్యారు. భాష నేర్చుకున్నారు. సంప్రదాయల్లోని వైచిత్రిని గమనించారు. బెంగాలీ పాటల్లో, సంగీతంలో పరవశించే మనుషుల ప్రాకృతిక స్వభావాన్ని ఆకళింపు చేసుకున్నారు. కనుకనే 'పీ...యు...' వంటి కథ సామాన్య నుంచి వచ్చింది.
దొంగలసంత, ఆలం కాందొకార్ లాంటి కథలు రాయాలంటే ఎంతో పరిశీలన ఉండాలి. ఆర్థిక, రాజకీయ పరిణామాల ప్రభావాన్ని అధ్యయనం చేయగానే సరిపోదు. వాటి ప్రభావాలని కళాత్మకమైన పద్ధతిలో వ్యక్తీకరించడం ద్వారానే సృజనకారుని సాఫల్యం తెలుస్తుంది. గ్లోబలైజేషన్, మార్కెట్ ఎకానమీ పరిణామాల నేపథ్యంలో రోజు గడిస్తే చాలనుకునే వారి బతుకులు ఏవిధంగా ఛిద్రమవుతున్నాయో 'దొంగల సంత' కథ చెప్పింది.
'ఆలం కాందొకార్' కథ నేరాల్ని అరికట్టే వ్యవస్థనే నేరాలకు పురిగొల్పే సన్నివేశాలు ఎలా వుంటాయో తెలియజేస్తుంది. ఫలితంగా బతుకును కబళించే విషాద బీభత్సం ఎంత భయానకమైనదో ఆర్ద్రంగా చెప్పారు. ఒకసారి పోలీసుల వలలో చిక్కినవారి ఘర్షణాత్మకమైన జీవితం ఎన్నెన్ని పరిణామాలకు లోనవుతుందో ఈ కథలో చూడొచ్చు. పాత్రల భావోద్వేగాల చిత్రణ, సన్నివేశాల సృష్టిలో, వాటి మధ్య సమన్వయంలో నేర్పును చూపితేనే ఇలాంటి కథలు చదివించే గుణాన్ని సంతరించుకుంటాయి. పాఠకులు తాదాత్మ్యం చెందుతారు. ఇక్కడే రచయిత కథన కౌశలం ఉపయోగకారి.
కార్యాకారణాల విశ్లేషణ వాచ్యంగా చెబితే కథ పేలవమవుతుంది. పాత్రల నడుమ అనవసర సంభాషణలు, రచయిత విశ్లేషణలు ప్రవేశిస్తే ఒక కళారూపంగా కథ మరణిస్తుంది. ఈవిషయంలో నేర్పుగలిగిన రచయితలు జాగ్రత్తగా కథని నడిపిస్తారు. ఇక్కడ సామాన్య కూడా జాగ్రత్తపడ్డారు. ఒక ముడిసరుకు లాంటి ఇతివృత్తాన్ని కళాత్మకమైన శైలిలో చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకోసం సామెతలు, జాతీయాలు, నానుడులు, ఉపమానాలు ఉపయోగించుకున్నారు. వాతావరణ చిత్రణలో దృశ్యాన్ని, మానవ మనస్తత్వాన్ని రూపు గట్టించారు. 'దొంగల సంత' కథలోని ఒక పేరా చూడండి:
''రాత్రి గబ్బీగీమంటోంది. స్మశానం పిరికి మేకపోతులా గంభీరంగా ఉంది. దిగులు పడ్డ ఒంటరి చంటి బిడ్డలా జాలిగా ఉంది. మొత్తం ఐదు కపాలాలు తీసి సంచుల్లో వేసుకొన్నాడు. అతనికి భయం అనే మాట జ్ఞాపకం వచ్చింది. విరక్తిగా అనిపించింది. దేనికి భయపడాలి? ఎన్నిరోజులు బతికినా ఇదే బతుకు. 'విదియ రోజు వెతికినా కనపడని చంద్రుడు, తదియ నాడు తానై కనపడతాడట' తమ బోటి మనుషులకు ఆ ఆశేది? ఈ రోజు కాకపోతే రేపు తమ బతుకుల్లో వెలుగు వచ్చి తీరుతుందన్న నమ్మకమేది...?'' (సామన్య కథలు - దొంగల సంత, పేజీ: 63)
ఈరకమైన స్వగతం, వాతావరణ చిత్రణ ద్వారా పాఠకుల్ని కథ వెంట నడిపించే కౌశలం కనిపిస్తుందీ కథా సంవిధానంలో. కథలో సౌందర్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చే లక్షణం రచయిత్రిలో వుందని ఈ కథలు తెలియజేస్తాయి. ఈ సలక్షణ రీతి 'పుష్పవర్ణమాసం' కథలో మరింత స్పష్టంగా ప్రతిఫలించింది. స్త్రీ పురుష సంబంధాల్లో వచ్చే మార్పుల్ని కొన్ని కథల్లో బలంగా చెప్పారు. ప్రేమానురాగాల గతిశీలత ఏవిధంగా వుంటుందో 'సీతకష్టాలు' కథలో చూస్తాం. మహిత, కల్పన, కొత్తగూడెం పొరగాడికో లవ్‌లెటర్ కథల్లో అనేక విషయాల్ని కళాత్మకంగా చర్చకు తీసుకువచ్చారు.
ఇతివృత్తం ఏదైనా కథని కొత్తగా రాయాలన్న తపన సామాన్య ప్రత్యేక లక్షణం. ఇది ఒక కథని అందమైన కావ్యంగా చిత్రిక పట్టడానికి దోవ చూపింది. ఈ కారణంగా చదివించే గుణాన్ని సంతరించుకున్నాయి ఈ కథలు. ఒక వస్తువుకు సంబంధించిన అనేక అంతరువుల్ని స్పర్శిస్తూ బహుళ కోణాల ఆవిష్కరణకు రచయిత్రి ప్రయత్నించడం వల్ల ఈ కథల పఠనానుభవం పాఠకుని అనుభవ వైశాల్యాన్ని ఇనుమడింపజేస్తుంది.
- అశోక్
Tuesday, 14 October 2014
సామల సదాశివ స్మృతి సంచిక & some musings
ఐదు రోజుల క్రితం శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు గారు ఫోన్ చేసి ''అమ్మ ,నీ అడ్రెస్స్ చెప్పరా , సామల సదాశివ గారి స్మృతి సంచిక ఒకటి వేసారు ,చక్కటి వ్యాసాలున్నాయిరా అందులో "అన్నారు . అడ్రెస్స్ పంపిన ఆవాళ 1230 పేజీల బృహద్గ్రంధమోటి ఇంటికి రాబోతుందని నాకు ఊహయినా లేదు . బుక్ తిరేగేయగానే నాకు, లడ్డూ కావాలా నాయనా అనే అడ్విమెంట్ గురుతోచ్చింది . సాహితీ ప్రియులు లడ్డూలా కొని దాచుకోదగ్గది, శ్రద్దగా చదువదగ్గది ఈ ''పరిశోధన'' .
విశ్వేశ్వర రావు గారు... పట్టుకుని ఏక భిగిన చదవడానికి కష్టంగా ఉంటుందనే కానీ ఎంత అపురూపంగా వుందో ఈ పుస్తకం . దీన్ని చూడగానే మా అమ్మాయి వాళ్ళ పాపాయికి వారసత్వపు బహుమతి గా ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నా . నా మనవరాలు తన లేత కళ్ళతో ఈ పుస్తకాన్ని చదవడాన్ని ఇప్పుడే డ్రీం చేసా . జిజ్ఞాస నిండిన కళ్ళు , నల్లటి చర్మపు రంగు , బారుపాటి జడ, అచ్చు బుజ్జి మా అమ్మాయ పెదాలు ... అపురూపమైన మేధస్సు ,ఖంగుమనే ఖంటమూ ,అన్యాయానికి తిరగబడే మానసిక స్తైర్యమూ , చచ్చే దాకా పోరాడగల మొండి తనమూ ,శారీరక ద్రుడత్వమూ తో సాదా సీదా గా ,అందరికీ స్నేహంగా అనిపిస్తూ , ఆత్మీయతను పంచే సాహసి నా మనవరాలికి ఈ పుస్తకాన్నివిల్లు రాసి బ్లాగ్ ముఖం గా ఇచ్చేస్తున్నాను .
ఇదేనా ఆవాళ ప్రాతినిధ్య రోజు అమ్మ... ప్రమీలమ్మ గారు నాకు ఇచ్చిన నెమలి పించం రంగు మంగళ గిరి ఝరీ చీర కూడా . నల్ల పిల్ల కదా దానికి అది బాగుంటుంది . దాని లేత చెంప ఆ చీరని ఆత్మీయంగా స్పృశించి మీరు నాకు ఇచ్చిన ప్రేమని ఫీల్ కావాలి .
థాంక్స్ ఫర్ ది బుక్ అండ్ థాంక్స్ ఫర్ ఎవిరీ థింగ్ .
థాంక్స్ అనేది పిచ్చి చిన్ని మాట , ఇప్పటికిప్పుడు నాకు కలిగిన ఈ అలవి కాని సంతోషాన్ని వ్యక్త పరచడానికి నా దగ్గర మాటలు లేవు . కాలక్రమంలో వీలు వెంబడి నెమ్మదిగా ఈ సంతోషాన్ని మీకు తిరిగి ఇస్తాను .
పి ఎస్ :నా కలలెప్పుడూ నిజమవుతాయి :))
Friday, 12 September 2014
షట్కోణం
షట్కోణం
నిర్వచనం ఇచ్చుకోవాలి .
అర్థం కాని వాటినీ ,అర్థం చేసుకోలేని వాటినీ
వెదకాలి లోపల్లోపల
ప్రశ్నార్థకాలని .
ఒకరెవరో వస్తారు
యేవో నిర్వచిస్తారు
కొన్ని తెల్లటి మెత్తటి పావురాయిల గురించి
మరొకరెవరో వాడి ముళ్ల గురించి
బల్ల మీది పేపర్ వెయిట్ గర గర తిరుగుతుంటుంది
హటాత్ గా షట్కోణం మదిలో ఉదయిస్తుంది
నిట్టూర్పు సుడులు తిరిగి తిరిగీ అణిగిపోతుంది
అన్నింటినీ చిలక్కొయ్యకి ఏక మొత్తం గా తగిలించేసాక
కొన్ని ఎర్రటి వుదయాల వేళ
ఎవరో ఆర్త గీతం పాడుకుంటూ లోతుల్లో కి నడిచి వెళతారు
అంతలోనే ఇక ఏదీ అదుపులో వుండదు
మొదలైన చోటికే చేరి పూర్ణ మవుతుంది
అస్తవ్యస్తంగా నిలబడ్డ అనుభవాలు
వరుస కట్టి దృశ్యమానమవుతాయి
నిర్వచనం
ఎప్పటికీ ఒక చిక్కు ప్రశ్నే
అదొక్కటేనా
నీడను వెదుకులాడటం కూడా
Wednesday, 27 August 2014
చేపలు పట్టే జాలరి !
చేపలు పట్టే జాలరి !
కలిసి పెంచిన దూరంలో
కలిసి పెంచిన దూరంలో
బహుశా
ఈ
దుఃఖం నీకొక రహస్యమే
పూల
పూల జీవన శైలిలో
ఈ
పరిమళం
నీకు
అనాఘ్రాతమే
పర్లేదు
అసంపూర్ణం
అసంతృప్తి కాదు
సంపూర్ణం
సంతృప్తిని చేరదు
కానీ
ఎందుకలా
...
వలలోను
నీటిలోనూ
ఏక
కాలాన ఉంచి ఇలా ...
Sunday, 8 June 2014
Sunday, 18 May 2014
ఈ మధ్య నేర్చుకున్న పాట ...
Saturday, 5 April 2014
Wednesday, 12 March 2014
నీ కొరకై ... ప్రభూ !
నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప
1.
నా జీవిత తీరమున - నా అపజయ భారమున నలిగినా నా హృదయమును -
నడిపించుము లోతునకు నా ఆత్మా విరబూయ - నా దీక్ష ఫలింప నా నావలో
కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
2. రాత్రంతయు శ్రమ పడినా -
రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము రక్షించు
నీ సిలువ - రమణీయ లోతులలో రతనాలను వేదకుటలో - రాజిల్లు నా పడవ
//నడిపించు //
3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి అహమును
ప్రేమించుచునే - అరసితి నీ కలిమి ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు //నడిపించు //
4. ప్రభు మార్గము
విడచితిని - ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము
మరచితిని ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది ఫల హీనుడని ఇపుడు -
పాటింతు నీ మాట //నడిపించు //
5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా
లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి లోనున్న ఈవులలో - లోతైన
నా బ్రతుకు లోపించని యర్పనగా - లోకేష చేయుమయా //నడిపించు //
6.
ప్రభు యేసుని శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని ప్రకటింతును లోకములో
- పరిశుద్దుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో
ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //
Subscribe to:
Posts (Atom)